Online Shopping Mobile Shopping

Online Shopping Mobile Shopping

Online Shopping Mobile Shopping సాదారణంగా ఏదైనా వస్తువు షాపింగ్ చేసే ముందు, ఆ వస్తువు తయారీ కంపెనీ గురించి, అందులో ఆ వస్తువు మోడల్స్ గురించి ఆరా తీసి, షాపింగ్ చేయడానికి షాప్ కి వెళ్తాం. ఆ వెళ్ళే షాపులలో కూడా సరసమైన ధరలలో బ్రాండెడ్ వస్తువులు అమ్మే షాపుకే వెళ్లి, అక్కడ కొనుగోలు చేస్తాం. ఎందుకు అంటే నాణ్యమైన వస్తువు సరైనా ధరలో మనకి లభించాలి కాబట్టి. కానీ కొన్నిసార్లు ప్రత్యక్ష షాపింగ్ కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు.

ఎందుకు అంటే కొన్ని షాపులలో అమ్మకాల వ్యవహారాలు నిర్వహించే వ్యక్తులు ఒరిజినల్ బ్రాండ్ కి బదులు డూప్లికేట్ వస్తువుల గురించి గొప్పగా చెప్పి, వాటిని కొనుగోలుదారునికి అంటగట్టే ప్రయత్నం చేయవచ్చు. కొంతమంది తమ దగ్గర ఉన్న వస్తువు అమ్మడానికి చూస్తారు కానీ కొనుగోలుదారునికి కావలసివ వస్తువు తమ దగ్గర లేదని చెప్పకపోవచ్చు. కొన్నిసార్లు ఇటువంటి ఇబ్బందులు కొనుగోలుదారునికి ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.ఆన్ లైన్ సేల్స్ ప్రారంభం అయ్యాక మాత్రం ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, ఫాషన్ ఐటమ్స్, హోం నీడ్స్ లాంటివి  ఇకామర్స్ వెబ్ సైట్ల నుండి అమ్మకాలు చాల తేలికగా జరిగుతున్నాయి. కొనుగోలుదారు ప్రత్యేకించి షాపునకు వెళ్ళనవసరం లేదు. ఇంటి దగ్గర కంప్యూటర్ ఉంటే ఇంటి నుండే లేదా స్మార్ట్ మొబైల్ ఫోన్ అయితే ఫోన్ నుండే, తమకు కావాల్సిన వస్తువును ఆర్డర్ చేయవచ్చు. ఇందులో కాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ వల్ల వస్తువు తీసుకునేటప్పుడే, వస్తువు ఖరీదు ధర చెల్లించవచ్చు. ముఖ్యంగా టైం సేవింగ్ అవుతుంది, కొన్ని ప్రేత్యేక డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. అయితే వస్తువు సిటీని బట్టి ఊరిని బట్టి వస్తువు ఇంటికి చేరే సమయం ఉంటుంది. మెట్రో సిటీస్ అయితే ఆర్డర్ చేసిన రోజే వస్తువు పొందే అవకాశం ఉంటే మిగిలిన ప్రదేశాలలో ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఆన్ లైన్ వ్యాపార లావాదేవీలు వ్యాపారంలో వేగాన్ని పెంచాయి.

అలా ఆన్ లైన్లో వస్తువులను సరసమైన ధరలలో అమ్మే నమ్మకమైన ఇకామర్స్ వెబ్ సైట్లు లేక మొబైల్ అప్స్ చూస్తే, ఫ్లిప్ కార్ట్ (Flipkart), అమెజాన్(Amazon) పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఫ్లిప్ కార్ట్ భారతీయ ఇకామర్స్ కంపెనీ అయితే, అమెజాన్ US కంపెనీ. ఇంకా పేటిఎం (Paytmmall), టాటా క్లిక్ (TATA CLIQ), గాడ్జెట్స్ నౌ (GADGETS NOW), క్రోమ (CROMA ) మొదలైన షాపింగ్ ఇకామర్స్ వెబ్ సైట్లు ఆన్ లైన్లో అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. ఎక్కువ పోటి అంటే ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ఇకామర్స్ వెబ్ సైట్ల మద్యనే.

ఇంకా కొన్న వస్తువు తయారు చేసే సంస్థలే తమ వెబ్ సైట్లలో అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. వాటిలో సామ్సంగ్ కంపెనీ, ఎంఐ కంపెనీ, హెచ్.పి కంపెనీ, లెనోవో కంపెనీ, నోకియా కంపెనీ, హానర్ కంపెనీ మొదలైనవి.

Online Shopping Mobile Shopping Sales

ఆన్ లైన్ అమ్మకాల చేసే సంస్థల గురించి తెలిస్తే, మరి వస్తువు నాణ్యతను, వస్తువు పనితీరుని, ముందుగా వస్తువుని కొనుగోలు చేసిన వారి అభిప్రాయాలు తెలిపే ఆన్ లైన్ వెబ్ సీట్లు లేక మొబైల్ అప్స్ చూస్తే, మొబైల్ మరియు టెక్నాలజీ గాడ్జెట్స్ వివరాలు, విశ్లేషణలు, వ్యత్యాసాలు, పోలికలు తేలిప వెబ్ మరియు మొబైల్ అప్ పేరు 91మొబైల్స్ అనే సంస్థ. ఇంకా మౌత్ షట్ వెబ్ మరియు మొబైల్ అప్ ఇందులో వస్తువు వాడిన వారి అభిప్రాయాలు ఎక్కువ వ్రాస్తుంటారు. స్మార్ట్ పిక్ష్ మొబైల్ ఫోన్ మోడల్స్ మద్య ఫీచర్స్ తేడాలు చూపిస్తుంది. అలాగే ఇంకా సినెట్, ఎంగాద్జేట్, టెక్ రాడార్, బిజిఅర్, ఇండియాటుడే, మైక్రోసాఫ్ట్ ఎంఎస్ఎన్ మొదలైన సంస్థల వెబ్ సైట్లలో వస్తువుల నాణ్యత పనితీరు గురించి వివరాలు చూడవచ్చు.

సరే ఆన్ లైన్ వస్తువులు అమ్మే సంస్థలు చూసి, వస్తువు నాణ్యతపరమైన విషయాలు చూసి, వస్తువు ఆన్ లైన్లో ఆర్డర్ చేసాం, కానీ మనం ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరే వస్తువు మనకి వచ్చింది. లేక బ్రేక్ అయిన వస్తువు వచ్చింది, లేక వస్తువుకు ముందుగానే ఆన్ లైన్ పేమెంట్ చేసి, వస్తువు గురించి వివరాలు చూసి, వస్తువు పనితీరు బాగోలేదు అని,  ఆ వస్తువు ఆర్డర్ రిటర్న్ చేసాం, డబ్బులు వాపసు రాలేదు. సదరు సంస్థకు పిర్యాదు చేసినా రెస్పాన్స్ లేకపోతే ఎలా ? ఆన్ లైన్ సంస్థలపై పిర్యాదులు తీసుకుని పరిష్కారం చూపే వెబ్ సైట్లు చూస్తే.


Voxya.com వెబ్ సైట్ ఒకటి ఉంది ఇక్కడ ఆన్ లైన్ కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు, కంప్లైంట్ సంభందించి లాయర్ ని కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఇంతకుముందు వస్తువు అమ్మకం దారుల నుండి  సమస్యలు ఎదుర్కొన్న కొనుగోలు దారుల కంప్లైంట్స్ ఉంటాయి. సదరు సంస్థ సాల్వ్ చేసిన కంప్లైంట్స్, పెండింగ్ కంప్లైంట్స్ చూడవచ్చు. ఏ సంస్థ నుండి ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నది కూడా మనకి ఈ వెబ్ సైట్లో తెలుస్తుంది. సంస్థను ఎంతవరకు నమ్మవచ్చో ఇక్కడ తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ సందర్శించడానికి బటన్ పై క్లిక్ చేయండి.

ఒక ప్రాసెస్ విధానంలో సమస్యలు రావడానికి కారణం ప్రాసెస్ నిర్వహించే సంస్థలో వ్యక్తుల పొరపాటుల వలన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ సంస్థ లేక ప్రాసెస్ పొరపాటులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రాసెస్ సృష్టించినప్పుడే, ఆ ప్రాసెస్ టెస్ట్ చేసి, నమ్మక సంస్థ నిర్వహణ చేపడుతుంది. అయితే ఇలా జరిగే పొరపాటులపై సంస్థలు, మరల పునరావృతం కాకుండా చూసుకోవాలి.

మరిన్ని విషయలు తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps