Mobile Apps

Smartphone Mobile Apps

స్మార్ట్ ఫోన్ ఉంటే జేబులో పెన్ లేకపోయినా, మనం ఏదైనా వ్రాయాలంటే ఫోనుతో ఫోటో తీయడమో లేక టైపు చేసి డ్రాఫ్ట్ లో సేవ్ చేసుకొని పెన్ లేకున్నా స్మార్ట్ ఫోనుతో గడిపివేయవచ్చు. సోషల్ మీడియాలో మన స్టేటస్ ఎక్కడ నుండి అయినా అప్డేట్ చేయవచ్చు, కానీ మొబైల్ డేటా అందుబాటులో ఉండాలి. బిల్ పేమెంట్, షాపింగ్, వాడిన వస్తువులు అమ్మకం కొన్ని మొబైల్ అప్స్ ఉపయోగించి అమ్మేయవచ్చు, అవే అప్స్ నుండి సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు.ఇంటర్నెట్ ద్వారా వాట్సప్, స్కైప్, హాంగ్ ఔట్స్, ఐఎంఓ మొదలైన మొబైల్ ఆప్స్ ఉపయోగించి వీడియో మరియు ఆడియో కాలింగ్ చేసుకోవచ్చు, ముఖ్యంగా ఇది ఇతర దేశాలలో ఉన్నవారితో మాట్లాడాలంటే, తక్కువ ఖర్చుతో మాట్లాడవచ్చు. న్యూస్ అప్డేట్ ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరుగుతున్న న్యూస్ సోషల్ మీడియాలో స్నేహితుల అప్డేట్ లేదా ప్రత్యేక న్యూస్ మొబైల్ ఆప్స్ ద్వారా మనం ఉన్న చోట నుండే తెలుసుకోవచ్చు, ఇంటర్నెట్ ద్వారా. స్మార్ట్ ఫోనును చిన్న టిప్స్ మరియు అవసరమైన మొబైల్ అప్స్ ఉపయోగించి స్మార్ట్ గా వాడుకోవచ్చు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ మొదలైనవి కూడా మొబైల్ అప్స్ ఉపయోగించి తెలుసుకోవచ్చు.

ప్రయాణానికి ట్రైన్ లేదా ప్రైవేటు మరియు APSRTC బస్సు టికెట్స్ మన మొబైల్ నుండే బుక్ చేసుకోవచ్చు. బస్సు లేదా ట్రైన్ రన్నింగ్ స్టేటస్ స్మార్ట్ ఫోన్లో అప్స్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. గుడికి వెళ్తున్నపుడు ప్రత్యెక పూజ టికెట్స్, మూవీకి వెళ్తుంటే మూవీ టికెట్స్ ముందుగానే Qలో నుంచునే అవసరం లేకుండా మన మొబైల్ నుండే బుక్ చేసుకోవచ్చు. లైవ్ ఈవెంట్స్, లైవ్ గేమ్స్, లైవ్ టీవీ చానల్స్ స్మార్ట్ ఫోన్ నుండే సంభందిత మొబైల్ అప్స్ ఉపయోగించి మన స్మార్ట్ ఫోను నుండే చూడవచ్చు. కాల్ రికార్డింగ్ స్మార్ట్ ఫోనుతో ఇది ఒక మంచి ఉపయోగం, మనం మాట్లాడే కాల్స్ రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ నుండి ఏదైనా స్కాన్ చేసి పిడిఎఫ్ గా మర్చి ఆ డాక్యుమెంట్ అవసరమైన సంస్థ ఉద్యోగిగి పంపించవచ్చు. మొబైల్ అప్స్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని, వాటిని ఉపయోగించి పై చెప్పబడిన విషయాలు నిర్వహించుకోవచ్చు. కొన్ని కంపెనీ స్మార్ట్ ఫోన్లలో కొన్ని అవసరమైన ఆప్స్ డిఫాల్ట్ ఆప్స్ గా ఇన్స్టాల్ చేసి ఉంచుతారు.మనకి అవసరమైన్ మొబైల్ అప్స్ అన్ని ఆయా సంబంధిత మొబైల్ OS ప్లాట్ ఫార్మ్ అనుసరించి ఆయా వెబ్ లేదా మొబైల్ అప్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆపిల్ OS అయితే ఐఓఎస్ అప్ స్టోర్ నుండి, ఆండ్రాయిడ్ OS అయితే గూగుల్ ప్లే స్టోర్ నుండి మొబైల్ అప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు తక్కువ మరియు ప్రీమియం ధరలలో అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ నుండి లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్ అప్స్ విభాగాలు చూద్దాం. ఎక్కువ ఫోన్ మెమరీ ఉన్న ఫోన్ల వలన ఎక్కువ మొబైల్ అప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎక్కువ రామ్ వలన ఒకేసారి రెండు మూడు అప్స్ ఆటంకం లేకుండా ఆపరేట్ చేయవచ్చు. బెస్ట్ క్వాలిటీ కెమెరా తో వీడియో రికార్డింగ్, ఫోటో షూట్ చేయవచ్చు. మంచి బాటరీ బ్యాక్ అప్ ఇచ్చే స్మార్ట్ ఫోన్లు అయితే వీడియోలు బిగ్ స్క్రీన్ మొబైల్లో ఎక్కువసేపు చూడవచ్చు.

షాపింగ్ మొబైల్ అప్స్ చాలా మనకి ప్లే స్టోర్ నందు లభిస్తాయి, దుస్తులు, మొబైల్స్, టాబ్లెట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోం నీడ్స్, పురుషులకు, పిల్లలకు, ఆడువారికి సంబంధించిన ఫాషన్ వస్తువులు,

మొబైల్ సెక్యూరిటీ ఇది చాల అవసరమైన విషయం అలాగే రామ్ క్లీనింగ్, జంక్ ఫైల్స్ డిలీట్ చేయడం లాంటి విషయాలతో ఫోన్ నిర్వహణ తెలుసుకోవాలి.

మొబైల్ లో బ్రౌజింగ్ విధానం చాల ముఖ్య విషయం ఎందుకంటే, బ్రౌజింగ్ చేసేటప్పుడు పొరపాటున కొన్ని లింకులపై క్లిక్ చేసినప్పుడు, వైరస్ లేక మాల్వేర్ ఫైల్స్ మన స్మార్ట్ ఫోన్లో చేరే అవకాశాలు ఎక్కువ.

మొబైల్ అప్స్ ద్వారా సంపాదనా ఎలాగంటే కొన్ని మొబైల్ అప్స్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని వాటిలో యాడ్స్ పై క్లిక్ చేయడం లేదా వాటిలో వీడియో ప్రకటనలు వీక్షించడం వలన కొద్దిపాటి సంపాదనా అవకాశాలు ఉంటాయి.

పెద్ద సైజు ఫైల్ లేదా ఫోటోలు లేదా వీడియోలు షేరింగ్

ఎంటర్టైన్మెంట్ మనకి అవసరమైనప్పుడు, మనం ఉన్న చోట మన స్మార్ట్ ఫోన్ నుండే సృష్టించుకునే అవకాశం ఉంది.  మనకి నచ్చిన వాల్ పేపర్స్, ఆడియో ఫైల్స్, వీడియోలు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చ్. మొబైల్ డేటా ద్వారా వివిధ రకాల మొబైల్ అప్స్ ఉపయోగించి, వీడియో వీక్షణ లేక లైవ్ ప్రోగ్రామ్స్ వీక్షించవచ్చు.

నేర్చుకోవడం అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోనుతో మరీ తేలిక, అనేక రకాల బ్లాగ్స్ వివిధ రంగాలలో గల వివిధ విభాగాలలో అనేక రకాల పోస్టుల ద్వారా విజ్ఞానం షేర్ అవుతూ ఉంటాయి. ఉదా: బ్లాగ్ ఎలా సృష్టించాలి, వెబ్ సైట్ ఎలా తయారుచేయాలి, మొబైల్ అప్ డెవలప్మెంట్, స్కూల్ లేదా కాలేజీ స్టడీ సబ్జెక్టు విషయాలు అనేక విషయాలలో బ్లాగ్స్ మనకి మొబైల్ బ్రౌజింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ వీడియోలు ద్వారా కూడా చూసి నేర్చుకునే అవకాశం కూడా మన స్మార్ట్ ఫోన్లో ఉంది.

ఆరోగ్యానికి సంభందించి టిప్స్, స్టడీ డౌట్స్ లేదా టిప్స్, హోం టిప్స్, కిచెన్ టిప్స్, వంటలపై పోస్టులు లేక వీడియోలు, వస్తువు తయారీ లేక వస్తువును ఎలా ఉపయోగించాలి, కొత్త వస్తువు అవగాహన లేక వాడుక విధానం, రాబోవు కొత్త విషయాలపై విశ్లేషణలు, టెక్నాలజీ సంగతులు, టెక్నికల్ డివైస్ ఫీచర్స్, కొత్త టెక్నికల్ పరికరాలు మొదలైన విషయలపై యూట్యూబ్ వీడియోలు లేదా బ్లాగ్ రీడింగ్ ద్వారా నేర్చుకునే అవకాశాలు ఎక్కువ.

ఎడిటర్ ఛాయస్ మొబైల్ ఆప్స్, ఆర్ట్స్ అండ్ డిజైన్ అప్స్, ట్రావెల్ అప్స్, బుక్స్, ఫైనాన్సు అప్స్, ఫోటోగ్రఫీ అప్స్, స్పోర్ట్స్ అప్డేట్ అప్స్, భక్తీ విశేషాలు, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్ టిప్స్ అండ్ అలర్ట్స్ అప్స్, ఎల్ ఐ సి, సాధనలో టిప్స్, మొబైల్ అప్స్ గురించి వివరించే అప్స్, సోషల్ మీడియా అప్స్, డేటా లేక ఫైల్ షేరింగ్ అప్స్, మెయిల్ అప్స్, ఏంటివైరస్ అప్స్, ఫోన్ క్లీనింగ్ అప్స్, బాటరీ సవేర్ అప్స్, ప్రత్యెక మొబైల్ థీమ్ అప్స్, లైవ్ వాల్ పేపర్ అప్స్, గేలరీ అప్స్, అబౌట్ డివైస్ అప్స్, షాపింగ్ అప్స్,  ట్రైనింగ్ అప్స్, మొబైల్ స్టడీ అప్స్, మ్యూజిక్ అప్స్, లైవ్ వీడియో అప్స్, లెర్నింగ్ అప్స్, వివిధ విభాగాలలో టిప్స్ కి సంభందిచి అప్స్, కోర్స్ లెర్నింగ్ అప్స్, సొల్యూషన్ అప్స్ అనేక సేవ మరియు వ్యాపార సంస్థల మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో అనేకం.

మరిన్ని మొబైల్ అప్స్ గురించి తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

13 thoughts on “Mobile Apps

 1. Pingback: Smartphone Performance - Telugu

 2. Pingback: Latest Android OS Mobiles

 3. Pingback: best-battery-backup-phones

 4. Pingback: Fingerprint Sensor Mobiles

 5. Pingback: SMARTPHONE IN TELUGU

 6. Pingback: Browsing With Browser - Mobile / Computer

 7. Pingback: Top Free Android Mobile Apps - I

 8. Pingback: Search Engine Things Browser

 9. Pingback: Mobile Application Install Things

 10. Pingback: Earning Chances From Mobile Applications

 11. Pingback: Useful LIC Mobile Application - Smartphone Teluguవేగ2020

 12. Pingback: Fingerprint Sensor Mobilesవేగ2020

 13. Pingback: Spoken / Learning Language Smartphone Mobile Applicationsవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *