Popular Smartphone Astrology Android Mobile Applications

Popular Smartphone Astrology Android Mobile Applications

Popular Smartphone Astrology Android Mobile Applications in Telugu: ప్రకృతిలో భాగమైన మనిషులు, ప్రకృతిని ప్రభావితం చేసే గ్రహాలచే కచ్చితంగా ప్రభావితం అవుతారని అనేకమంది శాస్త్రపండితులు చెబుతారు. అటువంటి గ్రహస్థితి, ఏవర్గపు రాశి పై ఒక వారంరోజులపాటు ఎలా ఉండబోతుంది అని చెప్పే జ్యోతిష్యుల సందేశం వారఫలం.

మనిషి తన భవిష్యత్తుని తెలుసుకునే శాస్త్ర పద్దతిలో కొన్ని చూస్తే, జ్యోతిష్యం, న్యుమరాలజి, హస్తసాముద్రికం, శరీరముపై గల పుట్టుమచ్చల ఆధారంగా అదృష్టాన్ని తెలియజేసే శాస్త్రం, తన నివాసస్థలం వాస్తు శాస్త్రం మోదిలైన వాటితో తన భవిష్యత్తుకోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సాధనలో వేగం తెలియని కాలంలో వేగిరపరుస్తూ, జీవిత లక్ష్యాన్ని సాధించే ప్రక్రియలో మనిషికి ఇవ్వన్ని ఉపయోగకరం అని చెబుతారు.

Varaphalalu Android Mobile Applications

వారఫలాలు చూసుకోవడం వలన ముఖ్యమైన పనులు ఆ వారంలో చేయవచ్చ లేక సాదారణ పనులతో వారాన్ని కొనసాగించాలా అనే నిర్ణాయక శక్తి వారఫల శ్రవణం వలన వస్తుందని అంటారు. ఇలా వారఫలాలు ఎక్కువగా టీవీ ఛానల్లలో మరియు వారపత్రికలలో వస్తుంటాయి. ఇక స్మార్ట్ ఫోన్ శకం వచ్చాక అన్ని మొబైల్ అప్స్ రూపంలో లభిస్తున్నట్టే, వారఫలాలు కూడా మొబైల్ అప్స్ గా గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల కోసం లభిస్తున్నాయి.

వీటిలో వారఫలాలు చెప్పే అప్స్ మరియు వ్యక్తిగత జాతకం తెలియజేసే మొబైల్ అప్స్, పెళ్లిళ్లకు వధువు వరుడుకి మ్యాచ్ పాయింట్స్ తెలియజేసే స్మార్ట్ మొబైల్ అప్స్, తెలుగు క్యాలెండర్, పండుగల జాబితా, పండుగల వివరాలు, పూజ విధానాలు, భక్తీ స్త్రోత్రాలు ఇలా అనేకమైన మొబైల్ అప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

Numerology Android Mobile Apps

అంతేకాకుండా న్యూమరాలజీ అంటే పేరుని నెంబర్లలోకి మార్చి, వచ్చిన అంకెలను కూడిక చేసి అందులో చివరగా ఒక అంకెను పేరుకి చేర్చీ, ఆ అంకె ఆధారంగా భవిష్యత్తు, ఆ అంకెకు సంభందించి గుణగణాలు తెలియజేసే పద్దతి. ఇటువంటి మొబైల్ అప్స్ మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల కోసం అయితే గూగుల్ ప్లే స్టోర్లో అనేకం. అంతేకాకుండా జ్యోతిష్యం, న్యూమరాలజీ వంటి శాస్త్రాల టిప్స్, ట్యుటోరియల్స్ సంభందించిన మొబైల్ అప్స్, పంచాంగం, తెలుగు క్యాలెండర్లు అప్స్ లభిస్తాయి.

హస్త సాముద్రికం చేతిలోని రేఖలు చూసి చూసి, అదృష్ట విషయాలు చెప్పే శాస్త్రం, ఇవి కూడా గూగుల్ ప్లే స్టోర్లో ‘hasta samudrika’ అని సెర్చ్ చేస్తే కొన్ని మొబైల్ అప్స్ లభిస్తాయి. సెర్చ్ చేసి ఆన్ లైన్లో సాధన చేసి జీవితంలో సాధించలేనిది లేదని అనవచ్చు.

మన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కోసం ప్లే స్టోర్లో లభించే మొబైల్ అప్స్ లింకులు క్రింది ఇవ్వబడ్డాయి.

తెలుగు జాతకం (Telugu Jatakam)

జాతక ఫలితాలు (Telugu Horoscope: Rashi Phalalu)

తెలుగు జాతకం 2018 (Telugu Jatakam 2018)

అస్ట్రోసేజ్ కుండలి ఆస్ట్రాలజీ (AstroSage Kundali Astrology)

ఆస్ట్రాలజీ అండ్ హోరోస్కోప్ (Astrology & Horoscope)

కుండలి సాఫ్ట్ వేర్ – ఆస్ట్రాలజీ (Kundli Software – Astrology)

తెలుగు క్యాలెండరు (Telugu Calendar)

న్యూమరాలజీ ఇన్ తెలుగు (Numerology in telugu)

న్యూమరాలజీ (Numerology)

పామ్ రీడింగ్ పెర్సనాలిటీ టెస్ట్ (Palm Reading Personality Test)

పుట్టుమచ్చలు – అదృష్టం (Mole Astrology in Telugu)

వాస్తుశాస్త్ర ఇన్ తెలుగు (Vastusastra in Telugu)

వాస్తుశాస్త్ర ఇన్ తెలుగు (Vastusastra in Telugu)

వాస్తుశాస్త్ర ఇన్ తెలుగు (Vastusastra in Telugu)

మరికొన్ని ఇతర మొబైల్ అప్స్ తరువాయి పోస్టులలో

ధన్యవాదాలు

వేగ2020– ViewEnlistedGadgetApps