Mobile Application Install Things

Mobile Application Install Things

మనకి కావాల్సిన మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి సెర్చ్ చేసి, ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటాం కానీ మొబైల్ అప్స్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు, గూగుల్ ప్లే స్టోర్లో కావాల్సిన అప్ ఐకాన్ పై క్లిక్ చేయగానే పక్కన ఉన్నట్టు  బటన్ వేరే గ్రీన్ కలర్ బ్యాక్ గ్రౌండ్ వైట్ కలర్ టెక్స్ట్ తో ఇన్స్టాల్ అని ఉంటుంది. ఆ బటన్ పైన క్లిక్ చేయగానే, మొబైల్ స్క్రీన్ పై పోప్అప్ విండో ఒకటి కనిపిస్తుంది, ఆ కనిపిస్తున్న చోట మీరు గమనిస్తే, మీరు క్లిక్ చేసిన అప్ సంభందించిన టైటిల్ మరియు టైటిల్ క్రిందనే (Needs access to) నీడ్స్ ఏక్సెస్ టూ అని చిన్న అక్షరాలతో ఉండి, దాని క్రిందగా కొన్ని పెర్మిషన్ల లిస్టు ఉంటుంది. ఆ లిస్టులో Device & app history, Identity, Location, Contacts, WiFi మొదలైన మీ ఫోన్లో ఉన్న ఫీచర్స్ పేర్లు కనిపిస్తాయి. అంటే అక్కడ కనిపించే లిస్టులో ఉన్న మీ ఫోన్లో ఫీచర్స్ ని ఆ మొబైల్ అప్ ప్రభావం చూపుతుంది. అలా ప్రతి మొబైల్ అప్ మీ ఫోన్లో ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసే ముందు అనుమతి అడుగుతుంది. అయితే అవి ఎక్కువగా ఉంటే మీ ఫోనుపై ఆ అప్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.


ఉదా: జియో మొబైల్ అప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేయడానికి, ఇన్స్టాల్ బటన్ పై క్లిక్ చేయగానే, కనిపించే అనుమతుల Jio Logo ప్రక్కనే MyJio: Jio Cricket Play Along ఇలా టైటిల్ ఉండి, దీని క్రిందనే needs access to అని ఉండి క్రిందగా లిస్టు ఇలా

1. Identity

2. Contacts

3. Location

4. SMS

5. Phone

6. Photos/Media/Files

7. Camera

8. Microphone

9. WiFi-connection information

10. Bluetooth connection information

11. Device ID & Call information ఇలా లిస్టు ఉంది క్రిందనే

బటన్ ఉంటుంది, టచ్ చేయగానే ఆ అప్ ఇన్స్టాల్ అవుతుంది, ఫోన్లో పైన చెప్పబడిన మీ ఫోన్ ఫీచర్స్ పై ప్రభావం చూపుతుంది. ఇలా అన్ని మొబైల్ అప్స్ మన ఫోన్లో కొన్ని ఫీచర్స్ పై ఏక్సెస్ అనుమతులు అడుగుతుంది. కొన్ని మొబైల్ అప్స్ ఎక్కువ ఫీచర్స్ పైన అనుమతులు కోరతాయి ఇన్స్టాల్ చేసే ముందు.

ఇందుకు ఇదంతా అంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఇలా మన ఫోన్లో ఎక్కువ  ఫీచర్స్ పైన ప్రభావం చూపే మొబైల్ అప్స్ ఎక్కువగా ఇన్స్టాల్ చేయబడి ఉంటే, ఎక్కువ వాహనాలు తిరిగే రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే ఎలా ఉంటుందో మన ఫోన్ పనితీరు కూడా ఒక్కోసారి హాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఫీచర్స్ పైన అనుమతులు అడిగే అప్స్ కొన్ని బ్యాక్ గ్రౌండ్, అంటే ఫోన్ స్క్రీన్ ఆఫ్ లో ఉన్న కొన్ని అప్స్ పని చేస్తూ ఉంటాయి. అప్పుడు ఫోన్ బాటరీ తొందరగా డౌన్ అవుతుంది. ఇటువంటి అప్స్ ఎక్కువ ఇన్స్టాల్ చేస్తే ఫోన్ వేడెక్కి, హాంగ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. అయితే ఎక్కువ రామ్, హై స్పీడ్ ప్రాసెసర్ వలన కొంచే ఇబ్బంది తగ్గవచ్చు. కానీ బాటరీ బ్యాక్ అప్ తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు.

ఇక్కడ ఫోన్లో అప్స్ ఇన్స్టాల్ చేసుకునే ముందు ఆ అప్ అడిగే అనుమతులు గమనించి, ఆ అప్ తప్పక ఉండాలి అని భావిస్తే ఇన్స్టాల్ చేసుకోవడం చేయాలి. కొన్ని అప్స్ మన ఫోన్లో తక్కువ స్పేస్ తీసుకుని తక్కువ ఫీచర్స్ పైనే ప్రభావం చూపుతాయి. అలాంటివి ఇన్స్టాల్ చేసుకున్న ప్రాబ్లం అంతగా ఉండదు.

ఇక్కడ మనం ఎక్కువ ఫీచర్స్ పై ప్రభావం చూపే మొబైల్ అప్ ఉంది, కానీ అంతగా వాడం, ఎప్పుడైనా వాడుకుంటాం అని అనుకుంటే, ఆ అప్ కి సంభందించిన వెబ్ సైట్ మొబైల్ బ్రౌజరులో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఉదా: కొన్ని రకాల షాపింగ్ అప్స్ మనం ఎక్కువ వాడం, ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు వాడుతం, అటువంటప్పుడు డైరెక్ట్ వారి వెబ్ సైట్ నుండి మనం కొనుగోలు చేస్తే, మన ఫోనుకి భారం ఉండదు.

మరి కొన్ని విషయాలు తరువాయి పోస్టులలో వ్రాయగలను.

ధన్యవాదాలు

వేగ2020 – View Enlisted Gadget Apps

14 thoughts on “Mobile Application Install Things

  1. Pingback: Smartphone Display

  2. Pingback: Best Camera Mobiles

  3. Pingback: Smartphone Performance - Telugu

  4. Pingback: Latest Android OS Mobiles

  5. Pingback: best-battery-backup-phones

  6. Pingback: Top Free Android Mobile Apps - I

  7. Pingback: New Smart Mobile Phones

  8. Pingback: Fingerprint Sensor Mobiles

  9. Pingback: Smartphone Useful Tips

  10. Pingback: Browsing With Browser - Mobile / Computer

  11. Pingback: Smartphone Mobile Apps

  12. Pingback: Earning Chances From Mobile Applications

  13. Pingback: Sometimes Dual Sim Smartphones Not Working Properly

  14. Pingback: Telugu Actors / Actress Image Gallery Mobile Applicationsవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *