Smartphone Touchscreen Impacts Smart Hands

Smartphone Touchscreen Impacts Smart Hands

స్మార్ట్ ఫోను వ్యక్తి జీవితంలో సాదారణ వస్తువుగా మారి కొందరికి నిత్యావసర వస్తువుగా మారింది. కొందరు అయితే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోనుపై వేళ్లను కదిలిస్తూనే ఉంటారు. మొత్తం మీద ఎక్కువ మంది సెల్ ఫోను టచ్ స్క్రీనును చేతి వ్రేళ్లతో తాకుతూ ఉంటారు. అయితే స్మార్ట్ ఫోను టచ్ స్క్రీనును వేలల్లో క్రిములు అంటిపెట్టుకుని ఉంటాయి అని పరిశోదకులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోను ఉపయోగం అంటే టచ్ స్క్రీనుని టచ్ చేయడం ద్వారానే, సెల్ ఫోనును ఉపయోగించగలం, కానీ మరుగుదొడ్డిలో ఉండే క్రిముల సంఖ్య కన్నా స్మార్ట్ ఫోను తాకే తెరపై ఉండే క్రిములు ఎక్కువ అని పరిశోదకులు తేల్చి చెబుతున్నారు. క్రిములు అనారోగ్య కారకాలు కావునా నిత్యం క్రిమికారక ప్రదేశాలకు వెళితే, తిరిగి వచ్చాక శరీర శుద్ది చేసుకుంటాము. మరి స్మార్ట్ ఫోను టచ్ స్క్రీనుని అంటిపెట్టుకునే క్రిముల వలన వ్యక్తి ఆరోగ్యానికి హాని ఉంటుంది కదా! Smartphone Touchscreen Impacts Smart Hands.

ఎక్కువగా చేతివ్రేళ్లతో స్మార్ట్ ఫోను టచ్ స్క్రీనుని వాడటం వలన, అలా స్మార్ట్ ఫోను టచ్ స్ర్కీనుపై ఉపయోగించిన చేతివేలు మంట ఎక్కడం, తిమ్మిరి రావడం, స్పర్శ లేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. సులువుగా వేగంగా పని జరుగుతుంది కదా అని అదేపనిగా చేతివ్రేళ్లను స్మార్ట్ ఫోను టచ్ పై ఉపయోగిస్తే, అలా ఉపయోగించిన చేతివ్రేళ్లపై ఉండే సహజ కణజాలం దెబ్బతింటుంది. స్మార్ట్ ఫోను టచ్ స్క్రీను చేతి వ్రేళ్లను ఉపయోగించడం కన్నా, టచ్ స్క్రీనుపై చేతివేలు మాదిరి, టచ్ పెన్ ఉపయోగిస్తూ, స్మార్ట్ ఫోను టచ్ స్క్రీనును ఉపయోగించవచ్చును. దీని వలన కొంతవరకు మన చేతివ్రేళ్లకు స్మార్ట్ ఫోనుపై ఉండే క్రిముల నుండి రక్షణ కల్పించిన వాళ్లము అవుతాము.

స్మార్ట్ ఫోను వాడలంటే టచ్ స్క్రీనును టచ్ చేయడం తప్పనిసరి కాబట్టి, చేతివేలు బదులుగా టచ్ పెన్స్ వాడటం ఉత్తమమైన పని. ఇంకా స్మార్ట్ ఫోనుని శుభ్రపరుస్తూ ఉండడం వలన, స్మార్ట్ ఫోను టచ్ స్క్రీనుని అంటి ఉండే క్రిములను పోగొట్టవచ్చును. మార్కెట్లో లభించే ఆల్కహాల్ స్వాబ్ లు ఉపయోగించి స్ర్కీనును తుడిచి, మెత్తని క్లాతుతో స్మార్ట్ ఫోను శుభ్రపరచడం మొదలైన చర్యల ద్వారా స్మార్ట్ ఫోను స్ర్కీను శుభ్రంగా ఉంచుకోవచ్చును. Smartphone Touchscreen Impacts Smart Hands.

స్మార్ట్ ఫోను వాడుక తప్పనిసరి పరిస్థితులే అందరికి ఉంటున్నాయి, అయితే తగు జాగ్రత్తతో స్మార్ట్ ఫోను వాడకపోతే, దానివలన ఉపయోగాలతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు పెరుగుతాయి. స్మార్ట్ ఫోను రేడియోషన్ విషయంలో, టచ్ స్క్రీను శుభ్రత విషయంలో తగు జాగ్రత్తలు స్మార్ట్ ఫోను వినియోగదారులకు తప్పనిసరి. అవసరాలు తప్పనిసరి అంతకన్నా ఆ అవసరాలు ఏ వ్యక్తి ఆధారంగా వస్తున్నాయో, ఆ వ్యక్తి శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము తప్పనిసరి. స్మార్ట్ ఫోను అతివినయోగం అంటే అది ఆరోగ్యకరమైన విషయం కాదు. మితము ఎప్పుడు మనిషికి మేలును చేస్తుంది. “Smartphone Touchscreen Impacts Smart Hands.”

Click here to read more for smartphone cleaning

ధన్యవాదాలు
vega2020