Top Free Android Mobile Apps – I

Top Free Android Mobile Apps – I

Top free Android Mobile Apps – I : స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో స్మార్ట్ గా పనిచేసే ఆప్స్ తప్పనిసరి ఇన్స్టాల్ చేసుకోవాలి, కొన్ని మొబైల్ అప్స్ డిఫాల్ట్ కంపెనీ వారు ఇన్స్టాల్ చేసిపెడతారు. అలంటి వాటిలో గేలరీ, కాల్, ఫోన్ డయిల్,  మెసేజ్, కాంటాక్ట్స్, సెర్చ్, బ్రౌజరు, కెమెరా, వీడియో ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్, రేడియో, ఇమెయిల్, క్లాక్, క్యాలెండర్, మాప్స్, మై ఫైల్స్, వాయిస్ రికార్డర్, రిమైండర్ లేక మెమో, సిమ్ మేనేజర్ మొదలైన బేసిక్ అప్స్ తో బాటు, సంభందిత మొబైల్ ఆపరేటింగ్ సిస్టం వారి ప్రోడక్ట్ అప్స్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఉదా: ఆండ్రాయిడ్ అయితే కనుక తప్పనిసరిగా ప్లే స్టోర్, క్రోమ్, గూగుల్ సెర్చ్, గూగుల్ మాప్స్, గూగుల్ డ్రైవ్, జిమెయిల్, యు ట్యూబ్, ప్లే మ్యూజిక్, ఫొటోస్, హాంగ్ ఔట్స్ మొదలైనవి.

బేసిక్ డిఫాల్ట్ మొబైల్ అప్స్ కాకుండా ఇంకా అవసరమైన అప్స్ చూస్తే, ముందుగా మొబైల్ ఏంటివైరస్ అప్స్ పైడ్ వెర్సన్ మన స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ఇవి వైరస్ నుండి ఫోన్ ప్రొటెక్ట్ చేయడానికి రూపొందిస్తారు. వీటిలో కొన్ని ఉచిత మొబైల్ అప్స్ ఏవిజి మొబైల్ ఏంటివైరస్,  ఆవిర ఏంటివైరస్, అవాస్ట్ మొబైల్ ఏంటివైరస్, మెకఫే మొబైల్ సెక్యూరిటీ, క్విక్ హీల్, నార్టన్, కాస్పర్ స్కై, ఇసెట్, కే7 మొదలైన్ ఏంటివైరస్ ఉచిత లేక కొంత రుసుం ఛార్జ్ తో లభిస్తాయి. క్రింది కనిపించే బటన్ పై క్లిక్ చేసి కావాల్సిన మొబైల్ అప్ వివరాలు చూడవచ్చు తరువాయి ప్లే స్టోర్ నుండి  ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

మీ మొబైల్ ఫోన్లో లైవ్ వీడియోలు, లైవ్ టీవీ చానల్స్, లైవ్ క్రికెట్, లైవ్ ఈవెంట్స్ చూడాలంటె మాత్రం Hotstar మొబైల్ అప్ మీ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరి. గూగుల్ ప్లే స్టోర్ నందు ఇది ఎడిటర్ ఛాయస్ నందు చోటు సంపాదించింది.

WhatsApp: వాట్సప్ ఫోటో షేరింగ్, మెసేజ్ షేరింగ్, వీడియో షేరింగ్, వాయిస్ కాల్, వీడియో కాల్ ఒకే అప్ అదే వాట్సప్ మొబైల్ అప్లికేషను. దీనికి ఇంటర్నెట్ ఆధారంగా అంటే మొబైల్ డేటా ఛార్జ్ వర్తిస్తుంది. ఇది కొన్ని ఫోన్లలో ముందుగానే కంపెనీ వారిచే ఇన్స్టాల్ చేయబడి ఉండవచ్చు, మరియు డిజిటల్ మార్కెటింగ్ కు కూడా బాగా ఉపయోగం.

Vigo Video: విగో వీడియో ఇది వీడియో ఎడిటింగ్ అండ్ షేరింగ్ మొబైల్ అప్, మీరు మీ ఫోనుతో చిత్రీకరించిన వీడియోను మీ ఫోన్లోనే అర్ధవంతంగా తయారు చేయవచ్చు. అలాగే ఆ వీడియోను మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయవచ్చు, ఒకవేళ ఎక్కువ మంది మీ వీడియోను ఇష్టపడితే మీకు ఈ అప్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉంది.

SHAREit: షేర్ ఇట్ ఇద అయితే కొన్ని ఫోన్లలో డిఫాల్ట్ అప్లికేషనుల ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఏకంగా ఒక మూవీ మొత్తం ఒక్కసారిగా మీ ఫోన్ నుండి ఫ్రెండ్ ఫోనుకు లేక మీ ఫ్రెండ్ ఫోను నుండి మీ ఫోనుకు చాల తేలికగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. నిమిషాలలో ఎక్కువ సైజు ఫైల్స్ ఓకే ఫోన్ లేక ట్యాబు నుండి వేరే డివైస్ కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు.Top Free Android Mobile Apps – I

Facebook Messenger : పేస్ బుక్కులో స్నేహితులు అయ్యి ఉంటే పేస్ బుక్ మెసెంజర్ మొబైల్ అప్ ద్వారా ఆయా స్నేహితులతో  వీడియో చాట్ లేక టెక్స్ట్ చాట్ చేసుకోవచ్చు. గ్రూప్ చాటింగ్ ప్రత్యేకత.

UC Browser: యుసి బ్రౌజర్ మొబైల్ అప్ మీరు దీని నుండి వీడియో వీక్షించడం, మీ ఫోన్లోకి వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం చాల ఫాస్ట్ అవుతుంది. అలాగే బ్రోజ్ చేస్తున్నప్పుడు మొబైల్ యాడ్స్ బ్లాక్ చేసుకునే సదుపాయం కలదు ఇంకా చాల ఉపయోగాలు ప్లే స్టోర్ నందు అప్ వివరాలలో వ్రాయబడి ఉన్నాయి.

MX Player: చాలమంది ఎంఎక్ష్ ప్లేయర్ తో స్మార్ట్ ఫోన్లో వీడియోలు చూడడానికి ఇష్టపడతారని, మనకి గూగుల్ ప్లే స్టోర్ నందు అప్ వివరాలలో వినియోగదారుల విశేషణ చదివితే అర్ధం అవుతుంది. వీడియో ఫార్వర్డ్, బ్యాక్ వర్డ్, సౌండ్ అడ్జస్ట్మెంట్ చాల సింపుల్ ఉంటాయి.

True Caller: ఇది కొన్ని కంపెనీ మోడల్స్ నందు డిఫాల్ట్ అప్లికేషన్లలో ఇన్స్టాల్ చేసి ఉంచుతారు. ఫోన్లో సేవ్ చేయని నెంబర్ నుండి మన ఫోనుకు కాల్ వస్తే, అ ఫోన్ నెంబర్ మాత్రమే మనకి కనిపస్తుంది కానీ ఆ వ్యక్తి పేరు మన స్మార్ట్ ఫోన్ స్క్రీనుపై కనబడదు. సేవ్ చేసిన నెంబర్ నుండి కాల్ వస్తే, కాల్ చేస్తున్న వ్యక్తి పేరును మన ఫోన్ స్క్రీనుపై కనబడుంది. కానీ సేవ్ చేయని ఫోన్ నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తే పేరు రావాలంటే మాత్రం ట్రూ కాలర్ మొబైల్ అప్లికేషను బాగా ఉపయోగపడుతుంది. అయితే ఆ ఫోన్ నెంబర్ ఇతరులలో ఎవరో ఒకరు ట్రూ కాలర్ అప్లికేషనులో సేవ్ చేసి ఉండాలి. అంటే ఉదా: మీకు తెలియని మీ ఫోన్లో సేవ్ చేయని సుచిత్ర అనే వ్యక్తి పేరు ఆ వ్యక్తికి సంభందించిన స్నేహితుల ఎవరో ఒకరు ట్రూ కాలర్ అప్లికేషనులో సుచిత్ర అను పేరుతొ సేవ్ చేసుకుని ఉన్నట్లయితే, ఇప్పుడు సుచిత్ర మీ ఫోనుకు కాల్ చేస్తే (మీరు ట్రూ కాలర్ మొబైల్ అప్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి), ట్రూ కాలర్ అప్ ఆ తెలియని వ్యక్తి పేరు సుచిత్రగా మీ ఫోన్ స్క్రీన్ పై సూచిస్తుంది. అదే సుచిత్ర పేరు ఆ వ్యక్తి స్నేహితులు సూచి అని సేవ్ చేసి ఉంటే, మీకు సూచి అనే పేరునే మీ మొబైల్ స్క్రీన్ పై సూచిస్తుంది. అంటే ఒక ఫోన్ నెంబర్ ఎక్కడో ఎప్పుడో ఒకసారి ట్రూ కాలర్ అప్లికేషనులో ఎదో ఒక పేరుతొ సేవ్ చేసి ఉంటే, ట్రూ కాలర్ అప్ ఇన్స్టాల్ చేసిన ఫోనుకి తెలియని వ్యక్తి చేసిన, ట్రూ కాలర్ పేరుని డిస్ప్లే చేయగలుగుతుంది. Top Free Android Mobile Apps – I

Facebook: ఈ అప్ గురించి తెలియని వారు ఉండరు, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారు లేక ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే పరికరాలలో జనరల్ గా ఉపయోగించే మొబైల్ అప్ లేక వెబ్ అప్. పేజెస్, గ్రూప్స్, టైం లైన్, స్టేటస్, లైక్, షేరింగ్ మొదలైన ఫీచర్స్ పేస్ బుక్ తో వాడుకోవచ్చు.

ఇంకా మరికొన్ని మొబైల్ అప్లికేషన్స్ గురించి తరువాయి పోస్టులలో తెలుసుకుందాం !

ధన్యవాదాలు

వేగ2020 – View Enlisted Gadget Apps