Sometimes Dual Sim Smartphones Not Working Properly As Dual Sim, But Same time It Is Working As Single Sim Well.

Sometimes Dual Sim Smartphones Not Working Properly As Dual Sim, But Same Time It Is Working As Single Sim Well.

డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్స్ ఒక్కోసారి డ్యూయల్ సిమ్ పనిచేయకుండా సింగల్ సిమ్ మాత్రమే పని చేస్తుంటాయి, లేదా డ్యూయల్ సిమ్ గా వాడుతున్నపుడు నెట్ వర్క్ ప్రాబ్లం ఉండి సిగ్నల్ సరిగా లేకపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సింగల్ సిమ్ మొబైల్ పనిచేసిన అంత కాలం డ్యూయల్ సిమ్ మొబైల్ పనిచేయవు అని అంటారు. స్మార్ట్ ఫోన్ అంతా బాగుండి డ్యూయల్ సిమ్ వర్క్ కాకపోతే, తప్పక సింగల్ సిమ్ వాడవలసి వస్తుంది. ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే డ్యూయల్ సిమ్ములలో రెండవ సిమ్ కేవలం ఇంటర్నెట్ కోసమే అయితే కనుక రిలయన్స్ JoiFi డివైస్ లేక అటువంటి హాట్ స్పాట్ డివైజులు ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించవచ్చు. అలా కాకుండా రెండు సిమ్స్ కాలింగ్, మెసేజ్ మొదలైనవి వాడుతుంటే కనుక మాములు తక్కువ ధరలో కంపెనీ ఫీచర్ ఫోన్ కొనుక్కోవడం బెస్ట్ కాలింగ్, మెసేజ్, వాటికీ బాగా ఉపయోగం. ఇంకా మల్టీమీడియా కోసం స్మార్ట్ ఫోన్ ఎలానో వాడుతాం.

HotSpot Device

హాట్ స్పాట్ డివైజెస్: ఇవి ఇంటర్నెట్ వైఫై రౌటర్ లాగా ఇతర వైఫై ఫీచర్ ఉన్న డివైజెస్ కు ఇంటర్నెట్ షేర్ చేస్తాయి. వీటిలో సంభందిత నెట్ వర్క్ ఆపరేటర్ సిమ్ కార్డు ఇన్సర్ట్ చేసి, వైఫై ద్వారా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. వీటి వలన ఉపయోగం స్మార్ట్ ఫోన్ లైఫ్ కొంత ఎక్కువ కాలం ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోనులో నెట్ వాడాలంటే కనుక, దానిలో నెట్ వర్క్ సింగల్ బాగుండాలి, అప్పుడు నెట్ స్పీడుగా వస్తుంది. నెట్ వర్క్ సింగల్ తక్కువగా ఉన్నప్పడు వీడియో బఫర్ అవుతుంది, సిగ్నల్ క్యాచ్ చేయడానికి ఫోన్ ట్రై చేస్తూ ఉండడం వలన దాని లైఫ్ తగ్గే అవకాశాలు ఎక్కువ. అంటే ఇక్కడ ఫోనులో మొబైల్ డేటా వాడుతున్నంత సేపు ఫోన్ మనం ఇచ్చే టాస్క్ చేస్తూ, సిగ్నల్ క్యాచ్ చేయాల్సి, ఉంటుంది. ఈలోపు ఎవరైనా కాల్ చేస్తే అది ఏ నెంబర్ ఏ నెట్ వర్క్ కాల్ గుర్తించాలి, ఫోన్లో కాంటాక్ట్ అప్స్ రీడ్ చేయాలి ఇలా ఫోన్ పని పెరిగిపోతుంది. ఎక్కువ లైవ్ వీడియోలు చుస్తున్నప్ప్పుడు, వీడియో డిస్ప్లే పై ప్లే అవుతూ, సిగ్నల్ క్యాచ్ చేస్తూ ఈ ఫోన్ పని బాగా ఎక్కువగా ఉంటుంది.


డ్యూయల్ సిమ్ ఫోను అంటే రెండు నెట్ వర్కుల సిమ్ కార్డ్స్ ఒక ఫోనులోనే ఉంటే, ఆ ఫోన్ రెండు నెట్వర్క్ సిగ్నల్ క్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రెండు నెట్ వర్కుల పదే పదే వచ్చే కాల్స్, మెసేజెస్, అప్పుడు ఫోన్ సిగ్నల్ క్యాచ్ చేయడానికి, సిగ్నల్ సరిగా లేకపోతె, ఫోన్ పని పెరిగే అవకాశం ఉంటుంది. అయితే సిగ్నల్ ఫుల్ గా ఉంటే ఫోను పనితీరు మెరుగే, పడే తక్కువ సిగ్నల్లో ఎక్కువసేపు ఫోన్ వర్క్ చేయడం, అందులో మల్టీ టాస్కింగ్ చేయడం కొంచెం పని తీరులో తేడా రావచ్చు.

ఫోను లైఫ్ తగ్గే అవకాశాలు ఎక్కువసేపు సిగ్నల్ లేని చోట సిగ్నల్ క్యాచ్ చేయాల్సి రావడమే అని అంటారు. సింగల్ క్యాచ్ చేయడం వలన ఫోన్ లైఫ్ తగ్గితే, మరి అదే పనిగా లైవ్ వీడియోలు చూడాల్సి వచ్చినప్పుడు లేకపోతె అదే పనిగా సోషల్ మీడియా అప్స్ చూస్తున్నప్పుడు, లేక బ్రౌజింగ్ చేస్తున్నప్పుడో, సెర్చింగ్ చేయడం వలనో మన స్మార్ట్ ఫోను ఇబ్బంది చుడండి.  ఖరీదు కలిగిన ఫోన్ పైకి అందంగా ఉండి,  లైఫ్ తొందరగా తగ్గిపోతే మరల కొత్త ఫోను కొనాల్సి వస్తుంది. ఫోన్ కొత్తగా ఉంది పనితీరు తగ్గితే, ఫోన్ తీసివేసి కొత్తది కొనాలంటే బలమైన బాధే. హాట్ స్పాట్ వలన ఫోనుకి సిగ్నల్ క్యాచ్ చేసే పని తగ్గుతుంది. కేవలం హాట్ స్పాట్ దగ్గరే ఉంటుంది కాబట్టి, వైఫై సిగ్నల్ బాగా ఉంటుంది, వైఫై ద్వారా ఇంటర్నెట్ వాడుక ఫోన్ త్వరగా కూడా హీట్  అవకాశాలు కూడా తక్కువ. అయితే మరి అదే ప్లేసులో వైఫై హాట్ స్పాట్ కూడా సిగ్నల్ కోసం పాట్లు పడాలి కదా అంటే, వైఫై హాట్ స్పాట్ ఖరీదు వెయ్యి రూపాయిలు ఉంటే, స్మార్ట్ ఫోన్ ధర పదివేల పైన కదా. ఖరీదు ఎక్కువ ఉన్న వస్తువు జాగ్రత్తగా వాడితే, ఖరీదు తక్కువ వస్తువు పాడైన వెంటనే కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ వెంటనే కొనుగోలు చేయకపోయినా కొంతకాలం ఫోను నెట్ వాడి మరల వైఫై హాట్ స్పాట్ ఇంకోటి కొనవచ్చు. సాదారణంగా స్మార్ట్ ఫోన్ ధర ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తే వైఫై హాట్ స్పాట్ కొనుగోలు చేయడం మంచిది. అయితే ప్రయాణంలో ఉన్నప్పుడు మన స్మార్ట్ ఫోన్లో నెట్ వాడుకోవచ్చు.

ఇలా ఫోనుకి కానీ ట్యాబుకి కానీ లాప్ టాపుకి కానీ డెస్క్ టాపుకి కానీ WiFi HotSpot Device ఇంటర్నెట్ అందించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. మనకి రిలయన్స్ వారి JoiFi, ఎయిర్టెల్ 4జి, ఐడియా 3జి వైఫై డొంగిల్ మొదలైనవి వేయి రూపాయల నుండి రెండువేల ఐదు వందల రూపాయల మధ్య ఆన్ లైన్ అఫ్ లైన్ మార్కెట్ నందు లభిస్తుంటాయి.

మరిన్ని ఇతర మొబైల్ అప్స్ గురించి తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

vega2020 – View Enlisted Gadget Apps

10 thoughts on “Sometimes Dual Sim Smartphones Not Working Properly As Dual Sim, But Same time It Is Working As Single Sim Well.

  1. Pingback: SMARTPHONE IN TELUGU

  2. Pingback: Fingerprint Sensor Mobiles

  3. Pingback: New Smartphone

  4. Pingback: Online Shopping Mobile Shopping

  5. Pingback: Top Free Android Mobile Apps - I

  6. Pingback: New Smart Mobile Phones

  7. Pingback: Earning Chances From Mobile Applications

  8. Pingback: Better Mobile Selection - 91Mobile Application

  9. Pingback: Best Camera Mobilesవేగ2020

  10. Pingback: Smartphone Mobile Appsవేగ2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *