Sign into Google Drive Through Gmail Account

Sign into Google Drive Through Gmail Account for Cloud Storage.

Every Gmail holder have to Sign into Google Drive Through Gmail Account. Google Drive is useful for user data backup into the cloud storage, which is provided by Google Drive to a user. At any time smartphone was loose or could not using it anyway if you back up your data with a schedule, it is useful to use on another device. Google drive is a product of the Google to a user as default application of the Android smartphones.  Google Drive data available upto15GB for a Gmail account holder. The user can able to save data in Google Drive upto15GB, which was photos, files, user data, and app data. If usage exceeds more than 15GB, need to buy extra storage for the account.

ఒక జీమెయిల్ ఖాతాదారుకి Google Drive ఒక ఆన్ లైన్ స్టోరెజ్, ఈ Google Drive ఉపయోగించుకుని జీమెయిల్ డేటా భద్రపరచు కోవచ్చును. ఏదైనా కంప్యూటర్ / లాప్ టాప్ లాంటి పరికరం కలిగి ఉన్న జీమెయిల్ ఖాతాదారు Google Drive ద్వారా జీమెయిల్ ఖాతా డేటా ఆన్ లైన్లోకి సేవ్ చేయవచ్చును. 15జిబి వరకు ఒక జీమెయిల్ వినియోగదారునికి గూగుల్ అందిస్తుంది. ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్ ఫైల్స్, ఇతర ఫైల్స్, వినియోగదారు డేటా, మొబైల్ ఆప్ డేటా Google Drive లోకి భద్రపరచవచ్చును. ఏవైనా ఫైల్స్ Google Driveలోకి అప్ లోడ్ చేసి భద్రపరిస్తే, అవి ఎప్పటికీ తిరిగి తొలగించేవరకు ఉంటాయి.

Google Drive Preinstalled Mobile App For Android Smartphones

Sign into Google Drive Through Gmail Accountఒక గూగుల్ ఖాతాకి జీమయిల్ ద్వారా కేటాయించబడిని అంతర్జాల నిల్వకి మించి ఎక్కువగా Google Drive నిల్వని వాడితే మాత్రం తగిన పధకం ద్వారా నెలవారీ, సాలువారీ చెల్లింపు పద్దతిలో కొనుగోలు చేయాలి. స్మార్ట్ ఫోను కలిగి ఉన్న వినియోగదారు జీమెయిల్ ఖాతాతో Google Drive Mobile App ఉపయోగించవచ్చును. ఈ Google Drive స్మార్ట్ ఫోనులో ముందుగానే ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. స్మార్ట్ ఫోను హోమ్ స్క్రీనులో ఉండే Google Apps ఫోల్డరులో ఇతర గూగుల్ ఆప్స్ తో కలసి ఉంటుంది. Google Driveలోకి బ్యాక్ అప్ చేయబడిన డేటా నిర్దిష్ట కాలపరిమితి వరకే భద్రపరచబడి ఉంటుంది. ఆ కాలపరిమితిని సరిచూసుకుని మరలా బ్యాక్ అప్ చేసుకోవడం చేయాలి. Sign into Google Drive Through Gmail Account to any internet browsing device.



బ్యాక్ అప్ (Backup) – భద్రపరచడం (Save) చేయడానికి తేడా ఉంటుంది. బ్యాక్ అప్ అంటే ఏ పరికరం నుండి డేటా సేకరించి ఒక చోట గుప్తంగా ఉంచామో, అదే చోటనుండి ఏపరికరం నుండి డేటా సేకరించామో, ఆ పరికరంలోనే తిరిగి రీస్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇతర పరికరాలలో ఉపయోగించడానికి ఉపయోగపడదు. అయితే బ్యాక్ అప్ ఒక మొబైల్ ఆప్ ద్వారా ఎంపిక చేసిన డేటాని ఆన్ లైన్ ఖాతా ద్వారా భద్రపరిస్తే, తిరిగి అదే ఖాతా ద్వారా అదే మొబైల్ ఆప్ ద్వారా ఇతర కొత్త పరికరంలోకి అప్డేట్ చేసుకోవచ్చును. జీమెయిల్ ఖాతా ద్వారా మొబైల్ ఆప్స్, గూగుల్ ఫోటోలు, మ్యూజిక్ ఫైల్స్, కాంటాక్ట్స్ లాంటివి, ఆన్ లైన్ లోకి సేవ్ చేస్తే, మరలా అదే ఖాతా వేరే స్మార్ట్ ఫోనులో ఓపెన్ చేయవచ్చును.

స్మార్ట్ ఫోనులో డేటాని Google Drive ద్వారా ఏవైనా ఫోటోలు, మ్యూజిక్ ఫైల్స్, డాక్యుమెంట్స్, వీడియోలు, జిప్ చేయబడిన బ్యాక్ అప్ డేటా అప్ లోడ్ చేస్తే, తిరిగి మీరు ఆ డేటాని తొలగించేవరకు, అలానే భద్రంగా ఉంటంది. బ్యాక్ అప్ డేటా తిరిగి స్టోర్ చేయడానికి ఉపయోగపడితే, మాన్యువల్ గా సేవ్ చేసిన డేటా ఎక్కడైనా ఉపయోగించడానికి పనికివస్తుంది. Google Drive లో డేటా మాన్యువల్ గా భద్రపరిస్తే, ఏ జీమెయిల్ ఖాతా ద్వారా భద్రపరిచామో, అదే ఖాతా ఉపయోగించి ఇతర కంప్యూటర్స్ మరియు పరికరాలలో Sign into Google Drive Through Gmail Account ఉపయోగించవచ్చును.

Sign in Google Drive Through Gmail Account

స్మార్ట్ ఫోనులో మీరు జీమెయిల్ ద్వారా Google Play Store లో ఇతర మొబైల్ ఆప్స్ డౌన్ లోడ్ చేయగలుగుతున్నారు అంటే, Google Drive లోకి ఆటోమేటిక్ గా Sign in అవుతారు. అయితే ఇతర పరికరాలు అంటే కంప్యూటర్ / లాప్ టాప్ వంటి వాటిలో Google Drive లోకి Sign in అవ్వలాంటే ఏదైనా బ్రౌజరు క్రోమ్/ఫైర్ ఫాక్స్ / ఓపెరా / సఫారి లాంటివాటిలో ఏదో ఒకటి కంప్యూటర్/లాప్ టాప్ లో ఇన్ స్టాల్ చేయబడి ఉండాలి. అలా ఇన్ స్టాల్ చేయబడిన ఒక బ్రౌజరుని ఓపెన్ చేసి Sign into Google Drive Through Gmail Account ఈ చిత్రంలో ఉన్నమాదిరి బ్రౌజరు యొక్క అడ్రసు బారులో www.google.com అని టైపు చేస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ అవుతుంది. అయితే మీరు గూగుల్ సెర్చ్ ద్వారా కూడా Google Drive web page కనుగొనవచ్చును.

అలా సెర్చ్ చేయనవసరం లేకుండానే google web పేజి ఓపెన్ అయ్యాక కుడి పైభాగాన గమనిస్తే క్రింది చిత్రంలో గ్రీన్ కలర్లో లైన్ ఉన్నచోట 9 చిన్న చిన్న బాక్స్ టైపు సింబల్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ మౌస్ తో క్లిక్ చేస్తే వచ్చే డ్రాప్ డౌన్ ఇమేజ్ లిస్టులో Google Drive కూడా ఉంటుంది.  Sign into Google Drive Through Gmail Account
అక్కడ అలా ఓపెన్ చేయవచ్చును. అలాగే డెస్క్ టాప్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజరు అయితే Sign into Google Drive Through Gmail Account ఈ చిత్రం మాదిరి బ్రౌజరు ఎడమ పైభాగాన ఉంటంది అక్కడ క్లిక్ చేసినా Google Apps ఓపెన్ అవుతాయి. అక్కడ నుండి కూడా Google Drive వెబ్ ఆప్ ఓపెన్ చేసి ఉపయోగించుకోవచ్చును. గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయగానే Go to Google Drive అంటూ ఆంగ్ల అక్షరాలు కలిగిన బటన్ బ్రౌజరు మద్యలో అలగే బ్రౌజరు కుడి పైభాగాన ఉంటుంది. ఆ బటన్ పై టచ్ చేయగానే మీరు Gmail అయ్యినట్టే, మీ జీమెయిల్ ఐడి, పాస్ వర్డు ఇచ్చి లాగిన్ అవ్వవచ్చును.

Google Drive Is Useful for Smart Device Backup

క్లౌడ్ స్టోరేజ్ అందించే Google Drive మాదిరి ఇతర మొబైల్ ఆప్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోను తయారీదారులు కూడా వారి ఫోను వినియోగదారుల కొరకు క్లౌడ్ స్టోరేజ్ మొబైల్ ఆప్స్ అందిస్తున్నాయి. ఇంతకుముందరి పోస్టులో Clould Storage Mobile Apps గురించిన ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్లకొరకు Google Play Store లభించే ఆప్స్ గా చెప్పబడినది. చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

మీ స్మార్ట్ ఫోను నుండి కానీ కంప్యూటర్ లేక లాప్ టాప్ మరే ఇతర ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసే వీలున్న పరికరాలలో నుండి Google Drive లోకి కేవలం ఫైల్స్ మాత్రమే అప్ లోడ్ చేయగలుగుతారు. ఫోల్డర్ ను ఫోల్డరుగా Google Drive లోకి అప్ లోడ్ చేయలేరు. అంటే మీ స్మార్ట్ ఫోనులో సాంగ్స్ అన్ని ఒక ఫోల్డరులో ఉన్నాయి, ఆ సాంగ్స్ కలిగిన ఫోల్డరుని Google Drive లోకి అప్ లోడ్ చేయలేరు. ఒక్కొక్క సాంగుని Google Drive లోకి అప్ లోడ్ చేయగలుగుతారు. అయితే అలా కాకుండా పాటలన్నింటిని కలిగి ఉన్న ఫోల్డరుని వేరే ఫార్మట్లోకి మార్చి, అలా మార్చిన ఫోల్డరుని ఒకేసారి Google Drive లోకి అప్ లోడ్ చేయగలుగుతారు. Sign into Google Drive Through Gmail Account.

Upload small zip files into Google Drive for quick re download from Google Drive.



Noteగమనిక: Google Drive లోకి ఎక్కువ ఫైల్స్ ని కలిగిన ఫోల్డరుని zip / Rar ఫార్మట్లలోకి కన్వర్ట్ చేసి పెట్టేటప్పుడు ఆ ఫోల్డరు పరిమాణం తక్కువగా ఉండేటట్టు చూడండి. అప్ లోడ్ అవుతుంది కదా అని ఎక్కువ ఫైల్స్ కలిగిన ఫోల్డరు zip/rar ఫార్మట్లలోకి మార్చేసి Google Drive లోకి అప్ లోడ్ చేస్తే, తిరిగి ఆ పెద్ద పరిమాణంలో ఉన్న ఫైలుని డౌన్ లోడ్ చేయడం అన్ని వేళలా సాద్యపడదు. ఇతర స్థలాలోకి వెళ్లినపుడు అక్కడ నెట్ వేగం తక్కువగా ఉండవచ్చును, అప్పుడు ఆ ఫైలు డౌన్ లోడ్ అవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కోవాలి. అంతేకాకుండా Google Drive నుండి తిరిగి డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు గూగుల్ డ్రైవ్ స్కానింగ్ చేయడం సాద్యం కాకపోతే, కొన్ని ఆన్ లైన్ ప్రదేశాలలో ఆ పెద్ద పరిమాణం కలిగిన ఫైల్స్ డౌన్ లోడ్ చేయలేరు.

ఏవైనా ఎక్కువ ఫైల్స్ కలిగిన ఫోల్డరుని zip/rar ఫార్మట్లోకి మార్చి అప్ లోడ్ చేయవలసి వస్తే మాత్రం, ఆ ఫోల్డరుని చిన్న ఫోల్డర్స్ గా విభజించి, అలా విభజించిన చిన్న చిన్న ఫోల్డర్లని Googlde Drive లోకి అప్ లోడ్ చేయడం వలన తిరిగి వాటిని ఎప్పుడైనా ఎక్కడైనా తేలికగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఉదా: 150MB సైజు కలిగిన ఫోల్డరుని 3 అంతకన్నా ఎక్కువ ఫోల్డర్లుగా చేసి, zip/rar ఫార్మట్లలోకి మార్చి Google Drive లోకి అప్ లోడ్ చేయవచ్చు. తక్కువ సైజు ఫైల్స్ అయితే తొందరగా అవసరానికి ఉపయుక్తంగా ఉంటాయి, తేలికగా వేగంగా డౌన్ లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది.

ధన్యవాదాలు
vega2020