Free Shortlinks Scanner Finding Main Site

Free Shortlinks Scanner Finding Main Site

స్మార్ట్ ఫోను సౌలభ్యంగా ఉంటుంది, నచ్చిన వీడియోలు చూస్తున్నప్పుడు, నచ్చిన లైవ్ షో చూస్తున్నప్పడు, సోషల్ మీడియాలో స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు లేక షాపింగ్, మొబైల్ ద్వారా చెల్లింపులు చేసేస్తున్నప్పుడు అయితే స్మార్ట్ ఫోను వాడేవారు పెరిగాక మార్కెటింగ్ వ్యవస్థ కూడా డిజిటల్ గా మారి, అందరి స్మార్ట్ ఫోనులు ప్రచార మాద్యమాలుగా మారుతున్నాయి. ఫేస్ బుక్, వాట్సప్, మెసెంజర్, ట్విట్టర్ ద్వారా అనే ఆన్ లైన్ కార్యకలాపాల ప్రచారాలు ఎక్కువమంది దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, Free Shortlinks Scanner Finding Main Site.

అలా డిజిటల్ మార్కెటంగులో భాగంగా వచ్చేవాటిలో షార్ట్ లింక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెసెంజర్ల ద్వారా అనేకమందికి మొబైల్ ఫోన్లలోకి వస్తూ ఉంటాయి. ఏ వెబ్ సైటు లేక మొబైల్ ఆప్ లేక డిజిటల్ యాడ్ లింకు ఏదైనా షార్ట్ లింకుల ద్వారా ప్రచారం అవుతూ ఉంటాయి. వీటిలో కొన్న సెల్ ఫోనుకు హాని కలిగించే వైరస్ లు ఉండవచ్చును. కొన్ని షార్ట్ లింక్స్ అయితే ప్రచారాలు ఎక్కువగా కలిగిన వెబ్ సైటుల లేక మొబైల్ యాప్స్ లింకులు కలిగి ఉండవచ్చును. వీటి వలన సరిగా పనిచేసే స్మార్ట్ ఫోను కూడా ఒక్కోసారి హాంగ్ అవుతూ ఉంటాయి.

పొడవైనా వెబ్ లింకులు అయితే, సదరు లింకు తాలుకా వెబ్ సైటు చిరునామా కూడా కలిగి ఉంటుంది. కొంతమంది ఆ వెబ్ సైటు పేరును బట్టి ఆ లింకు యెక్క ఉద్దేశం అవగాహన చేసుకొనగలుగుతారు, కానీ ఈ షార్ట్ లింక్స్ వలన ఆ లింకు ఏ వెబ్ సైటుది తెలియదు, లింకు యెక్క గుణమేమిటో తెలియదు, క్లిక్ / టచ్ చేస్తే అది హానికరమైన వైరస్ లేక అపరిమిత యాడ్ ప్రదర్శనను కలిగి ఉంటే, వెంటనే సెల్ ఫోను హాంగ్ అవుతుంది. Free Shortlinks Scanner Finding Main Site.

స్మార్ట్ ఫోను టచ్ స్క్రీనుపై ఉండే మలినమైన క్రిముల గురించన పోస్టు చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Shortlink Scanner Website

ఇటువంటి షార్ట్ లింక్స్ (పొట్టి లింకులు)ను స్కాన్ చేసి, ఆ షార్ట్ లింకు యెక్క మూల వెబ్ సైటు చిరునామ తెలియజేసే వెబ్ సైటు మనకి ఆన్ లైన్లో అందుబాటులో ఉంది. ఆ సైటులో మీకు వచ్చిన షార్ట్ లింకును కాఫీచేసి, ఈ వెబ్ సైటు లో ఎంటర్ చేస్తే చాలు, అది మీరు ఎంటర్ చేసిన షార్ట్ లింకు యెక్క మెయిన్ వెబ్ సైటును చూపుతుంది. తరువాత మీకు ఆవెబ్ సైట్ అవసరం అనుకుంటేనే, ఆ లింకుపై టచ్ చేసి, ఓపెన్ చేయవచ్చును.

Free Shortlinks Scanner Finding Main Site

అపరిమితంగా యాడ్స్ చూపే మొబైల్ యాప్స్ లేక గేమ్స్ వలన స్మార్ట్ ఫోను తొందరగా తన లైప్ సమయాన్ని కోల్పోతుంది. ఇంకా అటువంటి వెబ్ సైటులు, యాప్స్ వలన కనిపించే కొన్ని యాడ్స్ ను క్లిక్ చేయగానే ఫోనుని హాంగ్ చేసే వైరస్ ఫైల్స్ డౌన్ లోడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. Free Shortlinks Scanner Finding Main Site.

Click to Read About Mind Motivated Books From PostPapa Post

దన్యవాదాలు
vega2020