Adjust YouTube Video Quality Settings

Adjust YouTube Video Quality Settings On Mobile App and Web App

యూట్యూబ్ వీడియో వెబ్ అప్లికేషన్ మరియు మొబైల్ ఆప్ ఎంత ప్రసిద్దో చెప్పనక్కరలేదు. ఎందుకంటే ప్రసిద్ది చెందడానికి అనేక విషయాలు యూట్యూబ్ లోనే వీడియోలుగా చేరుతూ ఉంటాయి. సులువుగా ఉంటూ సంతోషకరమైన విషయాలు, నేర్చుకునే విషయాలు, బ్రేకింగ్ న్యూస్, అనూహ్య దృశ్యాలు, సినిమాలు, షార్ట్ ఫిలింస్ లాంటివి ఎన్నో వీడియోల రూపంగా చేతిలో ఇమిడిపోయే స్క్రీను నుండి – గోడకు సరిపడే స్క్రీనుల వరకు ఇంటర్నెట్ ద్వారా, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న అనేక పరికరాలలో ప్లే అవుతుంది Adjust YouTube Video Quality Settings.

చూసేవారికి వినోదం, చూపేవారికి ఆదాయాన్నిచ్చే యూట్యూబ్ (You Tube) అన్ని పరికరాల ద్వారా అందరికీ అందుబాటులో ఉండడంతో బాగా ప్రసిద్ది చెందింది. ఎన్నో వీడియోలకు అడ్డాగా మారిన యూట్యూబ్ (You Tube) ఎప్పుడైనా చూడడానికి అవకాశం ఎక్కువ. అయితే ఇంటర్నెట్ వేగం తగినంత ఉంటే మాత్రం సరైన నాణ్యతతో వీడియో ప్లే అవుతుంది. లేకపోటే బఫరింగ్ అవుతూనే ఉంటూ, చూసేవారిని విసుగు తెప్పిస్తుంది. యూట్యూబ్ గో (You Tube Go) వీడియో అయితే యూజర్ తక్కువ వేగం కలిగినప్పుడు కూడా వీడియోలు వీక్షించే విధంగా డేటా కంట్రోల్, వీడియో ఆఫ్ లైన్ మోడ్ సౌకర్యాలు Adjust YouTube Video Quality Settings అందిస్తుంది.

జియో, ఎయిర్ టెల్, ఐడియా వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ లాంటి మొబైల్ నెట్ వర్కు ప్రొవైడర్స్ రోజువారీ పరిమిత మొబైల్ డేటా ఆధారంగానే పధకాలు వినియోగదారుకి అందిస్తున్నారు. సాదారణ వినియోగదారు రోజుకి 2GB మొబైల్ డేటా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఎక్కువ డైలీ లిమిట్ ఉన్నా సాదారన వ్యక్తికి అందుబాటు ధరలు కన్నా ఎక్కువ లేక కాల పరిమితి తక్కువగా ఉంటాయి. కనుక ఎక్కువమంది స్మార్ట్ ఫోను వినియోగదారులకు మొబైల్ డేటా పరిమితంగానే ఉంటుంది.

అయితే ఇలా పరిమిత మొబైల్ డేటా ఉన్నప్పడు యూట్యూబ్ (You Tube) వీడియోలు ప్లే అవుతున్నంత సేపు చూస్తూ ఉంటే, మొబైల్ డేటా అయిపోగానే, వీడియో బఫరింగ్ మొదలవుతుంది. అదే డైలీ మొబైల్ డేటా వాడుకకు ముందే, మీ యూట్యూబ్ లో ప్లే చేస్తున్న వీడియో నాణ్యతని అవసరాన్ని బట్టి తగ్గించుకుంటే మాత్రం డేటా లిమిట్ ఎక్కువ సమయం ఉపయోగించవచ్చును. క్రింది వీడియో ఒక ఇమేజ్ లానే ఉండగా గమనించండి. ఇమేజ్ కుడివైపు క్రింద మూలగా రెండు సింబల్స్ ఉన్నాయి. వాటిలో కుడి నుండి రెండవ సింబల్ సెట్టింగ్స్ సింబల్. దానిపై టచ్/క్లిక్ చేస్త ఆటో ప్లే (Autoplay), నాణ్యత (Quality) ఒక లిస్టు మెనుగా వస్తుంది. Adjust YouTube Video Quality Settings.

Youtube Video Quality Adjustment For Saving Limited Mobile Data

ఆటోప్లే (Autoplay) ఆప్ off చేస్తే క్యూలో ఉన్న నెక్ట్స్ వీడియో వెంటనే ప్లే అవ్వదు, అప్పుడు డేటా వేస్ట్ కాదు, నచ్చిన వీడియో ఎంపిక చేసుకునే వరకు ఇంకో వీడియో ప్లే అవ్వదు. అలా కాకుండా ఆటోప్లే (Autoplay) ఆన్ on లో ఉంటే మాత్రం మీరు ఎంపిక చేసుకోకపోయినా వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతూనే ఉంటాయి. క్రిందగా ఉన్న ఆ లిస్టులోనే నాణ్యత (Quality) ప్రక్కగా ఎంత క్వాలిటీతో వీడియో ఉందో కూడా చూపుతుంది. సాదారణంగా ఆ క్వాలిటీ ఆటో (Auto) మోడ్లో ఉంటుంది. మీకు నెట్ వేగంగా ఉంటే, ఎక్కువ నాణ్యత(HD) క్వాలిటీతో వీడియో ప్లే అవుతుంది. HD Quality లో వీడియో వీక్షణ కొన్ని గంటలో కొన్ని GB డేటా అయ్యే అవకాశం ఉంటంది. కాబట్టి ఇంటర్నెట్ వేగంగా వస్తున్నా మీరు వీడియో ప్లే అవుతున్నప్పుడే, ఆ వీడియో నాణ్యత(క్వాలిటీ)ని మార్చుకుంటే, మీ పరిమిత మొబైల్ డేటా ఎక్కువ సమయం వాడుకోవచ్చును. వీడియో నాణ్యతని మార్చడం గురించి ఈ క్రింది వీడియోపై టచ్ చేయండి.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కొన్ని యూట్యూబ్ (You Tube) వీడియోలు కేవలం ప్రసిద్ద ఆడియో ప్లేచేయడానికి, ఆ ఆడియో పాపులారిటీని బట్టి కేవలం ఇమేజులు పెట్టి వీడియోలు చేస్తూ ఉంటారు అటువంటి వీడియోలకు ఎక్కువ నాణ్యత (HD)తో చూడడం అంటే మొబైల్ డేటా వృధా చేయడమే అవుతుంది. ఇంకా కేవలం ఆడియో కోసమే, వీడియోలను చూడవలసి వచ్చినప్పుడు కూడా యూట్యూబ్ (You Tube) వీడియో నాణ్యతను తక్కువకు మార్చుకుంటే, మొబైల్ డేటా ఎక్కువసేపు వస్తుంది.

ఇలా ఆడియో ప్రధానంగా ఫోటోలతో ఉండే వీడియోలు ప్రసిద్ది చెందిన పాటలలో, ప్రసిద్ద వ్యక్తుల ప్రవచనాలు, ప్రసిద్ద వ్యక్తుల గురించి చెప్పడంలో ప్రపంచ ప్రసిద్ద స్థలాల గురించి ఇలా బాగా పాపులారిటీ ఉన్న అంశాలలో కేవలం ఫోటోలతో ఆడియో ప్రధానంగా You Tube వీడియోలు ఉంటాయి. ఇటువంటి వీడియోలు చూస్తున్నప్పుడే, వీడియో నాణ్యతని తగ్గించండి. క్రింది వీడియోలో మొబైల్లో You Tube Video Quality Settings గురించి చూడండి. Adjust YouTube Video Quality Settings

ధన్యవాదాలు
vega2020