Networking Online Money Earning Ways

Networking Online Money Earning Ways – నెట్ వర్క్ పద్దతిలో ఆన్ లైన్ డబ్బు సంపాదన ?

ఇంటర్నెట్ ఆధారిత ఆదాయ మార్గాలలో వెబ్ సైటు మరియు మొబైల్ ఆప్స్ ద్వారా నెట్ వర్కింగ్ పద్దతి ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఒక ఖాతా దారునుండి కొంత మంది ఖాతాదారులను మరలా వారి నుండి మరి కొన్ని ఖాతాదారులను పెంచుకునే విధానంలో కొంత మొత్తమును సంపాదించే అవకాశం నెట్ వర్కింగ్ విధానంలో ప్రసిద్ది. నెట్ వర్కింగ్ విధానంలో మార్కెటింగ్ ఎక్కువగా సాగే అవకాశాలు ఉంటాయి, Networking Online Money Earning Ways.

ఒక స్మార్ట్ ఫోను కలిగిన వ్యక్తికి లేక నెటిజన్ కు ఉచిత ఖాత నమోదు సౌకర్యం కల్పించి, నమోదు అయిన ఖాతాదారు నుండి నెట్ వర్కు పద్దతిలో ఇంకా మరికొన్ని ఖాతాలను నమోదు చేయిస్తూ, అలా ఒక ఖాతా నుండి మరికొన్ను ఖాతాలు ఆ మరికొన్ని ఖాతాల నుండి ఇంకొన్ని ఖాతాలను నమోదు చేయించే నెట్ వర్కు విధానం సాగుతుంది. ఇంటర్నెట్ వినియోగదారు ఏదైనా ఒక సంస్థలో ఒక ఖాతా ఉచితంగా పొంది, తన ఖాతా నుండి మరికొంతమందిని సదరు సంస్థకు ఖాతాదారులకు చేరుస్తూ ఉంటే, అతనికి ఒక ఖాతాదారు నమోదుకు మద్దతుగా పని చేసినందుకు సదరు సంస్థ కొంతర నగదు మొత్తమును లేక పాయింట్లను ప్రధమ ఖాతాదారుకి జమచేస్తూ ఉంటారు.

Easy is way of lazy

ప్రధమ ఖాతాదారు ద్వారా ప్రవేశించిన ఇతర ఖాతాదారులు తమ ద్వారా మరి కొంతమంది ఖాతాదారులను నమోదు చేయిస్తే, మొట్టమొదటి ఖాతాదారు స్థాయి సంస్థలో పెరుగుతుంది. అలా క్రిందగా ఒకరి తర్వాత ఒకరు పిరమిడ్ లింకు పద్దతిలో ఖాతాలు పెరుగుతున్న కొలది ప్రధమ, ద్వీతీయ, తృతీయ మొదలగు స్థాయిలు ఏర్పడుతూ నెట్ వర్కింగ్ విధానం సాగుతుంది. లింకు కొనసాగుతున్న కొలది మొదటగా నమోదు అయిన ఖాతాదారు గరిష్ట లబ్ధిని పొందుతారు. లింకు బ్రేకు అయితే ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఈ నెట్ వర్కింగ్ విదానంలో సభ్యులుగా నమోదు అయిన ఏ స్థాయి ఖాతాదారు అయినా క్రింది స్థాయి ఖాతాదారులతో కలసి పనిచేసే అవకాశం ఎక్కువ. Networking Online Money Earning Ways.

ఈ విధానంలో ఒక వస్తువుకు లేక సర్వీసుకు బాగుగా ప్రచారం సాగించవచ్చును. నెట్ వర్క్ విధానంలో మొదట చేరిన సభ్యునకు ఎక్కువమంది పరిచయస్తులుగా ఉండి, ఉంటే ఆ పరిచయస్తులను కూడా ఈ నెట్ వర్క్ లోకి చేర్చడం ద్వారా ఎక్కువ ఫలితం పొందుతూ ఉంటారు. కొంతమంది ఈ నెట్ వర్కింగ్ మార్కెటింగ్ లోకి చేరిన తరువాత పరిచయస్తులను పెంచుకుంటూ వెళ్తారు.

Genuine ways of earning money

డబ్బు చెల్లించి సభ్యత్వం పొంది, తిరిగి సభ్యులను చేర్చే లింకు పధకం

నెట్ వర్కింగ్ విధానములోకి చేరేటప్పుడు సదరు నెట్ వర్కింగ్ మార్కెట్ చేయిస్తున్న వస్తువు లేదా సేవలను పరిశీలన చేయాలి. అవి అందరికీ ఉపయుక్తమా కాదా? మరియు వస్తువు నాణ్యతను పరిశీలన చేయకుండానే నెట్ వర్క్ మార్కెటింగులో డబ్బు చెల్లించి నమోదు అయితే, చెల్లించిన డబ్బును రాబట్టుకోవడానికి సదరు నాణ్యత లేక సరైన విదివిధానాలు లేని వస్తువు/సేవకు మద్దతుగా ప్రచారం చేయవలసి వస్తుంది. ఇటువంటి వాటి వలన బంధాలలో మనకు ఉన్న నమ్మకం పోతుంది.

కొంతమంది ముందుగా కొంత డబ్బును చెల్లించి మా సంస్థలో నమోదు అవ్వండి, తరువాత మీ స్నేహితులను, పరిచయస్తులను లేక ఇతరులను జాయిన్ చేయండి, మీ ఎక్కౌంటులో అపరిమిత డబ్బు చేరుతుంది. అంటూ ఆకర్శణీయమైన ప్రకటనల ద్వారా వ్యక్తులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి వాటిలో ఎక్కువమంది పరిచయస్తులు కలిగిన వారు, మాటకారితనము కలిగినవారు మాత్రమే విజయవంతమైనప్పటికి, ఇది పూర్తిగా చైన్ లింకు కాబట్టి దిగువ లెవల్స్ లో ఉన్నవారు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. Networking Online Money Earning Ways.

ముందుగా డబ్బు చెల్లించి వెబ్ సైటు ద్వారా ఏదైనా సంస్థలో సభ్యత్వం తీసుకుని, తరువాత వారికి పిరమిడ్ పద్దతిలో క్రింద లెవల్లలో పరిచయస్తులను నమోదు చేయించడానికి చాలమంది సోషల్ మీడియాను ఆశ్రయిస్తూ ఉంటారు. సభ్యత్వం తీసుకున్నాక వారికు అనుభందంగా సభ్యలను చేర్చడానికి వివిధ రకాల పోస్టులతో సోషల్ మీడియాలోనే సమయం వెచ్చించే వారు ఉంటారు. కేవలం లింకింగ్ విధానం ద్వారా డబ్బును రొటేట్ చేసే విధానం ఎక్కువకాలం మనగలగదు, కానీ మొదటలో చాలామందిని ఆకర్శిస్తుంది. కారణం నెట్ వర్క్ విధానంలో కాగితంపై లెక్కలు, లక్షలలో కనబడుతూ ఉంటుంది.

నెట్ వర్కింగ్ విధానంలో డబ్బు చెల్లించి డబ్బును సంపాదించడానికి మీ పరిచయస్తులతో కూడా డబ్బు చెల్లించి నమోదు చేయించండి. అనే విధానానికి చేరువ కావద్దు, కేవలం తేలికగా పనిలేకుండా డబ్బును సంపాదించడమంటే మోసపూరిత విధానం కనబడకుండా ఆకర్శణీయమైన పధకాలతో సభ్యులను మభ్యపెడుతూ ఉంటాయి. “Networking Online Money Earning Ways:.

ధన్యవాదాలు
vega2020