Smartphone Performance

Smartphone Performance – Telugu

ఫోన్ పెర్ఫార్మన్స్

స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ పెంచే మొబైల్ అప్లికేషన్లు కొన్ని ఉంటాయి, రామ్ క్లీనింగ్, అనవసర ఫైల్స్ తొలగించడం, అప్ వాడుక స్థితిని బట్టి అనవసరంగా వాడకుండా ఫోన్లో ఇన్స్టాల్ చేయబడిన మొబైల్ అప్స్ గురించి మొబైల్ బూస్ట్ అప్స్ సూచిస్తూ ఉంటాయి. కొంతవరకు వీటితో ఉపయోగమే కానీ ఫోన్ మెమరీ 8gb మాత్రమే ఉంటే తక్కువ మొబైల్ అప్స్ ఇన్స్టాల్ చేయగలం, అంతేకాకుండా ఫోటోలు లేదా వీడియోలు స్టోర్ చేయడం ఇబ్బంది. SD కార్డు ఉన్న అన్ని మొబైల్ అప్స్ SD కార్డులో ఇన్స్టాల్ కావు ఒకవేళ ఆ మొబైల్ అప్స్ SD కార్డులో ఇన్స్టాల్ అయినా, వాటిని వాడుకోవాలంటే మాత్రం వాటికీ రామ్ తో పాటు ఫోన్ మెమరీ కూడా అవసరం అవుతుంది. ఇంకా….

తక్కువ ఫోన్ మెమరీ ఉండడం వలన మొబైల్ OS సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు, మన స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫోన్ మెమరీ సరిపోదు, తర్వాత ఫోన్లో ఉన్న మొబైల్ ఆప్స్ కొన్నింటిని తొలగించడం లేదా పర్సనల్ డేటా తొలగించడమో చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన రూపంలో మంచి డిస్ప్లే ఉన్న ఫోన్ ఆటంకాలు లేకుండా పనిచేయాలంటే, తగినంత ఫోన్ కన్ఫిగరేషన్ ప్రధానం. కొన్ని స్మార్ట్ ఫోన్లు రెండు మూడు అప్లికేషన్స్ ఓపెన్ చేయగానే స్లో అవ్వడమో, లేదా హ్యంగ్ అవ్వడం లాంటివి చూస్తుంటాం. తక్కువ కన్ఫిగరేషన్ కలిగిన ఫోన్స్ మల్టీ టాస్కులు ఉపయోగిస్తున్న సమయంలో, వినియోగదారుడిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి ఫోన్లు సింగల్ టాస్క్ మాత్రమే ఉపయోగిస్తూ ఉండాలి, మరియు ఎప్పటికప్పుడు రామ్ క్లీన్ మరియు జంక్ ఫైల్స్ క్లీన్ చేస్తూ వాడుకోవాలి.

ఒకప్పుడు ప్రీమియం ఫోన్లలో ఉండే హై రామ్ కన్ఫిగరేషన్, ఇప్పుడు మిడ్ రేంజ్ మొబైల్స్ లోను లభిస్తున్నాయి. కొత్త ఫోన్ కొనేటప్పుడు రామ్ విషయంలో, ప్రాసెసర్ స్పీడ్, ఫోన్ మెమరీ ఈ మూడింటిలో దృష్టి పెడితే, కొన్న ఫోన్ ఆటంకాలు లేకుండా మల్టీ టాస్కులు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతుంది. సుమారు ఎనిమిది వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల మద్యలో మంచి కన్ఫిగరేషన్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ వివిధ కంపెనీల మోడల్స్ గా లభిస్తున్నాయి. ప్రముఖ ప్రాచుర్యం పొందిన బ్రాండ్ మొబైల్స్ అయితే ధర పదివేల రూపాయల పైన మంచి కన్ఫిగరేషన్ ఫోన్స్ లభిస్తాయి.

Click here to read useful mobile tips in Telugu

3GB రామ్, 32GB ఫోన్ మెమరీ, 1.5 GHz లేదా అంతకన్నా ఎక్కువ ప్రాసెసర్ స్పీడ్ కలిగిన ఫోన్స్ ఇప్పటి ట్రెండ్. హై రామ్ మరియు ఎక్కువ స్పీడ్ కలిగిన ప్రాసెసర్ వలన ఫోన్ ఆటంకం లేకుండా ఉపయోగించవచ్చు. ఎక్కువ ఫోన్ మెమరీ వలన ఎక్కువ మొబైల్ అప్ప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు ఆప్స్ అప్డేట్ చేసుకోవడానికి హై ఫోన్ మెమరీ వల్ల ఉపయోగం. ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్ ఫైల్స్ ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీల మోడల్స్ ఫోన్ కన్ఫిగరేషన్ అంతా ఒకే విధంగా ఉండి, రామ్ మరియు ఫోన్ మెమరీ ఎక్కువ పెట్టి ధర కొంచెం ఎక్కువ పెంచుతారు. హై కన్ఫిగరేషన్ తో బాటు మంచి డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, గుడ్ కెమెరా క్వాలిటీ, మంచి బాటరీ సామర్ద్యం, 4జి, వోల్టే, డ్యూయల్ సిమ్ మరియు మొదలైన ఫీచర్స్ కూడా అవసరమే! ఫోన్ పెర్ఫార్మన్స్ మాత్రమే ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఎక్కువ రామ్ మరియు స్పీడ్ ఎక్కువ కలిగిన ప్రాసెసర్ తో బాటు ఫోన్ మెమరీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

ఉదా: ఈ క్రింది కొన్నో మోడల్స్ రామ్ అండ్ ఫోన్ మెమరీ ఆధారంగా ధరలో తేడాలు చూద్దాం!

Rom – అంటే ఫోన్ మెమరీగా పరిగణిస్తే, రామ్ మరియు రోమ్ కాంబినేషన్ ధరలు ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైటు నుండి ఈ రోజు వారి వెబ్సైటు నందు ఉంచబడిన ధరలు ఆధారంగా క్రింది పట్టిక చూడండి.

Brand Ram / Rom Price Ram / Rom Price
Samsung Galaxy S9 4GB / 64GB Rs.57900/- 6GB / 128GB Rs.68900/-
Samsung on NXT 3GB / 16GB Rs.10999/- 3GB / 64GB Rs.12900/-
Sony Xperia R1 2GB / 16GB Rs.10499/- 3GB / 32GB Rs.12490/-
Lenovo K8 Note 3GB / 32GB Rs.10999/- 4GB / 32GB Rs.11999/-
Redmi 4 3GB / 32GB Rs.8499/- 4GB / 64GB Rs.10499/-
Redmi 5 3GB / 32GB Rs.8999/- 4GB / 64GB Rs.10999/-
Honor 9 Lite 3GB / 32GB Rs.10999/- 4GB / 64GB Rs.14999/-
Asus Zenfone 4 3GB / 32GB Rs.8999/- 4GB / 64GB Rs.12999/-

ఆన్ లైన్లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు కొన్ని రోజుల ఈ కామర్స్ వెబ్సైటు, ఒక్కోసారి మనకి నచ్చిన ఫోన్ డిస్కౌంట్ ధరలో లభించే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మొదలగు ఈ కామర్స్ వెబ్ సైట్లలో డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించి, పాపులర్ మోడల్స్ కూడా తక్కువ ధరలో అమ్మకం చేస్తుంటారు. ఉదా: పదివేల రూపాయల నిజ ధర కలిగిన ఫోన్, ఒక్కోసారి రూ.1000/-ల తగ్గింపు ధరలో లభించవచ్చు.

మరిన్ని స్మార్ట్ సంగతులు తరువాయి పోస్టులలో

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

10 thoughts on “Smartphone Performance

  1. Pingback: స్మార్ట్ ఫోన్ – SMARTPHONE – వేగ2020

  2. Pingback: Latest Android OS Mobiles

  3. Pingback: best-battery-backup-phones

  4. Pingback: Smartphone Display

  5. Pingback: Best Camera Mobiles

  6. Pingback: Smartphone Useful Tips

  7. Pingback: New Smartphone

  8. Pingback: Sometimes Dual Sim Smartphones Not Working Properly

  9. Pingback: Live Cricket Score Mobile Applicationsవేగ2020

  10. Pingback: Better Mobile Selection - 91Mobile Applicationవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *