Android 9.0 Pie New Version Missing Popular Feature

Android 9.0 Pie New Version Missing Popular Feature in Updates and New verions. స్మార్ట్ ఫోను వినియోగదారు సౌకర్యార్ధం సాంకేతికత ఎప్పటికప్పుడు సౌకర్యాలలో కొత్తదనం తెస్తూ ఉంటుంది. అలాగే అక్రమ వినియోగం నుండి సాధారణ వినియోగదారు రక్షణార్ధం కొన్ని సౌకర్యాలు నిలుపుతూ ఉంటారు. స్మార్ట్ ఫోను అంటే దానిచే పనిచేయించే సాఫ్ట్ వేర్ ఆండ్రాయిడ్ అందరికి తెలుసు, అందులో ఉండే వెర్షన్లు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఆండ్రాయిడ్ 1.0 ప్రారంభం అయ్యి 1.1 వెర్షన్ పెటిట్ ఫోర్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంగా మొదలయ్యి ఆండ్రాయిడ్ ఓరియో 8.1 వరకు వచ్చింది. కొత్తగా పై 9.0 ఎంపిక చేసిన కొన్ని కంపెనీ మోడల్స్ అప్డేట్ అందుబాటులో ఉండనుంది, కొత్తగా వచ్చే ఫోన్లలో కొద్ది మాసాల్లో రాబోతున్న ఓఎస్ 9.0.

Android 9.0 Pie New Version Missing Popular Featureఆండ్రాయిడ్ 8 వెర్షన్ని ఓరియోగా పేరు పెట్టిన గూగుల్ సంస్థ, ఆండ్రాయిడ్ 9.0 వెర్షన్లో కొన్ని పేర్ల పరిశీలన జరిపిన పిదప ఒక పేరు పెట్టింది. ఆ పేర్లలో ప్రధానంగా Pancake, Peanut Butter అండ్ Peda పరిశీలించి ఫైనల్ గా “Pie” టైటిల్ ప్రకటించారు. పై ఓఎస్ వచ్చే సదుపాయాలు ఎలా ఉంటాయో కొన్ని మసాల తరువాయి వచ్చే కొత్త ఫోన్లలో తెలుస్తుంది. ముందుగా ఎంపిక చేసిన మోడల్స్ లో పై అప్డేట్ వస్తుంది. అవి గూగుల్ పిక్సెల్, గూగుల్ పిక్సెల్ XL, గూగుల్ పిక్సెల్ 2, గూగుల్ పిక్సెల్ 2XL.

ఎప్పటికప్పుడు వినియోగదారుకి సాంకేతిక సదుపాయాలతో వినూత్న సాంకేతికను అందించే ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ కొన్ని కీ ఫీచర్స్. న్యూ సిస్టం నావిగేషన్, స్మార్ట్ టెక్స్ట్ సెలక్షన్, రిడిజైన్ క్విక్ సెట్టింగ్స్, సింపుల్ వాల్యూం కంట్రోల్స్, న్యూ డాష్ బోర్డు, ఆప్ టైమర్, న్యూ డూనాట్ డిస్ట్రబ్ మరియు విండ్ డౌన్ కొత్త కీ ఫీచర్లతో కలిగి ఉండే ఆండ్రాయిడ్ 9.0 వెర్షన్ త్వరలో సాదారణ కొత్త స్మార్ట్ ఫోన్లలో రానుంది. సరికొత్త ఫీచర్లతో రానున్న ఆండ్రాయిడ్ 9.0 ఫై వెర్షన్లో పాపులర్ అయిన పాత ఫీచర్ ఉపయోగించే అవకాశం ఉండదని అంటున్నారు. Android 9.0 Pie New Version Missing Popular Feature

Call Recording not working properly in future


కాల్ రికార్డింగ్ సదుపాయం, మనం మాట్లాడుతున్న కాల్ రికార్డు చేసే సదుపాయం వలన ఎవరితో ఏమి మాట్లాడమే మర్చిపోయినప్పుడు ఉపయోగపడుతుంది. లేక కొన్నిసార్లు ఆధారంగా కూడా ఉపయోగపడవచ్చు. అయితే కాల్ రికార్డు సదుపాయం దుర్వినియోగం ఎక్కువ అవుతందని కొన్ని దేశాల్లో నిషేదించారు. ఈ విషయంలో గూగుల్ సంస్థ కూడా ఆండ్రాయిడ్ మార్ష్ మాల్లో వెర్షన్లో ఈ సదుపాయం తొలగించారు. కానీ మూడవ పార్టీ తరపు డెవలపర్లు ఈ సదుపాయం సృష్టించకుండా అడ్డుకోలేదు. అయితే కొద్ది నెలలలో విడుదల కాబోతున్న ఆండ్రాయిడ్ 9.0ఫైలో మూడవ పార్టీ కాల్ రికార్డింగ్ మొబైల్ ఆప్ సరిగా పనిచేయదు.

ఆండ్రాయిడ్ పైతో పనిచేసే స్మార్ట్ ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో లేనట్టే, అయితే మూడవపార్టీ ఆప్స్ అందుబాటులో ఉంటే మాత్రం అవి కూడా సరిగా పనిచేయవు, అయితే రూట్ విధానంలో మూడవ పార్టీ మొబైల్ ఆప్స్ పని చేసే అవకాశం ఉంటుంది. అవసరానికి మించిన వాడుక లేక ఇతరులను నొప్పించే పనుల వలన ఆ పనికి ఉపయోగపడే సదుపాయాన్ని సమాజం నిషేదిస్తే, సాదారణ ప్రయోజనం పొందేవారు కూడా నష్టపోతారు. కొంతమంది మరిచిపోయే అవకాశం ఉన్నవారికి కాల్ రికార్డింగ్ సదుపాయం ఉపయోగం, కానీ దుర్వినియోగం వలన కాల్ రికార్డింగ్ సదుపాయం నిలిపివేస్తున్నట్టు సమాచారం. “Android 9.0 Pie New Version Missing Popular Feature” కాబట్టి అతివాడుక లేక దుర్వినియోగం వలన సమాజానికి సదుపాయం లక్ష్యానికి అడ్డు అవుతుంది.

ధన్యవాదాలు
vega2020

[Total: 0    Average: 0/5]