Search Engine Helping About Needed Browsing Things

Search Engine Helping About Needed Browsing Things

బ్రౌజర్లో బ్రౌజింగ్ చేసే విధానంలో సెర్చ్ ఇంజిన్ ఎంతో సహాయపడుతుంది. డొమైన నేమ్ సరిగా టైపు చేయకపోయినా, ఆ డొమైను పేరుకి సంభందించిన వెబ్ పేజి లేక మొబైల్ అప్ లింకులను బ్రౌజర్లో మనకి చూపిస్తుంది. అదే విధంగా ఏదైనా విషయం గురించి సందేహం, లేక ఏదైనా గాసిప్ గురించి అప్డేట్, ఇంకా వేరే విషయాలపై పరిష్కార మార్గాలు సూచించే వెబ్ సైట్ లేక మొబైల్ అప్ లింకులుగా సెర్చ్ ఇంజిన్ ఆన్లైన్ సర్వర్లో ఉన్నసమాచారాన్ని మనకి బ్రౌజర్లో చూపుతుంది. సెర్చ్ సరిగా చేస్తే ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్లో ఏదైనా లభిస్తే, సాధన చేస్తే జీవిత లక్ష్యం చేరవచ్చు.

ఉదా: మన ప్రీ పైడ్ మొబైల్ నెంబర్ అని ఫోన్లో సేవ్ చేయలేదు, ఎక్కువగా చెప్పే అవకాశం లేక మరిచాము అనుకుంటే. మన మొబైల్ నెంబర్ ఇప్పుడు రీఛార్జి చేయాల్సి వచ్చింది, ఇతర ఫోనుకి కాల్ చేసి నెంబర్ చూడాలంటే, ఫోన్లో జీరో బాలన్స్, అప్పుడు ఫోన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా ? మన దగ్గర ఉన్నది స్మార్ట్ ఫోనులు అయితే లేదా షాప్ వారి స్మార్ట్ ఫోనులో కానీ మొబైల్ బ్రౌజరు ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో “how to find my mobile number of ‘blank’ ” టైపు చేయగానే, సెర్చ్ ఇంజిన్ ఆన్ లైన్ సర్వర్లో మొబైల్ నెంబర్ కనుక్కునే విధానంలో ఉన్న ఉన్న వెబ్ పేజి లింకులను బ్రౌజర్లో చూపిస్తుంది. (blank అని రాసిత చోట నెట్ వర్క్ ప్రొవైడర్ నేమ్ వ్రాయాలి, జియో, ఎయిర్టెల్, ఐడియా మొదలైనవి, నెట్ వర్క్ ప్రొవైడర్ పేరు రాయకపోయినా లింకులు వస్తాయి, కానీ నెట్ వర్క్ పేరు టైపు చేయడం వలన మనకి కావాల్సిన సమాచారం తొందరగా పొందగలం.). ఇక్కడ మనం డొమైన్ పేరు వ్రాయలేదు మనకి కావాల్సిన విషయముపై ప్రశ్నను, మొబైల్ బ్రౌజర్లో అడిగాము, సెర్చ్ ఇంజిన్ సర్వర్లో ఉన్న సమాచారాన్ని లింకులుగా అందించింది.

పై చెప్పిన విధంగా ఏ విషయముపైన అయిన డొమైన్ నేమ్ తెలియకపోయినా, మనకు అవసరమైన విషయంలో ప్రశ్న, లేక రెండు మూడు పదాలు బ్రౌజర్లో టైపు చేయగానే, సంభందం ఉన్న సమాచారంలో లింకులుగా స్మార్ట్ ఫోన్ బ్రౌజర్లో చూడవచ్చు. సెర్చ్ ఇంజిన్ ఉపయోగం బ్రౌజరుతో మనకి చాల ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. బ్రౌజర్లో బ్రౌజింగ్ విధానం, సెర్చ్ ఇంజిన్ లింకుల పై ఒక అవగాహన ఉండాలి. అప్పుడు కచ్చితంగా మన కావాల్సిన సమాచారం వెంటనే పొందగలం. ఇదేమి పెద్ద కష్టమైనా, లేక బలవంతమైన పనేమీ కాదు, కాకపోతే కొంచెం గమనించడం, బ్రౌజర్లో సెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చే లింకులపై, క్లిక్ చేస్తే వచ్చే వెబ్ పేజి ఎలా వస్తుంది. అలాగే ఆ వెబ్ పేజి అక్కరలేకపోతే మరల సెర్చ్ ఇంజిన్ వచ్చే విధానం గమనిస్తే చాలు.

ఎప్పుడు బ్రౌజర్లో ఏ వెబ్ పేజి ఓపెన్ చేసిన, బ్రౌజర్లో పైన <— లెఫ్ట్ బాణం గుర్తు కన్నా ముందు, ఓపెన్ అయ్యి ఉన్న వెబ్ పేజిలో ఎక్కడో చోట బ్యాక్ బటన్ కానీ హోం బటన్ కానీ ఉంటాయి. అవి క్లిక్ చేసి బ్యాక్ పేజిలు సందర్శించడం మంచిది. ముఖ్యంగా బ్యాంకు వెబ్ సైట్లు ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే, వెబ్ పేజి ఎర్రర్ చూపుతుంది కానీ బ్యాక్ పేజి తిరిగి ఓపెన్ కాదు. అందుకే బ్రౌజ్ చేసే సమయంలో వెబ్ పేజి పూర్తిగా గమనిచడం మంచిది.

మీరు బ్రౌజర్లో సెర్చ్ చేస్తే,  అదే విషయాన్ని సెర్చ్ ఇంజిన్ సర్వర్లో సెర్చ్ చేస్తుంది. మనకి వెబ్ పేజి లింకులను ఆయా వెబ్ సైట్ పాపులారిటీ బట్టి మనకి బ్రౌజర్లో చూపుతుంది.

మరిన్ని పోస్టులు తరువాయి పోస్టులలో!

ధన్యవాదాలు

వేగ2020 – View Enlisted Gadget Apps

 

5 thoughts on “Search Engine Helping About Needed Browsing Things

  1. Pingback: Some Smartphone Useful Mobile Applications

  2. Pingback: Smartphone Useful Tipsవేగ2020

  3. Pingback: Spoken / Learning Language Smartphone Mobile Applicationsవేగ2020

  4. Pingback: Mobile Banking Money Transfer Payment Wallet Appsవేగ2020

  5. Pingback: Telugu Cooking Process TIps / Tricks Android Mobile Appsవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *