VegaSmartPhoneSangatulu

VegaSmartPhoneSangatulu

VegaSmartPhoneSangatulu వేగంగా విస్తరించడం అంటే వస్తువు లేదా విషయం ప్రభావిత అంశాలుపై ఎక్కువ మంది దృష్టిలో ఒకే భావన ఉండడం వలన, ఆ వస్తువు లేదా విషయం ఎక్కువమందికి చేరుతుంది. ఉదా: బాహుబలి బిగినింగ్ అందరికి నచ్చిందంటే, ఆ చిత్ర దర్శకుడి భావనలు, ఆ చిత్రాన్ని చూసిన, చూస్తున్నవారి భావనలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రేక్షలకు ముందు చలన చిత్ర రచయిత భావన, దర్శకుడి భావనలు, నిర్మాత మరియు సదరు టీం సభ్యుల భావనలు ఒక్కటయి, తరువాయి ప్రేక్షకుల ముందుకు రాగానే, ఆ చిత్ర యూనిట్ ఆలోచన భావనలు ప్రేక్షకుల చిత్ర దర్శనము ఒక్కటే అయ్యాయి. డానికి ప్రభావం వేగంగా ఎక్కువమందికి చేరింది. అదే వేగంతో ఉత్సుకత కలిగించిన బాహుబలి 1, బాహుబలి 2 దాకా ప్రభావం చూపించి, వేగంగా పరిమితులను చెరిపేసి, ఇతర ప్రాంతాలలో కూడా వేగంగా తన ప్రభావం చూపింది. సాధారణ భావనలతో కలిపి కొత్త ప్రయోగం మనస్సుకు మంత్రమే కదా !

స్మార్ట్ మొబైల్ ఫోను వేగంగా విస్తరించి, వేకువవేళలో కూడా మనిషి వేగిరపరుస్తూ మేలుకోల్పే సాధనంగా సాధారణమైపోయింది. కొంత మందికి అయితే నిద్ర సమయాన్ని కూడా వేగంగా హరించివేస్తుంది. వేగవంతమైన కదిలే కాలంలో వేగంగా సాగే జీవితం, వేగంగా వెళ్ళే వాహనాలతో వేగవంతమైన ప్రయాణం, వేగవంతమైన టెక్నాలజీతో వేగంగా ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్స్, వేగవంతమైన స్మార్ట్ ఫోన్ వాడుక, వేగంగా విషయలపై అవగాహన, ఇలా వేగులు వేగంగా విషయ సేకరణ చేసినట్లు టెక్నాలజీ పరికరాలు మన జీవితాన్ని వేగవంతమైన జీవితంగా మార్చేస్తున్న భావన!  వేగంగా వచ్చి వేగంగా వెళ్లి వేగంగా ఇంకొకటి వచ్చే స్మార్ట్ ఫోన్, వేగంగా సెకండ్ హ్యాండ్ పరికరంగా వేగంగా అమ్మకానికి వెళుతుంది.స్కూల్లో పిల్లవాడికి లెక్కలు బాగా అర్ధమైతే, అన్ని పరిక్షలు రెండున్నర గంటలు వ్రాస్తే లెక్కల పరీక్షా సుమారు రెండు గంటల లోపే వ్రాసేస్తాడు. అర్ధం కాకపోతే రెండున్నర గంటలు రెండింతలు చేసిన వ్రాయడం కష్టమే. ఇప్పుడు టెక్నాలజీ విషయం కూడా అంతే, అర్ధం అయితే జీవితంలో చాల వేగంగా వేయి పనులు కూడా చేయవచ్చు. బ్రౌజింగ్ గురించి అవగాహన ఉంటే, బ్యాంకింగ్, టికెట్ బుకింగ్, బిల్ పేమెంట్, అప్లికేషను సబ్మిషన్, సర్వే, షాపింగ్ ఎర్నింగ్ ఇలా ఇంటిదగ్గర నుండి లేక పని చేసే ఆఫీసు నుండి నిర్వహించి కాలహరణం కాకుండా చూడవచ్చు.

స్మార్ట్ ఫోన్ వినియోగం, స్మార్ట్ ఫోన్లో మొబైల్ అప్స్ వినియోగించడం, ఏఏ మొబైల్ అప్ ఏమి చేయడానికి ఉపయోగం, స్మార్ట్ ఫోన్ పనిచేసే విధానంలో సరైన అవగాహన ఉన్నవారికీ కంప్యూటర్ లో నిర్వహించే చిన్న చిన్న పనులు ఫోన్ నుండే చేయవచ్చు. ఉదా: టికెట్ బుకింగ్, బిల్ పేమెంట్, మొబైల్ బ్యాంకింగ్ మొదలైనవి.

VegaSmartPhoneSangatulu

టెక్నాలజీ సంస్థల లేక వారి ఆఫీసు నిర్వహణలో వేగవంతమైన విధానాన్ని సృష్టిస్తే, స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో వేగవంతమైన విధానానికి నంది అవుతుంది అని చెప్పవచ్చు. వేగంగా వ్యక్తి జీవన సంసారంలో ఒక బలమైన సంభందాన్ని స్మార్ట్ ఫోన్ వేగంగానే సృష్టించవచ్చు.

ఏమైనా ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది మార్పు అనుకునే కన్నా మార్పును గమనించి అనుమతిస్తే, మనస్సుకు మనుగడ ఉన్నట్లు, టెక్నాలజీ గమనించి వాడుకుంటే, సాధారణ జీవితంలో టెక్నాలజీ బాగా ఉపయోగమే అని చెప్పవచ్చు.

ఇంకా తరువాయి పోస్టులలో మరిన్ని ఇతర మొబైల్ అప్స్ !

ధన్యవాదాలు

వేగ2020 View Enlisted Gadget Apps