Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta

Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta

Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta భగవద్గీత భగవానుడు భక్తుడికి భోదించిన జ్ఞానబాండాగారం. భగవానుడు కృష్ణుడు – భక్తుడు అర్జునుడు. విచిత్రం ఇద్దరూ బంధువులు మరియు స్నేహితులు కానీ కాలంలో భగవంతుడుగా కృష్ణుడు, భక్తుడుగా అర్జునుడుగా మారారు. ఇద్దరూ కలిసి జీవన పరమార్ధాన్ని పాయసంగా ధారపోసారు. అలా జ్ఞానమంతా భగవంతుడి నోట వెలువడి, గీత లోకానికి వెలుగుని చూపే మార్గదర్శకంగా మారింది.

జీవితంలో గొప్ప స్థితికి చేరినవారు కూడా మేము భగవద్గీత చదవడం వలన మాకు చాలా మేలు జరిగిందని చెప్పుకున్నవారు ఉన్నారు. టివిలలో వచ్చే ప్రోగ్రాముల ద్వారా ఎంతోమంది భగవద్గీత గొప్పతనం గురించి వివరిస్తూ, శ్లోకాలు వాటి అర్ధాలు వివరిస్తూ ఉంటారు. గొప్ప గొప్ప పండితులు భగవద్గీతపై ప్రవచనాలు చెబుతూ భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటారు. మహానుభావుల నోట భగవద్గీత పలుకులు పలకడం చాలా చోట్ల జరుగుతుంది.మనిషి తన జీవన విధానంలో కష్టాలు పడుతూ సుఖాలు పొందుతూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటారు. అలాంటి మనిషికి జీవితం కొనసాగించడానికి ఆధారం అతని కుటుంబ ఆచార వ్యవహారం, సంప్రదాయం, సంస్కృతి తదితర విషయాలు. సాదారణ పూజ విధానం, పండుగ శ్లోకాలు ఫలాన్ని కోరిక వరకు పరిమితం చేస్తే, భగవద్గీత జీవిత పరమార్ధాన్నే భోదిస్తుంది, ఇక మాములు కోరికలు తీరకపోవడం అంటూ ఉండదని ప్రవచన కర్తలు చెబుతూ ఉంటారు. భగవంతుడు అప్పటి అర్జునుడికి భోదించిన గీత ఇప్పటివారికి ప్రవచన కర్తలు, భారతీయ పండితులు అనువదించిన భాషా గ్రందాల ద్వారా అవగతం అవుతుంది.

విశిష్టమైనదిగా ఉండేది ప్రాచీనమైనదిగా ఉంటుంది, ప్రాచీనమైనవి ఇప్పటిదాకా మనకి లభిస్తున్నాయంటే కచ్చితంగా అది భగవంతుడి లీలగానే ఉంటుంది. ఆనందించడానికి అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఇంకా ఎదో తెలుసుకోవాలనే జిజ్ఞాస పుట్టింది అంటే అది అంతర్యామి అనుగ్రహమే అవుతుంది. అంతర్యామి అనుగ్రహం ఉంటే గ్రహచారం కూడా ఏమిచేయలేదని చెబుతారు. అందరిలో ఉండే అంతర్యామి అంతరాంతరాలలో మనసు సృష్టించే ప్రకంపన ఆవల నిశ్చలంగా సర్వవ్యాపిగా ఉంటూ సాక్షి మాత్రమే అంటారు. ఆ సాక్షి ఏమిటి ? మనస్సాక్షి ఏమిటి ? మనసు ఎన్ని రకాలు ? మనస్సు గురించి, మనసుపై పట్టు అంటే కచ్చితంగా భగవద్గీత లాంటి పురాణ గ్రంధపఠనమే మార్గం అంటారు.

Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta

అర్జునుడు కృష్ణుడు భక్తుడు భగవంతుడు భారతంలో ఇద్దరి జీవితంపై గ్రంధాలూ చదివితే లేక వింటే తెలిసేది వారు ఇద్దరూ జీవితంలో బందువులు మరియు స్నేహితులు. అయితే అర్జునుడు నిరంతరం సాధన చేస్తూ విద్యలు నేర్చుతూ ధర్మం ప్రకారం అన్నగారి కోసం యుద్ధం చేయడానికి సమాయత్తం అవుతూ ఉంటాడు. మరి కృష్ణుడు నిరంతరం అర్జునుడిని గమనిస్తూ అవసరం అనుకున్నప్పుడు స్నేహితుడులా, భందువులా సహాయపడుతూ వచ్చాడు. కానీ యుద్ధంలో అర్జునుడు ఆందోళన చెంది, వైరాగ్యపు విజ్ఞతని తెలియజేస్తే అప్పుడు భందువు, స్నేహితుడు అయినా కృష్ణుడు భగవానుడుగా గీతని భోదించారు.

అంటే భగవానుడు ఎప్పుడు భక్తుడికి స్నేహితుడుగానో భందువుగానో ఉంటూ ఉంటాడు. చాలామంది ఆపదలో ఉన్నప్పుడు మాకు భగవంతుడే పలానా భందువుగానో లేక స్నేహితుడుగానో వచ్చి ఆదుకున్నారు అని అంటూ ఉంటారు. అంటే సహాయం చేయబడేది భగవంతుడి గుణాలలో ఒకటైన దయా గుణం. ఎదో రూపంలో సహాయం పొందతూ సాదారణ జీవితం సాగుతుంది. అలాగే ఆలోచన ధోరణి విబిన్నంగా సాగి విమర్శల పాలై కొంతమంది జీవితంలో పై స్థాయికి చేరతారు. అలాంటి వారు చెప్పేది, కష్టకాలంలో అందరూ కాదన్న భగవద్గీత నాకు స్నేహితుడులా సహాయపడింది అని చెబుతారు.

మనిషి ఆలోచనను బట్టి అవసరాన్ని బట్టి సమయానుసారం భక్తుడికి భగవంతుడు మేలు చేస్తూనే ఉంటాడు అని అర్జునుడులా సాధన చేసే జీవికి మాత్రమే అర్ధం అవుతుంది అంటారు. భగవద్గీత గొప్ప గ్రంధం, అలాంటి భగవద్గీత మనకి మొబైల్ ఆప్స్ ద్వారా వినవచ్చు, చదవవచ్చు.

క్రింది చిత్రాలకు భగవద్గీత మొబైల్ ఆప్స్ లింకు చేయబడినవి, ఆ చిత్రాలపై టచ్ / క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోగలరు.

Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta
భగవద్గీత తెలుగు ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta
శ్రీమద్ భగవద్గీత తెలుగు ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta
భగవద్గీత తెలుగు ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta
భగవద్గీత తెలుగు ఆడియో ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta
భగవద్గీత తెలుగు ఆడియో ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta
భగవద్గీత తెలుగు ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta
భగవద్గీత హిందీ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta
భగవద్గీత హిందీ ఆడియో ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్
Bhagavad-Gita Bhagavanudu Bhaktudiki Bhodinchina Geeta
భగవద్గీత ఇంగ్లీషు ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Android Apps