మెలోడీ పాటలు, సెంటిమెంట్ సాంగ్స్, ప్రేమపాటలు, భక్తీపాటలు

మెలోడీ పాటలు, సెంటిమెంట్ సాంగ్స్, ప్రేమపాటలు, భక్తీపాటలు

మెలోడీ పాటలు, సెంటిమెంట్ సాంగ్స్, ప్రేమపాటలు, భక్తీపాటలు తెలుగు చలనచిత్రాలలో ప్రేమ సినిమా పాటలు, యుగళగీతాలు, మెలోడీ మూవీ సాంగ్స్, సెంటిమెంట్ సినిమా సాంగ్స్, మూవీ మ్యూజికల్ సాంగ్స్, భక్తీ పాటలు చాలా పాటలు ఉన్నాయి. చాలామంది స్మార్ట్ ఫోన్లో సంగీతంతో సంతోషంగా సాగుతూ వాహనాలపై ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒత్తిడిలో మునిగే మనసుకు హాస్యంతో బాటు మంచి సంగీతం కూడా సంతోష సమయాన్ని తెస్తుంది.

మనిషికి మెలోడీ మనసుని మాయచేస్తే, మాస్ సాంగ్స్ ఉత్సాహాన్ని తెస్తే, సెంటిమెంట్ సాంగ్స్ సన్నిహితులను గుర్తు చేస్తే, ప్రేమపాటలు పరవశం కలిగిస్తే, భక్తీ పాటలు ఇహం నుండి పరానికి మార్గం చూపుతుంది. మనసుకి మాయ చేయడము లేక పొందడము ఎదో ఒకటి చేస్తూ ఉంటే ఉన్న కష్టాన్ని మారుస్తూ మరలా ఉత్సాహంగా తయారుఅవుతుంది అంటారు.

అమ్మ జోలపాటలతో మనసు మత్తులోకి వెళ్లి నిద్రించడం నేర్చుతుంది. జానపద పాటలతో కానీ భక్తీ పాటలతో కానీ ఎంకి పాటలతో సినిమా పాటలతో కానీ బాల్యంలో అమ్మ పాడితే తినడానికి తయారు అవుతుంది. మనకి మనకు తెలియకుండానే పాటలకు స్పందించే అలవాటు అమ్మ దగ్గర నుండే అలవరుతుంది. చిన్ననాటి రోజుల్లో విన్న అమ్మపాటలు పెద్దయ్యాక కూడా గుర్తే ఉంటాయి.

పిల్లలు పాటలతో ఆటలు ఆడుకోవడం, పెళ్ళిళ్ళలో ఉండే పాటల సందడి, దేశభక్తిని చాటే పాటలు సీతారాముల పై పాటలు, శివునిపై పాటలు, గోవింద గీతాలు ఇలా పాటలు మనసుని తాకుతూనే ఉంటాయి. ఇంకా సినిమా పాటలకు అయితే అంతేముంది ప్రతి ఒక్కరి స్మార్ట్ మొబైల్లలో వారి వారి అభిమాన నటుల పాటలు, అభిమాన సంగీత దర్శకుల పాటలు ఉంటూనే ఉంటాయి.

సినిమాల్లో వచ్చే మెలోడీ పాటలు, సెంటిమెంట్ సాంగ్స్, ప్రేమపాటలు, భక్తీపాటలు మనసుని ఆహ్లాదపరుస్తాయి.

మహేష్ బాబు చిత్రాల్లో మురారి, నాని పాటలు ఇప్పటికి బాగుంటాయి. చిరంజీవి చిత్రాల్లో ఛాలెంజ్, స్వయం కృషి, రాక్షసుడు, రుద్రవీణ, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి చాలా చిత్రాల్లో పాటలు బాగుంటాయి. ఇలా హీరో హీరోకి వారి వారి చలనచిత్రాల్లో కొన్ని మ్యూజికల్ హిట్స్ ఉంటాయి. కొన్ని ప్రేమకదా చిత్రాల్లో అయితే పాటలే ప్రసిద్ది చెందుతాయి.

సిరివెన్నల చిత్రానికి పాటలు రాసిన సీతారామశాస్త్రికి సిరివెన్నల ఇంటిపేరుగా మారిపోయింది అంటే ఆ చిత్ర పాటలు ఎంత ప్రజాదరణను పొందాయో తెలుస్తుంది. సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం లాంటి సంగీత ప్రధాన చిత్రాల్లో పాటలు ఇప్పటికి గొప్ప పాటలుగానే ఉంటాయి.

బస్సులో రైలులో ప్రయాణంలో పాటలు వినడం బాగుంటుంది ప్రయాణం సంతోషంగా సాగుతుంది, కానీ వాహనాలు నడిపేవారు వినడం అనేది ప్రమాదహేతువు. కష్టం తరువాత సంతోషం సంతోషం తరువాత కష్టం ఇలా కాలక్రమేనా సాగే క్రమంలో మనసు ఎప్పుడూ సంతోషించాలని ఎప్పుడు ఆలోచనలతో ఉంటే ఉన్న సంతోషంలో కూడా కష్టమే వస్తుంది.

విశ్వనాధ్ గారి దర్శకత్వం వచ్చిన సిరిసిరిమువ్వ పాటలు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ క్రింది చిత్రాలపై టచ్/క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే naasongs అనే వెబ్ సైట్ ఓపెన్ అయ్యి మీరు క్లిక్ చేసిన చిత్రంలో సాంగ్స్ అక్కడ లిస్టు ఉంటుంది. అయితే డౌన్ లోడ్ చేసే సమయంలో యాడ్స్ ఉన్న విండో ఓపెన్ ఆవుతుంది, అది క్లోజ్ చేసే మరలా లింకుపై టచ్/క్లిక్ చేస్తే మీకు ఆ పాట డౌన్ లోడ్ అవుతుంది. అయితే సాంగ్స్ మొబైల్ మోడ్లో కన్నా డెస్క్ టాప్ మోడ్లో డౌన్ లోడ్ చేయడం తేలికగా ఉంటుంది. మొబైల్ అయితే ఎక్కువ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి.

పైచిత్రంపై టచ్ చేయండి

తెలుగు మూవీస్ పాతపాటలు

పైచిత్రంపై టచ్ చేయండి

తెలుగు మూవీస్ సాంగ్స్

పైచిత్రంపై టచ్ చేయండి

తెలుగు సాంగ్స్ ఆఫ్ లైన్లో

పైచిత్రంపై టచ్ చేయండి

తెలుగు మూవీస్ ఓల్డ్ హిట్ సాంగ్స్

పైచిత్రంపై టచ్ చేయండి

తెలుగు భక్తీ గీతాలు ఆఫ్ లైన్లో

పై చిత్రాలపై టచ్/క్లిక్ చేస్తే సదరు మొబైల్ ఆప్స్ డౌన్ లోడ్ గూగుల్ ప్లే స్టోర్ వెబ్ పేజి ఓపెన్ అవుతుంది. సదరు మొబైల్ ఆప్ అనుమతులు, నిభందనలు సరి చూసి డౌన్ లోడ్ చేసుకోగలరు.

ధన్యవాదాలు
vega2020