Smartphone Mobile Apps Sometimes Having Harmful Ads

Smartphone Mobile Apps Sometimes Having Harmful Ads

Smartphone Mobile Apps Sometimes Contains Harmful Ads

Smartphone Mobile Apps Sometimes Contains Harmful Ads స్మార్ట్ ఫోను ఆకర్షణీయమైన వస్తువుగా మార్కెట్లో ఉంది. కొన్ని స్మార్ట్ ఫోను మోడల్స్ అయితే సెకండ్లలో వేల ఫోన్లు ఆన్ లైన్ ద్వారా అమ్ముడుపోతున్నాయి. mobilesలో ఎక్కువగా స్మార్ట్ ఫీచర్లు కలిగిన phones వచ్చాక మొబైల్ వాడుక దారులు పెరిగారు. ఇక mobile data ప్లాన్స్ చవకగా ఉండేసరికి ఇంటర్నెట్ వినియోగం ఇంకా ఎక్కువ అయ్యింది. కంప్యూటర్లో ఇంటర్నెట్ ద్వారా వీడియోలు చూడడం లేక ఏదైనా విషయంపై బ్రౌజ్ చేయాలంటే తప్పనిసరిగా ఆఫీసు కానీ ఇంట్లో కానీ సీటులో కూర్చునే చేయవలసిన పని, లాప్ టాప్ అయిన అంతే కానీ వెనుకాలే బాగ్ మోసినట్టు మోయాలి. కానీ స్మార్ట్ ఫోను అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోలు చూడవచ్చు. mobile data అందుబాటులో ఉన్నచోట ఎప్పుడైనా ఎక్కడైనా ఆన్ లైన్ వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. స్మార్ట్ ఫోను వచ్చి స్మార్ట్ సదుపాయాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందిస్తూ యువతతో బాటు మిగిలిన వారిని కూడా ఆకర్షిస్తుంది.

స్మార్ట్ ఫోను వాడుక విధానం ప్రధానం ఎందుకంటే, స్మార్ట్ ఫోన్లో మన యొక్క వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ పరిచయాలు, ఆఫీసు పరిచయస్తుల పరిచయాలు అలగే స్నేహితుల పరిచయాలు mobile numbers సాధారణ mobilephone లలో సేవ్ చేయబడి ఉంటాయి. ఇక ఇప్పుడు smartphone లలో అయితే mobile apps ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, money లావాదేవీలు నిర్వహించే మొబైల్ ఆప్స్ వాడుక కూడా అధికంగా ఉండడం వలన ఆర్ధికపరమైన విషయాలు కూడా smartphones నందు సేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా smartphones నందు mobile apps ద్వారా వ్యక్తిగత వివరాలు నిక్షిప్తం అవుతున్నాయి. smartphone సరైన అవగాహనతో ఉపయోగించకపోతే smartphone లో ఉన్న డేటా వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ‘Smartphone Mobile Apps Sometimes Contains Harmful Ads’.

సోషల్ మీడియా వలన వ్యక్తి విషయాలకు కూడా వ్యాప్తి ఎక్కువ

సోషల్ మీడియా mobile apps వలన వ్యక్తిగతం అంతా వ్యవస్థలో బహిర్గతం అవుతూ ఉంటుంది. ఒకప్పుడు సెలబ్రిటిలకు సంభందించిన వ్యక్తిగత వివరాలు ఎక్కువమందికి బహిర్గతం అవుతూ ఉంటే, సాదారణ వ్యక్తిగత విషయాలు సన్నిహితులకు మాత్రమే తెలిసేవిగా ఉండడం ఉండేది. smartphones వాడుకలో social media mobile apps వలననే చాలామంది వ్యక్తిగత విషయాలు తమకే తెలియని వారికి కూడా తెలుస్తూ ఉండడం జరుగుతుంది. టివిలోనే చూసే ప్రత్యక్ష్య ప్రసారాలు mobile apps ద్వారా smartphones నందే ఎక్కడ నెట్ వర్క్ సిగ్నల్ బాగుంటే అక్కడ ఎప్పుడైనా జరిగే ప్రత్యక్ష్య ప్రసారాలు చూడవచ్చు. ధియేటర్ కి వెళ్లి సినిమా చూసే విధానం కేవలం కొత్తగా విడుదల అయిన చిత్రాలకే పరిమితం అయ్యింది. కొన్ని నెలలదాటినా సినిమాలు mobile apps ద్వారా smartphones నందే చూసే అవకాశాలు ఉన్నాయి. smartphone ఉపయోగాలు ఎక్కువగానే కనబడుతున్నాయి.



ఎంత ఉపయోగం ఉంటే అంత సమయం ఆ ఉపయోగపడే వస్తువుని వాడడం పరిపాటి అయ్యింది. సాదారణంగా smartphones లో ఉండే సమస్యలు ఏమిటి అంటే, మనం ధియేటర్లో సినిమా చూస్తే, కేవలం సినిమా ప్రారంభానికి విశ్రాంతి తరువాత ప్రారంభానికి వాణిజ్య ప్రకటనలు చూస్తూ ఉంటాం. అదే ఇంట్లో టివిలో ఒక సూపర్ హిట్ అయిన సినిమా చూస్తున్నాం అంటే, అప్పుడు అరగంటకి పావుగంట వాణిజ్య ప్రకటనలు చూడవలసిన పరిస్థితి ఉంటుంది. ధియేటర్లో సినిమా చూడడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తే, టివిలో పాపులర్ సినిమా చూడడానికి నెలవారీ అద్దెతో బాటు, ఎక్కువ సమయం ఖర్చు చేస్తాం. మనిషి తిరిగి తీసుకురాలేని సమయాన్ని ఎక్కువసేపు ఖర్చు చేయాల్సి వస్తుంది. ధియేటర్ సినిమాకి – ఇంట్లో టివి సినిమాకి ఉన్న తేడా లాంటిదే, smartphones నందు mobile apps వలన కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. Smartphone Mobile Apps Sometimes Contains Harmful Ads

మొబైల్ బ్రౌజర్లో వచ్చే కొన్ని ప్రకటనలు స్క్రీను మొత్తంగా ఉండి, కంటెంట్ ని కనబడనీయవు

Smartphone Mobile Apps Sometimes Contains Harmful Adsయూట్యూబ్లో సినిమా చూస్తుంటే కొన్నింటిలో టివి సీరియల్లో యాడ్స్ వచ్చినట్టు వస్తూ ఉంటాయి. అయితే యూట్యూబ్ వీడియోలలో వచ్చే వాణిజ్య ప్రకటనలు దాటవేసే సదుపాయం ఉండడం మరియు ఆ వీడియో వాణిజ్య ప్రకటనలు smartphoneపై అంతగా ప్రభావం చూపవు. అయితే కొన్ని రకాల mobile apps లేక mobile browserలో కొన్ని రకాల websiteలలో ఉండే ప్రకటనలు smartphoneకు హానిని చేసేవిగా ఉంటాయి. ప్రక్క చిత్రంలో చూడండి బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు బ్రౌజర్లో ఓపెన్ అయ్యి ఉన్న website లో యాడ్స్ ఉంటే, కొన్ని రకాల యాడ్స్ మాత్రం ప్రక్క చిత్రంలో చూపిన విధంగా mobile స్క్రీనుని హాంగ్ చేస్తూనే ఉంటాయి. బ్యాక్ బటన్ నొక్కిన తిరిగి అదే పేజి ఓపెన్ అవుతుంది, కానీ బ్రౌజర్లో యాడ్ హైడ్ కాదు. అలాంటి యాడ్స్ వలన, ఆ యాడ్స్ ప్రకటించే website వలన smartphones కి హాని కలిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి యాడ్స్ టచ్ చేసే ఏదైనా ఫైల్ కనుక smartphoneలో డౌన్ లోడ్ అయితే ఇక ఆ mobile పనితీరులో తేడా వస్తుంది. అప్పుడప్పుడు హాంగ్ కావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే బ్రౌజ్ చేసేటప్పుడు కచ్చితంగా సేఫ్ అనుకున్న websiteలానే mobile బ్రౌజర్లో ఓపెన్ చేయాలి.

 

బ్రౌజింగ్ మరియు మొబైల్ ఆప్స్ గురించిన అవగాహనా smartphone యూజర్ కి అవసరం

ఒకవేళ బ్రౌజింగ్ పై అంతగా అవగాహన లేకపోతే, కొన్ని reliable mobile apps ఉపయోగించడం మేలు అంటారు. మొబైల్ బ్రౌజర్ ద్వారా ఏవైనా ఆడియో వీడియో ఫైల్స్ డౌన్ లోడ్ చేసేటపుడు ఇటువంటి యాడ్స్ వస్తూ mobile ని హాంగ్ చేస్తూ ఉంటాయి. బ్రౌజర్లో వెబ్ పేజిని కదలకుండా హాంగ్ చేస్తూ ఉంటాయి. కనిపిస్తున్న యాడ్ పైన టచ్ చేసే వరకు ఆ యాడ్స్ డిస్ప్లే అవుతూ ఆర్టికల్ చదవకుండా లేక ఆ వెబ్ పేజి చూడకుండా అడ్డుకుంటాయి. క్లిక్ చేస్తే వేరే వెబ్ పేజి లేక ఫైల్స్ లేక మొబైల్ డౌన్ లోడ్ కోరుతూ ఉంటాయి. Smartphone Mobile Apps Sometimes Contains Harmful Ads

అటువంటి ప్రకటనలు కాకుండా గూగల్ యాడ్ సెన్స్ ద్వారా ఉండే వెబ్ పేజిలు ఎటువంటి ఇబ్బంది లేకుండా mobile వెబ్ పేజిలలో కేవలం యాడ్స్ చూపుతూ ఉంటాయి. అంతేకాని బ్రౌజరుని హాంగ్ చేయడం, లేక అదేపని యాడ్ మాత్రమే కనబడే విధంగా స్క్రీను అంత వ్యాపించడం లాంటివి గూగుల్ యాడ్స్ లో ఉండవు. గూగుల్ కాకుండా కొన్ని రకాల ఇతర యాడ్స్ మాత్రం వెబ్ పేజి లేక mobiles బ్రౌజరుని కదలాకుండా ఆపుతూ, యాడ్ స్క్రీను అంతా వ్యాపించి ఉంటాయి. ఇటువంటివి క్లిక్ చేస్తే ఒక్కోసారి mobile కు హాని చేసే ఫైల్స్ కూడా డౌన్ లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. గూగుల్ యాడ్స్ సెన్స్ వలన ఇటువంటి ఇబ్బంది బ్రౌజరుకి కలగదు. యాడ్ సెన్స్ కలిగిన ఒక website mobile పేజి ఎలాగా ఉందో ఈ క్రింది వీడియోలో చూడండి. మీరు మొబైల్ బ్రౌజర్లో క్రోమ్/ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌజర్లో వెబ్ పేజిలు చూస్తున్నప్పుడు గూగుల్ యాడ్స్ ఉన్న అవి web page పైకి క్రిందికి కావాల్సిన విధంగా స్క్రోల్ అవుతాయి. కాని ఆ యాడ్స్ mobile web page ని    కదలకుండా అడ్డుకోవు. క్రింది వీడియో ఒకసారి చూడండి. యాడ్ సెన్స్ ఉన్న ఈ వెబ్ పేజి ఎలా స్క్రోల్ అవుతుందో.

Mobile Apps Ads కూడా కొన్ని స్క్రీనుపై ఉండి ఆ ఆప్ నుండి బయటకు వచ్చేవరకు కనబడుతూనే ఉంటాయి.

smartphone లో mobile apps వాడుతూ ఉంటాం. కొన్ని కంపెనీ మొబైల్ ఆప్స్ లో యాడ్స్ ఉండవు. ఉదాహరణకు జిమెయిల్, వాట్సప్, షాపింగ్ apps ప్రసిద్ది పొందిన కంపెనీ మొబైల్ ఆప్స్ లలో యాడ్స్ ఉండవు కానీ కొన్ని రకాల mobile apps లో మాత్రం యాడ్స్ ఉంటాయి. ట్యుటోరియల్ మొబైల్ ఆప్స్ లాంటి వాటిలో యాడ్స్ కనబడుతూ ఉంటాయి. కానీ అవి మొబైల్ ఆప్ కంటెంట్ చూస్తున్నప్పుడు అలా కనబడి ఇలా మాయం అవుతాయి, కానీ చూస్తున్న స్క్రీను కదలికలపై ఎటువంటి అజమాయిషీ చేయవు. ఇలాంటి mobile apps అందులో వచ్చే యాడ్స్ కొన్ని నిర్దిష్ట ప్రమాణాలతో యాడ్స్ చేయడం వలన అవి అలా ప్రవర్తిస్తూ ఉంటాయి. క్రిందగా ఒక ఇంగ్లీష్ గురించి తెలుగులో వివరించే మొబైల్ ఆప్స్ లో కనబడే యాడ్స్ ఎలా ఉంటుందో స్క్రీను రికార్డింగ్ జత చేయబడి ఉంది. గమనించండి. Smartphone Mobile Apps Sometimes Contains Harmful Ads

అయితే కొన్ని రకాల mobile apps లో మాత్రం వచ్చే యాడ్స్ స్క్రీను అంతగా వచ్చి వాటిపై టచ్ చేసేదాక అవి కనబడుతూనే ఉంటాయి. టచ్ చేయగానే ఆ యాడ్ కు సంభందించిన mobile web పేజి ఓపెన్ అవుతుంది. ఇటువంటి యాడ్స్ ఎక్కువగా mobile phone కి హాని చేసే virus ఫైల్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది, అంటారు. అలాగే అవి mobile apps ద్వారా యూజర్ వ్యక్తిగత డేటాని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి ఇలా టచ్ చేస్తేగాని మాయంకానీ mobile యాడ్స్ ను చూపే mobile apps తొలగించడం ఉత్తమమని చెబుతారు.

Youtube వీడియో ప్రకటన దాటవేయడం

If you observe vega’s website, It is also contained with google ads but could not disturb your browsing, only showing ads for your view. మీరు vega’s యొక్క website vega2020.com గమనించారా మొబైల్ బ్రౌజర్లో కానీ web బ్రౌజర్లో కానీ కేవలం ఒకటి రెండు యాడ్స్ మాత్రమే కనిపిస్తాయి. అవి కేవలం ప్రకటన ఉద్దేశం మీ దృష్టికి తేవడం వరకే పరిమితం కానీ మీ దృష్టిని మళ్ళించడం వాటి ఉద్దేశం కాదు. ఏ వాణిజ్య ప్రకటన అయినా కేవలం దృష్టికి తీసుకువెళ్ళేదిగా ఉంటేనే అది సరైన ప్రకటన. యూజర్ దృష్టిని మళ్ళించడం లేక చేస్తున్న పనికి అంతరాయం కలిగించే mobile app / mobile web యాడ్స్ వలన smartphones కి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువని అంటారు.

smartphones ద్వారా వీడియోలు వీక్షించేటప్పుడు కూడా వచ్చే ప్రకటనలు వస్తూ ఉంటాయి. అయితే ప్రకటనలను దాటవేసే బటన్ కూడా ప్రకటన ప్రసారం అవుతున్నప్పుడు వస్తూ ఉంటుంది. ఆంగ్ల భాషలో అయితే Skip add అని తెలుగు భాషలో అయితే ప్రకటనదాటవేయి అని బటన్ ప్రకటన సమయంలో స్క్రీనుపై కనబడుతూ ఉంటుంది. ఆ బటన్ పై టచ్ చేయడం ద్వారా ప్రకటన మాయం అయ్యి సాధారణ స్థితిలో ఎంపిక చేసిన వీడియో ప్రసారం అవుతుంది. క్రిందిగా ఒక యూట్యూబ్ వీడియో గమనించండి “Smartphone Mobile Apps Sometimes Contains Harmful Ads”

బ్రౌజరు మరియు mobile apps ఉపయోగించడంలో పరిశీలన లేకపోతే, పొరపాటున virus ఉన్న యాడ్స్ పై టచ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి mobileలో ఎక్కువగా ఉపయోగించే apps ని పూర్తిగా సెట్టింగ్స్ తో సహా ఒక సారి పరిశీలించడం వలన ఆ app గురించి అవగాహనతో పాటు, ఎప్పుడైనా virus వస్తే app లో జరిగిన మార్పులు తెలిసే అవకాశం ఉంటుంది. smartmobiles లలో ఉండే apps పై అవగాహనా ఏర్పరచుకోవడం smartphone వినియోగదారులకు అవసరం.

ధన్యవాదాలు
vega2020

[Total: 0    Average: 0/5]
local_offerevent_note

account_box


local_offer