Genuine User Reviews Website – Mobile Application

Genuine User Reviews Website – Mobile Application

Genuine User Reviews Website – Mobile Application కొనుగోలు చేయబోయే వస్తువుని గురించి, లేక వస్తువు ఉత్పత్తి దారుని, గురించి లేక ఆ వస్తువు అమ్మక చేసే ప్రముఖ ఆన్ లైన్ స్టోర్ గురించి, లేక ఆ వస్తువు మోడల్ పనితీరు గురించి, వస్తువు వాడిన వినియోగదారుల స్వయంగా వెలిబుచ్చిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే మాత్రం, కంప్యూటర్ నందు అయితే మౌత్ షట్ వెబ్ సైట్ లేక స్మార్ట్ ఫోన్లో అయితే మొబైల్ అప్ సందర్శిస్తే, ఇవన్ని చూడవచ్చు. రివ్యూ వెబ్ సైటులు లేక రివ్యూ మొబైల్ ఆప్స్ చూడడం వలన సదరు వస్తువు నాణ్యత, సదుపాయాలపై వినియోగదారుకి సరైన అవగాహనా వచ్చే అవకాశం ఉంటుంది.



అనేకమంది వినియోగదారులు రిజిస్టర్ అయ్యి ఉత్పత్తులు, సేవలు విషయాలపై తమతమ అభిప్రాయాలు వెల్లడి చేస్తారు. ఆ అభిప్రాయలు వివిధ విభాగాలలో, వివిధ వస్తువులపై, సాఫ్ట్ వేర్ పై, సంస్థల పై సేవ సంస్థలపై మొబైల్ మోడల్స్ పైన, మొబైల్ అప్స్, మొబైల్ సాఫ్ట్వేర్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టంపై, నెట్ వర్క్ ప్రొవైడర్, బ్రౌజర్స్, వెబ్ సైట్స్, న్యూ స్మార్ట్ ఫోన్స్ అనేక సంస్థలు ఉత్పత్తులపై కాటగిరిలుగా చూడవచ్చు. ఇంకా చలన చిత్రాలపై రివ్యూ రేటింగ్స్ కూడా ఇందులో చూడవచ్చు.

ఇంకా వీరు బుయింగ్ గైడ్ లైన్స్ అంటే కొత్త వస్తువు కొనుగోలు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు తెలియజేస్తున్నారు. ఎయిర్ టికెట్స్, ఎయిర్ ప్యురిఫైర్, ఎయిర్ కండిషన్, బ్యాంకు సెలక్షన్, బైక్, కార్, బుక్స్, కాలేజీ సెలక్షన్, కొరియర్ సర్వీస్, కెమెరా, డిటిహెచ్ సర్వీస్, క్రెడిట్ కార్డు కొనుగోలు, హాస్పిటల్, కిచెన్ ఐటమ్స్, హోం నీడ్స్ మొదలైన రంగాలలో మొదటి సరి వస్తువు కొనుగోలు లేక సర్వీస్ సెలక్షన్ పై సూచనలు తెలియజేస్తున్నారు. ఇంకా మొదటి సరి ఉద్యోగంలో చేరబోయే వ్యక్తులకు కూడా ఉద్యోగం ఇచ్చేసంస్థను ఎలా ఎంచుకోవాలి అనే సూచనలు కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు.

అలాగే సంస్థల కోసం కూడా మౌత్ షట్ ఫర్ బ్రాండ్ అనే విభాగంలో సంస్థలకు ఉత్పత్తుల ప్రమోషన్, సేవ ప్రమోషన్ తదితర విషయలపై సూచనలు తెలియజేస్తున్నారు.

ఇంకా ఇందులో ఎవరైనా వినియోగదారు, తాము వాడిన వస్తువు లేక వినియోగించిన సేవలపై అభిప్రాయం రిజిస్టర్ అయ్యి వెల్లడి చేయవచ్చు. అలా వెల్లడి చేసిన అభిప్రాయం, వారి స్నేహితులతో సోషల్ మీడియాలో షేర్ చేసి ఎంఎస్ పాయింట్స్ గెలవవచ్చు. అలా ఎక్కువ పాయింట్స్ వస్తే అవి కాష్ గా మార్చుకోవచ్చు. మీరు బాగా రివ్యూస్ రాయగలిగి, సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందితే, ఎన్ని రివ్యూస్ సెలెక్ట్ అయితే అన్ని ఎమెస్ పాయింట్స్ ఆర్జన చేయవచ్చు. ఆర్జించిన పెద్ద మొత్తం ఎంఎస్ పాయింట్స్ తరువాత కాష్ గా మార్చుకోవచ్చు.

ఇతర మొబైల్ అప్స్ తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

వేగ2020 View Enlisted Gadget Apps