సాంకేతికతపై సాదారణ పరిజ్ఞానం అందరికి అవసరం, వాడుకలో నియంత్రణ మరీ ముఖ్యం

సాంకేతికతపై సాదారణ పరిజ్ఞానం అందరికి అవసరం, వాడుకలో నియంత్రణ మరీ ముఖ్యం

సాంకేతికతపై సాదారణ పరిజ్ఞానం అందరికి అవసరం, వాడుకలో నియంత్రణ మరీ ముఖ్యం. వేగంగా వృద్ది పొందుతున్న సాంకేతికత వలన వేగవంతమైన వాడుక కోసం వెసులుబాటు వైపు వెళుతూ వ్యక్తిగత వివరాలను విశేషంగా సాంకేతిక సాధనాలలలో వేగువలే వ్యవహరించే కొన్ని అనువర్తనాలలో వివరించడం వలన వ్యక్తిగత వివరాలకు భద్రత విషయంలో సందేహాలు వెలువడుతున్నాయి. వేలకువేలు అనువర్తనాలు వివిధ విషయాలలో సాంకేతిక పరికరాలలో సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.

వేళకు ఏమిచేయాలో ఏవేళలో ఏమి కార్యముల కర్తవ్యములుగా రానున్నాయో ఆవేళకు గుర్తుచేసే అనువర్తనాలు వందలలో ఉంటూ ఉన్నాయి. అలాగే ఏదైనా దృశ్య విషయము విశేషముగా అనిపిస్తే ఆ దృశ్య విషయాన్నివెంటనే వేగంగా వీడియోగా సాంకేతికపరికరంలో బందించవచ్చు, అలా సాంకేతికత అభివృద్ధి చెందింది. ప్రధానంగా ఈ సాంకేతిక పరికరాలు ఎల్లప్పుడూ వెంటఉండే అవకాశం ఉండడం వలన, ఎప్పుడు కావాలంటే అప్పుడు విషయ సమాచారం పొందడానికి ఉపయుక్తంగా ఉండడం ఎక్కువగా వ్యాప్తిచెందడానికి కారణం కావచ్చు.సహజమైన మానవ సంబందాలు, సంతోష పెట్టే చిత్రవిషయాలు, మానవ మిత్రుల యోగక్షేమాల విచారణ ఇవ్వన్ని వ్యక్తిగతంగా ఎక్కడి నుండి ఎక్కడ ఉన్నవారినైనా వారిని కలవకుండానే సాంకేతిక పరికరాల సహాయంతో తెలుసుకోవచ్చు. ఇంకా అనేక విషయాల సమాచారం, విద్యా, వైద్య, ఆచరణ, అధికార, సామజిక, సాంఘిక వ్యవహారలలో విశేషాలు, రాజకీయ పరిణామాల వివరాలు, విశేషాలు, విశ్లేషణలు వీక్షించవచ్చు. ఇలా పలురకాల వివరాలను, వివరించబడిన కధనాలను చదవవచ్చు. అటువంటి సాంకేతిక పరికరాలలో స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, అధునాతన సాంకేతికత సదుపాయాలతో వివిధ రకాల అనువర్తనాలను నిర్వహించుకునే విధంగా ఉపయోగపడుతున్నాయి.

స్మార్ట్ ఫోన్ / టాబ్లెట్ ఒకవ్యక్తి వ్యక్తిగత వివరాలు కలిగిన మెయిల్ ఖాతా అందించిన పిదప సదరు సాంకేతికపరికరం ప్రారంభించబడుతుంది అలా కాకుండా మెయిల్ ఖాతా అందించకుండా సదరు పరికరం ప్రారంభిస్తే, ఆ పరికరాన్ని ఉపయోగించేటప్పుడు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి కారణం చేత స్మార్ట్ ఫోన్ / టాబ్లెట్ ఉపయోగించడానికి వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలు సదరు సాంకేతిక పరికరంలో పొందుపరచాలి లేక వ్యక్తిగత వివరాలతో సృష్టించబడి ఉన్న మెయిల్ ఖాతాని ఆ పరికరానికి జతచేయాలి.ఈవిధంగా స్మార్ట్ ఫోన్ ప్రారంభించాలంటే ఆన్ లైన్ లైవ్ ఖాతా తప్పనిసరి. సాంకేతికతపై సాదారణ పరిజ్ఞానం అందరికి అవసరం, వాడుకలో నియంత్రణ మరీ ముఖ్యం

సాదారణ వ్యక్తికి విషయజ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యం

ఇక సాంకేతిక పరికరాలలో ఒక చోట పెట్టి వాటిని ఉపయోగించుకునే సాంకేతిక సాధనాలు డెస్క్ టాప్ కంప్యూటర్, వీటిని ఎక్కువగా సంస్థాగత వ్యక్తులు, సేవా నిర్వాహక వ్యక్తులు, సాంకేతిక అభ్యసించే విధ్యార్ది విద్యార్ధినులు ఉపయోగిస్తూ ఉంటారు. ఒకచోట స్థిరస్థితిలో విద్య అభ్యసించడం లేక విద్య బోధించడం లేక వ్యవహారాలు చేయడం, లేక వ్యాపార నిర్వహణ కార్యకలాపాలు నిర్వహించడం, సేవలను అందించడం ఒక ప్రత్యేక సాంకేతిక ప్రావీణ్యం ఉన్న వ్యక్తులచే చేయడబడడం లేక వారు చేస్తూ ఉండడం ఉంటుంది.

వీటిని ఉపయోగించడానికి సాంకేతిక నైపుణ్యంలో సాదారణ ప్రావీణ్యం తప్పనిసరి కావునా వీటి కొనుగోలు స్మార్ట్ ఫోన్ / టాబ్లెట్ సాంకేతిక పరికరాల కన్నా తక్కువగా ఉంటుంది. కానీ వీటి పనితీరు చాలా బేషుగ్గా ఉంటుంది. వీటి ప్రారంభానికి సాదారణ వ్యక్తి లేక వ్యవస్థ వివరాలు అడిగిన ఆఫ్ లైన్ వరకే పరిమితం అయ్యే విధంగా సదరు సాంకేతిక పెద్ద పరికరాలు ఉపయోగించవచ్చు. అంటే కేవలం పేరు, నివాస స్థలం పూరిస్తే సరిపోతుంది. ఇలా సాంకేతిక పరిజ్ఞానంలో ప్రాధమిక జ్ఞానం కలిగి ఉంటే సదరు సాంకేతిక పెద్ద పరికరాలు ఉపయోగించడానికి అవకాశం ఉంది.

సాంకేతిక జ్ఞానం లేకుండా సమాజం సాగని స్థితిలోకి కూడా సమాజం సాగే స్థితి ఉందని చెప్పవచ్చు. అన్ని ఆన్ లైన్ అనే అంశం ఇప్పుడు అంతటా అన్ని రంగాలలో అన్ని విషయాలపై కొనసాగించబడుతుంది. వ్యక్తుల చేత స్మార్ట్ ఫోన్ వాడుక ఎలాగో ఎక్కువ అలాగే వ్యవస్థలో పెద్ద సాంకేతిక పరికరాల వాడుక తప్పనిసరి అయితే సాంకేతిక పరిజ్ఞానంలో కనీస సాంకేతిక విజ్ఞానం అందరికి అవసరమే అవుతుంది.

బ్యాంకింగ్ లావాదేవీలు బ్యాంకుకి వెళ్ళి నిర్వహించవలసినవ స్థితినుండి సంస్థలైతే కంప్యూటర్ ద్వారా, వ్యక్తులైతే స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో ఉన్నచోట నుండే నిర్వహిస్తున్నారు. అలా వివిధ రంగాల్లో వివిధ విషయాలలో సాంకేతికత అభివృద్ధి చెంది ఉన్నది. వ్యాపార పత్రం పొందాలంటే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళే స్థితి నుండి నేడు GST పోర్టల్ నుండి నేరుగా ధృవీకరణ పత్రం పొందవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా సాంకేతికతను ఆహ్వానించి వినియోగదారుకు సేవలను అందిస్తున్నాయి.

కుటుంబ సభ్యులు చిత్రవీక్షణకు పోరు పెడితే, సదరు కుటుంబ పెద్ద కొత్తగా వచ్చిన చిత్రాలు ఆరా తీసి, ఏచిత్రం వలన సకుటుంబ పరివారం చిత్రాన్ని ఆనందించగలరు అని ఆలోచన చేసి చిత్రవీక్షణకు బయలుదేరతారు. సాంకేతికత పరికరాలు ఎంతవరకు అవసరమో వాటిలో అనువర్తన సాధనాలు ఎంతవరకు ఉపయోగమో తెలుసుకోకుండా భాద్యతతో వ్యవహరించక పొతే, వ్యక్తిగత విషయాలు తెలియకూడనివారికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సాంకేతికతపై సాదారణ పరిజ్ఞానం అందరికి అవసరం, వాడుకలో నియంత్రణ మరీ ముఖ్యం.

వ్యక్తిని ఒంటరిగా చేసేంత సాంకేతిక పరికర వాడుక అనవసరం

పదిమంది బందుత్వం కలిగిన కుటుంబ సమస్తానికి ఒక టివి ఉండడం వలన ఆ టివిలో సరి అయిన విషయాలనే వీక్షించే అవకాశాలు ఎక్కువ. అదే పదిమందిలో ఒక్కొక్కరికి ఒక టివి ఉంటే, సదరు కుటుంబంలో వ్యక్తిగత వీక్షణ వలన మనసు మనిషిని వదిలి ప్రపంచం చుట్టివచ్చేస్తూ ఉంటుంది. సదరు వ్యక్తి నలుగురిలో ఉండి, ఒంటరి భావనను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు తెలిసితెలియని జీవిత ప్రయాణం ప్రారంభానికి ముందే వ్యక్తి మనసుపై పట్టు సంపాదించే మంచి విషయాలను బోధించి అవే వారి చుట్టూ చేరేల చూడాలి కానీ మనసుపై పట్టు కోల్పోయే విషయాలపై అనవసర స్వేచ్చ మనిషిని పాడుచేస్తుంది.

సాంకేతిక పరికరాల వలన వ్యక్తి ఆలోచనలకు స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది. అందులో చెడుదారిన పట్టే స్వేచ్చ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి పరిస్థితి ఎంతలా అంటే చెడుని చూపించి మంచిని కూడా పెంచుకోవాల్సిన పరిస్థితికి సమాజం వెళ్ళే అవకాశాలు ఎక్కువ. అందుకు ఉదా: సినిమాలు పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఒక సందేశాత్మక చిత్రం తీయాలంటే దానిలో ఎన్నో ఇతర అంశాలు, ఇప్పుడు యూత్ పోకడను దృష్టిలో పెట్టుకుని తీస్తే కాని ఒక సందేశం సినిమా ద్వారా ప్రజలకు చేరదు.

కనిపిస్తున్న విషయాలలో మంచిచెడులు చెప్పవచ్చు, అనుసరిస్తున్నవారిని హెచ్చరించవచ్చును, కానీ కనబడని విషయాలలో చెప్పలేము. అలాగే మనిషి పనులను బట్టి మనిషి మనసుతీరుని గమనించి పెద్దవారు హెచ్చరించే అవకాశం ఒకప్పుడు ఉంటే, ఇప్పుడు సాంకేతికత వలన అలాంటి మనసు ఒంటరిగానో, ఒక విషయానికి అలవాటుగానో, విషయాలపై వ్యామోహన్నో పెంచుకునే అంశం ఇతరులెవరు గుర్తించే అవకాశం తక్కువ.

ఇప్పుడు కొన్ని పోకడల కారణంగా వ్యక్తిని చెడుమార్గం వైపు తీసుకువెళ్ళే విషయాలు బహిరంగంగా ఉంటూ ఉంటే, అనుసరించేవారు మాత్రం వారు తప్పు అని తెలుసుకునే దాక ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఉదా: సిగరెట్ అలవాటు ఉన్న వ్యక్తి ఆ విషయం తండ్రికి తెలియదు అన్నంత కాలం తండ్రి తెలుస్తుందేమో అనే ఆలోచనతో అలవాటుపై కొంచెం అదుపు ఉండే అవకాశం ఉంటుంది. అదే వ్యక్తితండ్రికి ఆ విషయం తెలిసి ఉంటే, తెలిసిన విషయమే కదా అని ఇంకా అదుపు తప్పే అవకాశం ఉంటుంది. అలాగే సదరు వ్యక్తి తండ్రి కూడా సిగరెట్ అలవాటు ఎప్పుడన్నా ఉందని ఇతనికి తెలిసి ఉండి, ఇతను కూడా సిగరెట్ త్రాగడానికి అలవాటు పడితే, వ్యసనపరుడై ఉండే అవకాశం ఉంటుంది.

మేలైన విషయాలపై మెళుకువ కలిగి మెలుకువగా ఉండాలి

సాంకేతికత మేలైన అభివృద్ధిని తీసుకువచ్చింది, కానీ అసలు అంశానికి దూరం చేసే అవకాశంగా మారుతుంది. సౌకర్యవంతంగా ఉండే విలాసాలు తేలికగా తెలుసుకునే అవకాశం ఉంది, అనవసరమైన బందాలు పెరిగే అవకాశం ఉంది.

విలువైన విశేషమైన సాంకేతికత సజావుగా ఉపయోగిస్తే మనిషికి సమాజానికి చాల మేలునే చేస్తుంది, అది దుర్వినియోగం అయితే సముద్రం ప్రక్కనే నివాసంలాగ సమాజంలో వ్యక్తుల జీవితాలు సాగుతాయి. సాంకేతికతపై సాదారణ పరిజ్ఞానం అందరికి అవసరం, వాడుకలో నియంత్రణ మరీ ముఖ్యం

ధన్యవాదాలు
వెగ2020