Some Smartphone Useful Mobile Applications

Some Smartphone Useful Mobile Applications

Enlisted Gadget Some smartphone useful mobile applications in telugu: మొబైల్ అప్లికేషన్లు వలన స్మార్ట్ ఫోన్లో కొన్ని పనులు సులభంగా చేసుకోవచ్చు. అలాగే కొన్ని మొబైల్ అప్స్ ఉపయోగించి వ్యక్తిగత డేటాని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని రకాల మొబైల్ అప్స్ ఉపయోగించి ప్రయాణంలో టికెట్ బుకింగ్ లేక రెంటల్ కాబ్ or ఆటో బుకింగ్ లేక వెహికల్ ట్రాక్ చేసి ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవచ్చు. ప్రయాణంలో ఏదైనా సిటీలో వస్తువు కొనాలన్నా లేక కొంత రుసుం చెల్లించి తాత్కాలిక సేవలు పొందాలన్న వాటి పనితీరుపై అభిప్రాయ సేకరణ లేక రివ్యూస్ కొన్ని మొబైల్ అప్స్ ద్వారా పొందవచ్చు. మరికొన్నిసదుపాయాలు బ్యాంకింగ్, మొబైల్ నుండి మొబైల్ మనీ ట్రాన్స్ఫర్, గాసిప్, పొలిటికల్, మూవీస్, టెక్నికల్ న్యూస్ అప్డేట్స్ కొన్ని మొబైల్ అప్స్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం వలన పొందవచ్చు.



ఇంకా టెక్నికల్ గా అయితే కొన్ని మొబైల్ అప్స్ ద్వారా మన స్మార్ట్ ఫోన్లో డేటాని ఆన్ లైన్లో భద్రపరచుకోవచ్చు. కొన్ని అప్స్ ద్వారా ఫోను పనితీరు మెరుగుపరచవచ్చు. ఫోటో మరియు వీడియో ఎడిటింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయాలంటే, ఎడిట్ చేసే అప్స్, సోషల్ మీడియా అప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసి స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయడమే.

ఇంకా జాబ్ సెర్చ్ చేయడం, అప్లై చేయడం, అప్లికేషను స్టేటస్ చెక్ చేయడం, వ్యక్తిగత ఎకౌంటు మనజ్మేంట్, మనకి తెలిసిన విషయం బ్లాగ్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా గాని షేర్ చేయడం, లేదా విషయ సేకరణ ఇలా రక రకాల పనులు మొబైల్ అప్స్ ఉపయోగించి, స్మార్ట్ ఫోన్లో నిర్వహించుకోవచ్చు.

ఓల మొబైల్ అప్లికేషను : ఆటో, కాబ్ బుకింగ్ వ్యవస్థ మొబైల్ అప్ రూపంలో స్మార్ట్ ఫోన్లో లభిస్తుంది. మెయిన్ పట్టణాలు, నగరాలలో ఓల సంస్థ సర్వీసులు అందిస్తుంది.  మొబైల్ అప్ నుండి ఆటో లేక కాబ్ అద్దెకు బుక్ చేసుకోవచ్చు. వాటిని ట్రాక్ ట్రాక్ చేసి దగ్గరలో ఉన్న కాబ్ లేక ఆటో రెంటల్ గా బుక్ చేసుకునే సదుపాయం ఓల క్యాబ్స్ మొబైల్ అప్ లో కలదు.

ఆప్స్ లాక్ : మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న వ్యకిగత మొబైల్ అప్స్, ఇతరులు ఓపెన్ చేయకుండా కొన్ని కావాల్సిన అప్స్ మాత్రమే లాక్ చేసే సదుపాయం ఈ అప్స్ లాక్ మొబైల్ అప్ అందిస్తుంది. ఉదా: పేస్ బుక్, వాట్సప్, మెసెంజర్, గేలరీ, ఎస్ఎంఎస్, కాంటాక్ట్స్, మెయిల్ మొదలైన వాటిని ఈ అప్స్ లాక్ మొబైల్ అప్ ద్వారా లాక్ చేస్తే, ఇతరులు మీ ఫోను చూడడానికి తీసుకున్న మీ వ్యక్తిగత సమాచారం పొరపాటున కూడా చూడలేరు.

ఆటోమేటిక్ కాల్ రికార్డర్: ఉపయోగకరమైన మొబైల్ అప్స్ నందు ముఖ్యమైనది. కొన్నిసార్లు కాల్ మాట్లాడిన తరువాత, అవతలి వారు చెప్పినది మరిచిపోతే, గుర్తు రాకపోయినప్పుడు ఈ మొబైల్ అప్ ఉపయోగపడుతుంది. ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసి ఆక్టివేట్ చేస్తే, ప్రతి కాల్ రికార్డు చేస్తుంది. ఒక్కోసారి అటువైపు వ్యక్తి మాటలు రికార్డు అవ్వడం వలన, అవి ఎప్పుడైనా ప్రూఫ్ గా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఫోను కాల్ మాట్లాడే ఇద్దరి మాటలు రికార్డు అవ్వడం వలన, ఫైనాన్సు తరహ వాటిలో ప్రూఫ్ గా, బాగా ఉపయోగం.

రీఛార్జి ఇట్ నౌ: మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జి, పోస్ట్ పైడ్ బిల్ పేమెంట్, డిటిహెచ్ రీఛార్జి ఎక్కడ నుండైన ఎప్పుడైనా ఈ మొబైల్ అప్ ద్వారా నిర్వహించుకోవచ్చు. ఎకౌంటు రిజిస్టర్ చేసుకొని పేమెంట్ మోడ్ కూడా రిజిస్టర్ చేసి పెట్టుకోవడం వలన రీఛార్జి సులభంగా నిమిషాలలో చేసుకోవచ్చు.

మెసేజ్ బ్యాక్ అప్: స్మార్ట్ ఫోను వచ్చాక కాంటాక్ట్స్ డైరెక్ట్ మెయిల్ ఎకౌంటులో సేవ్ చేసుకునే అవకాశం ఉండడం వలన, ఫోను లేక సిమ్ మార్చినా కాంటాక్ట్స్ మెయిల్ ఎకౌంటులో ఆన్ లైన్లో సేవ్ అయ్యి ఉంటాయి. కానీ ఎస్ఎంఎస్ లు మాత్రం ఫోను మార్చినప్పుడు, ఆ డేటా కోల్పోతాం. మెసేజ్ బ్యాక్ అప్ మొబైల్ అప్లికేషను, స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఎకౌంటు ఆక్టివేట్ చేసుకొని మెసేజ్ బ్యాక్ అప్ తీసుకోవడం వలన, ఎస్ఎంఎస్ డేటా ఫోను మార్చిన తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

భీం మేకింగ్ ఇండియా కాష్ లెస్ : ఇద్దరి వ్యక్తుల మొబైల్ నంబర్స్, వారి వారి బ్యాంకు అకౌంటు అప్డేట్ అయ్యి ఉండి, అవే మొబైల్ నెంబర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లో భీమ అప్ ఇన్స్టాల్ చేసుకుంటే, వారి ఇరువురి మధ్య పేమెంట్ ట్రాన్స్ఫర్ జస్ట్ మొబైల్ నెంబర్ ఆధారంగా నిర్వహించుకోవచ్చు, కాష్ ట్రాన్స్ఫర్ రోజువారి లిమిట్ అనుసరించి. అత్యవసరంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంలో చాల స్పీడ్, కేవలం మొబైల్ నెంబర్ ఆధారం అమౌంట్ సెండ్ చేయవచ్చు, భీం మొబైల్ అప్ ఉపయోగించి.

అడోబ్ అక్రోబాట్ రీడర్ : మెయిల్లో మెయిల్ కి అటాచ్ అయ్యి ఉన్న ఫైల్స్ పిడిఎఫ్ మోడ్లో డౌన్లోడ్ చేస్తే అవి ఓపెన్ కావు, కానీ పిడిఎఫ్ అక్రోబాట్ రీడర్ సహాయంతో చదవగలం. ఇది మొబైల్ అప్ గా ప్లే స్టోర్లో లభిస్తుంది. ఎక్కువగా డాకుమెంట్స్ పిడిఎఫ్ ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి, ఈ మొబైల్ ఉపయోగమే డాక్యుమెంట్ రీడ్ చేయడానికి.

పిఎన్ఆర్ స్టేటస్: బుక్ చేసిన ట్రైన్ టికెట్ స్టేటస్ పిఎన్ఆర్ ఆధారంగా తెలియజేసే మొబైల్ అప్లికేషను. స్మార్ట్ ఫోన్లో అప్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే, టికెట్ కన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. అలాగే రెండు స్టేషన్ల మద్య నడిచే ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

వే2న్యూస్ : గాసిప్స్, న్యూస్, సొసైటీ అప్డేట్, పొలిటికల్ మొదలైన అంశాలలో, స్మార్ట్ ఫోన్లో న్యూస్ అప్డేట్ అందిస్తుంది. ఇంచుమించు మొబైల్ న్యూస్ పేపర్ లా అప్డేట్ చేస్తుంది. మొదట ఇది వే ఎస్ఎంఎస్ మొబైల్ అప్ గా ఉంది.

మరికొన్ని తరువాయి పోస్టులలో!

ధన్యవాదాలు

వేగ2020 – View Enlisted Gadget Apps

2 thoughts on “Some Smartphone Useful Mobile Applications

  1. Pingback: Smartphone Useful Tipsవేగ2020

  2. Pingback: Used/Unused Items Reselling Smartphone Mobile Applicationsవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *