Search Engine Things Browser

Search Engine Things Browser

సెర్చ్ ఇంజిన్ బ్రౌజరు అడ్రస్ బార్ ఏ పదం టైపు చేస్తే ఆ పదమునకు సంభందించిన వివరాలు గల వెబ్ సైట్ లేక బ్లాగ్ పేజిల లింకులను బ్రౌజరులో  ప్రదర్శించే వెబ్ సైట్ ప్రోగ్రాం. చాలా ఉపయోగకరమైనది. సాదారణంగా ఒక డొమైన్ నేమ్ సరి అయిన అడ్రస్ తెలిసి ఉంటే అది బ్రౌజరు అడ్రస్ బార్ నందు టైపు చేస్తే, ప్రత్యక్షంగా కావాల్సిన వెబ్ పేజి ఓపెన్ అవుతుంది. కానీ డొమైన్ నేమ్ అడ్రస్ సరిగా తెలియక లేక కావాల్సిన విషయం వివరాలు తెలియజేసే డొమైన్ నేమ్ తెలియనప్పుడు మనకి సెర్చ్ ఇంజిన్ బాగా ఉపయోగకరం. సెర్చ్ ఇంజిన్ బ్రౌజర్ బలమైన సంభందం కలిగి ఉంటాయి. అయితే ఆ సంభందం ఎదో ఒక సెర్చ్ ఇంజిన్ తో మన పరికరంలో బ్రౌజరుకి ఏర్పడి ఉంటుంది. మొబైల్ నందు బ్రౌజింగ్ ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ గా ఉపయోగపడుతుంది. విండోస్ ఫోన్లలో బింగ్ సెర్చ్ ఇంజిన్ గా ఉపయోగపడుతుంది. ఎక్కువగా సెర్చ్ ఇంజిన్ గా వాడేది గూగుల్, బింగ్, యాహు మొదలైనవి.


Search Engine Usage

సర్వర్లో ముందుగా పొందుపరచబడిన విషయల వివరాల హెడ్ లైన్స్ తో కలిపి ఆయా వెబ్ పేజి లేక బ్లాగ్ పేజి డొమైన్ పేరుతొ బ్రౌజరు నందు వినియోగదారుని సెర్చ్ చేస్తున్న విషయాన్ని బట్టి చూపిస్తుంది, సెర్చ్ ఇంజిన్. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక సెర్చ్ ఇంజిన్ అందరికి చేరువలో ఉంది. సెర్చ్ ఇంజిన్ సాయంతో ఇంటర్నెట్ ద్వారా బ్రౌజరు ఉపయోగించి ప్రపంచంలో అనేక విషయలు వెతికి తెలుసుకోవచ్చు. శ్రద్ధ పెడితే ఇంటర్నెట్ ఉపయోగించి సెర్చ్ ఇంజిన్ ద్వారా ఏదైనా కోర్స్ నేర్చుకోవచ్చు. మనం చేస్తున్న ఉద్యోగంలో లేక ప్రయత్నంలో సందేహాలు ఉంటే ఇంటర్నెట్ నెట్ ద్వారా సెర్చ్ ఇంజిన్ సహాయంతో తెలుసుకోవచ్చు. సంపాదనా మార్గాలు ఇంటి నుండే సృష్టించుకునే అవకాశాలు ఉంటాయి. విద్యార్ధులకు అయితే అనేక సందేహాలు సెర్చ్ ఇంజిన్ సహాయంతో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు, లేక ఆన్ లైన్ కోర్స్ చేయవచ్చు. జాతకాలు తెలుసుకోవచ్చు, వారఫలాలు తెలుసుకోవచ్చు.

అయితే సెర్చ్ చేసేటప్పుడు మనకి అవసరమైన వివరం సరిగా టైపు చేస్తే మొదటి లింకులోనే కావాల్సిన వెబ్ పేజి లేక బ్లాగ్ పేజి లింకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదా: ఐపిఎల్ క్రికెట్ లైవ్ చూడాలి అనుకుంటే, లైవ్ ప్రోగ్రాం ఇంటర్నెట్లో ఇచ్చే వెబ్ సైట్ డొమైన మనకి తెలియదు. అప్పుడు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయాలి కదా అయితే ఇక్కడ IPL అని మాత్రమే టైపు చేసామనుకోండి, మనకి IPL సంభందించి క్రికెట్ కి సంభందించి, క్రికెట్ ప్లేయర్స్ గురించి, IPL ఇతర బ్లాగ్స్ లింకులు, వేరే కధనాలు ఏవైనా లింకులు వచ్చే అవకశాలు ఎక్కువ. కానీ మనం సరిగా IPL 2018 LIVE STEAMING IN ONLINE అని టైపు చేస్తే కావాల్సిన వెబ్సైటు మొదటి పేజిలోనే లభించే అవకాశం ఉంటుంది. అంటే విషయం సూటిగా వివరంగా టైపు చేస్తే ఉంటే మొదటి పేజిలోనే ఆయా విషయ సంభందమైన లింకులు ఓపెన్ అవుతాయి. ఒక విషయం టైపు చేసిన పదం చిన్నది అయినా, అదే పేరు మీద డొమైన్ నేమ్ ఉండి, వారు దానికి సంభంచిన వివరాలే అందించే వెబ్సైటు ఒకటే అయితే వెంటనే మనకి మొదటి లింక్ కచ్చితంగా ఉంటుంది.

ఉదాహరణగా AVG ఏంటివైరస్ అప్ కంప్యూటర్ బ్రౌజరులో వెతుకుతున్నాం, ఫోను స్క్రీన్ చిన్నది కాబట్టి వెతికే సమయం ఎక్కువ పడుతుంది.  మనం బ్రౌజరు అడ్రస్ బారు నందు మొబైల్ అప్స్ అని టైపు చేస్తే అప్పుడు సెర్చ్ ఇంజిన్, మొబైల్ అప్స్ అంటే ఏమిటి, ఎన్ని మొబైల్ అప్స్ సంస్థలు ఉన్నాయి, ఎవరు రూపొందించారు, ఎవరు అభివృద్ధి చేసారు ఇలా ఆయా సంభందమైన లింకులు వస్తాయి కానీ మనకి సంభందమైన ఏంటివైరస్ లింకులు రావు. సరే ANTIVIRUS అని టైపు చేస్తే, ఏంటివైరస్ కంపెనీలు డెస్క్టాపు వెర్షన్ లింకులు వస్తాయి. అయితే ఆయా వైరస్ కంపెనీ వెబ్ సైటు నందు అప్ లింక్ ఉంటుంది. కానీ మనకి AVG ఏంటివైరస్ మొబైల్ అప్ కావాలి, మనం కచ్చితంగా AVG MOBILE ANTIVIRUS అని టైపు చేస్తే మొదటి రెండుమూడు లింకులలో అప్ లింక్ ఉంటుంది. అలాగే ఇంకో విషయం పేరెంట్ వెబ్ లింకు గుర్తు ఉంటే అది ఉపయోగం తొందరగా సెర్చ్ చేయడానికి. ఉదా: ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అయితే దాని పేరు – గూగుల్ ప్లే స్టోర్, PLAY STORE అని గూగుల్ టైపు చేస్తే ప్రత్యక్షంగా ఆ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. ఆ ప్లే స్టోర్ వెబ్ సైట్లో AVG ANTIVIRUS అని టైపు చేయగానే మనకి అప్ లింక్ వస్తుంది. అది మొబైల్ లింక్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఉదాహరణగా చెప్పాను, సాదారణంగా మొబైల్ అప్స్ ప్లే స్టోర్ నందు తేలికగానే ఫైండ్ చేయవచ్చు. ముఖ్యంగా రివ్యూ రేటింగ్స్ చూసి ఇన్స్టాల్ చేయాలంటే, డెస్క్ టాప్ బ్రౌజింగ్ తేలిక.

ఇంకా వివరంగా బ్రౌజర్ గురించి ఇక్కడ చదవండి

మరిన్ని విషయాలు తరువాయి పోస్టులలో !

దన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

12 thoughts on “Search Engine Things Browser

  1. Pingback: SMARTPHONE IN TELUGU

  2. Pingback: Fingerprint Sensor Mobiles

  3. Pingback: Smartphone Mobile Apps

  4. Pingback: Browsing With Browser - Mobile / Computer

  5. Pingback: Mobile Application Install Things

  6. Pingback: Latest Android OS Mobiles

  7. Pingback: best-battery-backup-phones

  8. Pingback: Smartphone Display

  9. Pingback: Smartphone Performance - Telugu

  10. Pingback: Better Mobile Selection - 91Mobile Application

  11. Pingback: Earning Chances From Mobile Applications

  12. Pingback: Top Free Android Mobile Apps - Iవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *