Android Apps Games Starter Kits

Android Apps Games Starter Kits For Smartphones.

సాదారణంగా స్మార్ట్ ఫోను సోషల్ మీడియాలో పోస్టులు పోస్టుచేయడానికి కొంతమంది ఉపయోగిస్తూ ఉంటే, కొంతమంది ఎక్కువగా ఫన్నీ వీడియోలు వీక్షించడానికి స్మార్ట్ ఫోనును ఉపయోగిస్తారు. ఇంకా మ్యూజిక్ వింటూ ఆనందించేవారు, నేచర్ కాప్చర్ చేసేవారు ఉంటారు. విద్యార్ధులు వీడియోలు లేక వెబ్ సెర్చ్ ద్వారా స్టడీ సందేహాలు వెతుకుతూ ఉంటారు. కేవలం కాలింగుకు మెసేజుకు మాత్రమే అయితే చాలమంది స్మార్ట్ ఫోను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు, Android Apps Games Starter Kits.

స్మార్ట్ ఫోనును సమర్ధవంతంగా ఉపయోగించడానికి అంతే సమర్ధవంతంగా పనిచేసే మొబైల్ అనువర్తనాలు (Apps) అవసరం. స్మార్ట్ ఫోను కెమెరాతో కాప్చర్ చేసిన చిత్రాన్ని అందంగా ఒక ఫ్రేమ్ ఫోటోలాగా లేక ఫోటోపై పేరు వ్రాయడం లాంటి పనులకు ఫోటో ఎడిటింగ్ మొబైల్ ఆప్ కావాలి, అలాగే వీడియో ఎడిట్ చేయాలంటే, వీడియో ఎడిటింగ్ మొబైల్ ఆప్ కావాలి. అలా ఎడిట్ చేసిన ఫోటో లేక వీడియో షేర్ చేయాలంటే, సోషల్ మీడియా ఖాత సంభందిత మొబైల్ ఆప్ కావాలి.

డౌన్ లోడ్ చేసిన లేక మొబైల్ స్టోరేజ్ లో ఉన్న వీడియోలు వీక్షించడానికి అధునాతన సదుపాయాలు కలిగిన మొబైల్ ఆప్ ఉంటే, వీడియో వీక్షణ చక్కగా సాగుతుంది. అలాగే పాటలు వినడానికి కూడా మరో మొబైల్ ఆప్ వినియోగించాల్సి ఉంటుంది. ఆడియో వీడియో ప్లేయర్స్ అనేకంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగులో ప్లేస్టోర్లో లభిస్తాయి. ఆడియో రికార్డర్ మరియు వీడియో రికార్డింగ్ మొబైల్ ఆప్స్ కూడా లభిస్తాయి.

Click here to read Postpapa Posts

ఇకామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఆన్ లైన్ అమ్మకాలు ఎక్కువై, అవి మొబైల్ ఆప్స్ ద్వారా మొబైల్ షాపింగ్ కూడా ప్రసిద్ది చెందింది. షాపింగ్ చేయాలంటే ప్రసిద్ద ఇకామర్స్ సంస్థయొక్క మొబైల్ ఆప్ ఉంటే మన ఫోన్లో ఉంటే, ఎప్పడైనా, ఎక్కడైనా మొబైల్ డేటా స్మార్ట్ ఫోను ద్వారా షాపింగ్ చేయవచ్చును. క్యాష్ ఆన్ డెలివరీ, డెబిట్ కార్డ్ ఇఎంఐ, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఆన్ లైన్ రివ్యూస్ మొబైల్ షాపింగు ప్రసిద్ది చెందడంలో దోహదపడుతున్నాయి. Android Apps Games Starter Kits.

టెక్స్ట మెసేజెస్, ఫోటో మరియూ వీడియో షేరింగ్ చేయడానికి మెసెజింగ్ మొబైల్ ఆప్స్ అవసరమైతే, వీడియో కాలింగ్ చేయడానికి సంభందిత వీడియో కాలింగ్ మొబైల్ ఆప్స్ అవసరం. ఇంకా కాల్ రికార్డ్ చేయడానికి, తెలియని కాలర్ వివరాలను కాల్ వస్తూండగానే తెలియజేసే మొబైల్ ఆప్స్ రకరకాల ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి.

Click here to goto Google Play Store

Payment Wallets, Mobile Shopping Apps

నోట్ల రద్దు తర్వాత పెరిగిన ఆన్ లైన్ బ్యాంకింగుతో బాటు, మొబైల్ బ్యాంకింగ్ మరియు మొబైల్ పేమెంట్ వాల్లెట్స్ పెరిగాయి. మొబైల్ పేమెంటు వాల్లెట్ ఆప్స్ అయితే రిఫరింగ్ విధానంతో ప్రమోషనల్ ఆఫర్లతో లభిస్తుంటే, కొన్ని రకాల మొబైల్ ఆప్స్ లో అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఎపుడూ ఏదో ఒక వస్తువుపై ఉంటూ ఉంటాయి.

ఇలా ఎన్నో రకాల ఉపయోగాలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే మొబైల్ ఆప్స్ గూగులో ప్లేస్టోర్లో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్లకొరకు లభిస్తాయి. అనేకంగా అసంఖ్యాకంగా అభించే ఆండ్రాయిడ్ అప్స్ తో బాటు, గేమ్స్, బుక్స్ అనేక వర్గాలుగా లభిస్తాయి. గూగుల్ ప్లేస్టోర్లో సెర్చ్ చేసి, వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చును. Android Apps Games Starter Kits.

అసంఖ్యాకంగా లభించే ఆండ్రాయిడ్ ఆప్స్ మరియు గేమ్స్ వెతికే తీరిక ఉన్నా అవి ఏమేమి ఉన్నాయో కొత్తగా స్మార్ట్ ఫోను కొనుగోలు చేసినవారికి తెలియక పోవచ్చును.  మీరు కొత్తగా ఫోను కొంటే, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులో ప్రసిద్ది చెందిన మొబైల్ ఆప్స్ ప్రసిద్ద వర్గాలనుండి గూగుల్ ప్లే స్టోర్లో కనబడతాయి. వాటిని ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా సంభందిత వర్గాలలో ఉన్న ఇతర మొబైల్ ఆప్స్ కనబడుతూ ఉంటాయి.

అయితే కొత్త ఫోను కలిగి ఉన్న యూజర్ తమ జీమెయిల్ ఐడితో డెస్క్ టాప్ లేక లాప్ టాప్ ఇంటర్నెట్ బ్రౌజర్లో గూగుల్ ప్లేస్టోర్లో లాగిన్ అయితే అందులో ఆప్స్ బటన్ పై క్లిక్ చేయగానే Apps starter kit అని కొన్న ప్రసిద్ద మొబైల్ ఆప్స్ మరియు Games starter kit అని కొన్ని ప్రసిద్ద ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్స్ కనబడతాయి. ఇక్కడ గూగుల్ ప్లేస్టోర్ సాదారణ స్మార్ట్ ఫోను యూజరుకి అవసరంగా భావించే కొన్ని ప్రసిద్ద మొబైల్ ఆప్స్ మరియు గేమ్స్ చూపిస్తూ, కొత్తగా వచ్చిన మొబైల్ ఆప్స్ మరియు గేమ్స్ ను చూపుతుంది. Android Apps Games Starter Kits.

గూగుల్ ప్లేస్టోర్లో Apps starter kit లో Whatsapp, Flipkart, MX Player, Hotstar, Instagram, Truecaller, Vigo Video, Wynk Music, Facebook, Paytm, IMO, Gpay, CamScanner, Ola, Netflix & other mobile Apps ఉంటే, Games starter kit లో Candy Crush Saga, Ludo King, Subway Surfers, Hill Climb Racing, Temple Run2 మొదలైన ప్రసిద్ద గేమ్స్ ఉంటాయి.

Clicker here to read in English

ఇంకా కొత్తగా వచ్చి ఎక్కుగా ప్రాచుర్యం పొందుతున్న మొబైల్ ఆప్స్ మరియు గేమ్స్ కూడా క్రిందగా మనకి ప్లేస్టోర్లో కనబడతాయి. ఒకసారి మీరు ఇన్ స్టాల్ చేసుకుని వాడుతున్న మొబైల్ ఆప్ లేక గేము వర్గానికి సంభందించిన మొబైల్ ఆప్స్ మరియు గేమ్స్ మీ స్మార్ట్ ఫోను గూగులో ప్లేస్టోర్లో కనిపిస్తూ ఉంటాయి. అవే మీ ఇష్టాలు గా చేరుతూ ఉంటాయి. Android Apps Games Starter Kits.

ధన్యవాదాలు
vega2020