• vegawebviews@gmail.com
  • 08-00 to 20-00

Mobile Banking Money Transfer Payment Wallet Apps

Mobile Banking Money Transfer Payment Wallet Apps

Mobile banking money transfer payment wallet apps for Android smartphones. ఇంతకుముందు ఎవరికైనా డబ్బు పంపించాలంటే బాగా పాత పద్దతి తంతి తపాలా కార్యాలయం నుండి, ఎవరికీ డబ్బు పంపాలో వారు పేరు చిరునామా వ్రాసి MO చేసేవారు, కొన్ని రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి డబ్బు చేరేది. ఇక ఇప్పటివరకు పంపవలసిన వ్యక్తి పేరు లేక సంస్థ పేరుపై బ్యాంకులలో DD ద్వారా ఇంకా NEFT / RTGS ద్వారా డబ్బు పంపకాలు జరుగుతున్నాయి.

ఆన్ లైన్ వచ్చాక మాత్రం చాలామంది బ్యాంకుల కల్పించే నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉపయోగించి, ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్లో కూడా డబ్బు పంపకాలు జరుగుతున్నాయి.అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ వలన సదరు సంస్థ ఆఫీసు వ్యక్తి కానీ, లేక వ్యక్తిగత ఎకౌంటు ఉన్నవారు కానీ బాంకుకి వెళ్ళవలసిన పని తగ్గించిందని చెప్పవచ్చు. ఇంకా ఇంటి దగ్గరే లేక ఆఫీసు నుండే NEFT/RTGS లేక IMPS పద్దతిల్లో డబ్బు నిమిషాలలో పంపకం చేయవచ్చు. చాల సంస్థలకు, వ్యక్తులకు ఇది కాలహరణం కాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ సాయపడుతుంది అని చెప్పవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ తోబాటు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలు మొబైల్ అప్స్ అన్ని బ్యాంకుల వారు వారి వినియోగదారులకు అందిస్తున్నారు.



మొబైల్ బ్యాంకింగ్ వలన ఉన్నచోట నుండే మన ఎకౌంటులో ఉన్న సొమ్ము వేరేవారికి పంపకం చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఇంటివద్ద నుండో లేక ఆఫీసు నుండో డబ్బు పంపిణి చేయాలి, కానీ మొబైల్ బ్యాంకింగ్ వలన వినియోగదారునికి చాలవరకు టైం సేవింగ్ అవుతుందని చెప్పవచ్చు. అన్ని బ్యాంకుల వెబ్ సైట్లు, వినియోగదారు మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించడానికి స్మార్ట్ ఫోన్ మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ ఫోనుకి అయితే గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

ఇంకా పేమెంట్ వాల్లెట్, ఇది బ్యాంకు అప్ టైపులో పనిచేస్తుంది. బ్యాంకు ఎకౌంటులో డబ్బు జమచేసినట్లే, వీటిలో కూడా కొంత డబ్బు జమ చేస్తే, తిరిగ ఆ డబ్బుని మీరు మీ ఆన్ లైన్ ఖరిదులలో వాడుకోవచ్చు.అయితే ఈ మొబైల్ అప్స్, వ్యాపార లేక సేవ సంస్థలచే రూపొందించబడి ఉంటాయి. వీటితో కూడా బాగా ఉపయోగమే, చిన్న చిన్న పేమెంట్స్ వీటిద్వారా తొందరగా పే చేయవచ్చు. ఉదా: ప్రీపెయిడ్ రీఛార్జి, పోస్ట్ పైడ్ రీఛార్జి, DTH రీఛార్జి, మొబైల్ షాపింగ్ in అప్స్, అలాగే మీ స్నేహితులకు కూడా అదే పేమెంట్ వాల్లెట్లో ఎకౌంటు ఉంటే వారికి డబ్బు మీ పేమెంట్ వాల్లెట్ నుండి పంపకం చేయవచ్చు.

Payment Making With Mobile Banking Money Transfer Payment Wallet Apps

స్మార్ట్ ఫోనుని స్మార్ట్ బ్యాంకింగుగా మార్చేయవచ్చు. ఖాతా నిర్వహణ ఎక్కడ నుండి అయిన బ్యాంకు వర్కింగ్ రోజులలో నిర్వహించుకోవచ్చు. ఒకవేళ బ్యాంకు పని చేయని రోజులలో డబ్బు పంపకం చేయాలంటే, రోజువారీ పరిమితమైన కొంత డబ్బు పంపకం చేయవచ్చు. ఆ పద్దతే, IMPS లేక quick transfer సదుపాయం. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, కెనార బ్యాంకు, బ్యాంకు అఫ్ ఇండియా,icici బ్యాంకు HDFC బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు మొదలైన బ్యాంక్స్, మొబైల్ బ్యాంకింగ్ మరియు పరిమత డబ్బు ఎప్పుడైనా పంపడానికి IMPS సదుపాయాన్ని అందిస్తున్నాయి.

అయితే మొబైల్ బ్యాంకింగ్ నిర్వహించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది,.ముందుగా మన స్మార్ట్ ఫోన్ ఎక్కువసార్లు హాంగ్ అవుతుందా లేదా ఫోన్ వర్కింగ్ కండిషన్ బాగుందా లేదా అని చెక్ చేసుకోవాలి.

అలా కాకుండా హాంగ్ అవుతుంటే రామ్ క్లీన్ చేసుకుని, మొబైల్ బ్యాంకింగ్ వాడుకోవడం మంచిది. ఎందుకంటే డబ్బు పంపిస్తున్న సమయంలో ఫోన్ హాంగ్ అయితే ఒకోసారి డబ్బు మన ఖాతా నుండి వెళ్ళిపోయి అవతల వ్యక్తి ఖాతాలో కూడా జమ కాకపోవచ్చు.

అలాగే మొబైల్ డేటా బాలన్స్ మరియు డేటా స్పీడ్, ఎందుకంటే ఇంటర్నెట్ స్పీడ్ లేకపోయినా ఒక్కోసారి డబ్బు పంపిణి వ్యవహారం జరగకపోవచ్చు. ఫోను పెర్ఫార్మన్స్ బాగుంటే, మధ్యలో హాంగ్ కాకుండా ఉంటుంది.

ఇంకా మొబైల్ బ్యాంకింగ్ వ్యవహారం చేస్తున్నప్పుడు, మొబైల్ ఫోన్లో మనం ఎప్పుడు ఉపయోగించే బ్యాక్ బటన్ టచ్ చేయకూడదు. అలా మొబైల్ బ్యాంకింగ్ మద్యలో ఉండగా, బ్యాక్ బటన్ నొక్కితే, అది error చూపుతుంది.

మొబైల్ బ్యాంకింగ్ చేసే ముందు, ఆ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలు ఏమి కల్పిస్తుంది, వాటిని ఎలా ఉపయోగించాలి మొదలగు విషయాలు తెలుసుకోవడం వలన మొబైల్ బ్యాంకింగ్ వ్యవహారం సులభంగా జరుగుతుంది.యూజర్ ఐడి. పాస్వర్డ్ చాల సేఫ్ గా ఉంచుకోవాలి.

మరిన్ని పోస్టుల ఇతర మొబైల్ అప్స్ వివరాలతో తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

Vega2020 – View Enlisted Gadget Apps

Tags: , , , ,

2 thoughts on “Mobile Banking Money Transfer Payment Wallet Apps”

Comments are closed.