Fingerprint Sensor

Fingerprint Sensor Mobiles – Telugu

Fingerprint Sensor Mobiles – Telugu ఫింగర్ ప్రింట్ సెన్సార్ గత కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ సదుపాయాలలో లో ఎక్కువమంది, తాము కొనబోయే ఫోన్లో ఈ సదుపాయం ఉందా! లేదా అని చూస్తున్నఫీచర్. జస్ట్ సింగల్ ఫింగర్ టచ్ తో ఫోన్ అన్ లాక్ చేసుకోవచ్చు. పాటర్న్ లేదా పాస్వర్డ్ లేదా పిన్ నంబర్స్ గుర్తు పెట్టుకునే అవసరం లేదు, మరియు పాస్వర్డ్ టైపు చేసే శ్రమ ఉండదు, ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్మార్ట్ ఫోన్లో ఉండడం వల్ల, చేతి వేలు ఆధారంగా మీ స్మార్ట్ ఫోన్ unlock చేసుకోవచ్చు. ఐఫోన్ 5s నుండి ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్మార్ట్ ఫోన్లో అందుబాటులోకి వచ్చిందట, అయితే ఇప్పుడు అన్నిస్మార్ట్ ఫోన్లలోనూ ఇది కామన్ ఫీచర్ అయ్యింది. కొత్త స్మార్ట్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, పేస్ రెకగ్నిషన్ సదుపాయాలు కలిగి ఉంటున్నాయి. Fingerprint Sensor Mobiles – Telugu



స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీ విషయంలో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా పాస్వర్డ్ అవసరం ఉండదు. స్మార్ట్ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆక్టివేట్ చేసుకోవడానికి సింపుల్ పిన్ నెంబర్ అవసరం. ఎప్పుడైనా అత్యవసరంగా ఎవరైనా ఫోన్ అన్ లాక్ చేయాలంటే, లేదా ఫింగర్ ప్రింట్ వేరొకటి రిజిస్టర్ చేయాలంటే ఈ పిన్ నెంబర్ ఉపయోగపడుతుంది. కొన్ని పర్సనల్ అప్ప్స్ హైడ్ చేయడం లేదా ఇతరులకు ఓపెన్ కాకుండా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉపయోగించవచ్చు. కొన్ని పేమెంట్ వాల్లెట్లలో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఖాతా నిర్వహించడంలో పిన్ బదులుగా ఉపయోగపడుతుంది.

కొన్ని ఫోన్లలో ఇది ఫోన్ బ్యాక్ సైడ్ రేర్ కెమెరా క్రిందగా ఉంటే, మరి కొన్ని ఫోన్లలో ఫోన్ డిస్ప్లే క్రిందగా ఉండే హోం బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న ఫోన్ ఉపయోగించడం తేలిక ఉంటుంది. చేతిలో ఉన్న ఫోనుని చూపుడు వేలు సాయంతో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తేలికగా వాడుకోవచ్చు. ఫోన్ డిస్ప్లే క్రిందగా ఉండే హోం బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గా ఉంటే మాత్రం చేతి బొటన వేలు సాయంతో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉపయోగించుకునే వీలు ఉంటుంది. ఇంకా ఆధునాత ఫీచర్స్ లేటెస్ట్ OS వెర్షన్, కెమెరా క్వాలిటీ, ఫుల్ హెచ్.డి. డిస్ప్లే, బిగ్ సైజు స్క్రీన్, ఫోన్ మెమరీ, రామ్, ప్రాసెసర్ స్పీడ్, గుడ్ బాటరీ బ్యాక్ అప్ నెట్వర్క్ టైపు, డ్యూయల్ సిమ్, వోల్టే సపోర్ట్, హెచ్.డి. రికార్డింగ్, పేస్ డిటెక్షన్, సెక్యూరిటీ ఫీచర్స్, గ్రాఫిక్ పిక్సెల్ డెన్సిటీ మొదలగు ఫీచర్స్ చూడాలి. కొన్ని మొబైల్ అప్స్ తమ సెక్యూరిటీ ఫీచర్స్ నందు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఆడ్ చేసి ఉంటాయి. ఎందుకంటే వీటితో అన్ లాక్ ఈజీ.

ఫోన్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన కొన్ని స్మార్ట్ ఫోన్ మోడల్స్

లెనోవో K8 నోట్ : 

హానర్ 8 లైట్ :

హానర్ 9 లైట్ : 

లెనోవో K8 ప్లస్ :

రెడ్ మి నోట్ 5 :

ఒప్పో F5 యూత్ :

హానర్ 7X :

హానర్ 6X :

రెడ్ మి నోట్ 4 :

లావా z80 :

నోకియా 7 ప్లస్ :

నోకియా 6.1 :

MI మాక్స్2 :

స్మార్ట్ ఫోన్లో ఉండే గూగుల్ వారి ప్లే స్టోర్లో అనేక రంగాలలో అనేక భాగాలలో వివిధమైన మొబైల్ అప్స్ చాలా ఎక్కువగా లభిస్తాయి. ఫోన్ టూల్స్ గా ఉపయోగపడే అప్స్, కెమెరా ఆధారంగా పనిచేసే వివిధ రకాల మొబైల్ అప్స్, ఫోన్ పెర్ఫార్మన్స్ పెంచే లేక రామ్ క్లీన్ చేసే మొబైల్ అప్స్, భక్తీ విషయాలు, ఆరోగ్య విషయలు, యోగా విషయాలు, ఎల్ఐసి వివరాలు, క్రీడలపై వార్తలు, లైవ్ స్కోర్ అప్డేట్స్, సాధనాపరమైన విషయాలు తెలిపే మొబైల్ అప్స్, డబ్బు సంపాదనపై వివరాలు ఇచ్చే మొబైల్ అప్స్, షాపింగ్ చేయడానికి అనువుగా ఉండే అప్స్, షాపింగ్ వస్తువులపై విశ్లేషణలు, వివరాలు పనితీరు తెలియజేసే మొబైల్ అప్స్, ఇంకా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఆధారంగా అనేక రకాల ఉపయోగకరమైన మొబైల్ అప్స్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

మరిన్నిమొబైల్ విషయాలు తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

7 thoughts on “Fingerprint Sensor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *