Browsing Better, Homescreen Button Best Instead of Browsing Apps

Browsing Better, Homescreen Button Best Instead of Browsing Apps

Browsing Better, Homescreen Button Best Instead of Browsing Apps. Bookmark shortcuts are the best choice for some browsing activities in the smartphone. More mobile apps installation will be a chance of harming the performance of the smartphone. బ్రౌజరు అంటే నెట్లో ఉన్న టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియోలని వీక్షించగలిగే సౌకర్యం కలిగిన అప్లికేషను. క్రోమ్ / మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజింగు అప్లికేషన్లుగా ప్రసిద్ది చెందినవి. స్మార్ట్ ఫోన్లో ప్రతి విషయానికి మొబైల్ ఆప్స్ అనేకం లభిస్తున్నాయి, ఎక్కువ మొబైల్ ఆప్స్ ఇన్స్టాల్ చేయబడి ఉండడం వలన స్మార్ట్ ఫోన్ పనితీరుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. బుక్ మార్కింగ్ విధానం వలన ఎక్కువసార్లు బ్రౌజింగ్ (Browsing) చేయదగిన అంశాల మొబైల్ వెబ్ పేజిలను వెంటనే సందర్శించవచ్చు.

ఉదా: పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్ పేజిని బుక్ మార్క్ చేసుకుని, ఆ బుక్ మార్క్ షార్ట్ కట్ కీగా స్మార్ట్ ఫోన్ హోం స్క్రీనుపై సేవ్ చేస్తే, సదరు షార్ట్ కట్ కీపై టచ్ చేయగానే పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ వెబ్ పేజి ఓపెన్ అవుతుంది. అప్పుడప్పుడు మాత్రమే నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తూ కేవలం నెఫ్ట్ / ఆర్టిజిఎస్ పేమెంట్లు మాత్రమే చేసేవారు ఈ బుక్ మార్క్ ద్వారా మొబైల్ వెబ్ పేజి ఉపయోగించుకోవచ్చు. మొబైల్ ఆప్ ఇన్స్టాల్ చేయవలసిన అవసరం ఉండదు. అలా క్రోమ్ / మొజిల్లా ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌజర్ల సహాయంతో నెట్లో లభించే డేటాని వీక్షించవచ్చు, డౌన్లోడ్ సదుపాయం కలిగిన ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. బ్లాగుల ద్వారా విషయాలపై పరిశీలన చేయవచ్చు. బ్రౌజరు సాయంతో వెబ్ అప్లికేషన్లు ఉపయోగించవచ్చు. బ్రౌజర్లో సోషల్ మీడియా వెబ్ సైట్లు ఓపెన్ చేసి స్టేటస్ అప్డేట్ చేయవచ్చు.

జిమెయిల్ కంప్యూటర్లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ, ఓపెరా తదితర డెస్క్ టాప్ వెబ్ ఆప్స్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు, అదే విధంగా స్మార్ట్ ఫోన్లోను ఉపయోగించవచ్చు. యూట్యూబ్ వీడియోలు కూడా బ్రౌజరు ద్వారా వీక్షించవచ్చు. మ్యూజిక్ వెబ్ సైట్ల ద్వారా మ్యూజిక్ వినవచ్చు. నచ్చిన చిత్రాలను బ్రౌజరు నుండి డౌన్ లోడ్ చేసుకుని మొబైల్లో వాల్ పేపరుగా సెట్ చేసుకోవచ్చు. ఇలా బ్రౌజరు ద్వారా బ్రౌజ్ చేశాక, హిస్టరీ తొలగించడం ద్వారా ఫోను మెమరీ సేవ్ చేయవచ్చు.

షాపింగ్ మొబైల్ ఆప్స్ అనేకంగా ఉంటూ ఉంటాయి, ఎప్పుడు షాపింగ్ చేయం కాబట్టి షాపింగ్ మొబైల్ ఆప్ కన్నా షాపింగ్ మొబైల్ వెబ్ పేజి బుక్ మార్కుగా హోం స్క్రీనుపై ఏర్పాటుచేసుకుంటే సదరు షాపింగ్ ఆప్ అనవసరంగా నిరుపయోగంగా స్మార్ట్ ఫోన్లో ఉండనవసరంలేదు. చాలా వెబ్ సైటులు తమ తమ మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్లో వినియోగదారు సౌకర్యార్ధం ఉంచుతాయి. అయితే మనం ఎక్కువగా ఉపయోగించని సౌకర్యాలు స్మార్ట్ ఫోనుకి అసౌకర్యంగా ఉంటాయి. స్మార్ట్ ఫోన్లో అంతగా ఉపయోగించని మొబైల్ ఆప్స్ అన్ని మొబైల్ ఆప్స్ లాగానే రామ్, ఫోన్ మెమరీ మరియు స్మార్ట్ ఫోన్ సదుపాయాలను ఉపయోగించుకుంటూ ఉంటాయి. అంటే కెమెరా, గేలరీ, మెసేజ్ సిస్టం, కాలింగ్ సిస్టం జిపిఎస్ సిస్టం అలా సిస్టం ఆప్స్ పై ప్రభావం చూపుతూ ఉంటాయి.



ఎక్కువగా ఉపయోగించని మొబైల్ ఆప్స్ బదులు సదరు మొబైల్ ఆప్ అధికారిక వెబ్ పేజిలో గల సౌకర్యాలను అప్పుడు అప్పుడు ఉపయోగించుకోవడం వలన స్మార్ట్ ఫోను పెర్ఫార్మన్స్ తగ్గకుండా ఉండే అవకాశం ఎక్కువ. అలా అప్పుడపుడు ఉపయోగించే మొబైల్ బ్రౌజింగు (Mobile Browsing) చేసేటప్పుడే సదరు మొబైల్ వెబ్ పేజి యొక్క అడ్రస్ బుక్ మార్కుగా స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీనుపై సేవ్ చేసుకుంటే, బుక్ మార్కు బట్టన్ పై టచ్ చేయగానే సదరు మొబైల్ వెబ్ పేజి వెంటనే బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. Browsing Better, Homescreen Button Best Instead of Browsing Apps

పదే పదే బ్రౌజింగ్ చేసే వెబ్ పేజిని షార్ట్ కట్ కీగా స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీనుపై బటన్ గా క్రియేట్ చేస్తే, ఉపయోగకరం.

క్రికెట్ లైవ్ స్కోర్ అందించే మొబైల్ ఆప్స్ కూడా అంతే, క్రికెట్ మ్యాచులు జరుగుంటే మొబైల్ ఆప్స్ ఉపయోగిస్తాం లేకపోతే వాటిని ఉపయోగించం. అటువంటప్పుడు ఆ మొబైల్ ఆప్ అనవసరంగా స్మార్ట్ ఫోన్లో స్పేస్ మరియు స్మార్ట్ ఫోన్ సదుపాయాలపై ప్రభావం చూపుతూ ఉంటుంది. లైవ్ స్కోర్ అందించే మొబైల్ వెబ్ పేజి బుక్ మార్కుగా స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీనుపై సేవ్ చేస్తే, క్రికెట్ లైవ్ ఉన్నప్పుడు మన ఆ బుక్ మార్క్ ద్వారా స్కోర్లు తెలుసుకోవచ్చు. ఏదైనా వర్క్ చేయాలంటే మొబైల్ ఆప్ తప్పనిసరి కానీ వీక్షించడానికి మాత్రమే అయితే స్మార్ట్ ఫోన్ బ్రౌజరు ఉపయోగపడుతుంది.

ఫోటో ఎడిట్ చేయాలంటే కేవలం ఫోటో ఎడిట్ చేసే మొబైల్ ఆప్ సరిపోతుంది, కానీ కేవలం చూడడం మాత్రమే అయితే యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్ ఎకౌంటులు కూడా బ్రౌజర్ నుండి ఓపెన్ చేసి స్టేటస్ అప్డేట్ చేయవచ్చు. అలాగే జిమెయిల్, యాహూమెయిల్ లాంటి తదితర మెయిల్ ఎకౌంటులు కూడా బ్రౌజర్ సహాయంతో ఉపయోగించవచ్చు. వాట్సప్, ఐఎంఓ, స్కైప్ లాంటి ఆడియో వీడియో కాలింగ్ మొబైల్ ఆప్స్ తప్పనిసరిగా ఆప్స్ ద్వారానే ఉపయోగించగలం. డెస్క్ టాప్ కంప్యూటర్లో బ్రౌజింగ్లో ఉపయోగించగలిగే వెబ్ అప్లికేషను ఏదైనా, మొబైల్ ఫోన్లోకి కూడా ఉంది అంటే దానిని మొబైల్ వెబ్ బ్రౌజర్లో కూడా ఉపయోగించవచ్చు.

స్మార్ట్ ఫోన్ ఎక్కువకాలం ఉపయోగపడాలంటే, అవసరమైన మొబైల్ ఆప్స్ ఉపయోగిస్తూ, సాద్యమైనంతవరకు బ్రౌజింగ్లో విషయాలను వీక్షిస్తూ ఉంటే, స్మార్ట్ ఫోన్ పనితీరు బాగుంటుంది అని అంటారు. స్మార్ట్ ఫోన్ వాడడానికి తప్పనిసరి కంపెనీ అందించే బేసిక్ మొబైల్ ఆప్స్ తో బాటు ముఖ్యమైన మొబైల్ ఆప్స్ వాట్సప్, పేస్ బుక్, హాట్ స్టార్, పేటిఎం, ఎంఎక్ష్ ప్లేయర్, ఆఫీస్, హోటల్స్, సోలోలెర్న్, వింక్ మ్యూజిక్, ట్రేలో, మైండ్ పీస్, షేర్ ది మీల్, పిక్సార్ట్ ఫోటో స్టూడియో, లెర్న్ లాంగ్వేజ్ గ్రామర్, బీలింగు ఆప్ లాంగ్వేజ్ ఆడియో బుక్స్ మొదలైనవి.

ఏదైనా నేర్చుకునే విషయాలు, లేకా వార్తా విషయాలు, స్పోర్ట్స్ అప్డేట్స్ మొదలైన అంశాలలో అప్పుడప్పుడు మాత్రమే సదరు ఆప్స్ ఉపయోగిస్తూ ఉంటే మాత్రం సదరు మొబైల్ వెబ్ పేజి బుక్ మార్క్ చేయడం చాలా ఫోన్ పనితీరు మెరుగుకు ఉపయోగం. Browsing Better, Homescreen Button Best Instead of Browsing Apps

స్మార్ట్ బ్రౌజింగ్ బటన్ స్మార్ట్  వ్యూ

క్రింది చిత్రంలో గమనించండి బుక్ మార్కును స్మార్ట్ ఫోన్ హోం స్క్రీనుపై సెట్ చేసుకునే విధానం చూపబడింది. దిగువగా కనిపిస్తున్న చిత్రంలో a బాణం గుర్తు చూపుతున్న మూడు నిలువు చుక్కలపై టచ్ చేస్తే ప్రక్క చిత్రంలో ఉన్న మెనూ లిస్టు వస్తుంది. ఆ లిస్టులో గులాబీ రంగులో ఉన్న Add to Home screen ఆంగ్ల అక్షరాలపై టచ్ చేస్తే ప్రక్కన చూపిన విధంగా విండో వస్తుంది. అక్కడ vega2020 అని వెబ్ పేజి పేరు ఉంది. కావాలనుకుంటే ఆ పేరుని మార్చి వేరే టైపు చేసి క్రిందగా ఉన్న ADD అక్షరాలపై టచ్ చేస్తే, స్మార్ట్ ఫోన్ హోం స్క్రీనుపై vega2020 వెబ్ సైట్ మొబైల్ వెబ్ పేజి బుక్ మార్క్ షార్ట్ కట్ కీ వచ్చింది ప్రక్క చిత్రంలో b బాణం గుర్తు గమనించండి.

Browsing Better, Homescreen Button Best Instead of Browsing Apps
వెగ2020 వెబ్ సైట్ మొబైల్ వెబ్ పేజి బుక్ మార్కుని స్మార్ట్ ఫోన్ హెం స్క్రీనుపై షార్ట్ కట్ కీగా చేర్చుట

అలాగే వెబ్ సైట్లో కావాల్సిన వెబ్ పేజిని మాత్రమే కూడా బుక్ మార్కుగా షార్ట్ కట్ కీని స్మార్ట్ ఫోన్లో ఏర్పాటు చేసుకుని అవసరమైనప్పుడు సదరు మొబైల్ వెబ్ పేజి ఓపెన్ చేసి వీక్షించవచ్చు. ఈ క్రింది చిత్రం గమనించండి. వెగ2020 వెబ్ సైట్ ఓపెన్ చేయగానే వచ్చిన మొదటి పోస్ట్ Bhagavad-Gota Bhagavanudu Bhodinchina Geeta అంటూ ఆంగ్ల అక్షరాల హెడ్ లైన్ ఉంది, అది ఆ పోస్టు యొక్క హెడ్ లైన్, ఆ అక్షరాలపై టచ్ చేస్తే సదరు పోస్టులో వ్రాయబడిన అంశం ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆ పోస్టు చదవాలనిపించి, చదివే సమయం అప్పుడు లేకపోతే, మరలా సెర్చ్ చేసి వెతికే పనిలేకుండా, చదవాలి అని అనుకున్నప్పుడు ఓపెన్ అయ్యే విధంగా షార్ట్ కట్ కీ స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీనుపై చేర్చుకోవచ్చు. పై చిత్రంలో చెప్పినట్టే, కాకపోతే ఇక్కడ మొత్తం వెబ్ సైటుని కాకుండా మనకి నచ్చిన మొబైల్ వెబ్ పేజిని మాత్రమే ఓపెన్ చేసి పైన వివరించిన విధంగా బుక్ మార్క్ షార్ట్ కట్ కీని స్మార్ట్ ఫోన్ హోం స్క్రీనుపై చేర్చుకుంటాం.

Browsing Better, Homescreen Button Best Instead of Browsing Apps
వెగ2020 బ్లాగు పోస్టుని స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీనుపై బుక్ మార్క్ షార్ట్ కట్ కీ చేర్చడం.

బ్రౌజింగ్ వలన స్మార్ట్ ఫోనుపై అవగాహనా ఎక్కువ.

పైన వివరించిన బుక్ మార్క్ షార్ట్ కట్ కీ విధానం గూగుల్ క్రోమ్ బ్రౌజరు ద్వారా చేయబడినది. మీరు క్రోమ్ బ్రౌజర్లో ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా పైన a బాణం గుర్తు సూచిస్తున్న చోట మూడ్ నిలువు చుక్కలు కనబడుతూ ఉంటాయి. వాటి పై టచ్ చేస్తే ప్రక్క చిత్రంలో చూపిన విధంగా మెను లిస్టు వస్తుంది. ఆ లిస్టులో బుక్ మార్క్స్, తదితర అంశాలు ఉంటాయి. వాటిని ఉపయోగించి చూడడం వలన బ్రౌజింగుపై చక్కటి అవగాహనా ఏర్పడుతుంది. Browsing Better, Homescreen Button Best Instead of Browsing Apps

మనకి కావాల్సిన మొబైల్ వెబ్ పేజిని హోం స్క్రీనుకి చేర్చుట. కాబట్టి, Add to Home screen ఆంగ్ల అక్షరాలపై టచ్ చేస్తే ప్రక్క చిత్రంలో ఆ పోస్టు లేక వెబ్ సైట్ పేరు వస్తుంది, కావాలంటే పేరు మార్చుకుని లేక అవే అక్షరాలతో సదరు షార్ట్ కట్ కీనీ స్మార్ట్ ఫోన్ హోం స్క్రీనుపై చేర్చవచ్చు. గూగుల్ క్రోమ్ ద్వారా ఏ వెబ్ సైట్ లేక బ్లాగు పోస్టులను, లేక మొబైల్ బ్యాంకింగ్ వెబ్ పేజిలను, లేక షాపింగ్ వెబ్ సైట్ మొబైల్ వెబ్ పేజిలను హోం స్క్రీనులో షార్ట్ కట్ కీస్ గా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన బ్రౌజింగ్ చక్కగా వస్తే, పేస్ బుక్, ట్విట్టర్, మెయిల్ అకౌంట్స్, మొదలైన చూసే వరకు పరిమితమయ్యే అంశాలలో మొబైల్ ఆప్స్ ఇంస్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు.

పేస్ బుక్, మెయిల్ ఎకౌంటులు వీటిలో ఎన్ని లావాదేవీలు ఉంటే అంత ఫోన్ డేటా ఉపయోగిస్తూ, ఫోన్ మెమరీని వాడుతూ ఉంటాయి. అదే బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఆ ఫోన్ మెమరీ సేవ్ అవుతుంది. డేటా వాడుక కూడా తగ్గుతుంది. అసలు ఫోనులో బ్రౌజింగుపై పట్టు ఉంటే మొబైల్ ఆప్స్ సెట్టింగ్స్ విషయంలో కూడా మీరు ఇతరుల సహాయం అర్ధించాల్సిన అవసరం ఉండదు. ప్రధానంగా మొబైల్ ఆప్స్ మనకి ఎంత సౌకర్యవంతంగా ఉంటే, వాటి ప్రభావం అంతకన్నా ఎక్కువగా స్మార్ట్ ఫోన్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి సౌకర్యం ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగపడే మొబైల్ ఆప్స్ ఉపయోగించడం మేలైన పద్దతి.

మొబైల్ ఆప్స్ చాలా ఉపయోగకరం వాడుక విధానం తెలియకపోతే అవే నష్టకరమైన విషయాలుగా ఉండవచ్చు. వాడుతున్న విషయంపై అవగాహనా ఉండడం సబబు, అలాగే మన స్మార్ట్ ఫోన్లో మొబైల్ ఆప్ ఉంది అంటే, దాని ఉపయోగం, దాని వలన మనకి ఎంతవరకు ఉపయోగం, దాని వాడుక విధానం, వాడుక విధానంలో సమస్యలుంటే అవి తెలిసి ఉండాలి.

ధన్యవాదాలు
vega2020 – view enlisted gadget apps and games

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *