VegappsView Smart Apps Google Android Mobiles

VegappsView Smart Apps Google Android Mobiles

VegappsView Smart Apps Google Android Mobiles స్మార్ట్ ఫోన్ సదుపాయాలు ఉపయోగించుకోవడంలో సహకారిగా ఉండేవి మొబైల్ ఆప్స్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. అలా లభించే వాటిలో గూగుల్ దగ్గర నుండి విషయలను పోస్టు చేసే న్యూస్ బ్లాగ్స్ వరకు అన్ని మొబైల్ ఆప్స్ రూపంలో స్మార్ట్ ఫోన్ల కొరకు లభిస్తున్నాయి. ఫోటో ఎడిట్, సాంగ్ కట్టర్, వీడియో ఎడిట్, వీడియో కాలింగ్, షేరింగ్, మెసేజింగ్, వాయిస్ రికార్డింగ్, వాయిస్ టాకింగ్, ఫ్లాష్ లైట్, రిమైండర్లు, నోట్ పాడ్స్, వాల్ పేపర్స్, షాపింగ్, పేమెంట్ వాల్లేట్, ఫోటో మార్ఫింగ్, కంపాస్, మాప్స్, రూటింగ్, నావిగేషన్, మెయిల్, బ్లాగ్గింగ్, సోషల్ మీడియా, కోర్సులు లెర్నింగ్, వీడియో లెర్నింగ్ అనేక రకాల మొబైల్ ఆప్స్ అనేక వర్గాలుగా గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తున్నాయి.

ప్రధానంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువ కాబట్టి తప్పనిసరిగా కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ కంపెనీ తయారుదారి ద్వారానే ప్రాధమికంగా ఇంస్టాల్ చేయబడి ఉంటాయి. అలా ఉండేవాటిలో గూగుల్ ప్లే స్టోరుతో బాటు జిమెయిల్, గూగుల్ సెర్చ్, క్రోమ్, యూట్యూబ్, కాంటాక్ట్స్, మాప్స్, క్యాలెండరు, ఫొటోస్, డ్రైవ్, గూగుల్ ప్లే మ్యూజిక్ తప్పనిసరిగా ఉంటాయి. సాదారణ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులో సాదారణంగా ఇంస్టాల్ చేయబడి ఉంటాయి ప్రత్యేకించి ఇన్స్టాల్ చేయనవసరం లేదు. కాకపోతే అప్డేట్లు అందుబాటులో ఉన్నప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.


Google Apps

జిమెయిల్ తప్పనిసరిగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లో ఉండే మొబైల్ ఆప్. అసలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను ఉపయోగించాలంటే, మూడవపార్టీ మొబైల్ ఆప్స్ కానీ గేమ్స్ కానీ డౌన్ లోడ్ చేయాలంటే సదరు స్మార్ట్ ఫోన్లో జిమెయిల్ ఎకౌంటు లాగిన్ తప్పనిసరి. ఇది వెబ్ అప్లికేషను మరియు మొబైల్ ఆప్ గా మనకి అందుబాటులో ఉంటుంది. VegappsView Smart Apps Google Android Mobiles

వెబ్లో గూగుల్ సెర్చ్ అతిపెద్ద వెతుకులాడే సెర్చ్ ఇంజినుగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. ఏదేని బ్రౌజరు అడ్రస్ బార్లో www.google.com అని టైపు చేసి వచ్చిన సెర్చ్ బార్లో కావలసిన విషయాలను పొందవచ్చు. క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్ష్ ప్లోరర్, ఓపెరా, సఫారీ, ఆండ్రాయిడ్ ఏదైనా వెబ్ బ్రౌజరు మరియు మొబైల్ బ్రౌజరు సహాయంతో ఆన్ లైన్లో పొందుపరిచిన విషయాలను వెతికి చూడవచ్చు. గూగుల్ సంస్థ ప్రసిద్ది అంటే సెర్చ్ ఇంజినే అని చెబుతారు.

నెట్ ద్వారా వీడియోలు చూడాలంటే గుర్తుకు వచ్చే యూట్యూబ్ అందరికి సుపరిచితమే. ఏదేని విషయం వీడియోగా ఉంటే అది తప్పనిసరిగా యూట్యూబ్లో ప్రత్యక్షం అవుతుంది. టివిసీరియల్స్ దగ్గరనుండి లేటెస్ట్ మూవీస్ వరకు యూట్యూబ్ వీడియోలుగా లభిస్తాయి. సబ్జెక్టు పరంగా నేర్చుకునేవారికి అయితే అనేక వీడియోలు ఉంటాయి, మరలా సందేహాలు తీర్చే వీడియోలు కూడా ఉంటాయి. ఔత్సాహికులు కొంతమంది తమకు తెల్సిన సాంకేతిక విషయాలు, లేక సామజిక విషయాలు లేక తయారీ విధానం లేక అనుసరించు విధానం లేక ఉపయోగించు విధానం లేక ఉత్పత్తిపై విశ్లేషణలు లేక చరిత్రకు సంభందించిన విషయాలు, రాజకీయ విషయాలు, చిత్ర విషయాలు, నటీనటుల విషయాలు, పోకడలు, దోరణలు ఇలా అనేకానేక రంగాలలో వివిధ రకాలైన వీడియోలు యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. ఇంకా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Google Chrome Better for search things

గూగుల్ క్రోమ్ ఇది ఒక వెబ్ మరియు మొబైల్ బ్రౌజరు. ఎక్కువ శాతం బ్రౌజర్స్ ఉపయోగించే బ్రౌజరు. స్మార్ట్ ఫోన్లో ప్రాధమిక మొబైల్ ఆప్ గా ఉంటే డెస్క్ టాప్ కంప్యూటర్లలో డౌన్ లోడ్ చేసుకుని ఇంస్టాల్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్లో గూగుల్ సెర్చ్ ద్వారా మీరు వాయిస్ సెర్చ్ లేక టైపింగ్ సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ ఫలితాలు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కనబడతాయి. అంటే ఆన్ లైన్లో పొందుపరచబడి ఉన్న సమాచారాన్ని సెర్చ్ ఇంజిన్ సహాయంతో డొమైన ఆధారిత వెబ్ సైట్ల డేటాని మొబైల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ చూపెడుతుంది. స్మార్ట్ ఫోన్లో స్మార్టుగా ఉపయోగపడే మొబైల్ ఆప్. బ్రౌజింగ్ గురించి వివరించే పోస్టు Browse with Browser – Mobile/Computer చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ప్రధాన నగరాల నుండి చిన్న పల్లెల వరకు కలిపే రోడ్డు మార్గాలలో ప్రధాన మార్గాలు, కూడలి మార్గాలు, చిన్న చిన్న మార్గాలను మాప్స్ రూపంలో చూపించే మొబైల్ ఆప్ మాప్స్. ఇదే వెబ్ అప్లికేషన్లలో కూడా గూగుల్ మాప్స్ గా ఉంటాయి. ప్రాధమిక ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ ఆప్. మాప్స్ ద్వారా రూట్ సెట్ చేసుకోవచ్చు, నావిగేషన్ సహాయంతో తెలియని ప్రాంతాలలో కూడా దారి తెలుసుకోవచ్చు. ప్రయాణానికి ముందే ఎక్కడ ఏమి ఉంటాయో చూసుకోవచ్చు, అలాగే ప్రయాణ మార్గాలలో ట్రాఫిక్ అప్డేట్లు పొందవచ్చు. ప్రయాణాలలో చాలా ఉపయోగపడే మొబైల్ ఆప్ గా ప్రసిద్ది చెందింది.

కాంటాక్ట్స్ ఒకసారి జిమెయిలుతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో లాగిన్ అయితే, స్మార్ట్ ఫోను పరిచయలన్ని సదరు జిమెయిల్ ఎకౌంటుకి సింక్రనైజ్ చేసుకుంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఆ పరిచయాలను ఉపయోగించవచ్చు. డెస్క్ టాప్లో లాప్ టాప్లో అయినా టాబ్లో స్మార్ట్ ఫోన్లో అయినా జిమెయిల్ ద్వారా పరిచయాలను వాడుకోవచ్చు. పరిచయాలు చేర్చవచ్చు తొలగించవచ్చు.


Google Drive, Android Message Apps Default for Android Smartphones

క్యాలెండరు ప్లానింగ్లో రిమైండరుగా సహాయపడుతుంది. ఏదేని తేదిలో మరేదైనా సమయంలో చేయవలసిన పనిని నోట్ చేసుకుని పెట్టుకుంటే, సదరు సమయానికి క్యాలెండరు ఆప్ నోటిఫికేషన్ పొందేలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

డ్రైవ్ ఇది క్లౌడ్ స్టోరేజ్ మొబైల్ ఆప్, ప్రతి జిమెయిల్ ఖాతాదారుకి 15జిబి ఆన్ లైన్ స్టోరేజ్ పరిది కేటాయించబడుతుంది. ఆ పరిదిలో ఫోటోలు, వీడియోలు, పత్రాలు లాంటివి స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడు జిమెయిల్ ఎకౌంటు ద్వారా ఉపయోగించవచ్చు. ఇదే స్మార్ట్ ఫోన్లో అన్ని బ్రౌజర్ల సహాయంతో ఆన్ లైన్ డేటా ఎక్కడ నుండైనా వాడుకోవచ్చు.

ఆండ్రాయిడ్ మెసేజెస్ మొబైల్ అప్లికేషను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను ప్రాధమిక మొబైల్ ఆప్. ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ చేయాలంటే తేలికగా పంపించే మొబైల్ డేటా అవసరంలేని మొబైల్ ఆప్. సుమారు 100మిలియన్లకు పైగా డౌన్ లోడ్స్ కలిగి ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్. VegappsView Smart Apps Google Android Mobiles

Social Media Android Mobile Apps

సోషల్ మీడియా మొబైల్ ఆప్స్ చాలామంది స్మార్ట్ ఫోన్లో ఎక్కువగా ఉపయోగించేవి సోషల్ మీడియా మొబైల్ ఆప్స్ మరియు యూట్యూబ్ వీడియోలు. అటువంటి వాటిలో పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ మొదలైన మొబైల్ ఆప్స్ బాగా ప్రసిద్ది చెందినవి. పేస్ బుక్, పేస్ బుక్ మెసెంజర్, వాట్సాప్, ట్రూ కాలర్, ఎంఎక్ష్ ప్లేయర్, షేర్ ఇట్, విగో వీడియో, హాట్ స్టార్ మొదలైన మొబైల్ ఆప్స్ Top Free Android Mobile Apps గా గతకాలపు పోస్టులలో వివరించడం జరిగింది. చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Some smartphone useful mobile applications పోస్టుని తెలుగులో చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ట్విట్టర్ మొబైల్ అప్లికేషను ఇది ఒక సోషల్ మీడియా వెబ్ అప్లికేషనుగా కూడా ఉంది. పేస్ బుక్ లాగానే వ్యక్తులు, సంస్థలు ఎవరైనా ఖాతా తెరిచి సోషల్ స్టేటస్ షేర్ చేసే విధంగా పనిచేస్తుంది. ట్విట్టర్ ఖాతా అనేకమంది వాడుతున్నవారిలో ఫేమస్ పర్సన్స్ కూడా ఉంటారు. షేర్ చేసే విషయం ట్వీట్ గా పరిగణిస్తారు. వీటిని మరలా ట్వీట్ చేయవచ్చు, కామెంట్ చేయవచ్చు లైక్ చేయవచ్చు. ప్రపంచ ప్రసిద్ద సోషల్ మీడియా మొబైల్ ఆప్. బ్లాగర్లు కొంతమంది SEO ఆర్టికల్స్ కు ట్విట్టర్ ట్రెండ్స్ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

VegappsView Smart Apps Google Android Mobiles

ఐఎంఓ వీడియో కాలింగ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్, మూడవ పార్టీగా ఉన్న మొబైల్ ఆప్ కారణం చేత దీనిని వినియోగదారు వ్యక్తిగత ఇష్టానుసారం గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఇంటర్నెట్ ద్వారా కాల్ చార్జెస్ లేకుండా కేవలం మొబైల్ డేటా వినియోగించి వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడవచ్చు. అలాగే ఫోటోలు వీడియోలు షేర్ చేయవచ్చు. 500 మిలియన్ల డౌన్ లోడ్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి కలిగి ఉంది.

లింకెడిన్ మొబైల్ ఆప్ ప్రొఫెషనల్ ఫ్రంట్ యూజర్స్ వాడే మొబైల్ ఆప్. ఉద్యోగస్తులు, సంస్థ యాజమాన్యాలు, సంస్థ మేనేజర్లు తదితర ప్రొఫెషనల్ పనులు నిర్వహించేవారు ఖాతాని కలిగి ఉంటారు. తమ తమ వృత్తులు, పనులు, చేస్తున్న ఉద్యోగం వివిధ వివరాలతో ప్రొఫైల్స్ కలిగి ఉంటారు. ఈ ఖాతా ద్వారా ఒకరి ప్రొఫైల్ గురించి ఒకరు తెలుసుకోవడం వలన ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

Quora Best Fourm Website

Quora ప్రసిద్ద ఫోరం వెబ్ సైట్ అలాగే మొబైల్ ఆప్ కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనేకానేక సాంకేతిక, సామజిక, విద్యా విషయాలలో వివిధ రంగాలకి సంభందించిన సందేహాలు క్వారలో అడుగుతూ ఉంటే, వాటికి సమాధానం తెలిసిన ఔత్సాహికులు లేక నిపుణులు సమాధానాలు వ్రాస్తూ ఉంటారు. ప్రసిద్ద ప్రశ్నలు – ప్రసిద్ద సమాధానాలు మీ స్మార్ట్ ఫోన్లో మీరు పాల్గొనాలంటే మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేసుకోండి.

ఇంస్టాగ్రామ్ మొబైల్ అప్లికేషను వేయి మిలియన్ డౌన్ లోడ్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి కలిగి ఉంది. బ్లాగర్లకు గూగుల్, పేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు వారి బ్లాగు ప్రమోషనుకి ఉపయోగపడినట్టు ఈ ఇంస్టాగ్రామ్ కూడా ఉపయుక్తం. వాటిలాగానే సోషల్ మీడియా స్టేటస్ అప్డేట్ ఉంటుంది, కాకపోతే ఫోటోలు ప్రధానంగా సాగుతాయి. అనేకానేక మంది ఫాలోయర్స్ ఉంటారు. ప్రసిద్ది చెందిన వెబ్ and మొబైల్ ఆప్.

పేస్ బుక్, పేస్ బుక్ పేజిలు, పేస్ బుక్ గ్రూపులు గురించి గతకాలపు పోస్టుని చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

అలాగే ఎడిటర్ ఛాయస్ మొబైల్ ఆప్స్ గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ఎప్పుడైనా ఎక్కడైనా ప్రైమ్ వీడియోలుగా ప్రసిద్ది పొందిన లేటెస్ట్ మూవీస్ మీ స్మార్ట్ ఫోన్లో వెంటనే వీక్షించాలంటే అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఆప్ ద్వారా వీక్షించవచ్చు. నెలవారీ రూ.129లతో సబ్ స్క్రైబ్ అవ్వవచ్చు. మొబైల్ వీడియో అండ్ మ్యూజిక్ ఆప్. యూట్యూబ్ మాదిరి వీడియోలు ఆఫ్ లైన్లోకి తీసుకుని అవసరమైనపుడు చూడవచ్చు. అలాగే తక్కువ మొబైల్ డేటా వినియోగం ఉంటుందని చెబుతున్నారు. అయితే అమెజాన్ ప్రైమ్ membership ఉంటే అమెజాన్ స్టోర్లో కొనుగోలు సమయంలో డెలివరీ మరియు డిస్కౌంట్ ఆఫర్లలో ప్రాధాన్యత ఇస్తారు. మీకు అమెజాన్ prime membership కావాలంటే ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Some More Mobile Apps

కామ్ స్కానర్ ఫోను పిడిఎఫ్ క్రియేటర్ ఇది ఒక ఆండ్రాయిడ్ ఎడిటర్ ఛాయస్ మొబైల్ ఆప్ గా లభిస్తుంది. ఏదైనా డాక్యుమెంట్ మీ స్మార్ట్ ఫోను ద్వారా స్కాన్ చేసి డైరెక్ట్ గా స్మార్ట్ ఫోను నుండే పిడిఎఫ్ ఫార్మాట్లో పంపించవచ్చు. స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఎడిట్ చేయవచ్చు. ఇంకా ఫోటోలపై ఉన్న టెక్స్ట్ ని వేరుచేయవచ్చు, అయితే దీనికి కూడా నెల లేక సంవత్సరం వారిగా రుసుం చెల్లించి మెంబెర్షిప్ తీసుకోవాలి.

స్టాక్ (Stock) ఎక్స్చేంజి రూపాయి విలువ డాలర్ విలువ వస్తువుల విలువ బ్రాండ్ విలువలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు అనేకంగా గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. ఎంఎస్ఎన్ మనీ – స్టాక్ కోట్స్ & న్యూస్, యాహు ఫైనాన్సు, మనీ కంట్రోల్, CNBC బ్రేకింగ్ న్యూస్, ఎకనామిక్ టైమ్స్, స్టాక్ అలర్ట్స్ (Stock Alerts), స్టాక్ మార్కెట్ (Stock market) ఇంకా వివిధమైన మొబైల్ ఆప్స్ స్టాక్ (stock) గురించి తెలియజేసేవి లభిస్తాయి.

ప్రభుత్వ ఆఫీసులు ఎన్ని డిపార్టుమెంటులు ఎక్కడెక్కడ ఉన్నవి చిరునామాలు అందరికి తెలియకపోవచ్చు. కాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలా పుట్టుకకు, చావుకు, నివసిస్తున్నట్టు, ఆదాయానికి, కులానికి అన్నింటికి ప్రభుత్వ అధికారిచేత ధృవీకరణ పత్రాలు తప్పనిసరి ప్రభుత్వ అధికారితో పని ఉంటే, ఇంకో ప్రభుత్వ అధికారి ద్రువికరణ పత్రం తప్పనిసరి. ఆన్ లైన్ అయ్యాక మాత్రం మీసేవద్వారా పొందే వెసులుబాటు వలన తిరుగుడు తగ్గిందనే చెప్పవచ్చు. ప్రభుత్వ డిపార్టుమెంటులకు సంభందించిన మొబైల్ ఆప్స్ మనకి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్ నుండి లభిస్తాయి. సదరు పోస్టుని చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

క్రికెట్ / హిస్టరీ / టాలీవుడ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్

international sports ఎక్కడ జరిగినా ఆన్ లైన్ లైవ్ తప్పని సరిగా ఉంటాయి. ప్రధానంగా మనకి క్రికెట్ మ్యాచులు, 2020క్రికెట్ మ్యాచులు, 5050 ఓవర్ల డేక్రికెట్ మ్యాచులు, 5డేస్ టెస్ట్క్రికెట్ మ్యాచులు జరుగుతూ ఉంటే, ఎక్కువమంది తక్కువ సమయంలో ముగిసే twenty20క్రికెట్ మ్యాచులు లైవ్ చూస్తూ ఉంటే, వన్డే మ్యాచులు లైవ్ స్కోర్ తెలుసుకుంటూ ఉంటారు. ఇలా క్రికెట్ మ్యాచులు అప్డేట్స్, న్యూస్, ఆటగాళ్ళ బయోగ్రాఫి తెలిపే మొబైల్ ఆప్స్ అనేకం ఉన్నాయి సదరు పోస్టు గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

గతకాలంలో ఏమేమి జరిగిందో ఏఏ సంఘటనలు ఎప్పుడెప్పుడు సంభవించినాయో ఏఏ ప్రముఖలు ఎప్పుడు జన్మించారో తెలిపేది, చరిత్ర. ప్రసిద్ద వ్యక్తుల జీవిత విశేషాలు, వారి పుట్టుపూర్వోత్తరాలు తెలియజేసే మొబైల్ ఆప్స్ వివిధములుగా లభిస్తాయి. ఇప్పుడు జరుగుతున్నా ఈరోజున గతంలో ఏమి జరిగిందో, ఏ ప్రముఖ వ్యక్తి జన్మదినమో తెలిపే మొబైల్ ఆప్స్ కుడా మనకి లభిస్తాయి. సదరు పోస్టు గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

తెలుగు చిత్ర పరిశ్రమలో చిత్రవిశేషాలు, కొత్త చిత్ర వివరాలు, ప్రారంభించబోయే తెలుగు చిత్ర విషయాలు, విడుదలపై న్యూస్, ప్రసిద్ద చిత్ర నిర్మాతల, దర్శకుల విషయాలు, టాలీవుడ్ హీరోల విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే మొబైల్ ఆప్స్ కూడా మనకి అనేకంగా ఉంటాయి. చిత్రవిచిత్ర విషయాల సమాచారాలని తెలియజేసే వెబ్ సైట్లు, మొబైల్ ఆప్స్ గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

English Word Games Court & Famous Personalities Mobile Apps

ఇంగ్లీషు అక్షరాలతో గేమ్స్ ఆడడం వలన ఇంగ్లీషు పదాలపై పట్టు పెరుగుతుంది, అంటారు. చిన్నపిల్లలకు ఈ మొబైల్ గేమ్స్ బాగుగా ఉంటాయి. ఆడుకోవడానికి సరదాగా ఉంటాయి. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇంగ్లీష్ పదాలపై అవగాహన బాగాపెరుగుతుంది. ఆంగ్ల అక్షరాలను నిలువుగా అడ్డుగా ఐమూలగా కలుపుతూ పదాలను కొనుగోనే మొబైల్ గేమ్స్ వివరాలు చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

జిల్లా కోర్టు, హై కోర్టు, సుప్రీమ్ కోర్టు కోర్టులు కన్నా కేసులు ఎక్కువ కేసుల కొలది లాయర్స్ ఎక్కువ, న్యాయస్థానాలలో న్యాయం కోసం నమోదు చేయబడిన అనేక కేసుల వివరాలు అందించే విధంగా వెబ్ సైట్లు, మొబైల్ ఆప్స్ ఆన్ లైన్లో ఉంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల కొరకు లభించే మొబైల్ ఆప్స్ కోర్టులలో కేసు స్థితిని తీర్పుని కేసు నెంబర్ లేక లాయర్ పేరుని బట్టి చూపేవిధంగా ఉంటాయి. సదరు కోర్టులకు సంభందించిన మొబైల్ ఆప్స్ పోస్టు చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

దేశకాలప్రాంతలను బట్టి అనేకమంది ప్రసిద్ద వ్యక్తులు గతంలోను వర్తమానంలోను ఉంటారు. ప్రసిద్ద చెందినా చెందుతున్న వ్యక్తుల జీవిత విశేషాలు అనుసరణీయం అని అంటారు. అనుసరించదగిన ప్రసిద్ద వ్యక్తుల గురించి తెలిపే ఆండ్రాయిడ్ ఆప్స్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయంగా ప్రసిద్ది చెందిన వ్యక్తుల జీవిత విశేషాలను తెలిపే మొబైల్ ఆప్స్ గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

స్మార్ట్ ఫోన్లు వచ్చాయి ఆకర్షించాయి ఇంకా వస్తున్నాయి ఇంకా ఆకర్షిస్తున్నాయి కారణం సాంకేతికత పెరిగి ఉపయోగాలు అవసరాలు అన్ని సాంకేతికతపై ఆధారపడడమే కావచ్చు. అటువంటి స్మార్ట్ ఫోన్లపై వాడితే సమస్యలు అంటారు, అలాగే కొన్ని మొబైల్ ఆప్స్ వలన భద్రతా సమస్యా అంటారు. చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

క్రికెట్ ఇదొక జ్వరమనే పోస్టుల కూడా ఉంటాయి, ఇది ఒక క్రేజీ క్రికెట్ అని క్రేజీగా వార్తలు వస్తూ ఉంటాయి, ఏదైనా క్రేజీ ఉందంటే దానిపై వీడియోలు ఉంటాయి. అలాగే క్రికెట్లో ప్రసిద్ద ఆటగాళ్ళ ఉత్తమ ప్రదర్శనలు, బెస్ట్ బాటింగ్, బెస్ట్ బౌలింగ్, బెస్ట్ కాచెస్ మొదలైనవిగా వీడియోలను ప్లే చేసే మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు కొరకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. ఈ పోస్టుపై చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

BigBoss Big Reality Show In TV

BigBoss Big Reality Show and it is a one of the big topic in social media. Jr. NTR was first anchor for the season 1 of BigBoss. Now anchoring by Natural Star Nani for BigBoss2 reality Show. VegappsView Smart Apps Google Android Mobiles Click for MobileApps for BigBossRealityTelugShow on the same letters.

Click here to read astrology mobile apps to avail. More people telling about AstroWorld and describing Astrology results for users. Popular astro pandits in AstroWorld, more mobile apps in Google playstore for peoples.

Continuing in other posts for more android mobile aaps

Thanking you
vegapps