Earning Chances From Mobile Applications

Earning Chances From Mobile Applications

Earning chances From Mobile Applications ఇంటర్నెట్ ద్వారా ఇంటి వద్ద నుండే సంపాదించే అవకాశాలు ఉన్నట్లు, స్మార్ట్ ఫోన్ నుండి అయితే ఎక్కడ నుండి అయినా మనీ ఎర్నింగ్ అవకాశాలు ఉన్నట్లు అని అంటారు. అయితే అటువంటి సంపాదన అవకాశాలు ఇచ్చే మొబైల్ అప్స్ ఏమిటో చూస్తే, లింకులు పై క్లిక్ చేస్తే వచ్చే యాడ్స్, లేదా యాడ్స్ క్లిక్ చేస్తే వేరే అప్స్ మన మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవడం, కొన్ని ఆన్లైన్ సర్వేలలో పాల్గొనడం,  కొన్ని ప్రకటన వీడియోలు చూడడం ద్వారా మనీ ఎర్నింగ్ అవకాశాలు ఉన్న్తట్లు కనిపిస్తాయి. కొన్ని అప్స్ బాగా చిత్రీకరించి రూపకల్పన చేసిన వీడియోలు షేర్ చేయడం ఎదో మార్గం ఉంటుంది. అయితే సహనంతో సాధించాలి అంటారు. ఓర్పు నేర్పు కార్యదక్షతను పెంచే అవకాశము ఎక్కువ.


సరే మొబైల్ అప్స్ చూస్తే, గూగుల్ వారి గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ మొబైల్ అప్ (Google Opinion Rewards) ప్లే స్టోర్లో ఉచితంగా లభిస్తుంది. జస్ట్ డౌన్లోడ్ చేసుకుని, మీ జిమెయిల్ ఎకౌంటుతో రిజిస్టర్ అయ్యి, వారు నిర్వహించే సర్వేలలో పాల్గొనాలి, అలా చేస్తే సర్వ్ సక్సెస్ ఫుల్ అయితే, చిన్న అమౌంట్ మీ ఎకౌంటుకి వస్తుంది. అలా వారు నిర్వహించే ఎక్కువ సర్వేలలో పాల్గొంటే ఎక్కువ అమౌంట్.

గూగుల్ ఏడ్సెన్స్ (Google AdSense) మొబైల్ అప్ కానీ ఇదే వెబ్సైటు లేక బ్లాగ్ ట్రాఫిక్ బట్టి మనీ ఎర్నింగ్ అవకాశాలు ఉంటాయి. బ్లాగ్ కానీ వెబ్ సైట్ కానీ ఏదైనా మంచి కంటెంట్ తో రోజువారీ పోస్టులు అప్డేట్ చేస్తూ, ఆ బ్లాగ్ రోజువారీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే, అమౌంట్ మీ జిమెయిల్ ఎకౌంటుకు జమ అవుతుంది. ఇది మంచి మార్గం అని ఎక్కువ మంది అభిప్రాయం ఎందుకంటే బ్లాగ్ ద్వారా తెలిసిన విషయాలు తెలియని వారికీ తెలియజేయబడతాయి. తెలిసినవారు తమకు తెలిసింది నలుగురికి షేర్ చేస్తూ, సంపాదించడం ఉంటుంది. అయితే ప్రారంభంలో పట్టు వదలకుండా ఒకే విభాగంపై పడే పడే కొత్త కొత్త విషయలు తెలియజేస్తూ ఉంటే, కొన్ని నెలలో బ్లాగ్ ద్వారా సంపాదించే అవకాశాలు ఉంటాయి.

Earning Chances From Mobile Applications youtube, blogger

యు ట్యూబ్ (YouTube) మీరు ఆకర్షనీయమైన థంబ్నెయిల్స్ తో మంచి వీడియోలు చేసి యు ట్యూబ్ ఛానల్లోకి అప్లోడ్ చేసి, అది ఎక్కువ మంది చూస్తే కనుక మీకు ఎర్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వెబ్ సైట్ కంప్యూటర్ లో ఓపెన్ చేసే చూసేవారు, మొబైల్లో యు ట్యూబ్ వీడియో చూసేవారి కన్నా తక్కువే. అందుకే యు ట్యూబ్ వీడియో ఛానల్ తొందరగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అయితే వీడియో ఛానల్ అంశం అందరికి ఉపయోగపడేది అయితే తొందరగా పాపులర్ అవుతుంది. ఇంకా చేస్తున్న వీడియోలు యు ట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్లకు లోబడి ఉండాలి. కాపీ కంటెంట్ కాకుండా ఉండాలి. స్మార్ట్ ఫొన్లొ యు ట్యూబ్ ఒక ప్రధాన స్మార్ట్ అప్లికేషను.

బ్లాగర్ (Blogger) ఇది కూడా గూగుల్ మొబైల్ అప్ మరియు వెబ్ సైట్. బ్లాగ్గింగ్ చాల తేలికగా చేయవచ్చు. మీ ఆండ్రాయిడ్ మొబైల్ నుండి ఏదైనా కంటెంట్ ఆధారిత పోస్టులు అప్డేట్ చేయవచ్చు. బ్లాగ్ ట్రాఫిక్ పెరిగితే మనీ ఎర్న్ చేయవచ్చు. ఏదైనా అంశంలో టిప్స్ కానీ, వివరణ కానీ, రివ్యూస్, న్యూస్, గాడ్జెట్ న్యూస్, మొబైల్ టిప్స్, సాఫ్ట్వేర్ టిప్స్ ఇలా ఎదో ఒక విషయంలో రోజు పోస్టుల ద్వారా కంటెంట్ అందించే బ్లాగ్ అయితే  బేసిక్ బ్లాగర్ కి ఇది అప్ ఉపయోగం. మీ స్మార్ట్ ఫోన్ నుండే బ్లాగ్ నిర్వహించవచ్చు కానీ బేసిక్ పోస్టింగ్స్ వరకు చేయగలం, బ్లాగ్గింగ్ కు కంప్యూటర్ బాగుంటుంది. 

పేస్ బుక్ (Facebook): పేస్ బుక్ పేజి ఉండి, ఎక్కువ లైక్స్ ఉంటే, లేక పేస్ బుక్ గ్రూప్ ఉండి ఎక్కువమంది సభ్యులుగా ఉంటే, అఫిలియేట్ ప్రోగ్రాం ద్వారా అంటే అమెజాన్ లేక ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ప్రోడక్ట్ ని మీ పేస్ బుక్ పేజి కానీ గ్రూప్ లో కానీ షేర్ చేస్తే, మీరు షేర్ చేసిన ప్రోడక్ట్ మీ లింకు ఆధారంగా అమ్మకం అయితే, దాని ద్వారా కమిషన్ రూపంలో డబ్బు సంపాదించవచ్చు. అయితే అదే పనిగా లింకులు షేర్ చేస్తే పేస్ బుక్ ఎకౌంటు బ్లాక్ అవుతుంది.

విగో వీడియో (Vigo Video – Formerly Hypstar): ఇది వీడియో ఎడిటింగ్ మొబైల్ అప్ దీనిద్వారా మన మొబైల్ ద్వారా చిత్రీకరించిన వీడియోలు, ఎడిట్ చేసి రిజిస్టర్ అయిన స్నేహితులతో షేర్ చేయవచ్చు. అలా షేర్ చేసిన వీడియో ఎక్కువమంది చూసి, బాగా పాపులర్ అయితే ఈ మొబైల్ అప్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి టచ్ / క్లిక్ చేయండి ప్రక్క బటన్.

వాచ్ అండ్ ఎర్న్ – ఎర్న్ రియల్ మనీ (Watch & Earn – Earn Real Money) అనే పేరుతొ గూగుల్ ప్లే స్టోర్ నందు లభిస్తుంది. ప్రకటన వీడియోలు చూడడం వలన కొన్ని కాయిన్స్ ఎర్న్ చేసి, అవి ఎక్కువ మొత్తం అయ్యాక వారు అందించే పార్టనర్ కూపన్ ద్వారా లేక పేమెంట్ వాల్లెట్ కూపన్ ద్వారా ఫలితం అందుతుంది.

ఇంకా ఇతర మొబైల్ ఎర్నింగ్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్ నందు లభిస్తాయి.

మరిన్ని విషయలు తరువాయి పోస్టులలో

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps