ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్

ఆర్టికల్స్ రాయడం వ్యక్తికి ఒక కళగా ఉంది. ఆర్టికల్స్ వ్రాయడానికి ముందుగా ప్రాధమిక అంశాలు తెలియాలి. అయితే ప్రాధమిక విషయాలు తెలిసిన వ్యక్తి, తనకు బాగా తెలిసిన అంశముపై లేక విషయముపైన క్లుప్తంగా ప్రారంభించి, తర్వాత తగినంత వివరణను జత చేసి వ్రాయగలుగుతారు.

వివిధ అంశాలలో ఉండే వివిధ విషయాలలో వివరణ ఎందుకు చెబుతూ, తరువాత సదరు విషయముపై సవివరణను వ్రాయడం, చివరగా ముగింపును వ్రాయడం ఆర్టికల్ ప్రాధమిక విషయాలలో ఒకటిగా ఉంటే, ఆ ప్రాధమిక విషయాలన్నింటిని తెలిపే వివిధ రకాల ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ మనకి గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తాయి.

అయితే ప్రాధమిక ఆర్టికల్ రైటింగ్ విషయాలు తెలిశాక, ఆ వ్యక్తి తనకు తెలిసిన విషయాలలో మాత్రమే వ్రాయగలరు. అందులో రీడర్ ను ఆకట్టుకునే విధంగా వ్రాయడం, అతనికి అనుభవపూర్వకంగా అలవాటు అవుతుంది.

అతనికి ఏఏ అంశంలో ఎంతవరకు వ్రాయవచ్చు అనే విషయం, రీడర్ ని ఆకట్టుకునే విధంగా, చదివే కొలది చదవాలనిపించే విధంగా రీడర్ దృష్టిని ఆకర్శించే విధంగా వ్రాయాలంటే మాత్రం ఆ వ్యక్తి ఇతరులు వ్రాసిన ఆర్టికల్స్ భాషననుసరించి చదివితే, ఆయా భాషలలో వ్రాయడానికి సహాయకంగా ఉంటాయి.

అయితే ఆర్టికల్స్ కొంతమంది సొంత భావననుసరించి సొంతంగా వ్రాసి, ఇతరులకు షేర్ చేయడం జరుగుతుంది. వారి వారి అభిరుచికి తగ్గట్టుగా కొందరు వ్రాస్తూ ఉంటారు. కొంతమంది తమచుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులను చూసి, భవిష్యత్తు సామాజిక విషయాలపై వ్రాస్తూ ఉంటారు.

https://enews.postpapa.com/entertainews/natural-star-nani-new-movie-title-gangaleader/
ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్

కొంతమంది తమ చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి, చదువులు గురించి, రాజకీయాల గురించి, మానవ జీవనం గురించి వివిధ రకాలుగా భవిష్యత్తు గురించి ఊహాత్మకంగా వ్రాస్తూ ఉంటారు. వ్రాసే కొలది వారి వారి అంశాలలో మంచి నిపుణతను సంపాదిస్తూ ఉంటారు.

అలాకాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టికల్స్ వ్రాస్తూ ఉంటారు. కొన్ని కంపెనీలకు, కొన్ని సేవా సంస్థలకు, కొన్ని వస్తువుల ప్రమోషన్ గురించి వ్రాస్తూ ఉంటారు. అనేక రకాల విషయాలలో అనేక వస్తువుల అవసరాలు, ఉపయోగాలు, వాటి సదుపాయాలు గురించి చెబుతూ, తగినంత రుసుముతో ఆర్టికల్స్ వ్రాస్తూ ఉంటారు.

తగినంత రుసుముపై ఆర్టికల్స్ వ్రాయడాన్ని పెయిడ్ ఆర్టికల్స్ గా చెబుతారు. వీటిలో వ్యాపార ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా ఆర్టికల్స్ అనేవి చాలా సమర్ధవంతమైన విషయం.

దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలు మరియు మాస పత్రికలలో ఆర్టికల్స్ వ్రాయాలంటే, వాటికి ముందుగా రచించిన ఆర్టికల్స్ ను ఆయా పత్రికల ఆఫీసుకు పంపించవలసి ఉండేది. తదుపరి ఆయా ఆఫీసు సిబ్బంది ఆమోదం తరువాత ప్రచురించడం జరిగేవి.

కానీ ఇప్పుడు మాత్రం ఆన్ లైన్ వెబ్ సైటులు, మొబైల్ యాప్స్ వచ్చాకా ఆర్టికల్ రైటింగ్ ఒక మనీ ఎర్నింగ్ సోర్స్ గా మారింది, ఎక్కువమందికి. ఇంగ్లీషు ఆర్టికల్స్ అయితే మరింత సంపాధన అవకాశాలు ఫ్రీలాన్సర్ పనిగా అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడైతే స్టూడెంట్స్ చదువుతూనే ఈ ఫ్రీలాన్సర్ పనితో డబ్బు సంపాదిస్తున్నారు.

మరి ఇంత సమర్ధవంతమైన ఆర్టికల్స్ ఆంగ్లంలో వ్రాయడంలో ప్రాధమిక విషయాలను అందించే ఆండ్రాయిడ్ యాప్స్ మరియు వివిధ అంశాలలో ఆర్టికల్స్ ను అందించే ఆండ్రాయిడ్ యాప్స్ గురించి చూద్దాం..

ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్
ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్

English Writing Skills – ఇంగ్లీషు రైటింగ్ స్కిల్స్: వివిధ రకాల ఆంగ్ల వ్యాస రచనలు ఎలా చేయాలి అని వివరించడం ఉంటుంది. సమర్ధవంతమైన కవర్ లెరింగ్, బయోగ్రఫీ, ముగింపు, న్యూస్ లెటర్, పారాగ్రాఫ్ వివరణ, రిపోర్ట్ ఇలా వివిధ వర్గాలలో వ్రాయవలసిని ఆర్టికల్స్ గురించి విషయాలను తెలుసుకోవడానికి ఈ English Writing Skills Android Mobile App Install చేసుకోవచ్చును. ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయడం ద్వారా గూగుల్ ప్లేస్టోర్లో నుండి ఈ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్
ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్

English Writing – ఇంగ్లీషు రైటింగ్ : రెజ్యూమ్ రైటింగ్, సి.వి. రైటింగ్, టాపిక్ సెంటెన్స్, లింకింగ్ వర్డ్స్, ఇంట్రడక్షన్, రివ్యూ రైటింగ్, బిజినెస్ లెటర్ రైటింగ్, ఎస్సే ముగింపు మొదలైన వర్గాలలో ఆర్టికల్ రైటింగ్ విధానం గురించి ఈ మొబైల్ ఆప్ ద్వారా తెలుసుకోవచ్చును. ఈ మొబైల్ యాప్ ను గూగులో ప్లేస్టోర్ నుండి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులోకి డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ లేక క్లిక్ చేయండి.

ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్
ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్

Writing Tips – రైటింగ్ టిప్స్ : ఇంగ్లీషులో రైటింగ్ టిప్స్ అంటే సృజనాత్మకమైన ఆంగ్ల రచన ఎలా? రైటింగ్ టెక్నిక్స్, రైటింగ్ టిప్స్, స్టోరీ రైటింగ్, వ్యాసరచన, అప్లికేషన్ రైటింగ్, బిజినెస్ ఇమెయిల్, సాధారణ ఇమెయిల్, సమర్ధవంతమైన ఇమెయిల్ రైటింగ్ మొదలైన వర్గాలలో రైటింగ్ టిప్స్ అందించే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ గూగులో ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును. ఈ మొబైల్ యాప్ మీ స్మార్ట్ ఫోనులోకి గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ లేక క్లిక్ చేయండి.

ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్
ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్

Pocket: Save, Read, Grow. పాకెట్: సేవ్, రీడ్, గ్రో పేరుతో గూగులో ప్లేస్టోర్లో ఎడిటర్ ఛాయిస్ మొబైల్ యాప్ గా ఉంది. ఈ మొబైల్ యాప్ ద్వారా మీరు ఆన్ లైన్లో చూసిన ఆర్టికల్స్ ను మీఫోన్లో ఆఫ్ లైన మోడ్లో సేవ్ చేసుకుని, తీరికవేళలో చదువుకోవచ్చును. అలాగే ఆర్టికల్స్ ను వాయిస్ రూపంలో వినవచ్చును. చదవడం కన్నా వినడం ద్వారా త్వరగా ఆర్టికల్ రీడింగ్ పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ సమయం సేవ్ అవుతుంది. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి మీ స్మార్ట్ ఫోనులోకి డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.

ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్
ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్

Article Reader Offline – ఆర్టికల్ రీడర్ ఆఫ్ లైన్ : ఈ మొబైల్ యాప్ ద్వారా మీరు పై మొబైల్ యాప్ మాదిరి ఆర్టికల్స్ ను ఆఫ్ లైన్ మోడ్లో చదువుకోవచ్చు. ఇంకా ఆర్టికల్ సైజు, టెక్ట్స్ స్టైల్ మీకు నచ్చిన రూపంలో మార్చుకోవచ్చును. పి.డి.ఎఫ్ మోడ్లోకి ఆర్టికల్ ను కన్వర్ట్ చేయవచ్చు. ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుండి, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులోకి డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.

ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్
ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్

Title Things Think in Things – టైటిల్ థింగ్స్ థింక్ ఇన్ థింగ్స్ ఆలోచనా విషయాలలో వివిధ విషయములపై వివిధ ఆంగ్ల ఆర్టికల్స్ ఈ టైటిల్ థింగ్ మొబైల్ యాప్ ద్వారా చదవవచ్చును. రైటింగ్ టిప్స్ తో బాటు వివిధ రచనలను చదివితే, మనం వ్రాసేటప్పుడు, ఉపయుక్తమని అంటారు. అలా కనుక మీరు వివిధ విషయాలలో ఆర్టికల్స్ చదవాలంటే Title Things Think In Things మొబైల్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని చదవవచ్చును. టైటిల్ థింగ్స్ ఆండ్రాయిడ్ మొబైల్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోనులో గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్ లేక క్లిక్ చేయండి.

vega2020

ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్
ఇంగ్లీష్ ఆర్టికల్స్ వ్రాయడంలో సహాయపడే యాప్స్