Wednesday, October 17, 2018
Home > vegadget > Upcoming GadgetSmartphones Next Months August, September 2018.

Upcoming GadgetSmartphones Next Months August, September 2018.

Upcoming GadgetSmartphones Next Months August, September 2018.

Upcoming GadgetSmartphones Next Months August, September 2018.

Upcoming GadgetSmartphones Next Months August, September 2018. కొత్త వింతగానో విచిత్రంగానో ఆకర్షణను కలిగి ఉంటుంది. ఇక స్మార్ట్ vegadget గాడ్జెట్లు అయితే చెప్పక్కర్లేదు. సాంకేతికత సామాన్యంగా ఉండదు, చేతిలో అద్బుతాలు చూపించే చిన్నితెరగా ఇమిడిపోయింది. చేతబూనిన చిన్నితెరపై లోకంతీరు, వింతలు, విషయాలు విశేషాలు చూపిస్తూ నిత్యసన్నిహిత వస్తువుగా ఉంది. కొత్తగా రాబోయ్ స్మార్ట్ గాడ్జెట్లు చూస్తే ఆగష్టు నెలలో విడుదల అయ్యే అవకాశం ఉన్న కొన్ని కంపెనీ మోడల్స్ హానర్9x(Honor9X), లెనోవోZ5(Lenovo Z5), నోకియాX6(Nokia X6 2018), షియోమి MI8(Xiaomi MI8), షియోమిMI8SE(Xiaomi MI8 SE), వివో NEX S(Vivo NEX S), సామ్సంగ్ గాలక్సీ A9స్టార్ (Samsung Galaxy A9Star).

లెనోవో Z5 స్మార్ట్ ఫోను ఆగష్టు 22వ తేదిన విడుదల కావచ్చు అని వార్తలుగా ఉన్నాయి. ఇంతకుముందు లెనోవో K సిరీస్లో వచ్చిన స్మార్ట్ ఫోన్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. అధునాతన సదుపాయాలతో బడ్జెట్ ధరలలో మార్కెట్లో గట్టి పోటి ఇచ్చాయి. లెనోవో K6పవర్, K6నోట్, K8ప్లస్, K8నోట్ స్మార్ట్ ఫోన్లు ట్రెండి స్మార్ట్ ఫోన్లుగా ఉంటే, ఇప్పుడు లెనోవో Z సిరీస్ నుండి Z5 ట్రెండ్ ప్రకారం పెద్ద స్క్రీనుతో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో వస్తుంది. అక్ట కోర్ ప్రాసెసర్ వేగం1.8 GHz వేగంతో 6GB రామ్ 64GB ఫోను మెమరీ కలిగి ఉంటుంది. ఆధునిక ప్రదర్శనను చూపే ఈ స్మార్ట్ గాడ్జెట్ రెండు బ్యాక్ కెమెరాలు16+8మెగాపిక్సెల్,ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 3300 mAh బాటరీ సామర్ధ్యంతో బాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జి, వోల్టే, క్విక్ ఛార్జింగ్ తదితర స్మార్ట్ సదుపాయాలు కలవు. ఇంకా వివరాలకు ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.



హానర్9N జూలై 31న అమ్మకాలు జరగనుండగా, హానర్ 9 సిరీస్ నుండే హానర్9X స్మార్ట్ ఫోను ఆగస్టు నెలాఖరుకు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్పబడుతున్నది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్ తో వస్తున్న అక్టకోర్ ప్రాసెసర్ 2.36 వేగంతో ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ రేర్ కెమెరాలు, గుడ్ ఫ్రంట్ కెమెరా, ఓటిజి సపోర్ట్, 4జి, వోల్టే మొదలైన సదుపాయాలతో 4GB రామ్ 64GB ఫోను మెమరీ కలిగి ఉంటుంది. ఇంతకముందు వచ్చిన హానర్ 9 సిరీస్ స్మార్ట్ గాడ్జెట్లలో ట్రెండి స్మార్ట్ ఫోన్లుగా ఉన్నాయి. ఇంకా వివరాలకు ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Samsung, MI, Redmi 6Pro UpComing SmartGadgets

ధరకు తగిన సదుపాయాలు అందిస్తూ ఇతర కంపెనీ బ్రాండ్లను వెనుకకు నెట్టేసే షియోమి స్మార్ట్ ఫోన్లు బాగా ప్రసిద్ది. ఇప్పుడు MI సిరీస్ లో వస్తున్న స్మార్ట్ ఫోను ప్రీమియం ఫోనుగా ఉంది. స్మార్ట్ ఫోన్లలో పెద్ద స్క్రీనుతో రానున్న ఫోను వేగంగా పనిచేసే ప్రాసెసర్ కలిగి ఉంది. ప్రభావంతమైన ఫ్రంట్ కెమెరా, రెండు సమాన నాణ్యతలో బ్యాక్ కెమెరాలు కలిగి ఉంటుంది. పెర్ఫార్మన్స్ విషయంలో ఎక్కువగా ప్రసిద్ది చెందిన షియోమి స్మార్ట్ ఫోన్ల వర్గంలోకి ఈ స్మార్ట్ గాడ్జెట్ చేరుతుంది. నాణ్యతలో కొంత తేడాతో మరో మోడల్ కూడా ఈ మోడల్ తో బాటు విడుదల కానుంది. ఆగష్టు 30న విడుదల అవ్వవచ్చు అని చెప్పబడుతున్న స్మార్ట్ ఫోను స్మార్ట్ సదుపాయాలు కలిగి ఉంది. వివరాలకు ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

సామ్సంగ్ గాలక్సీ A సిరీస్ ప్రసిద్దమైన ఫోన్లు ప్రీమియం ఫోన్లుగా ప్రసిద్ది. 6.28 అంగుళాల పెద్ద టచ్ స్క్రీనుగా అక్టకోర్ ప్రాసెసర్ వేగం 2.2 GHz వేగం కలిగి ఉంటుంది. 24 మెగా పిక్సెల్ క్వాలిటీ ఫ్రంట్ కెమెరా, 24 మెగా పిక్సెల్ మరియు 16మెగా పిక్సెల్ నాణ్యత కలిగిన కెమెరాలు gadget బ్యాక్ సైడ్ ఉంటాయి. 4GB రామ్ కు తోడుగా 64GB ఫోను మెమరీ, 256జిబి మెమరీ కార్డు స్లాట్ కలిగి ఉంది. వేగవంతమైన ప్రాసెసర్ కలిగి ఉన్న ఈ స్మార్ట్ gadget ఫింగర్ ప్రింట్ సెన్సార్, వోల్టే, స్మూత్ గ్రాఫిక్స్, 4k వీడియో రికార్డింగ్, క్విక్ ఛార్జింగ్ మరియు స్మార్ట్ సదుపాయాలతో ఉంది. ఆగష్టు 29న విడుదల కావచ్చు ఇంకా వివరాలకు ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

రెడ్మి స్మార్ట్ ఫోన్లలో అధునాతన సదుపాయాలు తక్కువ ధరలలో లభించడం వలన ప్రసిద్ది చెందిన మోడల్స్ అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు రెడ్మి6 ప్రో మోడల్ గా వస్తున్న ఈ స్మార్ట్ gadget సెప్టెంబర్ మాసంలో విడుదల కావచ్చు. హై బాటరీ సామర్ధ్యం, 3GB+32GB రామ్ మరియు ఫోను మెమరీ లతో ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఓరియో ఒఎస్ తో వస్తుంది. వేగవంతమైన ప్రాసెసర్ వలన పెర్ఫార్మన్స్ బాగుంటుందని అంచనా అయితే అక్టకోర్ 2GHz వేగంతో ప్రాసెసర్ ఉంది. 5.84 అంగుళాల తాకేతెర, 12+5ఎంపి బ్యాక్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటే 4జి, వోల్టే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొదలైన స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. స్మూత్ పెర్ఫార్మన్స్, క్విక్ ఛార్జింగ్, హై స్పీడ్ ఇంటర్నెట్ తదితర అంశాలలో బాగుటుంది అని ఉంది. వివరాలకు ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Nokia X Seires Nokia5.1, Nokia 6.1 Upcoming Smart Gadgets

Upcoming GadgetSmartphones Next Months August, September 2018. అటు తరువాత వచ్చే నెల లేక ఆ పైనెలలలో విడుదల కాబోయే స్మార్ట్ గాడ్జెట్లు చూస్తే నోకియా5.1, నోకియాX6, షియోమి రెడ్మి 6 ప్రో ఉన్నట్టుగా ఉంది.

నోకియా 5.1 మోడల్ నోకియా X5 గా పిలిస్తే సెప్టెంబర్ మాసంలో లభించవచ్చు అనే విషయం ప్రాచుర్యంలో ఉంది. 5.86 అంగుళాల తాకే తెరగలిగిన ఈ స్మార్ట్ ఫోను డ్యూయల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరాలు 13MP + 5 MP, 8MP క్వాలిటీలో లభించనుంది. 3060 mAh సామర్ధ్యంతో బాటరీ ఉంటే, 2 GHz వేగం కలిగిన అక్టకోర్ ప్రాసెసర్ తో ఆండ్రాయిడ్ 8 ఓరియోతో వస్తుంది. ఇంకా స్మార్ట్ ఫీచర్స్ కలిగి 3జిబి+32జిబి రామ్ మరియు ఫోను మెమరీతో లభించనున్న స్మార్ట్ ఫోను ధర సుమారు. 11K రేంజిలో ఉండవచ్చు. ఇంకా వివరాలకు ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

అప్ కమింగ్ స్మార్ట్ గాడ్జెట్లలో ప్రసిద్దిగా ఉన్న నోకియాX మోడల్ నోకియా 6.1 గా స్మార్ట్ ఫీచర్స్ కలిగి సెప్టెంబర్ 20న నుండి అందుబాటులోకి రావచ్చు అని అంటున్నారు. 5.8 అంగుళాల తాకేతెరతో వేగం కలిగిన అక్టకోర్ ప్రాసెసర్, డబల్ బ్యాక్ కెమెరాలు, సింగల్ సెల్ఫి కెమెరాలతో ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్విక్ ఛార్జింగ్ మరియు మొదలైన స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. 4GB + 64GB రామ్ మరియు ఫోను మెమరీతో ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఓరియో ఓస్ తో లభించనుంది. వివరాలకు ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Upcoming GadgetSmartphones Next Months August, September 2018. పైన వివరించబడిన అప్ కమింగ్ స్మార్ట్ గాడ్జెట్ల వివరాలు 91మొబైల్స్ వెబ్ సైట్ ఆధారంగా వివరించబడినవి. వారి అంచనా వివరాలు ఆధారంగా ఉంటాయి, కావునా ఇంకా మీకు రాబోయే వివిధ మోడల్స్ పైన లేక ఉన్న లేటెస్ట్ ఫోన్లపైన రివ్యూలు, పోలికలు ఈ వెబ్ సైటులో చూడవచ్చు. అయితే పైన వివరించిన vegadget స్మార్ట్ ఫోన్లలో ఆగస్ట్ మరియు తరువాయి మాసలాలో విడుదల అవుతుంటే, ప్రస్తుతం ఈ నెలలోనే హానర్ కంపెనీ నుండి హానర్9ఎన్ విడుదల కానుంది. ఆ వివరాలకు వెబ్ సైట్ల రివ్యూల కోసం ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ధన్యవాదాలు
vegadget

bpr