• vegawebviews@gmail.com
  • 08-00 to 20-00

Spoken / Learning Language Smartphone Mobile Applications

Spoken / Learning Language Smartphone Mobile Applications

Spoken / Learning Language Smartphone Mobile Applications స్మార్ట్ ఫోను వలన చాలానే ఉపయోగాలు ఉన్నాయి, కానీ నేర్చుకునే విషయంలో మాత్రం స్మార్ట్ ఫోను స్మార్ట్ గా ఉపయోగపడుతుంది. బిగ్ సైజు స్క్రీనుతో పాటు హై రామ్, మంచి బాటరీ సామర్ధ్యం కలిగిన స్మార్ట్ ఫోను ఉంటే, యు ట్యూబ్ టీచింగ్ / లెర్నింగ్ వీడియోలు ఆఫ్ లైన్ మోడ్లో డౌన్లోడ్ చేసుకొని, ప్రాక్టీసు చేయవచ్చు. స్మార్ట్ ఫోను బ్రౌజరు (క్రోమ్) ఉపయోగించి అనేక ట్యుటోరియల్ బ్లాగ్స్ నుండి అవసరమైన సమాచారం లేక ఏదైనా సబ్జెక్టుకు సంభందించిన సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో క్రోమ్ మొబైల్ అప్ ఉపయోగించి, గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఏదైనా నిర్దిష్టమైన కోర్స్ బేసిక్ టచ్ ఉంటే ఇంకా అడ్వాన్సుగా నేర్చుకోవచ్చు.

ఉదా: మీకు వెబ్ డిజైన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజులు అయిన html మరియు css లలో ప్రాధమికంగా వచ్చి ఉంటే, మాత్రం మీరు బ్లాగులు, యు ట్యూబ్ వీడియో ద్వారా ఇంకా అడ్వాన్సు డిజైన్ కోర్సులు సాధన చేయవచ్చు. అలాగే కొన్ని కంప్యూటర్ లాంగ్వేజులు కానీ అప్లికేషన్స్ కానీ ప్రాధమిక స్థాయిలో తెలిస్తే, ఆన్ లైన్ బ్లాగులు మరియు యూట్యూబ్ వీడియోల ద్వారా సాధన చేయవచ్చు. సాధనతో సమకూరు పనులు జగములోన అని అన్నట్లు, మనకి స్మార్ట్ ఫోను ద్వారా కూడా యూట్యూబ్ వీడియోలు చూసి ఏదైనా కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.



ఇంకా విద్యార్ధులకు తరగతులు, ఇంటర్ మరియు డిగ్రీ ఇయర్స్ వారిగా వివిధ సబ్జెక్టులలో ట్యుటోరియల్, లెర్నింగ్ టిప్స్, బుక్స్ అందించే మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ ఫోన్ల నిమిత్తం గూగుల్ ప్లే స్టోర్లో అనేకం లభిస్తాయి. ఆ మొబైల్ అప్స్ నందు వీడియో ట్యుటోరియల్ లేక వచనంలో పేజిలు లేక ఆడియో ఫైల్స్ గా ఉండవచ్చు. ఇలా విద్యార్ధులకు పరిక్షలకు ప్రిపేర్ పేపర్స్ అందించే మొబైల్ అప్స్ కూడా లభిస్తాయి.

ఇంకా స్మార్ట్ ఫోన్లోనే లాంగ్వేజ్ లెర్నింగ్ అప్స్ అంటే ఇతర భాషలు మాట్లాడే విధానం లేక వ్రాసే విధానం  నేర్పించే మొబైల్ అప్స్ ఉదా; ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటే, ఇంగ్లీషు డిక్షనరీ, ఇంగ్లీష్ స్పీకింగ్, ఇంగ్లీష్ లెర్నింగ్ అప్స్, ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియో అప్స్, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించే అప్స్, లాంగ్వేజ్ ట్రాన్సులేషన్ అంటే బాషను ఇతర బాషలో తర్జుమా చేసే మొబైల్ అప్స్, ఇలా ఆయా బాషకు సంభందించిన మొబైల్ అప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లకైతే గూగుల్ ప్లే స్టోర్లో మొబైల్ అప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

క్రింది కొన్ని రకాల లాంగ్వేజ్ లెర్నింగ్ or స్పీకింగ్  మొబైల్ అప్స్ లింకులు గమనించగలరు.

ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ (English Telugu Dictionary) – తెలుగులో

స్పోకెన్ ఇంగ్లీషు ఇన్ తెలుగు (Spoken English in Telugu) – తెలుగులో

ఇంగ్లీషు డిక్షనరీ (English Dictionary – Offline) – ఇంగ్లీషులో

స్పోకెన్ ఇంగ్లీషు టూ తెలుగు (Spoken English to Telugu) – తెలుగు

ఇంగ్లీషు గ్రామర్ టెస్ట్ (English Grammar Test) – ఇంగ్లీషులో

ఇంగ్లీషు గ్రామర్ టెస్ట్ (English Grammar Test) – ఇంగ్లీషులో

ఇంగ్లీషు స్పీకింగ్ టిప్స్ (English Speaking Tips) – హిందీలో

లెర్న్ ఇంగ్లీషు ఇన్ 60 డేస్ విత్ హిందీ (learn English in 60 days with Hindi) – హిందీలో

హిందీ ఇంగ్లీషు ట్రాన్సులేటర్ – ఇంగ్లీష్ డిక్షనరీ (Hindi English Translator – English డిక్షనరీ) – హిందీలో

ఏదైనా పోస్టులో టెక్స్ట్ మొత్తం ఒక కలర్లో ఉండి, అక్కడక్కడ టెక్స్ట్ వేరే కలర్లో ఉంటే మాత్రం, ఆ టెక్స్ట్ కు ఇంటర్నల్ పోస్టు లింకులు లేక ఇతర వెబ్ పేజి లింకులు ఉంటాయి అని అర్ధం. అలా ఇప్పుడు పై మొబైల్ అప్స్ లిస్టులో వేరే కలర్లో ఉన్న టెక్స్ట్ పైన టచ్ / క్లిక్ చేస్తే సంభందిత ప్లే స్టోర్లో ఆయా అప్స్ ఇన్స్టాల్ పేజి ఓపెన్ అవుతుంది. మీకు అవసరమైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

మరిన్ని ఇతర మొబైల్ అప్స్ గురించి తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

వేగ2020 – ViewEnlistedGadgetApps

 

Tags: , , ,

3 thoughts on “Spoken / Learning Language Smartphone Mobile Applications”

Comments are closed.