Latest SmartPhone Android Mobile Games Download

Latest SmartPhone Android Mobile Games Download

ఎక్కువగా అందరిచేతిలో ఉండే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో మొబైల్ ఆప్స్ తో బాటు ఉండేవి మొబైల్ గేమ్స్ కూడా. ఎప్పుడైనా తీరిక సమయంలో స్మార్ట్ ఫోను గేమ్స్ ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. కేవలం గేమ్స్ మాత్రమే కాకుండా స్మార్ట్ ఫోన్ చాల విషయాలలో ఉపయుక్తంగా ఉంది. నేర్చుకునే విషయాల్లో, తెలుసుకునే విషయాల్లో, అయితే మొబైల్ గేమ్స్ కూడా మైండ్ రిఫ్రేస్స్ అవడానికి సాయపడతాయని అంటారు. కొన్ని లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మొబైల్ గేమ్స్ క్రిందగా తెలియజేయదమైనది For Latest SmartPhone Android Mobile Games Download.

Android Mobile Games To Download From PlayStore

Latest SmartPhone Android Mobile Games Download
మొబైల్ గేమ్ కొరకు పైచిత్రంపై టచ్/క్లిక్ చేయండి – vegames

హనుమంతుడు భక్తులకు బాలలకు కొండంత అండ, అటువంటి హనుమంతుడి చిత్రాన్ని విగ్రహాన్ని చూస్తేనే పిరికివారికి కూడా ధైర్యం వస్తుంది అని అంటారు. మరి ఇక హనుమంతుడుగా మనమే మన స్మార్ట్ గాడ్జెట్‌లో గేమ్ ఆడితే, ఇంకెంత బాగుంటుంది. మరి ఈ గేమ్ థీమ్ ఏమిటంటే ? మహామాయావి మహిరావణుడు రామలక్ష్మణులను మాయతో తన ద్వీపంలో దాస్తాడు. సముద్రంపై ఎగురుతూ వెళ్లి వందయోజనాల దూరంలో ఉన్న రావణ లంకనే తగలబెట్టిన హనుమంతుడు ఇక మరొకసారి రామలక్ష్మణుల కోసం అడవిలో శత్రువులని జయిస్తూ మాంత్రికుడితో పోరాడే హనుమను నడిపించే మొబైల్ గేమ్ ద్వారా మనం ఆడవచ్చు. ఈ గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొరకు లభిస్తుంది.

Latest SmartPhone Android Mobile Games Download
మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేయడానికి పై చిత్రంపై టచ్/క్లిక్ చేయండి.

కృష్ణభగవానుడు పరమాత్మ అన్ని అవతారాలలో ఎలా ఉన్నా కృష్ణావతారంలో బాలుడిగా చేసినా లీలలు అమృతమయమే అంటారు. అలాంటి పరమాత్మ బృందావనంలో చేసిన లీలలు ఎంతో ఆనందాన్నిస్తాయి. ఇక చిన్న పిల్లవాడిగా చేసిన అల్లరేఅల్లరి. అటువంటి అల్లరికృష్ణుడుపై రూపొందించిన మొబైల్ గేమ్ లిటిల్ కృష్ణ. బృందావనంలో చిన్ని కృష్ణుడు చేసిన చిలిపి దొంగపనులు, వెన్న దొంగలా చేసిన అల్లరి ఇలాంటి వాటి ఆధారంగా కృష్ణుడు సవాళ్ళను స్వీకరిస్తూ అల్లరిగా సాగే గేమ్‌లో ఆవేశంతో వచ్చే ఎద్దులు, కోపంతో ఉండే ఏనుగులు, వేడిగా ప్రవహించే లావా ప్రవాహం వీటిని కృష్ణుడుగా ఎదుర్కొని నివారించడం గేమ్ ప్రధాన థీమ్. ఎక్కువ స్కోర్ చేయడంలో పోటి, అలాగే ఎక్కువ నాణేలు సంపాదించడం గేమ్ ఆడడానికి ఉత్సాహంగా ఉంటుంది. లిటిల్ కృష్ణ ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ సందర్శించండి.

Latest SmartPhone Android Mobile Games Download
ఈ మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేయడానికి పై చిత్రంపై టచ్/క్లిక్ చేయండి.

భీముడు అంటే భారతంలో భీముడే బలానికి ప్రతీకగా ఉంటూ తనవారిని రక్షించడంలో బలపరాక్రమాలు ఉపయోగిస్తూ కుటుంబాని అండగా నిలిచినా భీమసేనుడు చిన్ననాటి నుండి మహాబలవంతుడు. మరిబలమైన భీముడు తనరాజ్యాన్ని తన భుజబలంతో రక్షించినట్టు ఈ మొబైల్ గేమ్‌లో కూడా రాజ్యాన్ని కాపాడడంలో గదతో యుద్ధం చేసే యోదుడుగా మీరు ఈ చోటభీం మొబైల్ గేమ్ ఆడవలసి ఉంటుంది. శత్రువుల నుండి కోటను రక్షిస్తూ ఉండడంలో 50 లెవెల్స్ దాటవలసి ఉంటుంది. ప్రతి లెవెల్లో యుద్ద సన్నివేశాలలో పోరాటం చేయడం, శక్తి సముపార్జించుకోవడం, ఎటాక్స్ ఎదుర్కోవడం, సైన్యాన్ని కూడగట్టుకుని యుద్దాలు చేయడం హీరో అడ్వెంచర్లు ఉంటాయి. రాజ్యాన్ని రక్షించే వీరుడుగా వ్యూహంతో పోరాటాలు చేయడం ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి దాదాపు 10 లక్షలకు పైగా డౌన్ లోడ్స్ కలవు.

Super Bheem Mobile Game Click On Image to Download From Play Store

Latest SmartPhone Android Mobile Games Download
ఈ మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేయడానికి పైచిత్రంపై టచ్/క్లిక్ చేయండి.

సూపర్ భీం: రాజుల కాలం చెల్లిన రాజుల చేసిన యుద్దాలు, కోటను కాపాడుకోవడంలో వారి తెలివితేటలు అద్బుతంగా అనిపిస్తుంది సినిమాలు చూస్తున్నప్పుడు. అలంటి ఒక కోటను రక్షించడానికి, ఒక బాలుడు కోటలో శత్రువులతో పోరాటం చేస్తూ ఉండే మొబైల్ గేమ్. ఆ బాలుడిగా అడాల్సింది మనమే. హుక్ లేదా క్రూక్ ఉపయోగిస్తూ రాజ్యాన్ని రక్షించుకోవడం బాలుడి సాహసం. అలా భీం బాలుడు తన శక్తులతో రాజ్యాన్ని రక్షించగలడు, సూపర్ శక్తులతో ప్రాణంతకమైన వారితో పోరాడడం, రాజ్యంపై దాడి చేయాలనుకునే శత్రువులను ఎదుర్కుంటుంది. ఏనిమేషన్లు, స్లో మోషన్ అట్టాక్స్, 3D వ్యూ ఆసక్తిగా ఉంటాయి. ఈ మొబైల్ గేమ్ కావాలంటే గూగుల్ ప్లే స్టోర్ దర్శించండి. Latest SmartPhone Android Mobile Games Download.

Latest SmartPhone Android Mobile Games Download
ఈ మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేయడానికి పైచిత్రంపై టచ్/క్లిక్ చేయండి.

బలమైన తెలివైన స్మార్ట్ పోలీసు ఆఫీసర్ ఒక యువకుడు, అతను మిర్చి నగర్ కు రక్షణ చేస్తూ ఉంటాడు. అతనే లిటిల్ సింఘం. ఇద్దరి సహాయంతో జైల్లో స్థంబాలు విరిగిపొతే తప్పించుకోవడానికి ప్రయత్నించే శంబాలను, పారిపోకుండా ఉండడానికి చేసే చేజ్. మిర్చి నగర్ నుండి పారిపోయే వారిని పట్టుకోవడంలో మీరు సింఘంలాగా గేమ్ ప్రారంభించడమే. మిర్చినగర్ సందులలో పరిగెడుతూ నాణేలు పొందుతూ, ఎదురుగా వస్తున్న కార్లు మొదలైన వాహనాల నుండి తప్పించుకుంటూ చేజ్లో పాల్గొనడం. టెంపుల్ రన్ గేమ్ మాదిరి ఈ మొబైల్ గేమ్‌లో కూడా కాయిన్స్ క్యాచ్ చేయడం ఉంటుంది. డైలీ ఛాలెంజ్ ఉంటుంది. ఇంకా పేస్ బుక్ ఫ్రెండ్స్ ద్వారా కూడా హై స్కోర్ చేయడంలో ఛాలెంజ్ చేస్తూ ఆడవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Android Editor Choice Mobile Games From PlayStore

Latest SmartPhone Android Mobile Games Download
ఈ మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేయడానికి పైచిత్రంపై టచ్/క్లిక్ చేయండి.

గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే మొబైల్ గేములలో ఎడిటర్ ఛాయస్ మొబైల్ గేమ్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు ప్రత్యేకం. గేమ్స్ ఉత్తమ పెర్ఫార్మన్స్ హైయెస్ట్ డౌన్ లోడ్స్ ఆధారంగా ఎడిటర్ ఛాయస్ మొబైల్ గేమ్స్ గా ఉంటాయి అని అంటారు. బాడ్మింటన్ లీగ్ ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్ ఒక టోర్నమెంట్ ఆడినట్లుగా ఫ్రెండ్స్ తో ఒకరితరువాత ఒకరితో ఆడి గెలుస్తూ టోర్నమెంట్లో విజయం సాధించడంగా ఉంటుంది. బహుళ పద్దతులలో గేమ్ ఉంటుంది, కారెక్టర్ సృష్టించుకోవడం, వంటి ఫీచర్స్ ఉపయోగించుకోవచ్చు. రియల్ గేమ్ ఆడుతున్న అనుభవం ఉంటుందట. ఈ గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఎడిటర్ ఛాయస్ మొబైల్ గేమ్ గా లభిస్తుంది. ప్రత్యక్షంగా స్నేహితులతో అడాడానికి ఒకే వైఫై ద్వారా కానీ మొబైల్ హాట్ స్పాట్ ద్వారా కానీ ఆడవచ్చు.

Latest SmartPhone Android Mobile Games Download
ఈ మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేయడానికి పైచిత్రంపై టచ్/క్లిక్ చేయండి.

బెస్ట్ గేములలో ఒక గేముగా ఉన్న CATS Crash Arena Turbo Stars అలగే ఎడిటర్ ఛాయస్ మొబైల్ గేముగా గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. 10 మిలియన్ల డౌన్ లోడ్స్ కలవు. సొంతంగా యుద్ద బాట్ తయారుచేసుకుని ఇతర ఆటగాళ్ళతో ఆడడంగా ప్రసిద్ది చెంది ఉన్నది. అల్టిమేట్ మెషిన్ తయారీ చేసి, వెపన్స్ కూడగట్టుకుని ఫైట్ చేయడమే. న్యూయార్క్ నగరంలో ఉన్న గ్యాంగులతో స్టైలిష్ ఫైట్ చేయడం, వెపన్స్ అన్ లాక్ చేయడం, ఇతర గ్యాంగులపై యుద్ధం చేయడం వంటివి ఉంటాయి. చివరగా ఛాంపియన్ అవ్వడం ప్రధాన లక్ష్యం. చాలామంది స్మార్ట్ యూజర్లని ఆకర్షించిన మొబైల్ గేములలో ఇది ఒకటి. అసలైన ఆటగాళ్ళతో ఆన్ లైన్ ద్వారా ఎవరితోనైనా ఆడవచ్చు. అత్యధిక రేటింగ్ పొందిన మొబైల్ గేమ్.

 

Nautical Life, Garden Escapes Android Mobile Games From PlayStore

Latest SmartPhone Android Mobile Games Download
చిత్రంపై టచ్/క్లిక్ చేయండి.

సముద్రంలో సాహసం అంటే సూపర్ గా ఉంటుంది. పడవలతో ప్రయాణం చేయడానికి సన్నాహాలు చేసుకోవడం, అభిరుచికి తగినట్టుగా పడవ తయారుచేసుకోవడం. సముద్రంలో ప్రయాణాన్ని సెట్ చేసుకోవడం, ఫిషింగ్ గేమ్ నీటిపైన టైకూన్ వ్యవహారంలా ఉంటుంది. పగలు మోడ్ రాత్రి మోడ్ ఉంటే, మనకి కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. పడవలు నిర్మించుకోవడం, అందుకు ఫర్నిచర్, ఫ్రెండ్స్ పడవలను రేట్ చేయడం మొదలైన ఫీచర్స్ తో ఉంటుంది. వన్ మిలియన్ పైగా గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్ లోడ్లు కలిగి ఉంది. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ మొబైల్ గేమ్ డౌన్ లోడ్ చేయడానికి అయితే ఎడమప్రక్కగా ఉన్న చిత్రంపై టచ్ / క్లిక్ చేయండి. Latest SmartPhone Android Mobile Games Download

Latest SmartPhone Android Mobile Games Download
పైచిత్రంపై టచ్/క్లిక్చేయండి.

ప్రకృతిలో పెంచుతున్న తోటలు చాల ఆహ్లాదకరంగా ఉంటాయి. తోటలలో ఆటలు బాగుంటాయి. తోటలో కి ప్రవేశించి తోటని కళాత్మకంగా చూడమనేది తోట. స్మార్ట్ ఫోన్లో తోటను మనకు నచ్చినట్టు డిజైన్ చేస్తూ అటలాగా ఆడితే బాగుటుంది. తోట ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్లకు గార్డెన్ ఎస్కేప్స్ పేరుతొ గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తుంది. గార్డెన్లో సాహాస ప్రయాణం చేయడంలో 3 లెవెల్స్ దాటి వెళ్ళాలి, క్యారెక్టర్లు మ్యాచ్ చేయడం, గార్డెన్ డెకరేట్ చేయడం, సాల్వ్ చేయడం లాంటివి ఉంటాయి. 3 లెవెల్స్ దాటి వెళ్ళడంలో అనేక మలుపులు ఉంటే, ఫన్ తెచ్చే కుక్క కూడా ఉంటుంది. ఈ మొబైల్ గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఎడిటర్ ఛాయస్ ఆండ్రాయిడ్ మొబైల్ గేముగా ఉంది. డౌన్ లోడ్ చేసుకోవడానికి ప్రక్కన ఉన్న చిత్రంపై టచ్/క్లిక్ చేయండి.

పైన వివరించబడిన మొబైల్ గేములలో యాడ్స్ డిస్ప్లే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొన్ని రకాల యాడ్స్ వలన స్మార్ట్ ఫోన్లకు ఆటంకం కలుగుతుంది అని అంటారు. మీరు పై చిత్రాలపై టచ్/క్లిక్ చేసినా సదరు మొబైల్ గేమ్ డౌన్ లోడ్ పేజి గూగుల్ ప్లే స్టోర్ నుండి ఓపెన్ అవుతుంది. ఆ పేజి సదరు మొబైల్ గేమ్ యొక్క నిభందనలు, కొనుగోళ్ళు గురించి వివరాలు ఉంటాయి. Latest SmartPhone Android Mobile Games Download గమనించి డౌన్ లోడ్ చేసుకోగలరు.

ధన్యవాదాలు
vegames – vega2020