Compass Navigation Route Direction Android Mobile Applications

Compass Navigation Route Direction Android Mobile Applications

Compass, Navigation, Route Direction Android Mobile Applications very useful in traveling. కొత్తగా బయటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, అక్కడ దిక్కులు కొనుక్కోవడం అంటే కష్టమే. కొంతమందిని అడిగితే దిక్కు కూడా తెలియదా అన్నట్లు భావనే వెల్లడి చేసే అవకాశం కూడా ఉంటుంది. దిక్కులు తెలియాలంటే సూర్యోదయం అయ్యే వైపు తెలిస్తే, మిగిలిన దిక్కులు తెలుసుకోవచ్చు, కానీ మధ్యాహ్న సమయం అయితే మరి ఎలా సూర్యుడు నడినెత్తిన వుంటాడు, ఎటు ఉదయిస్తాడు అని అప్పటికి తెలుసుకోలేం ! ఎవరినైనా అడిగే తెలుసుకోవాలి.

శివాలయం శివలింగం పానపట్టం ఎటువుంటే అటు ఉత్తరదిక్కుగా పరిగణించి, మిగిలిన దిక్కులు సరి చూసుకోమని చెబుతారు. ఎందుకంటే శాస్త్రీయపద్దతిలో శివాలయం పానపట్టం ఉత్తరదిక్కుగానే ఉండాలని చెబుతారు. అయితే మనం ఉన్న చోట శివాలయం ఉండవచ్చు, లేక శివాలయం దూరంలో ఉంటే, ఆ శివాలయానికి ఏదిక్కుగా వెళ్ళాలని ఎవరినైనా అడగాలి. జనంలేని చోట మనం వెళ్ళవలసి వస్తే, ఇంకా దేవుడే దిక్కు. దిక్కుతోచని దిగ్బ్రాంతి కలుగుతుంది. ఇటువంటి సమయంలో రూటును సూచించే పరికరం మనదగ్గర ఉంటే, ఇంక దిగ్బ్రాంతి పోతుంది.

స్మార్ట్ ఫోను జిపిఎస్ సిస్టంతో ప్రయాణమార్గాలను సూచించే నావిగేషన్ సదుపాయం కలిగి ఉండడం వలన కొత్త ప్రదేశాలలో కూడా పరిచయ ప్రదేశం సందర్శించినట్టే తిరగవచ్చు. ప్రయాణాలలో GPS రూటింగ్, లొకేషన్ గుర్తించడంలో మాప్స్ సహాయం చాల ఉపయోగకరం. కంపాస్ వలన దిక్కులు తెలియబతాయి. అష్టదిక్కులను కంపాస్ తెలుపుతుంది, స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉంటే. ఇంకా ఇంట్లో కూడా వాస్తు ప్రకారం ఇంటిని సర్దుబాటు చేయాలంటే, కంపాస్ మొబైల్ అప్ ఉపయోగపడుతుంది.

ప్రయాణంలో మార్గాలను సూచించడంతో బాటు వాయిస్ అసిస్టెన్స్ సదుపాయం కూడా గూగుల్ మాప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లో మనకి లభిస్తుంది. ఇంకా వెళుతున్న మార్గంలో అవసరమయ్యే అవకాశం ఉన్న పెట్రోల్ బంకులు, వెహికల్ రిపేర్ షాపులు, సర్వీస్ సెంటర్స్, రేటింగ్ ఆధారంగా హోటల్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ ను కూడా గుర్తించే విధంగా ఉంటుంది. ప్రయాణంలో స్మార్ట్ ఫోను వలన చాలానే ఉపయోగాలు ఉంటాయి, కానీ మాప్స్ బాగా ఉపయోగకరం అని చెప్పవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను ఆధారంగా పనిచేసే కంపాస్ (దిక్శూచి), మాప్స్, నావిగేషన్ మొదలైన మొబైల్ అప్స్ క్రింది ఇవ్వబడినవి. క్రింది ఫోటోలపై క్లిక్ చేయడం ద్వారా ఆ అప్ కి సంభందించిన ఇన్స్టాల్ పేజి ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది. సాదారణంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ నందు గూగుల్ మాప్స్ డిఫాల్ట్ ఇన్స్టాల్ మొబైల్ అప్.

Route Navigation GPS Mobile Aps In Travelling Time For Smartphones

మాప్స్-నావిగేషన్ & ట్రాన్సిట్

Route Navigation GPS Mobile Aps In Travelling Time For Smartphones

లైవ్ మ్యాప్స్ గైడ్ లైవ్ ఇంకు

Route Navigation GPS Mobile Aps In Travelling Time For Smartphones

ఆండ్రాయిడ్ ఆటో మాప్స్, మీడియా

Route Navigation GPS Mobile Aps In Travelling Time For Smartphones

మాప్స్, జిపిఎస్, నావిగేషన్, దిక్కులు

Route Navigation GPS Mobile Aps In Travelling Time For Smartphones

కంపాస్ 360ప్రో (దిక్శూచి)

Route Navigation GPS Mobile Aps In Travelling Time For Smartphones

తెలుగు కంపాస్ 3 (దిక్కులు)

మరిన్ని ఇతర మొబైల్ అప్స్ విషయాలు ! తరువాయి పోస్టులలో
ధన్యవాదాలు
వేగ2020 – ViewEnlistedGadgetApps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *