Used/Unused Items Reselling Smartphone Mobile Applications

Used Items Reselling Smartphone Mobile Applications

వస్తువుని కొన్నాళ్ళు వాడకా, తిరిగి అమ్మకం చేయడం, లేదా కొత్త వస్తువు కొనాలని పాత వస్తువ్లు అమ్మకాలు చేసేవారి కోసం మొబైల్ అప్లికేషన్స్ ఆండ్రాయిడ్ ఫోన్లకి అయితే గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.  Used Items Reselling smartphone mobile applications in Telugu. పోస్టు యొక్క టైటిల్ నందు Unused పొరపాటున చేరింది, లింకు బ్రోకెన్ కాకూడదని unused వర్డ్ అలాగే ఉంచడం జరిగింది గమనించగలరు.

వాహనాలు తప్పనిసరిగా తిరిగి అమ్మకాలు జరిగే విభాగం, ఎక్కువగా మోటార్ బైక్స్, కార్స్ కొత్తవి కొనటం కొంతకాలం తరువాత అమ్మేయడం. మోటార్ బైక్స్ రిసేల్ చేసే షోరూమ్స్ కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తాయి. మరికొంత మంది లేటెస్ట్ ఇయర్ కి సంభందించిన వాడిన బైక్స్ కొని కొంతకాలం వాడి మరల అమ్మేస్తారు. ప్రత్యక్షంగా అమ్మకాలు చేసేటప్పుడు అమ్మేవారు show room లేక మెకానిక్ ద్వారా అమ్మడం వల కచ్చితమైన ధర రాకపోవచ్చు. కానీ ఆన్ లైన్లో అయితే, అమ్మేసే బైక్ వివరాలు వెబ్ సైట్లో పెట్టి, contact వివరాలు ఇస్తే, డైరెక్ట్ కస్టమర్ కాల్ చేస్తే, బైకుకు కచ్చితమైన ధర వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు ఆన్ లైన్లో వెబ్ సైట్ లేక మొబైల్ అప్స్ ద్వారా సాగుతున్నాయి.



మొబైల్స్ మరియు టాబ్లెట్స్ కొంచెం తిరిగి అమ్మేవాటిలో ఇది కూడా చేరుతుంది. ఎందుకంటే వీటిలో ఎప్పటికప్పడు మొబైల్ os వెర్షన్ కొత్త కొత్త సదుపాయాలతో విడుదల అవ్వడం, అలాగే టెక్నాలజీ హార్డ్ వేర్ కొత్తగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు, వాడుతున్న మొబైల్ అమ్మేసి కొత్తవి కొనడం జరిగీ అవకాశాలు ఎక్కువ అని చెప్పవచ్చు.

ఏదైతే వాడిన వస్తువులు రిసేల్ చేసే ఆన్ లైన్ సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే మొబైల్ అప్స్ కూడా ప్లే స్టోర్లో లభిస్తాయి. ఇలా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మకాలు, కొనుగోలు ఎక్కువ జరిగే మొబైల్ అప్ Olx. అలాగే మరికొన్ని మొబైల్ అప్స్ మన ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. క్రింది లింకులపై క్లిక్ చేసి, ప్లే స్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

కార్ దేఖో అప్ (Car Dekho App – Buy New & Used Cars in India)

కార్ వాలే (CarWale- Search New, Used Cars)

బైక్, స్కూటర్ ఇండియా (Bike, Scooter India: Bike Dekho)

ఓ.ఎల్.ఎక్ష్ (OLX: Buy & Sell near you)

Quckr- Search Jobs, mobiles, Cars, Home Services

మరికొన్ని ఇతర మొబైల్ అప్స్ తరువాయి పోస్టులలో !

ధన్యవాదాలు

వేగ2020

4 thoughts on “Used/Unused Items Reselling Smartphone Mobile Applications

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *