YouTube Mobile Dark Theme Mode For Eye Safety

YouTube Mobile Dark Theme Mode For Eye Safety

యూట్యూబ్ స్మార్ట్ ఫోనులో యూట్యూబ్ మొబైల్ ఆప్ (YouTube Mobile App) ఉపయోగించకుండా ఉండేవారు అరుదుగా ఉంటారు. కానీ కలర్ పుల్ వీడియోలు ఎక్కువసేపు చూడడం ఉంటే, అవి కంటికి సమస్యలు తెస్తాయి అంటారు. కాలాక్షేపంగా వీడియో వీక్షణ కాస్తా కొంతమందికి అలవాటుగా కూడా ఉండవచ్చును. ఎందుకంటే ఎక్కువగా చలనచిత్రాలతో పాటు నటీనటుల గాసిప్స్ పైవీడియోలు యూట్యూబ్ ద్వారా హల్ చల్ చేస్తూ ఉంటే, ఎవరైనా ఆకర్షితులవుతారు, YouTube Mobile Dark Theme Mode For Eye Safety.

ఇంకా మూవి మిక్చరే కాకుండా రాజకీయ, సామాజిక అంశాలలో చిత్ర విచిత్ర విషయాలతో వీడియో చానెల్స్ యూట్యూబులో అనేకంగా ఉంటాయి. అంతేకాకుండా ఈటీవి జబర్దస్తు కామెడి కార్యక్రమం యూట్యూబులో అప్ లోడ్ అయితే చాలు వేలకు పైగా వీక్షణలు వేళకానీ వేళల్లో కూడా వీక్షిస్తూ ఉంటారు. కాలక్షేపంగానో, కామెడి కోసమో యూట్యూబ్ ద్వారా వీడియోలు చూసేవారు అధికంగానే ఉంటారు. అలా ఎక్కువసేపు వీడియోలు స్మార్ట్ ఫోనులో చూసేవారు, స్మార్ట్ ఫోను డిస్ప్లే బ్రైట్ నెస్ (Smartphone Display Brightness)తగ్గించుకోవడం లాంటి వాటితో కొంత కళ్లకు రక్షణ కల్పించవచ్చును. డిస్ప్లే బ్రైట్ నెస్ (Display Brightness) తగ్గించడం వలన బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం ఎక్కువ సమయం నిలబడుతుంది.

డార్కు బ్యాక్ గ్రౌండు(Background) ఉండే విధంగా మొబైల్ ఆప్స్ సెట్ చేసుకుంటే, స్మార్ట్ ఫోను కాంతి కళ్లను అంతగా ఇబ్బంది పెట్టదు. డార్కు బ్యాక్ గ్రౌండు ఉండేవిధంగా సాలిడ్ సింగిల్ కలర్ స్మార్ట్ ఫోను వాల్ పేపరుగా(Smartphone Wallpaper) సెట్ చేసకోవడం వలన కూడా మొబైల్ కాంతి ప్రభావం (Mobile Light) కంటికి ఇబ్బందిగా ఉండదు. YouTube Mobile Dark Theme Mode For Eye Safety.

Click2Read about How To Find Harming Shortlinks In Your Smartphone

కొన్ని లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో డిస్ప్లే సెట్టింగ్స్ లో కంటి రక్షణ(Eye Protection)గా ఆటో సెట్టింగ్ సదుపాయం ఉంటుంది. ఈ ఆప్సన్ వివో స్మార్ట్ ఫోన్లలో ఉంటుంది. ఇతర కంపెనీ స్మార్ట్ ఫోన్లలో డిస్ప్లే సెట్టింగ్స్ (Display Settings)కూడా చూస్తే ఉండవచ్చును.

Click2Read PostPapa Posts

Click2Read Posts In English

Dark Background In Whatsapp And YouTube Mobile Apps

వాట్సప్ మొబైల్ ఆప్ ఎక్కువగా ఉపయోగిస్తుంటే, అందులో చాటింగ్ బ్యాక్ గ్రౌండును, ఏదైనా డార్క్ సాలిడ్ కలరుని (Dark Color) సెట్ చేసుకోవచ్చును. అలాగే యూట్యూబ్ మొబైల్ ఆప్ లో కూడా డార్కు థీము(Dark Theme)ని ఎంచుకోవడం ద్వారా యూట్యూబులో వీడియోలు చూస్తున్నప్పుడు కళ్లకు ఒత్తిడి కలగకుండా చూసుకోవచ్చును YouTube Mobile Dark Theme Mode For Eye Safety.

Click2Read About TouchScreen Dust

యూట్యూబు మొబైల్ ఆప్ పైభాగంలో కుడివైపుగా కనిపించే ఐకానులో మీ ఫోటో కానీ లేక మీ పేరులో మొదటి ఆంగ్ల అక్షరం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోటో లేక ఆ ఆంగ్ల అక్షరంపై టచ్ చేస్తే వచ్చే మెనులో సెట్టింగ్స్ పై టచ్ చేస్తే మరలా వచ్చే మెనులో నుండి జనరల్ సెట్టింగ్స్ పై (General Settings) టచ్ చేస్తే ఇంకో మెను వస్తుంది. ఆమెనులో ఉండే డార్క్ థీమ్ మోడ్(Dark Theme) ఎనేబుల్ చేసుకుంటే, మీ యూట్యూబ్ మొబైల్ ఆప్ స్క్రీను వెంటనే డార్కు కలర్లోకి మారుతుంది. ఈ విధంగా డార్కు కలర్ మోడ్ లేక థీమ్ మోడ్ అందుబాటులో ఉన్న ప్రసిద్ద మొబైల్ ఆప్స్ డార్కు కలరు(Dark Color)ని బ్యాక్ గ్రౌండు(Background)గా సెట్ చేసుకుంటే, మొబైల్ ఫోను కాంతి ద్వారా కళ్లపై పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చును. మితమెప్పుడూ మేలుగా, అపరిమితమెప్పుడూ అర్ధరహితంగా ఉంటుంది. “YouTube Mobile Dark Theme Mode For Eye Safety”.

ధన్యవాదాలు
vega2020