Stock Market Money Commodity Updates Tracking Mobile Apps

Stock Market Money Commodity Updates Tracking Mobile Apps

Stock Market Money Commodity Updates Tracking Mobile Apps మనీ ముఖ్యమైన విషయం అందరి జీవితంలో ప్రధానమైన పాత్ర పోషించే విషయం. వచ్చే మనీ పోయే మనీ పోను మిగిలినది విలువైనదిగా ఉండి, సదరు వ్యక్తీకి వ్యవస్థకి విలువను పెంచుతుంది. సమాజంలో శాసించే విషయాలలో మొదటిది, అలా శాసించే విషయాలను కూడా ప్రభావితం చేసేది మనీ. అటువంటి మనీ వివిధ దేశాలలో వివిధ రూపంలో మారకం చెందుతూ ఉంటుంది. మనకి రూపాయిగా మారకంగా ఉపయోగ పడుతుంది.

అంతర్జాతీయంగా రూపాయి విలువ మన ఆర్ధిక పరిస్థితి పటిష్టతను ప్రతిబింబిస్తుంది. అలాగా అంతర్జాతీయంగా రూపాయికి, డాలర్ కి, యూరోకి ఏ కరెన్సీకి అయినా విలువను చూపుతూ మార్కెట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ (Stock Market Index) సూచీలు, వీటివలన వస్తువు విలువ, రూపాయి విలువ, ఇతర దేశ కరెన్సీ విలువ, వస్తువుల విలువ, కంపెనీ బ్రాండ్ విలువ (Brand Value), ఉత్పత్తుల విలువ, సంస్థల వాటా (Share) విలువలను తెలియజేస్తూ ఉంటాయి. ఆర్ధికమైన విషయాలతోనే అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. చేసిన పనికి ఫలితంగా వచ్చేది ఆర్ధికపరమైన విషయం డబ్బుతోనే, కాబట్టి ఆర్ధిక వ్యవస్థ చాలా ముఖ్యమైనదిగా ఉంది.



మనీతో మనిషికి సమాజానికి సంస్థలకి ప్రభుత్వానికి సంభందం కలిగి ఉంటుంది. వ్యక్తి, వ్యక్తుల కష్టం కుటుంబానికి ఆదాయం పెంచి ఆర్ధికపరంగా ఉన్నత స్థితికి చేరుస్తుంది. అలాగే కొంతమంది కార్మికులు కొందరి పెట్టుబడి, కొందరి తెలివితేటలు, కొందరి మార్కెటింగ్ స్కిల్స్ ఇలా కొన్ని వ్యావహారిక విషయాలలో సమైక్యతతో సాధించే ఫలితాలు సదరు సంస్థ యొక్క విలువని, బ్రాండ్ విలువని ఆర్ధికంగా సూచించే స్థాయిలోకి అభివృద్ధిని సాధిస్తాయి.

అన్నింటిని ఆర్ధిక పరమైన మనీతో ఉన్న సంభందంతో అన్ని విషయాలు బ్రాండ్ విలువ కుడా ఆర్ధికంగా సూచింపబడుతుంది. ఒక వ్యక్తి టాలెంట్ కూడా ఆర్ధికపరమైన ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. మనీ అన్ని విషయాలను ప్రభావం చేసే శక్తిని సమాజంలో కలిగి ఉంటుంది. ఎక్కువ మనీ సంపాదించే ఉద్దేశం లేక ఎక్కువగా ఉన్న మనీ ఇంకా పెంచే ఉద్దేశం కావచ్చు కొంతమంది కంపెనీ బ్రాండు విలువ ఆధారంగా ఉన్న షేర్ వాటాలను స్టాక్ మార్కెట్లో కొనడం ఉంటుంది. మార్కెట్ విలువ పెరుగుతున్నప్పుడు ఆ షేర్ వాటాలతో లాభాలు ఆర్జించడం, మార్కెట్ విలువ తగ్గుతున్నప్ప్పుడు నష్టాలను చూడడం ఉంటుంది.

Stock Market Share Market Index Mobile Apps

స్టాక్(Stock) మార్కెట్లో చేరని ప్రసిద్ద కంపెనీ ఏది ఉండదు, అలాగే అన్ని కమోడిటీలు ఈ స్టాక్ మార్కెట్లో విలువను కలిగి ఉంటాయి. సామజిక ఆర్ధిక పరిణామాలను బట్టి స్టాక్ (Stock) సుచిలాలో కమోడిటీ, కరెన్సీ విలువలు మారుతూ ఉంటాయి. అలాగే బ్రాండు విలువలు కూడా మార్పుకు గురి అవుతూ ఉంటాయి. ఒక్కోసారి రాజకీయ పరిణామాలలో అధికారం పార్టీ మారినపప్పుడు ఈ ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ ప్రభావం ఉంటుంది. ఏదైనా ఆర్ధికపరమైన భారి నిర్ణయాలు ప్రభుత్వాలు నిర్ణయం చేస్తే, అటువంటి నిర్ణయాలు కూడా స్టాక్(Stock) సూచిలపై ప్రభావం చూపుతాయి.

ఎక్కువగా కొంతమంది ఫొరెక్ష్ మార్కెట్ కరెన్సీ ఆధారిత లావాదేవీలు ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది షేర్ వాటాలు దినసరిగా కొని అమ్మేస్తూ ఉంటారు. ఈ విధమైన విధానాలను కల్పించే అనేక ఆన్ లైన్ ఆఫ్ లైన్ సంస్థలు ఉంటాయి. ఫొరెక్ష్ మార్కెట్, స్టాక్ మార్కెట్ రెండు రూపాయి విలువ, డాలర్ విలువను బట్టి ఉంటాయి. అలాగే బంగారం, వెండి లాంటి కమోడిటీల విలువలలో కూడా తేడాలు గమనించవచ్చు.

కరెన్సీ, కమోడిటీ, బ్రాండు, సంస్థ షేర్ వాటాలా విలువలను సూచించే మొబైల్ ఆప్స్, ఎప్పటికప్పుడు మొబైల్ అప్డేట్స్ అందించే కొన్ని ఆండ్రాయిడ్ ఆప్స్ క్రింది చిత్రాలకు లింకులుగా ఉన్నాయి. Stock Market Money Commodity Updates Tracking Mobile Apps. మొబైల్ ఆప్స్ డౌన్ లోడ్ చేసేటప్పుడు సదరు మొబైల్ ఆప్ ఇంస్టాల్ పేజిలో ఉండే నిబందనలు, స్మార్ట్ ఫోనుపై అడిగే నియంత్రణ అనుమతులు సరి చూసుకుని డౌన్ లోడ్ చేయగలరు.

MSN Money Stock Quotes & News Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
Stock Trainer Virtual Trading Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
Stocks, Forex, Bitcoin Mobile Apps
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
Stock Edge Android Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
Money Control Android Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
StockNote Stock Market Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
ET Markets: NSE & BSE Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
My Stocks Portfolio Android Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
How to invest learn with Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
Yahoo Finance Android Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
BSE India Stock Android Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
CNBC Breaking Business Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
Economic Times Market Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
Best Brokers Stock Market Mobile App
Stock Market Money Commodity Updates Tracking Mobile Apps
Webull Stock Quotes Android Mobile App

ధన్యవాదాలు
vegapps