Smartphone Pradhamika Mobile Apps Gurinchi Avagahana

Smartphone Pradhamika Mobile Apps Gurinchi Avagahana

Smartphone Pradhamika Mobile Apps Gurinchi Avagahana Avasaram స్మార్ట్ ఫోన్ సంగతుల్లో వినియోగదారు వినిమయ వివరాలు మొబైల్ ఆప్స్ ద్వారా ఒకదాని నుండి ఒకటి లింక్ అవుతూనే ఉంటాయి. ఫోను నెంబర్ ద్వారా జిమెయిల్ ఎకౌంటు క్రియేట్ అయితే, జిమెయిల్ ఎకౌంటు ద్వారా గూగుల్ ప్లస్ ఎకౌంటు, బ్లాగర్ ఎకౌంటు ఓపెన్ చేయవచ్చు. అలాగే జిమెయిల్ లేక ఫోన్ నెంబర్ ద్వారా పేస్ బుక్ ఎకౌంటు ఓపెన్ చేయవచ్చు, అలాగే వాట్స్ అప్ ఎకౌంటు, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చు.

పేస్ బుక్ లేక గూగుల్ ప్రొఫైల్స్ తో అనేక ఆన్ లైన్ అకౌంట్స్ ఓపెన్ చేయవచ్చు. ఇలా ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ద్వారా మొబైల్ ఆప్స్ లేక ఆన్ లైన్ అకౌంట్స్ కలిగి ఉండవచ్చు. ఈవిధంగా సదరు మొబైల్ నెంబర్ మరియు మెయిల్ బేసిక్ డేటా ఒక మొబైల్ ఆప్ నుండి మరొక మొబైల్ ఆప్ కి అనుమతులు కోరుతూ మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఆన్ లైన్ ఎకౌంటులలో కానీ మొబైల్ ఆప్ ఎకౌంటులలో కానీ మొబైల్ నెంబర్ మరియు మెయిల్ వివరాల వరకు మాత్రమే ఉపయోగించడం శ్రేయష్కరం అని సాంకేతిక నిపుణల అభిప్రాయంగా చెబుతూ ఉంటారు.

కొన్ని మొబైల్ ఆప్స్ లేక గేమ్స్ వలన ఫోన్ పనితీరు బాగుండదు అని చెప్పినా వాటికీ అలవాటు పడినవారు వాటిని వాడుతూనే ఉంటూ ఉండవచ్చు. అవసరం లేనివారు వాటిని తొలగిస్తూ ఉంటారు. ఉచితంగా సేవలు పొందుతూ ఉన్నాము అంటే వాటికి ఆదాయంగా మనమే మారుతూ ఉండవచ్చు. లేకపోతే ఉచిత సేవలు అందించడానికి వారికి ఆర్ధిక, యాంత్రిక, మానవ వనరులు ఎక్కడ నుండి లభిస్తాయి. తక్కువ మొబైల్స్ కలిగిన మొబైల్ షాపులో మొబైల్ ధర ఎక్కువ ఉండవచ్చు, అలాగే ఎక్కువ మొబైల్స్ అమ్మేవారి దగ్గర ధర తక్కువ ఉండవచ్చు. ఆ మాదిరి సేవలు అందించే ఆప్స్ ఎక్కువమంది వాడుతున్నారు అంటే ఎక్కువమంది వినియోగ వినిమయ వివరాలు వారి నియంత్రణలో ఉంటాయనేది సుస్పష్టమే.



ఏది ఏమైనా స్మార్ట్ ఫోన్ వలన వినియోగదారు వివరాలు ఇంటర్లింక్ అయ్యి ఆన్ లైన్ బహిరంగ విషయాలుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది అంటే, మొబైల్ ఆప్స్ వినియోగం ఎక్కువగా ఉందనే అర్ధం, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ప్రధాన ప్రయోజనం మొబైల్ ఆప్స్ నడిపించే పరికరం.

Smartphone Pradhamika Mobile Apps Gurinchi Avagahana

వినియోగదారుకి ప్రయోజనం ప్రధానంగానే స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఆప్స్ ఆవిష్కరింపబడతాయి. వినియోగదారు ప్రధాన ప్రయోజనాలు స్మార్ట్ ఫోనులకు ప్రాధమిక ప్రయోజనాలుగా మారుతూ ఉంటాయి. సాదారణంగా స్మార్ట్ ఫోన్లు టచ్ స్క్రీన్, 3G నెట్వర్క్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్, మెసేజ్ /ఫోటో / వీడియో చాటింగ్ మరియు షేరింగ్, మ్యూజిక్, వీడియో వీక్షణ, ఫోటో & వీడియో కాప్చర్, మాప్స్, జిపీస్, రేడియో, టెక్స్ట్ మెసేజ్, వాయిస్ రికార్డర్, కాల్ రికార్డర్, వైఫై, బ్లూటూత్, సింగల్ ఆపరేషన్ ప్రాధమిక ప్రధాన ఉపయోగాలుగా ఉండేవి. సదరు సదుపాయాలలో నాణ్యతను బట్టి ధరలు ఉండడం సాదారణ అంశమే.

తరువాయి టెక్నాలజీ అభివృద్ధిలో మారిన సాదారణ సదుపాయాల ప్రాధాన్యతలు: బిగ్ స్క్రీన్ హెచ్.డి. డిస్ప్లే, 4జి నెట్ వర్క్, వోల్టే, హెచ్. డి. వాయిస్ కాలింగ్, వీడియో కాన్ఫరెన్స్, లైవ్ వీడియో షేరింగ్, డ్యూయల్ ఆప్ ఉపయోగం, మల్టీ టాస్కింగ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్, పేస్ డిటెక్షన్, పేస్ అన్ లాక్, హై రామ్, హై ఇంటర్నల్ మెమరీ, ఓటిజి సపోర్ట్, వైఫై హాట్ స్పాట్ ఇలా పలు రకాల సదుపాయాలు ఎప్పటికప్పడు టెక్నాలజీ మారుతూ ఉంటే తదనుగుణంగా స్మార్ట్ ఫోన్ సదుపాయాలు పెరుగుతూ అవి సాదారణ స్మార్ట్ ఫోన్ ప్రాధమిక సదుపాయలుగా మారడం మాములే.

ధరని బట్టి నాణ్యతకు బదులు బడ్జెట్ ధరలో సామాన్య నాణ్యతలో అధునాతన సదుపాయాలు అందించడం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రధాన అంశం అయ్యింది. స్మార్ట్ ఫోన్లో షాపింగ్ అవకాశం కల్పిస్తున్న మొబైల్ ఆప్స్ మరియు రివ్యూ ఆప్స్ వలన ఇంకా వివిధ స్మార్ట్ ఫోన్లలో ఉన్న సదుపాయాల పోలిక ధరల పోలికా చూసుకుని కొనుగోలు చేసే వినియోగదారులు కొందరు అయితే, రాబోయ్ స్మార్ట్ ఫోన్ల సదుపాయాలపై మొబైల్ ఆప్స్ ద్వారా విచారణ చేసి తెలుసుకునే వారు కొందరుంటారు.

ఇలా టెక్నాలజీ అనేక సదుపాయాలను తీసుకుస్తే స్మార్ట్ ఫోన్ రోజురోజుకూ ఆకర్షనీయంగా సదుపాయంగా మారుతుంటే, ఉపయోగించడం తెలియని వారి స్మార్ట్ ఫోన్ డేటా ఇతరులకు చేరే అవకాశాలు కూడా ఎక్కువే. కంపెనీ లేక సేవా సంస్థ అధికారిక మొబైల్ ఆప్స్ వలన అంతగా నష్టం జరగకపోవచ్చు, ఎందుకంటే ఏ కంపెనీ అయినా సేవా సంస్థ అయినా వినియోగదారు దగ్గర తమపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోరు.

ఎంతపెద్ద కంపెనీ అయిన చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి అంటే సదరు కంపెనీలో పనివంతుడి పొరపాటు ఉండవచ్చు. లేక తప్పుదారి పట్టిన పనివారి నిర్వాకం కారణం కావచ్చు. వేలమంది పనివారిలో ఎవరోఒకరు పొరపాటు చేయకమానరు, కానీ పొరపాట్లను సరిచేసే అవకాశం ఉంటుంది, పొరపాటు వలన మరలా అది జరగకుండా చూసుకోవచ్చు. కానీ కావాలని తప్పిదం చేసే అవకాశం ఉంటే మాత్రం అది నైపుణ్యం కలిగిన వారి వలన అయితే అది నష్టదాయకమే.అటువంటి నైపుణ్యం కలిగినవారి తప్పులు పట్టుకోవాలంటే వారిపై నిపుణత కలిగినవారి అజమాయిషీ అవసరం.

Smartphone Pradhamika Mobile Apps Gurinchi Avagahana

మరి మనం ఉపయోగించే మొబైల్ ఆప్స్ ఎంత ఎక్కువ ఉంటే, అంత నైపుణ్యం మనలో ఉన్నట్టే అనుకుంటే పొరపాటు కావచ్చు. ఎందుకంటే చాలామందికి సదరు స్మార్ట్ ఫోన్ తయారుదారు, సాఫ్ట్వేర్ సేవాదారు ఇచ్చిన బేసిక్ మొబైల్ ఆప్స్ కూడా ఉపయోగించకపోవచ్చు. అయితే ప్రధానంగా స్మార్ట్ ఫోన్లో కొన్నప్పుడే బేసిక్ గా ఇన్స్టాల్ చేయబడిన మొబైల్ ఆప్స్ గురించి పూర్తిగా యూట్యూబ్ లేక తయారుదారు మాన్యువల్ బుక్ చదవడం చాల మంచిది. ఆఫీసులో ఏమి జరుగుతుందో తెలిసినప్పుడే మేనేజర్ ఆ ఆఫీసుని వృద్దిలోకి తేగలడు, లేకపోతే అతను ఒక అసమర్ధ మేనేజర్ అవుతాడు. అలాగే స్మార్ట్ ఫోన్లో ఉన్న సాదారణ మొబైల్ ఆప్స్ సాదారణ సెట్టింగ్స్ గురించి తెలుసుకోవడం ప్రధాన విషయం స్మార్ట్ ఫోన్ వినియోగాదరుకి.

ఇప్పటి స్మార్ట్ ఫోన్ అయిన గతకొంతకాలపు స్మార్ట్ ఫోన్ అయినా సాదారణ మొబైల్ ఆప్స్ తో ఫోన్ వాడకం సజావుగానే సాగుతుంది. మూడోపార్టీ మొబైల్ ఆప్స్ ఉపయోగించినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు. అలా స్మార్ట్ ఫోన్లో మూడోపార్టీ మొబైల్ ఆప్స్ స్మార్ట్ ఫోన్ సదుపాయాల ఆధారంగా సౌకర్యాలు ఇంకా ఎక్కువగా అందించే విధంగా ఉంటాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే….

కొన్ని రకాల మొబైల్ ఆప్స్ విషయంలో కూడా ఇన్స్టాల్ చేసుకునే ముందు మీ స్మార్ట్ ఫోన్ యొక్క అనుమతుల వివరాలు లిస్టుగా చూపుతూ మిమ్మల్ని అడుగుతుంది. అయితే సదరు మొబైల్ ఆప్ ఎంతవరకు అవసరమో తెలుసుకుని, ఆ అనుమతుల వివరాలు సరి చూసుకుని సదరు మొబైల్ ఆప్ స్మార్ట్ ఫోన్లోకి డౌన్ లోడ్ చేసుకోవడం ఉత్తమమని అంటారు.

ఎక్కువ సౌకర్యాలు అందించే మొబైల్ ఆప్స్ కి ఎక్కువ స్మార్ట్ సదుపాయాలను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటివి ఇన్స్టాల్ చేయబడిన స్మార్ట్ ఫోన్ వినియోగదారు నుండి ప్రాదమిక వివరాలపై కూడా అనుమతులు పొంది ఉంటాయి.

ప్లే స్టోర్ నుండి మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేసుకునే విధానంలో కొన్ని స్క్రీన్ షాట్స్ కలిగిన పోస్ట్ చదవడానికి ఇక్కడ క్లిక్/టచ్ చేయండి.

ధన్యవాదాలు
vega2020