ప్రయాణ సూచనల ఆండ్రాయిడ్ యాప్స్

ప్రయాణ సూచనల ఆండ్రాయిడ్ యాప్స్

ప్రయాణం అంటే ఇష్టపడని వారెవరుంటారు? అందరికీ ప్రయాణం అన్నా ప్రయాణంలో కనిపించే ప్రకృతి అందాలను ఆస్వాదించడం అన్నా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం, తిరుపతి నుండి విశాఖపట్నం, అమరావతి నుండి విశాఖపట్నం, ఇలా ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేసినా దారిలో అనేక పట్టణ, పల్లె ప్రదేశాలు మనసుని ఆకర్షిస్తూ ఉంటాయి.

రైలు ద్వారా అయితే పల్లె వాతావరణం, పల్లెల్లో పొలాలు, కొండ ప్రాంతాలు, లోయ ప్రదేశాలు ఎక్కువగా ఆకర్షణీయంగా కనబడతాయి. బస్సు అయినా, ట్రైన్ అయినా, కారు అయినా తెలిసిన లేక తెలియని దూర ప్రాంతాలను సందర్శించడంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. తెలియని ప్రాంతాలను సందర్శించవలసి వస్తే, చేరబోయే ప్రదేశంలో నివసించేవారు ఎవరైనా తెలిసినవారి ద్వారా తెలుసుకుని వారి ద్వారా ఆయా ప్రదేశాలను చూడగలం.

ఇక ఇప్పుడు సాంకేతిక పరిజ్ఙానం పెరిగి, సోషల్ మీడియా వలన ఇంటర్నెట్ ద్వారా అనేక ప్రాంతాలను గురించి వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆయా ప్రాంతాలకు ఉన్న రవాణా సౌకర్యాలు, ఆహార పదార్ధాల వివరాలు, నివాస ప్రాంతాల గురించి ఆన్ లైన్ ద్వారా తెలుస్తుంది. స్మార్ట్ ఫోను వినియోగం పెరిగాక తెలియని విషయాలు తెలిసిన వారితో మొబైల్ యాప్ ద్వారా చేరడం ఇప్పుడు సాదారణమైంది.

వివిధ రకాల విషయాలలో టిప్స్ అందించే మొబైల్ యాప్స్ లాగానే ఇప్పుడు ప్రయాణ విషయాలలో కూడా సూచనలు, సలహాలు అందించే ఆండ్రాయిడ్ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తున్నాయి.

Google Trips – Travel Planner – గూగుల్ అందిస్తున్న మొబైల్ యాప్స్ లలో ఇదొక ట్రావెల్ ప్లానర్ మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్ ద్వారా మీ జిమెయిల్ ద్వారా ట్రిప్స్ ప్లాన్ చేసుకుని టికెట్ బుకింగ్, హోటల్ రూం బుకింగ్ వంటివి చేయవచ్చును.

Travel Tips: ప్రయాణ అవసరాలను ప్రయాణాలలో పాటించవలసిన సూచనలను ప్రయాణ మార్గమును అనుసరించి సూచనలను తెలియజేసే మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తుంది.

Travelrao – ప్రయాణం చేయడం సరదా అయితే, ఆ సరదాలో మరుపు మరియు కొత్త ప్రదేశాలకు అయితే కంగారు కూడా జత అవుతుంది. ఇలా బస్పు, రైలు ప్రయాణాలలో కొన్ని వస్తువులను మరిచిపోడం లేక కొన్ని విషయాలలో జాగ్రత్తలు మరుస్తూ ఉంటాం. ప్రయాణంలో మన చేరబోయే ప్రదేశం గురించి ముందుగానే తెలుసుకుంటే, అంత తొందర ఉండదు. మనం చేయబోయే ప్రయాణ మార్గం ముందుగానే నిర్ణయించి బుక్ చేసుకోవడం వలన కూడా కొంత ఉపయోగం ఉంటుంది. అయితే ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణ ప్రాంగానాన్ని ముందుగా చేరుకునే సమయం చూసుకోవాలి. ఇలా ట్రావెల్ కి సంభందించిన ఆర్టికల్స్ చదవడానికి లేక మీ ట్రావెలింగ్ అనుభవం – టిప్స్ అందించడానికి ట్రావెల్ రావు ఆండ్రాయిడ్ యాప్ ద్వారా చేయవచ్చు.

vega2020

ప్రయాణ సూచనల ఆండ్రాయిడ్ యాప్స్
Scroll to top