Aashada Shudda Purnima Tithi Veda Vyasa Purnima Guru Purnima

Aashada Shudda Purnima Tithi Veda Vyasa Purnima Guru Purnima

Aashada Shudda Purnima Tithi Veda Vyasa Purnima Guru Purnima

Vegaview: Aashada Shudda Purnima Tithi Veda Vyasa Purnima Guru Purnima వ్యాస పూర్ణిమ గురుపూర్ణిమగా ఉంది. రాక్షసాపహరణకు గురైన వేదాలు కలసిపోతే, ఆ మొదటిగురువుగా వేదాలను విభజించి, అష్టాదశ పురాణలను ప్రసాదించిన శ్రీమహావిష్ణువు అంశ అయిన వేదవ్యాస జన్మతిథి ఆషాడమాస పూర్ణిమ తిథి. ఈ ఆషాడ పౌర్ణమి రోజునే గురుపౌర్ణమిగా ప్రసిద్ది చెంది వేదవ్యాస మహర్షి సనాతనధర్మ ఆచార్యులచేత, జనుల చేత పూజలు అందుకుంటున్నారు.

భగవద్గీతలో మనోవికారాలు పోగొట్టే మహత్తు ఉంటే, జీవితాన్ని సార్ధకం చేసుకోగలిగే జ్ఞానాన్ని, సామాజికంగా వ్యక్తి కర్తవ్యతను గుర్తుచేస్తూ తనని తాను ఉద్దరించుకోగల ఆలోచనాశక్తిని ఇవ్వగలిగే జ్ఞాన బండగారం అయిన భగవద్గీత కలిగిన మహాభారతాన్ని లోకానికి ప్రసాదించిన కృష్ణద్వైపాయనుడు వ్యాసమహర్షి పదవిలో ఉన్నారు. లోకానికి జ్ఞాన, భక్తి, వైరాగ్య విషయాలను శాస్త్రాలుగా అందించిన మహర్షి వ్యాసమహర్షి సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరుపుడుగా చెబుతారు. ఆ విష్ణు రూపం గురురూపంలో వేదవ్యాస మహర్షిగా లోక మార్గనిర్దేశక శాస్త్రాలను అందించిన జగద్గురు స్వరూపం.పాఠాలు చెప్పిన గురువుల వలన విషయజ్ఞానం అందితే, జగద్గురు వేదవ్యాస మహర్షి వేదవిభజన, వ్యాసులవారి పద్దెనిమిది పురాణాల వలన దైవస్వరూపాల పూజవిధానాలు, స్త్రోత్రాలు, భక్తి విశేషాలు, పరమాత్మ లీలలు సనాతనధర్మపరులకు అందాయి. అటువంటి ఆచారాలు వంశపారంపర్యంగా మనకు అందుతున్నాయి అంటే అందుకు ఆద్యుడు ఆ శ్రీమహావిష్ణు స్వరూపం జగద్గురు వేదవ్యాస హృదయవిజ్ఞాన ప్రసాదమే. భగవంతుడిని చేర్చే భక్తిమార్గానికి అవసరమైన ఏశ్లోకమైన, స్త్రోత్రమైన గురువు వేదవ్యాస రచనలనుండి వెలువడినవే. ఏభాషలో ఉన్న మూలం వేదవ్యాస శాస్త్రాలే.

మహాత్మాగాంధీ, తిలక్ లాంటి స్వాతంత్ర్య పోరాట నాయకులకు గడ్డుకాలంలో కర్తవ్య దీక్షాదక్షులను చేసిన గ్రంధం శ్రీమద్ భగవద్గీత అనే చెబుతారు. అటువంటి భగవద్గీత అంతర్భాగంగా ఉన్న పంచమవేదమైన మహాభారతాన్ని, భాగవతులు, భగవానుడి లీలలను తెలియజేసే భాగవతం ప్రసాదించిన వేదవ్యాసతిథి రోజున వేదవ్యాసుని పూజించడం ఉంది. లోకభాందవుడు జ్ఞానరూపంలో అనేక గురుస్వరుపాలకు గురువుగా నిలిచిన జగద్గురు అయిన వేదవ్యాసుని జన్మదినం మనకు వెలుగుని ప్రసాదించిన పర్వదినమే. ఆదిశంకరచార్యులు భాష్యం వలన మరింత చేరువైన భగవద్గీతా జ్ఞానం మదిలో వెలుగువేదిక.

మన వాంగ్మయానికి మూలమైన గురుస్వరూపం జగద్గురు స్వరూపమే అయిన వ్యాసవిజ్ఞానం అద్బుతమైన విజ్ఞానం. ఎందరో మహానుబావులు వచ్చి అనేకరకాలుగా లోకమార్గ దర్శకమైన విషయాలను భోదించడం లేక ఆచరించి ఆచార్యులుగా లోకానికి మార్గదర్శకంగా నిలిచారు అంటే అందుకు మూలమైన జ్ఞానవిజ్ఞానమంతటికి మూలం వేదవ్యాస విజ్ఞాన ప్రసాదమే. Aashada Shudda Purnima Tithi Veda Vyasa Purnima Guru Purnima సత్యవతి పరాశర సుపుత్రుడుగా పుట్టిన కృష్ణద్వైపాయనుడు వ్యాసమహర్షిగా లోకాలను నడిపించే పరమాత్మను తెలియజేసే శాస్త్రవిజ్ఞానాన్ని లోకానికి ప్రసాదించారు.

vegaview: VedaVysa Vijnananni Pustakalu Andinche Free Gurukul Mobile App

విజ్ఞానమంటే జిజ్ఞాసువుల మదిలో మెదిలే వెలుగుల వేగు. జిజ్ఞాసువులకు విజ్ఞానాన్ని తెలియపరిచే పుస్తక రూపం స్మార్ట్ రూపం సంతరించుకుని మొబైల్ ఆప్స్ రూపంలో మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకొరకు లభిస్తున్నాయి. వేగం నియంత్రించాలంటే అదుపు, ఉపాయం అవసరం, ఉపాయాలకు పుట్టుకకు ఆలోచన కారణం అయితే అటువంటి ఆలోచనచేసే మనసుని సరైన మార్గంలో పెట్టేది జ్ఞానమే అంటారు. ఎరుకలో కష్టాన్నైనా ఇష్టంగా చేయగలిగే శక్తి జ్ఞానంవలననే వస్తుంది అంటారు. మరి అటువంటి జ్ఞానం మనకి పుస్తకరూపంలో అనేకమంది మహానుభావులు అందించారు. ఆ పుస్తకజ్ఞానానికి మూలమైన వేదవ్యాస పుట్టిన తిథిగా ఉన్న ఆషాడ మాస పౌర్ణమి తిథినాడు వ్యాసుడిని గుర్తు చేసుకుంటూ ఆరాదిస్తూ ఉండడం మన సామజిక ధర్మమే. Aashada Shudda Purnima Tithi Veda Vyasa Purnima Guru Purnima

గురుపూర్ణిమ సందర్భంగా జగద్గురువులను గురించి చెప్పే మొబైల్ ఆప్స్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఏవేవి ఉన్నాయి చూద్దాం. గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందంగా కనిపించే చిత్రాలతో మొబైల్ ఆప్స్ ఉంటే, గురు పౌర్ణమి సందర్భంగా గురువులపై ఉండే శ్లోకాలు స్త్రోత్రాలను అందించే మొబైల్ ఆప్స్ లభిస్తాయి. (Free Gurukul – Telugu Books, Pravachanams) ఉచిత గురుకుల తెలుగు పుస్తకాలు ప్రవచనాలు అందించే ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషను ఎన్నో విజ్ఞాన పుస్తకాలను డిజిటల్ రూపంలో స్మార్ట్ ఫోన్లో అందిస్తుంది. వేదాలు, అష్టాదశ పురాణాలు, వాటిపై వివిధ రచయతల రచనలు, గ్రందాలు, పురాణాలు, సామజిక రచనలు, మహానుభావుల గురించి దాదాపు 3500 పైగా పుస్తకాలూ ఒకే మొబైల్ ఆప్ లో లభిస్తాయి. వేదవ్యాస పరిచయం కలిగించే మహాభారతం, భారతంపై, భగవద్గీతపై ఉన్న రచనలు మనకి లభిస్తాయి. డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ధన్యవాదాలు
vega2020vegaview enlisted gadget apps

Aashada Shudda Purnima Tithi Veda Vyasa Purnima Guru Purnima
Scroll to top