Smartphone Useful Tips

Smartphone Useful Tips

Smartphone Useful Tips in Telugu స్మార్ట్ ఫోన్ ఉపయోగించడంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఫోన్ ఎక్కువ కాలం మన్నే విధంగా వాడుకోవచ్చు, మరియు ఫోన్ వైరస్ బారిన పడకుండా చూసుకోవచ్చు. వస్తువు పాతబడే కొలది దాని పనితీరులో మార్పు సహజం, అయితే జాగ్రత్తలు తీసుకుని వాడితే వస్తువు పనితీరు మెరుగుగా ఉంటుందని అంటారు.

కొత్తఫోను కొన్నప్పటి నుండి సరైన విధానంలో వాడితే, అది కొంచెం ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుంది. సెర్చ్ చేస్తే ఆన్ లైన్లో దొరకనది ఉండనట్లే, సాధన చేస్తే స్మార్ట్ ఫోనుతో కంప్యూటర్లో చేయదగిన పనులు, వేగంగా స్మార్ట్ ఫోన్లో వివిధ రకాల మొబైల్ అప్స్ ఉపయోగించి సాధించవచ్చు.

మొబైల్ డిస్ప్లే బ్రైట్ నెస్ తగ్గించడం వలన, స్క్రీన్ రొటేషన్ అవసరం మేరకు వాడుకోవడం వలన, స్క్రీన్ డిస్ప్లే ఆఫ్ టైం తగ్గించడం వలన కూడా బాటరీ ఖర్చు తగ్గించే అవకాశం ఉంటుంది. ఆటో ఫ్లాష్ తీసివేయడం. కెమెరా సెట్టింగ్స్ లో ఫ్లాష్ వెలుతురు సరిగా లేనప్పుడు వాడితే, ఫోన్ బాటరీ బ్యాక్ అప్ ఎక్కువ కాలం రావచ్చు.

ఫోను సిమ్ కార్డు మార్చవలసి వచ్చి, బాటరీ తీయవలసిన అవసరం ఉంటే కనుక, స్మార్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బాటరీ తెస్తే ఫోన్ లైఫ్ బాగుంటుంది అని చెప్పవచ్చు. సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడకుండా మెసేజ్ లేదా వాట్సప్ చాటింగ్ చేయడం వలన ఫోన్ అనవసర బాటరీ ఖర్చు ఉండదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా నాన్ రిమోవబుల్ బాటరీతో వస్తున్నాయి, కాబట్టి phone స్విచ్ ఆఫ్ చేయకుండానే సిమ్ మార్చవచ్చు.

సిగ్నల్ క్యాచ్ చేసేటప్పుడు ఫోనుకి పని ఎక్కువ అని అంటారు కాబట్టి, ఇంటర్నెట్ బ్రౌజ్ లేక ఆన్లైన్ వీడియోలు చూసే టప్పుడు ఫోన్ ఎక్కువసేపు సిగ్నల్ క్యాచ్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఎక్కువ ఇంటర్నెట్ ఫోన్లోనే వాడవలసి వస్తే బాటరీ బ్యాక్ తొందరగా తగ్గే అవకాశం ఉంది. అలాంటప్పుడు వైఫై హాట్ స్పాట్ బాగా ఉపయోగకరం, వీటి ద్వారా ఇంటర్నెట్ కంటిన్యుగాచూడవచ్చు. ధర తక్కువలో వున్న వైఫై హాట్ స్పాట్ వలన ఫోనుని జాగ్రత్తగా ఎక్కువ కాలం మన్నేలా వాడవచ్చు.

డ్యూయల్ సిమ్ పని చేయాలంటే సిగ్నల్ క్యాచ్ పని ఫోనుకి ఇంకా ఎక్కువ కనుక, మీ ఫోన్లో ఇంటర్నెట్ కోసమే రెండవ సిమ్ ఉంటే, రెండవ సిమ్ కి సంభందించి వైఫై హాట్ స్పాట్ ద్వారా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇంటర్నెట్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఖరీదు అయిన ఫోను పని తీరు బాగుంటుంది.

Smartphone Useful Tips

నెట్వర్క్ ఆపరేటర్ ఫ్లాష్ మెసేజ్ ఆక్టివేట్ అయ్యి ఉంటే, వెంటనే డిఆక్టివేట్ చేసుకోండి, లేకపోతే వారి ఫ్లాష్ మెసేజెస్ ఎక్కువగా వచ్చి ఫోన్ ఎక్కువ సేపు ఆన్ మోడ్ లో ఉంటుంది, బాటరీ బ్యాక్ అప్ తగ్గే అవకాశం ఎక్కువ.

ఫోన్ క్లీనింగ్ మరియు రీసెంట్ మొబైల్ అప్స్ క్లీన్ చేయడం, కాష్ డేటా క్లీన్ చేయడం, ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్లు స్క్రీన్ లాక్ పోసిషన్లో డిస్ప్లే కాకుండా చేసుకోవడం. అవసరం లేకపోతె మొబైల్ డేటా ఆఫ్ లో పెట్టడం, అలాగే వైఫై, లొకేషన్, జిపిఎస్, బ్లూ టూత్ ఆఫ్ లో ఉంచడం, మంచి పని. బ్రౌజింగ్ చేసేటప్పుడు, బ్రౌజర్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ క్లిక్ చేయకుండా బ్రౌజ్ చేయడం చాల ప్రధానమైన విషయం.

మన ఫోన్లోనే ఉన్న జిమెయిల్ అకౌంటుతో ఎక్కువ వెబ్ సైట్లలో సబ్ స్క్రైబ్ అవ్వడం వలన, ఆయా వెబ్ సైట్ల నోటిఫికేషన్లు మన ఫోన్లోకి వస్తుంటాయి, అలాగే యు ట్యూబ్ వీడియో చానల్స్ ఎక్కువగా సబ్ స్క్రైబ్ అయ్యిన, వాటి నోటిఫికేషన్లు మన స్మార్ట్ ఫోన్లో ఫోన్ అన్ లాక్ చేసి ఉన్నా వస్తుంటాయి. ఇలాంటి నోటిఫికేషన్లు ఎక్కువ వస్తే ఫోన్ అనవసరంగా బాటరీ పవర్ వృదా అవుతుంది. మనకి బాగా ఉపయోగం అనుకుంటేనే ఆయా వెబ్ లేదా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోవాలి.

ఇతర మొబైల్ అప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఆ అప్ అడిగే పర్మిషన్లు చెక్ చేయడం వలన, అది మన స్మార్ట్ ఫోన్లో ఏఏ అప్స్ విషయాలపై ప్రభావితం చేసేది తెలుస్తుంది, అది బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే అవకాశం ఉంటే, బ్యాక్ గ్రౌండ్ లో రన్ కాకుండా చూసుకోవాలి.

మనం అంతగా ఉపయోగించని బ్యాక్ గ్రౌండ్ రన్నింగ్ మొబైల్ అప్స్ తొలగించడం, మన స్మార్ట్ ఫోన్ ఇంటర్నల్ మెమరీ స్పేస్ బట్టి మొబైల్ అప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, లేకపోతే అప్పటికే ఇన్స్టాల్ చేయబడిన మొబైల్ అప్స్, ఫోన్ డిఫాల్ట్ మొబైల్ అప్స్ మరియు మొబైల్ OS అప్డేట్స్ అవ్వవు. దానివలన కొత్తగా చేర్చబడిన OS సెక్యూరిటీ ఫీచర్స్ లేదా ఇతర ఫీచర్స్ మన ఫోనుకు అందుబాటులో ఉండవు. అందుకే మన ఫోన్లో మెమరీ కొంత స్పేస్ ఉంచాలి.

మరి అత్యవసరం బాటరీ ఛార్జ్ చేసుకునే అవకాశం లేదంటే కనుక మనం మన ఫోన్ పవర్ సేవింగ్ మోడ్ ఆక్టివేట్ చేస్తే ఫోన్ కేవలం కాల్ మరియు మెసేజ్ చేసే విధంగా ఉంటుంది. మొబైల్ ఛార్జ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ నార్మల్ మోడ్ కు రాకపోతే, మళ్ళి ఆ ఆప్షన్ డిఆక్టివేట్ చేయాలి.

Smartphone Useful Tips

ఫోన్ రామ్, జంక్ ఫైల్స్, కాష్ డేటా క్లీన్ చేసే మొబైల్ అప్స్ ప్లే స్టోర్లో లభిస్తాయి, వాటిని ఇన్స్టాల్ చేసి ఉపయోగించడం వలన ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. బ్రౌజ్ చేస్తున్నప్పుడు మాల్వేర్ ఇన్స్టాల్ కాకుండా చూసే ఏంటి మాల్వేర్ లేదా ఏంటివైరస్ మొబైల్ ఆప్స్ ఉంటాయి, వాటితో ఫోనును వైరస్ బారిన పడకుండా కాపాడవచ్చు. ఏంటివైరస్ మొబైల్ ఆప్స్ పైడ్ వెర్షన్ వలన సపోర్ట్ బాగుంటుంది.

ఏదైనా వస్తువు కొనుగోలు చేయల్సివచ్చినప్పుడు, ఆ వస్తువు పనితీరు, సదుపాయాలు, ఏ సదుపాయాలలో ఆ వస్తువు పనితీరు మెరుగ్గా ఉంది, వస్తువు కొత్తది లేక పాత మోడల్ కానీ ఎక్కువగా అమ్మకాలు సాగుతున్న మోడల్, వస్తువుపై వివరణలు, వినియోగదారుల అభిప్రాయాలు (రివ్యూస్) అందించే మొబైల్ అప్స్ వలన స్మార్ట్ ఫోన్లో మనం షాప్లో కొనేముందు కూడా తెలుసుకోవచ్చు.

మరిన్నిఇతర మొబైల్ అప్స్ మరియు స్మార్ట్ సంగతులు తరువాయి పోస్టులలో

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps