Android OS Budget Trendy SmartPhone Models

Android OS Budget Trendy SmartPhone Models

Android OS Budget Trendy SmartPhone Models vegaSmartview అనేకములైన అంశాలను స్మార్ట్ విషయాలుగా వివరిస్తూ యూజర్ చేతిలో చూపిస్తున్న స్మార్ట్ ఫోన్లకు సమాజంలో మంచి ఆదరణ ఉంది. కొత్త సౌకర్యాలు సాంకేతిక సదుపాయాలతో సరసమైన ధరలలో లభించే స్మార్ట్ ఫోన్లకు మంచి గిరాకి ఉంటుంది. అలా సాంకేతిక సదుపాయాలను చేరుస్తూ స్మార్ట్ ఫోన్లను మధ్యతరగతి వినియోగదారుకి అందుబాటు ధరలో అందించే స్మార్ట్ ఫోను కంపెనీల మోడల్స్ ఎక్కువ విక్రయాలు కలిగి ఉంటాయి.

Redmi Trendy Budget Smartphones: రెడ్మి స్మార్ట్ ఫోన్లు మన మార్కెట్లోకి వచ్చాక ప్రముఖ కంపెనీ స్మార్ట్ ఫోన్ల సాంకేతిక సదుపాయాలు పెరిగి, ధరలలో మార్పులు వచ్చాయి. మార్కెట్ లేని సమయంలో నాణ్యత ధరలలో మార్పులు చేసే వాణిజ్య వ్యవహారం డిమాండ్ పెరిగితే మార్పునకు శ్రీకారం జరిగే అవకాశం కూడా ఉంటుంది. సాదారణ సాంకేతిక అవసరాలకు సరసమైన ధరలలో అందించే స్మార్ట్ ఫోన్ల కంపెనీలలో ఇప్పుడు ప్రముఖమైన కంపెనీలు ఉన్నాయి.Keypad Phones: మొదట్లో ప్రాధమికంగా కాలింగ్, మెస్సేజింగ్, ఫోన్ బుక్, వాయిస్ రికార్డు, లౌడ్ స్పీకర్, రేడియో కేవలం ఆంగ్ల భాషలలో లభించే కీపాడ్ ఫోన్లు స్నేహితుల, బంధువుల, వ్యాపార, సేవ సంస్థల మద్య మాటల మార్పిడి పెట్టెగా ఉపయోగపడుతుంది. అలా కీపాడ్ ఫోన్లనుండి కెమెరా, మ్యూజిక్ సదుపాయాలు జతచేసుకుంటూ మల్టీమీడియా సౌకర్యాలతో కీపాడ్, స్లైడ్, ఓపెన్ టాప్ ఫోన్లకు సాంకేతికత అభివృద్ధి చెందితే సదరు సమయంలో మనకి నోకియా కంపెనీ అమ్మకాలు ఎక్కువగా ఉండేవి. సామ్సంగ్, మైక్రోమాక్స్ తదితర ఫోన్లు తరువాతి స్థానంలో ఉంటే, బ్లాక్ బెర్రీ క్వర్టి కీపాడ్ ఫోన్లు ప్రీమియం ఫోన్లుగా ప్రాచుర్యంలో ఉండేవి. సింబియాన్ ఓస్ తో నోకియా 6600, నోకియా N సిరీస్ ఫోన్లు ప్రీమియం ఫోన్లుగా ప్రసిద్ది.

Android OS SmartPhones Trended in the market:

ఆండ్రాయిడ్ ఆగమనం అన్నింటిని మొబైల్ ఓస్ లను ప్రక్కకు నెట్టి టాప్లో ఉంటే, సామ్సంగ్ తదితర సంస్థలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత ఫోన్లను తయారుచేసి మార్కెట్లో పోటిబడ్డాయి. 256ఎంబి రామ్, 164 ఎంబి ఫోను మెమరీ ఫోన్ల సుమారు ఎనిమిదివేల రూపాయల ధర నుండి ఉంటే, ఇప్పుడు అదే ధరలో 2జిబి రామ్ 16జిబి ఫోను మెమరీ కలిగిన స్మార్ట్ ఫోన్లు అనేక స్మార్ట్ సదుపాయాలతో లభిస్తున్నాయి. 256MB, 512MB, 768MB, 1.5GB, 2GB, 3GB, 4GB రామ్ స్మార్ట్ ఫోన్లతో బాటు గరిష్టంగా 6GB రామ్ కలిగిన స్మార్ట్ ఫోన్లు మనకి మార్కెట్లో లభిస్తున్నాయి.

ఇప్పుడు ఎక్కువగా ట్రెండిగా 3GB Ram, 32GB ఫోను మెమరీ లేక 4GB రామ్ 64GB ఫోను మెమరీ మొబైల్స్ ఇతర స్మార్ట్ సదుపాయాలతో లభిస్తున్నాయి. ఒకప్పుడు ఎనిమిదివేల రూపాయల ధరలో 2 మెగా పిక్సెల్ కెమెరా క్వాలిటీ కలిగిన ఫోన్లు ఉంటే, ఇప్పుడు అదే ధరలో 13 మెగా పిక్సెల్ ఫోన్లు సాదారణ నాణ్యతలో లభిస్తున్నాయి. ఇలా అన్ని స్మార్ట్ సదుపాయాలు సామాన్యధరలో మార్పులు చెంది అన్ని మొబైల్ కంపెనీలకు పోటిని పెంచాయి. Android OS Budget Trendy SmartPhone Models

ట్రెండి సదుపాయాలు కలిగిన స్మార్ట్ ఫోన్లు ఏఏ ధరలలో లభిస్తున్నాయనే వివరాలు తెలిపే పోస్టుని చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

Comparison Old Samsung Basic Smartphone and New Basic Smartphone

సదుపాయాలు Samsung S5360 Galaxy Y Samsung Galaxy J2 2018
ధరలు సుమారు రూ.7800/- రూ.7690/-
నెట్వర్క్ 2G, 3G 2G, 3G, 4G
డిస్ప్లే 3″ 5″
స్క్రీన్ రిజల్యుషన్ 320 x 240 pixels 540 x 960 pixels
ప్రాసెసర్ 832MHz 1.4 GHz
రామ్ 256MB 2GB
ఫోను మెమరీ 164MB 16GB
OS ఆండ్రాయిడ్ 2.3.3 ఆండ్రాయిడ్ 7.1
కెమెరా 2MP 8MP,5MP బ్యాక్ & ఫ్రంట్
రిజల్యుషన్ 1600×1200 pixels 3264 x 2448 Pixels
బాటరీ 1200mAh 2600mAh
ఇతర సదుపాయాలు వైఫై, బ్లూటూత్2.1, USB పోర్ట్, జిపిఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, రేడియో, మెమరీ కార్డు మొదలగు వైఫై, హాట్ స్పాట్, వోల్టే, ఫ్లాష్, ఆండ్రేనో గ్రాఫిక్స్, బ్లూటూత్4.1, USB పోర్ట్, జిపిఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, రేడియో, మెమరీ కార్డు మొదలగు.

చిత్రంగా ఒకేధరలో కాలం గడిచే కొలది స్మార్ట్ సదుపాయాలు పెరుగుతూ ఉంటున్నట్టు పై రెండూ స్మార్ట్ ఫోను మోడల్స్ గమనిస్తే అర్ధం అవుతుంది. పై రెండు పోలికపెట్టిన మోడల్స్ సామ్సంగ్ కంపెనీ గాలక్సీ ప్రాధమిక స్మార్ట్ ఫోన్లు. అదే ధరలలో సుమారు 9K నుండి ఇతర రెడ్మి, లెనోవో, హానర్ తదితర కంపెనీల మోడల్స్ ఇంకా బెటర్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇప్పుడున్న ట్రెండ్లో బెస్ట్ ఫీచర్స్ అంటే సుమారు 12K ధరలలో లభిస్తాయి, విడుదల అయ్యి 6months దాటిన మోడల్స్ తగ్గింపు ధరలలో లభించవచ్చు. ప్రస్తుత సాంకేతికతను బట్టి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు 15K రేంజిలో ట్రెండి సదుపాయాలు కలిగి ఉంటాయి.

Present Trendy SmartPhones

Redmi Note4, Redmi Note5, Honor7X, Redmin Y1, Redmi Y2, Honor9Lite, Samsung Galaxy OnNxt, Samsung Galaxy On6, Moto E5, Moto E5Plus, CoolPad Note5Lite, Redmi5, Vivo Y71i, Oppo A3S, RealMe1, Honor7C, Samsung Galaxy On7 Prime, Lenovo K8Note, Samung Galaxy J7Prime2, Samsung Galaxy J6, Samsung Galaxy J4, Nokia3.1, Sony Xperia R1 మొదలైన స్మార్ట్ ఫోన్లలో కొన్ని ఆన్ లైన్లో లభిస్తే కొన్ని స్మార్ట్ ఫోను మోడల్స్ ఆఫ్ లైన్ స్టోర్లో లభిస్తాయి.

ధన్యవాదాలు
vega2020