స్మార్ట్ ఫోన్ – SMARTPHONE

SMARTPHONE IN TELUGU

Smartphone in Telugu వేగంగా సాగిపోయే కాలంలో స్మార్ట్ ఫోన్ సమయం సేవ్ చేస్తుంది, వేరొక చోటకి వెళ్లి చేయవలసిన పనులు ఇంటివద్ద నుండో లేక ఆఫీసు నుండో చేసేయవచ్చు. కరెంటు బిల్ల్స్, రీఛార్జి, షాపింగ్ మొదలగు విషయలలో స్మార్ట్ ఫోన్ మొబైల్ అప్ప్స్ మనకి చాల బాగా ఉపయోగపడతాయి. ఇంకా వెబ్ బ్రౌజింగ్ లో అనుభవం ఉంటే కనుక బ్యాంకు ఖాతా లావాదేవీలు మన స్మార్ట్ ఫోన్ నుండే నిర్వహించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల ఎక్కువగా షాపులకు, బ్యాంకులకు తిరగవలసిన అవసరం ఉండదు. అలాగే స్మార్ట్ ఫోన్ తో వివిధ రంగాలలో డౌట్స్ ఆన్లైన్ శోదన లేదా యు ట్యూబ్ వీడియోల ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. మీసేవ, ఆధార్, వోటరు రిజిస్ట్రేషన్, ఎల్ఐసి ఎకౌంటు, ఎల్ఐసి ప్రీమియం పేమెంట్, పిఎఫ్ ఎకౌంటు నిర్వహణ, బస్సు మరియు లైవ్ క్రికెట్ స్కోర్, ట్రైన్ టికెట్ బుకింగ్, భక్తీ స్త్రోత్రాస్, భక్తీ పుస్తకాలు, భక్తీ పాటలు, ఇపేపర్, న్యూస్, లైవ్ టివి, ఆన్ లైన్లో వస్తువులు షాపింగ్ చేయడానికి, హోం మేడ్ హెల్త్ టిప్స్, వైద్య విషయాలు, యోగా టిప్స్, ఫిట్ నెస్ అప్స్, భక్తీ ప్రవచనాలు మొదలైన విషయలలో ఎన్నోయూస్ ఫుల్ మొబైల్ అప్స్ తో  మనకి స్మార్ట్ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది.

ప్రముఖంగా స్మార్ట్ ఫోన్ కమ్యూనికేట్ చేయడంలో, ప్రపంచంలో మనుషుల మద్య దురాన్ని తగ్గించివేసింది. అలాగే ఇప్పుడు సేవలు అందించడంలో, ఉపయోగించుకోవడంలో సమాజం స్మార్ట్ సమాజంగా మారిపోతుంది, అన్ని సంస్థల వారి ఉత్పత్తులు లేదా సేవలు మొబైల్ ఆప్స్ రూపంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండడం వలన చాలా వరకు స్మార్ట్ సమాజంగా మారుతుందని చెప్పవచ్చు. పది సంవత్సరాల క్రితం ఫోన్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలంటే, తప్పనిసరిగా సంబందిత షాప్ కి వెళ్లి కొనుగోలు చేయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు జస్ట్ చేతిలో టచ్ ఫోన్ ఉపయోగించి అవసరమైన హోం నీడ్స్ కూడా ఆర్డర్ చేయవచ్చు. వ్యాపార సేవలు స్మార్ట్ ఫోన్లో స్మార్ట్ గా మారుతున్నాయి.

స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది, అది లేకుండా యువత బయట తిరగడానికి కూడా ఇష్టపడక పోవచ్చు, అంతలా స్మార్ట్ ఫోన్ సమాజంలో ఒక ప్రభావమంతమైన మీడియా డివైస్ గా మారింది. టచ్ సదుపాయం కలిగి ఉండడం వలన స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం అందరికి తేలికగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించే అనేక రకాల కంపెనీల ఫోన్లు మార్కెట్లో మనకి ఎక్కువగా ఉన్నాయి. కొత్త ఫోన్ కొనేముందు దృష్టి పెట్టవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. డిస్ప్లే, రామ్, ఫోన్ మెమరీ, ప్రాసెసర్, సేన్సార్స్, సపోర్ట్ నెట్వర్క్, బాటరీ, లాంగ్వేజ్ సపోర్ట్, ఎక్స్టర్నల్ మెమరీ కార్డు స్లాట్, సిమ్ కార్డ్, ఓస్ వెర్షన్, కెమెరా క్వాలిటీ, డ్యూయల్ సిమ్ మరియు అందుబాటులో ఉన్న మొదలైన అధునాతన ఫీచర్స్ మనం కొనే ఫోన్లో ఉన్నాయా లేదా అని చూడాలి.

వేగంగా టెక్నాలజీ అభివ్రుదీ చెందుతున్నప్పుడు, స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ కూడా మారుతూ ఉంటాయి. చక్కగా చూడముచ్చటగా చేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్, చేతిలో ప్రాపంచిక విషయాలను అనేక రకాల మొబైల్ అప్స్ రూపంగా చూపుతూ అన్ని తరగతుల ప్రజలను ఆకర్షిస్తుంది.

గూగుల్ వారి ఆండ్రాయిడ్ వచ్చాక మొబైల్ ఫోన్ల అమ్మకాలు పెరిగనట్లు, జియో ప్లాన్స్ వచ్చాక ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది, మొబైల్ డేటా ప్లాట్ టారిఫ్ ధరలు అందరికి అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిప్ కార్ట్ అమెజాన్ వంటి సంస్థల వెబ్సైట్ల ద్వారా ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్ల అమ్మకాల ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రేత్యేకమైన మోడల్స్ కేవలం ఆన్లైన్ వెబ్సైటు ద్వారానే అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. ఇవి ప్రధానంగా మధ్యతరగతి వారిని ఆకర్షించే విధంగా వాటి ఫీచర్స్ మరియు ధరలు ఉంటాయి. ఎలాగైతే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. SMARTPHONE IN TELUGU

కానీ ఎక్కువగా కొంతమంది స్మార్ట్ ఫోన్లు కొని కొన్నాళ్ళే ఉపయోగించి అమ్మేస్తుంటారు, ఇదో సరదా ! కొత్త ఫీచర్స్ కలిగిన ఫోన్ వస్తే, వాడుతున్న ఫోన్ అమ్మేసి కొత్త ఫోన్ కొనుక్కునే సరదా. బాగా ఎక్కువ కాలం వాడి ఫోన్ ఎక్కువసార్లు రిపేర్ వస్తుంటే, ఇంకా కొత్త ఫోన్ కొనవలసిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ ఫీచర్స్ వస్తుంటే, కొత్త ఫోన్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.

SMART PHONE MODELS IN TELUGU

ప్రతి కంపెనీ వారి ఫోన్ ఎదో ఒక మోడల్ పేరుతొ ఆన్ లైన్లో కానీ ఆఫ్ లైన్లో కానీ విడుదల చేస్తారు, ఆ మోడల్ ఎంతవరకు ప్రభావం మార్కెట్ పై చూపింది, అంటే అమ్మకాలు ఎక్కువగా ఉన్నయా లేదా, ఉంటే అది విడుదల అయి ఎన్ని మాసాలు(నెలలు) అయ్యింది. మోడల్ విషయంలో అది లేటెస్ట్ లేదా ఓల్డ్ మోడల్ అనేది చూసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే టెక్నాలజీ, ఓస్ వెర్షన్ మారిపోతుంటాయి. (ఉదా: లెనోవో K6 పవర్ జనవరి 31 2017 తేదిన విడుదల అయితే మరిన్ని ఫీచర్స్ లేటెస్ట్ ఓస్ వెర్షన్ కలిగిన లెనోవో K8 ప్లస్ సెప్టెంబర్ 07 2017 తేదిన విడుదల అయ్యింది.) అలాగే అందుబాటులో ఉన్న మోడల్ పనితీరు కూడా పరిశిలీంచాలి, చాలా వెబ్ సైట్లు మొబైల్ రివ్యూస్ అందిస్తుంటాయి, కొత్తగా విడుదల అయ్యిన వాటిపై, రాబోవు కొత్త మోడల్స్ వివరాలతో. అలాగే ఆన్ లైన్లో కొనుగోలు చేసే వెబ్ సైట్లో, అప్పటికే కొనుగోలు చేసిన వారి అభిప్రాయాలు వ్రాయబడి ఉంటాయి, అవి చూసి కూడా మనం ఆ మోడల్ పనితీరు అంచనా వేసుకోవచ్చు. 91మొబైల్స్ వెబ్సైటు మంచి ప్రాచుర్యం పొందిన వెబ్సైటు మొబైల్ వివరాలు తెలియజేయడంలో.

POPULAR MODELS IN TELUGU

ఆపిల్ కంపెనీ ఐఫోన్ బ్రాండ్ అండ్ క్రేజీ ఫోన్, ఆకర్షణీయమైన డిజైన్లో వివిధ రకాల మోడల్స్ కలవు. క్వాలిటీ అంటే ఇఫోన్ అనే అంత రీతిలో ఐఫోన్ ఉంటుంది. ఐఫోన్ x, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7 మొదలైన మోడల్స్ ఆన్ లైన్లో లభిస్తున్నాయి. ఇవి ప్రీమియం ఫోన్లు, ఎక్కువ ధర కలిగిన ఫోన్లు సుమారు 25 వేల నుండి 1 లక్ష ధరలలో లభిస్తాయి. ఇఫోన్ 5S, SMARTPHONE IN TELUGU

సామ్సంగ్ కంపెనీ మొబైల్స్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం వచ్చాక మొబైల్ రంగంలో బాగా ప్రాచుర్యం పొందిన సంస్థ. టచ్ ఫోన్ సిరీస్ మొదలయ్యాక సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ బాగా అమ్ముడయ్యాయి. ప్రస్తుతం సామ్సంగ్ S8 సుమారు రూ.49990/- లతో మరియు సామ్సంగ్ S9 ప్లస్ సుమారు రూ.64900/- మోడల్స్ ప్రీమియం ఫోన్లుగా ఆన్ లైన్లో లభిస్తున్నాయి. మిడ్ రేంజ్ మొబైల్ సామ్సంగ్ J7 సిరీస్ బాగా ప్రాచుర్యం పొందాయి. సామ్సంగ్ J7ప్రో, సామ్సంగ్ J7 డ్యూ, సామ్సంగ్ J7ప్రైమ్, సామ్సంగ్ J7 మాక్స్ సామ్సంగ్ J7NXT ఇవి ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్లో లభిస్తాయి. సామ్సంగ్ J2, J3 సిరీస్ మోడల్ చీఫ్ అండ్ బెస్ట్ మొబైల్ విభాగంలో ప్రాచుర్యం పొందాయి. అలాగే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఆన్ సిరీస్ మోడల్స్ కేవలం ఆన్ లైన్లో మాత్రమే లభిస్తాయి. వాటిలో ప్రస్తుతం కొన్ని కొత్త మోడల్స్ సామ్సంగ్ గాలక్సీ ఆన్ 7 ప్రైమ్, సామ్సంగ్ గాలక్సీ ఆన్ మాక్స్, సామ్సంగ్ గాలక్సీ ఆన్ నెక్స్ట్, SMARTPHONE IN TELUGU

వన్ ప్లస్ 6, అసస్ జెన్ ఫోన్ 5, గూగుల్ పిక్సెల్2, హానర్ 8 ప్రో, హానర్10, ఒప్పో F7, నోకియా 8, నోకియా 8సిరోకో, మోటో Z2 ఫోర్సు, LG G6, వివో 5ప్లస్ మొదలైన ప్రీమియం మోడల్స్ ప్రీమియం ధరలలో లభిస్తున్నాయి.

సుమారు పదివేల నుండి పదిహేడు వేల రూపాయల ధరలో లభించే కొన్ని పాపులర్ మోడల్స్

నోకియా 6.1, రెడ్ మి నోట్ 5, రెడ్ మి 5, లెనోవో K8 నోట్, లెనోవో K8 ప్లస్, హానర్ 9 లైట్, హానర్ 7X, రెడ్ మి నోట్ 4, ఎంఐ మాక్స్ 2, సామ్సంగ్ ఆన్ 7 ప్రైమ్, సామ్సంగ్ గాలక్సీ ఆన్ మాక్స్, సామ్సంగ్ గాలక్సీ ఆన్6, మోటో ఇ5 ప్లస్, హానర్ 7a, హానర్ 7c మొదలైన మొబైల్ మోడల్స్ మనకి ఆన్ లైన్లో లభిస్తాయి.

కొత్త ఫీచర్స్ ఎక్కువగా మొబైల్ యూజర్స్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. హై స్పీడ్ ప్రాసెసర్, కొత్త సాఫ్ట్వేర్ వెర్షన్, కెమెరా క్వాలిటీ మరియు డ్యూయల్ కెమెరా ఫ్రంట్ అండ్ బ్యాక్, ఐ రెటీనాతో, ఫింగర్ ఫ్రింట్ తో, పేస్ డిటెక్షన్ తో ఫోన్ అన్ లాక్ చేసే ఫీచర్స్, క్విక్ బాటరీ ఛార్జ్, హై రామ్ అండ్ ఫోన్ మెమరీ, కంపాస్, మొదలగు ఫీచర్స్.

Smartphone In Telugu

వివిధరకాల కంపెనీల స్మార్ట్ ఫోన్లు చాలానే వస్తూ ఉంటాయి, అయితే అవి ఎక్కువగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లె మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి, వాడుక సులభంగా ఉంటుంది. SMARTPHONE IN TELUGU

రకరకాల మొబైల్ ఆప్స్ వివిధ అంశాలవారిక కొన్నిరకాల వర్గాలుగా విభజన చేయబడి చాలా ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ కొత్తగా వస్తూ ఉంటాయి, పాతవి అప్డేట్సు పొందుతూ ఉంటాయి. బయోగ్రఫీ మొబైల్ ఆప్స్, స్పోర్ట్స్ న్యూస్ మొబైల్ ఆప్స్, డాక్టర్ హెల్త్ మొబైల్ ఆప్స్, ఎడిటర్ ఛాయస్ మొబైల్ ఆప్స్, మానసిక పరివర్తన మొబైల్ ఆప్స్.  ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్స్ అనేకంగా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సాదారణ మొబైల్ గేమ్స్, పైడ్ మొబైల్ గేమ్స్, న్యూ ట్రేండింగ్ మొబైల్ గేమ్స్, హెవీ మొబైల్ గేమ్స్, లైవ్ మొబైల్ గేమ్స్, క్రికెట్ మొబైల్ గేమ్స్, ఫుట్ బాల్ మొబైల్ గేమ్స్, వరల్డ్ కప్ ఫాషన్ మొబైల్ గేమ్స్ మరియు మొదలైన వర్గాలుగా మొబైల్ గేమ్స్ అనేకం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు లభిస్తాయి.

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games