Better Mobile Selection – 91Mobile Application

Better Mobile Selection – 91Mobile Application

91mobiles వెబ్ సైట్లో ఇండియాలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో టాప్ 20 మొబైల్ ఫోన్లు గురించిన ఆర్టికల్ కొత్తగా మొబైల్ కొనాలని అనుకునేవారికి ఉపయుక్తంగా ఉండవచ్చు. ఆర్టికల్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే కొత్తగా రాబోయే స్మార్ట్ ఫోన్లు లేక మొబైల్ టెక్నికల్ న్యూస్ ఈ వెబ్ సైటులో read చేయవచ్చు.

స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు, మనం కొనాలి అనుకున్న కంపెనీ మోడల్ మొబైల్ మనకి తెలిసిన వారు ఉపయోగిస్తుంటే, చూసి మనకి నచ్చితే అటువంటి మోడల్ కొనవచ్చు. అయితే మనం కొత్త ఫోను కొనేటప్పుడు, లేటెస్ట్ ఫోన్ టెక్నాలజీ, అప్డేట్ మొబైల్ అప్స్ కలిగిన ఫోన్ మన స్నేహితులు చుట్టుపక్కల వారు వాడని ఫోన్ కొనాలి అనుకుంటే, ఆ ఫోన్ పనితీరు అంచనా వేయడానికి, ఆ కంపెనీలో ఇంతకుముందు విడుదల అయిన మోడల్ పని తీరు, వినియోగదారులు అభిప్రాయాలు తెలుసుకుంటే, కొత్తగా విడుదల అవ్వబోయే ఫోనుపై కూడా మన మంచి అవగాహన వచ్చే అవకాశము ఉంటుంది. ఇలా మనకి కొత్తగా వచ్చి మార్కెట్లో ఉన్న మొబైల్స్, బెస్ట్ పెర్ఫార్మన్స్ మొబైల్స్, బెస్ట్ కెమెరా మొబైల్స్, హై రామ్ మొబైల్స్, లేటెస్ట్ os మొబైల్స్, రాబోయే మొబైల్ మోడల్స్ అంచనాలు తెలియజేసే వెబ్ సైటు లేక మొబైల్ అప్ 91మొబైల్స్ (91mobiles)

91mobiles: 91 మొబైల్స్ ప్రత్యేకించి మొబైల్స్ గురించి విశ్లేషణలు, వివిధ మోడల్స్ మధ్య ఫీచర్స్ పోలిక వివరిస్తుంది. అయితే ఇందులో ఇంకా  లాప్ టాప్స్, టాబ్లెట్స్, కేమేరాస్, టెలివిజన్లు, హోం థియేటర్స్, పవర్ బ్యాంక్స్, స్మార్ట్ వేర్స్, వాషింగ్ మెషిన్, ఎయిర్ కండీషనర్ మొదలైన వాటిపై కూడా రివ్యూస్, వివరణలు చూడవచ్చు. వస్తువులపై ఓవరాల్ స్కోర్ మరియు ఫీచర్స్ పై రేటింగ్ ఇందులో ప్రత్యేకత ఉంది, మొబైల్స్ గురించి చూస్తే 91 మొబైల్స్ ప్రతి కంపెనీ మొబైల్ మోడల్ పై, వాటి ఫీచర్స్ పనితీరుని బట్టి స్కోర్ ఇస్తుంది.

కెమెరా క్వాలిటీ ఆధారంగా, పెర్ఫార్మన్స్ ఆధారంగా, బాటరీ బ్యాక్ అప్ ఆధారంగా, కొత్తగా వచ్చిన మొబైల్ ఆధారంగా, ఎక్కువగా అమ్ముడవుతున్న మొబైల్స్ ఆధారంగా, మొబైల్ OS ఆధారంగా పాపులర్ అయిన మొబైల్స్ ఇలా ఆయా విభాగంలో ఏ ఫోన్ బెస్ట్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే అన్ని విభాగాలలో ఏ మొబైల్ పనితీరుని బట్టి కూడా మనం వరుసలో ఏ కంపెనీ మోడల్ మంచి స్కోర్ ఉందొ చూడవచ్చు. అలాగే a మోడల్ ఏ PROS వర్డ్స్, CONS వర్డ్స్ మోడల్ ఎందులో ప్రత్యేకత కలది తెలియజేస్తుంది.  ఇంకా ధరని బట్టి కూడా మనం మంచి రేటింగ్ ఉన్న ఫోన్ సెలక్ట్ చేసుకోవడానికి, వివధ మోడల్స్ పై కంపారిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రీమియం మొబైల్స్ రూ.30000/-ల పైన 85% స్కోర్ పైన కలిగి ఉంటాయి. మిడ్ రేంజ్ మొబైల్స్ ఎక్కువగా 65% నుండి 82% మద్యలో స్కోర్ కలిగి, సుమారు రూ. 7000/- ల నుండి రూ.15000/- ల ధరలలో అందించే ఇకామర్స్ వెబ్ సైట్ల లింకుని కూడా అందిస్తుంది. ఓవరాల్ మోడల్ పై 65% పై స్కోర్ కలిగిన మోడల్స్ ఎక్కువ ఫీచర్స్ బాగున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఫీచర్స్ పేరు రాసి, ఆ ఫీచర్ ప్రక్కనే, క్రింద గ్రీన్ లైన్ ఫీచర్ పెర్ఫార్మన్స్ సూచిస్తుంది. గ్రీన్ లైన్ డార్క్ ఉంది లెంగ్త్ ఎక్కువ ఉంటే, ఆ ఫీచర్ ఆ ఫోన్ మోడల్ బెస్ట్ అని తెలుస్తుంది. ఎక్కువ ఫోన్ పెర్ఫార్మన్స్, డిస్ప్లే, కెమెరా, బాటరీ, రిజల్యుషన్, పిక్సెల్ డెన్సిటీ మొదలైన ఫీచర్స్ గురించి, గ్రీన్ లైన్ సూచి, ఆయా విషయలలో ఫోన్ ప్రత్యేకతను తెలియజేస్తుంది.

ఆ మొబైల్ మోడల్ వాడిన యూసర్ రివ్యూస్ రేటింగ్ కూడా ఇక్కడ చూడవచ్చు. మొబైల్స్ విషయంలో సరి అయిన రివ్యూస్, క్వాలిటీ పెర్ఫార్మన్స్ విషయంలో అవగాహన కలిపించే మోడల్స్ వివరాలు, ఫీచర్స్ పై సూచి రేటింగ్ మొబైల్ కొనుగోలు విషయంలో ఒక క్లారిటీ లభిస్తుంది.

ఇంకా తరువాయి పోస్టులో మరి కొన్ని!

ధన్యవాదాలు

వేగ2020View Enlisted Gadget Apps

8 thoughts on “Better Mobile Selection – 91Mobile Application

  1. Pingback: Fingerprint Sensor Mobiles

  2. Pingback: Latest Android OS Mobiles

  3. Pingback: best-battery-backup-phones

  4. Pingback: Mobile Application Install Things

  5. Pingback: Review Websites - Mobile Applications

  6. Pingback: Earning Chances From Mobile Applications

  7. Pingback: Genuine User Reviews Website - Mobile Application

  8. Pingback: New Smartphoneవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *