10K-18K Latest Android Smartphones Below 10K Mobiles

10K-18K Latest Android Smartphones Below 10K Mobiles

10K-18K Latest Android Smartphones Below 10K Mobiles పదివేల రూపాయల నుండి పదిహేనువేల రూపాయల ధరలో వచ్చే స్మార్ట్ ఫోన్లు నేటి యువతకు అవసరమయ్యే సదుపాయాలు సాదారణ నాణ్యతలో లభించే అవకాశం ఎక్కువ. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతతో కొత్త సౌకర్యాలు, సదుపాయాలు కలిగిన స్మార్ట్ ఫోన్లకు యువత అప్ గ్రేడ్ అవుతూ ఉంటుంది. అందులోను పాత ఫోను అమ్మకాలు తేలికగా మొబైల్ ఆప్స్ ద్వారా అమ్మేసే అవకాశం ఉండడంతో కొత్త స్మార్ట్ ఫోన్లు కొనుగోలు పెరుగుతుంది.



కొత్త కంపెనీలు కొత్త మొబైల్ మోడల్లలో ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తూ ధర వీలుబాటులో ఉండేవిధంగా ఉంటున్నాయి. మధ్యతరగతి ధరగా 10 – 16 వేలరూపాయలలో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ట్రెండి సదుపాయాలతో సాదారణ నాణ్యతలో లభిస్తూ ఉంటాయి. 10K – 15కే ధరలలో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందించే కంపెనీలు లెనోవో, హానర్, సామ్సంగ్, నోకియా, ఆసస్, వివో, ఒప్పో, రెడ్మి, మోటో మొదలైన కంపెనీల ఫోన్లు లభిస్తాయి.

సామ్సంగ్ గాలక్సీ J సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఫేమస్ చెందినవి

సామ్సంగ్ గాలక్సీ నుండి ఎక్కువగా J సిరిస్ స్మార్ట్ ఫోన్లు మొబైల్ షాపులలో మరియు ఆన్ లైన్ ఇకామర్స్ స్టోర్లలో లభిస్తూ ఉంటాయి. అలాగే సామ్సంగ్ గాలక్సీ ఆన్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఆన్ లైన్ ద్వారానే ఎంపిక చేసిన ఇకామర్స్ వెబ్ సైట్లలో లభిస్తాయి. సామ్సంగ్ గాలక్సీ న్యూ స్మార్ట్ ఫోన్లు: సామ్సంగ్ గాలక్సీ J6 – సుమారు 14000/- లలో లభిస్తే ఈ ఫోనుకి పోటిగా మరిన్ని ఎక్కువ సదుపాయాలతో మోటో G6 లభిస్తుంది.

అలాగే సామ్సంగ్ నుండి 10K రేంజిలో సామ్సంగ్ గాలక్సీ J4 లభిస్తుంది. అయితే 10K రేంజిలో అనేక కంపెనీ మోడల్స్ పోటిలో ఉన్నాయి. హానర్9 లైట్, ఆసస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎం1, రెడ్మి నోట్ 5 ప్రో, లెనోవో K8, మోటో G6 ప్లే, రెడ్మి Y2 తదితర మోడల్స్ ఇంకా ఎక్కువ సదుపాయాలతో ఆకర్షణీయంగా ఉంటాయి.

పదివేల రూపాయల ధరలో కానీ 10K రేంజిలోపులో లభించే లేటెస్ట్ స్మార్ట్ మొబైల్ ఫోన్లు: రెడ్మి 5, లెనోవో K8 ప్లస్, హానర్7a, మోటో E4 ప్లస్, రెడ్మి 5a, 10 or G 64జిబి తదితర స్మార్ట్ ఫోన్లు ఆన్ లైన్ మార్కెట్లో లభిస్తున్నాయి. 10K రేంజిలోపు స్మార్ట్ ఫోను ఫీచర్స్ విషయంలో కొనుగోలుదారుకి అంత సంతృప్తికరమైన సదుపాయాలు లభించకపోవచ్చు. ఒకవేళ 10K లోపు స్మార్ట్ ఫోను సదుపాయాలు ఎక్కువగా ఉన్నా అవి పాత మోడల్ అయిన బ్రాండు కానీ అంతగా ప్రాచుర్యం పొందని బ్రాండు ఫోన్లు కానీ అయ్యి ఉండవచ్చు.

Latest Smartphones Under 10K – 18 K

10K నుండి 18K వరకు స్మార్ట్ ఫోన్ల ఫీచర్స్ ట్రెండి ఫీచర్స్ గా ఉండి, కొనుగోలుదారుని ఆకర్షిస్తాయి. వాటిలో సామ్సంగ్ గాలక్సీ J8, సామ్సంగ్ గాలక్సీ A6, నోకియా 6.1, రెడ్మి నోట్ 5 ప్రో, మోటో G6, వివో Y83, మోటో E5 ప్లస్, సామ్సంగ్ గాలక్సీ on6, వివో Y71 32జిబి, నోకియా 3.1, సామ్సంగ్ గాలక్సీ J6 తదితర స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఓఎస్ ఆధారంగా 32 జిబి ఫోను మెమరీ, 3జిబి రామ తదితర ఫీచర్స్ కలిగి ఉంటాయి. పాపులర్ ఫోన్లు గురించి ఫీచర్స్ చెక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అమెజాన్ వెబ్ సైట్ నుండి వివిధ స్మార్ట్ ఫోన్ల ధరలు చూడడానికి ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

స్మార్ట్ ఫోను కంపెనీల ప్రముఖ మోడల్ ఫోన్లు

నోకియా ఒకప్పటి ఫీచర్ ఫోన్లలో రారాజు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల తాకిడి తరువాత ఫోన్ల తయారీ ఆపివేసి, మరలా పునఃప్రవేశం చేసింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా నోకియా3.1(Nokia3.1), నోకియా6.1(Nokia6.1), నోకియా7ప్లస్ స్మార్ట్ ఫోన్లో మార్కెట్లో పోటిగా ఉన్నాయి. ఇంకా నోకియా నుండి నోకియా X6(NokiaX6) అప్ కమింగ్ స్మార్ట్ ఫోనుగా ప్రచారంలో ఉంది.

సామ్సంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్లో ప్రాచుర్యం పొందిన మోడల్స్ గాలక్సీ J, ఆ సామ్సంగ్ గాలక్సీ J సిరీస్ నుండి J4, J6, J8 స్మార్ట్ ఫోన్లు ఈ మధ్యే విడుదల అయ్యాయి. సామ్సంగ్ A సిరీస్ నుండి కూడా కొన్ని మోడల్స్ విడుదల అయితే ఇవి ప్రీమియం ధరలలో లభిస్తాయి. సామ్సంగ్ గాలక్సీ నుండి A9 స్టార్ (Samsung Galaxy A9star) త్వరలో రాబోయే స్మార్ట్ ఫోనుగా చెప్పబడుతుంది.

స్మార్ట్ ఫోనుని సామాన్య ధరలలోకి ఎక్కువ ఫీచర్స్ ని అందించే సంస్థగా ప్రఖ్యాతి పొందిన షియోమి నుండి రెడ్మి నోట్ 4, రెడ్మి నోట్ 5 సిరీస్ ఫోన్లు ఎక్కువగా విక్రయాలు జరుగుతుంటాయి. అలాగే ఈ కంపెనీ నుండి ఎంఐ సిరీస్ స్మార్ట్ ఫోన్లు కూడా ప్రాచుర్యం పొందాయి. షియోమి ఎంఐ ఏ2 (Xiaomi MI A2), షియోమి రెడ్మి 6 ప్రో (Xiaomi redmi6pro) అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్లుగా ప్రచారంలో ఉన్నాయి.

లెనోవో K6 పవర్, లెనోవో K6 నోట్, లెనోవో K8 ప్లస్, లెనోవో K8 నోట్ స్మార్ట్ ఫోన్లతో అనేకమంది స్మార్ట్ యుజార్లను ఆకట్టుకుంది. ఇప్పుడు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో లెనోవో Z5(LenovoZ5) స్మార్ట్ ఫోను అప్ కమింగ్ స్మార్ట్ ఫోనుగా చెప్పబడుతుంది.

హానర్ హాల్లీ స్మార్ట్ ఫోనుతో మధ్యతరగతి స్మార్ట్ వినియోదరులను బాగా ఆకట్టుకుంది, తరువాత హానర్ 4X, హానర్ 5X, హానర్ 6X, హానర్8 స్మార్ట్ ఫోన్లతో మంచి స్మార్ట్ ఫీచర్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు హానర్7X, హానర్7C(Honor7C), హానర్7a(Honor7A), హానర్9 లైట్ (Honor9lite)స్మార్ట్ ఫోన్లు ట్రెండిగా ఉన్నాయి. ఇంకా హానర్9N(Honor9N) కొత్తగా విడుదల కాబోతున్న స్మార్ట్ ఫోను. ఎక్కువగా అవసరమైన స్మార్ట్ ఫీచర్స్ 10K-18K Latest Android Smartphones Below 10K Mobiles లలో లభిస్తూ ఉంటాయి.

ధన్యవాదాలు
vega2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *