Arogyame MahaBhagyam – Manasu Shariram Okadanikokati Adharam

Arogyame MahaBhagyam – Manasu Shariram Okadanikokati Adharam

Arogyame MahaBhagyam – Manasu Shariram Okadanikokati Adharam ఆరోగ్యమే మహాబాగ్యం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా వినబడుతుంది, కనబడుతుంది దానిపై శ్రద్దపెట్టేవారు ఎంతమంది అనేది ఇప్పటి పరిస్థితుల్లో చెప్పడం కష్టం అంటారు. ఉద్యోగానికెళితే ఏసమయంలో ఇంటికిచేరుతారో ఏసమయానికి తింటారో తెలియదు. వ్యాపారస్తులు వాణిజ్య సమస్యలు ఒత్తిడులు ఎక్కువ, సేవా సంస్థలకు సమస్యలతో పోరాటం ఏ రంగం చూసిన ఎదో ఒక సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భాలే ఎక్కువగా చెబుతూ ఉంటే అసలు విషయం మరుగున పడుతుంది. ఆరోగ్యం విషయం కూడా అలాగా అశ్రద్ధ కానీ అలక్ష్యం అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మనసుపై సలహాలు సూచనలు చిట్కాలు తెలిపే మొబైల్ ఆప్స్ కూడా లభించే అవకాశం ఉంటుంది.

మనసు బాగుంటే శరీరం బాగుంటుంది, శరీరం బాగుంటే మనసు బాగా పనిచేస్తుంది అంటారు. రెండింటికి అవినాభావ సంబంధమే చెబుతూ ఉంటారు. బలమైన శరీరం ఉండి ఆలోచన సరిగాలేకపోతే బలం వృదా అంటారు. మనసు శరీరం బాగుండాలంటే సమయపాలన పౌష్టికాహారం ముఖ్యం అంటారు. పౌష్టికాహారం లభించే ఆహార పదార్ధాలు గురించి అవగాహన లేకపొతే కొన్ని మొబైల్ ఆప్స్ మన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని తెలుసుకోవచ్చు.

సినిమా చూసిన వ్యక్తి ధియేటర్ నుండి బయటకు వచ్చి సదరు సినిమాలో డైలాగ్ లేక పాట తనకు తెలియకుండానే చెప్పడమో పాడటమో చేస్తూ ఉంటారు కొందరు. కొంతమంది అయితే సినిమా సన్నివేశాలు కూడా వివరిస్తూ ఉంటారు. అయితే అందులో వారికి తెలియకుండానే వారి మనసు సినిమాలో ఎదోఓక మాటనో పాటనో పట్టుకుంటే మరి జీవితంలో ఒత్తిడులను ఇంకెంత బలంగా పట్టుకుంటుంది. అలా ఒత్తిడికి గురైన మనసు మనిషి మాట వినడం అంటే అది అద్బుతమే అంటారు కొందరు. కానీ కానీ ఇక్కడ మనిషి నిశ్చయం చేసుకుంటే మనసుని నియంత్రించడం కూడా సాధ్యమే అని చెబుతారు.

కంప్యూటర్ / మొబైల్ లాంటి టెక్నికల్ గాడ్జెట్ వాడకం పెరిగాక అందరికి ముందు వచ్చేవి కంటి సమస్యలు. దృష్టిదోషం ఏర్పడి దగ్గరగా ఉన్నవి కనబడకుండా ఉండడమో లేక దూరంగా ఉన్నవి కనబడకుండా ఉండడమో జరుగుతూ ఉంటుంది. ఇంకా అనేక సమస్యలు తెలియజేస్తూ ఉంటారు. వేగంగా ఎదగాలి అనే ప్రయత్నంలో నియమాలు లేక క్రమం తప్పి పనిచేయడంలో ఆరోగ్య సమస్యలు త్వరగా వచ్చే అవకాశము ఎక్కువ అంటారు. కంప్యూటర్ వాడకానికి కూడా పాటించవలసిన దూరం మరియు సిట్టింగ్ పోసిషన్ లాంటివి పాటించడం వలన కొంచెం బెటర్మెంట్ ఉంటుంది అంటారు.

Arogyame MahaBhagyam – Manasu Shariram Okadanikokati Adharam

అయితే ఎక్కువగా పని ఒత్తిడిలో ఆరోగ్యంగా ఉన్నాం కదా అని అశ్రద్ధ చేస్తూ ఎక్కువ సేపు పనిలో మునగడం, సమయానికి తిండి తినక ఆరోగ్యసమస్యలు తెచ్చుకునే వారు అధికమైతే, కొంతమంది వ్యసనపరులై ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. మొదట్లో ఏ సమస్యా లేనట్టు ఉండి, వయసు పెరుగుతున్న కొలది సమస్యలు పెరుగుతూ ఉంటూ ఉంటాయి. అయితే నిరంతర సాధన సమయ పాలన పౌష్టికాహారం వైద్యుని సూచనల ప్రకారం చేస్తే అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు అని అంటారు.ఏ విటమిన్ లోపించడం వలన ఏ సమస్య వస్తుందో చదువుకున్నప్పుడు సైన్సు పాఠాలలో వచ్చే ఉంటాయి, మరిచిపోయి ఉంటాము. కానీ వాటి గురించి తెలియడం వలన ఈ ఆహారం తీసుకుంటే ఏ విటమిన్ లభిస్తుందో అవగాహనా ఉంటే రోజువారి మోతాదులో విటమిన్ లోపం అధిగమించవచ్చు అని చెబుతారు. విటమిన్లు రకాలు విటమిన్లు సమస్యలు విటమిన్లు లభించే ఆహారపదార్ధాలు వీటిని సూచించే మొబైల్ ఆప్స్ కూడా కొన్ని ఉంటాయి.

ఇన్స్టంట్ ఫుడ్ ఇదో పెద్ద సమస్య నగరాల్లో ఎక్కువగా బాచిలర్స్ మరియు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అయితే మాత్రం వారి హోటల్ కూరలు లేక ఇన్స్టంట్ ఫుడ్ పై మొగ్గుచూపడం అనారోగ్య సమస్యలకు కారణం కాగలదు. వ్యాపారి లాభాపేక్షకలిగి ఉండడం వలన రక్షణాత్మకమైన విషయాలలో వెసులుబాటు ఉన్నంతవరకు తప్పించుకునే ప్రమాదం ఉన్నందున వ్యాపార కేంద్రాలలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం అంటే ఖర్చు చేసి సమస్యను తెచ్చుకుని ఆ సమస్యను పోగొట్టుకోవడానికి ఇంకోసారి ఖర్చు చేయడమే అవుతుంది. అప్పుడప్పుడు అవసరానికి ఇన్స్టంట్ ఫుడ్ ఎవరికైనా తప్పదు, కానీ ఎక్కువమార్లు ఆరోగ్యభంగం అంటారు.

ఆరోగ్యం బాగున్న వ్యక్తి మనసుకి కష్టం కలిగితే అతను తేరుకోవడానికి ఎక్కువకాలం పడుతుంది అంటే, మరీ అనారోగ్యపరులకు మనసుకు కాలంలో కలిగే కష్టాలు కలిగితే జీవితం దుర్లభం అవుతుంది. అందుకే నియమాలు కలిగిన క్రమశిక్షణ పెద్దపీట వేస్తారు సమాజంలోను విద్యాలయాల్లోను. శరీరం మనిషి తయారు చేయాలనే అద్బుతమైన యంత్రం అయితే మనిషిచే ప్రకృతిలో అనేక విషయాలను, వస్తువులను సృష్టింపచేయగల మనసు ఇంకెంత గొప్పది. రెండింటి ఆరోగ్యం మనిషి తక్షణకర్తవ్యమే.

ధన్యవాదాలు.
vega2020