Cloud Data Storage Free Android Smartphone Mobile Apps

Cloud Data Storage Free Android Smartphone Mobile Apps

Cloud data storage free Android smartphone mobile apps in Telugu ఎక్కువగా పాత స్మార్ట్ ఫోన్ తీసివేసి కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు డేటా నష్టపోవడం జరిగే అవకాశాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్లో ఉండే ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్ ఫైల్స్, కాంటాక్ట్స్ వ్యక్తిగత మొబైల్ ఆప్స్ డేటా మొదలైనవి ఎక్కువగా ఉంటే, ఫోను మెమరీ తక్కువగా ఉన్నప్పడు కొన్ని మొబైల్ ఆప్స్ తొలగించడం లేక డేటా తొలగించడం చేయవలసి ఉంటుంది. క్లౌడ్ స్టోరేజ్ మొబైల్ ఆప్స్ వలన కొంత డేటా నష్టం జరగకుండా చూసుకునే అవకాశం కలదు.

సాదారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఒక క్లౌడ్ స్టోరేజ్ మొబైల్ ఆప్ అంటే గూగుల్ డ్రైవ్ డిఫాల్ట్ మిగిలిన గూగుల్ అప్స్ తో ముందుగానే ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. దీనితో మీ స్మార్ట్ ఫోన్లో ఫైల్స్, ఫోటోలు, వీడియోలు మొదలైనవి ఆన్ లైన్లోకి అప్ లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి అలా గూగుల్ డ్రైవ్లోకి అప్ లోడ్ చేసిన డేటాని ఎప్పుడైనా ఇతర స్మార్ట్ ఫోను, ట్యాబు, లేక వెబ్ బ్రౌజర్లలో ఉపయోగించుకోవచ్చు. జిమెయిల్ ఎకౌంటు ఆధారంగా గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ 15 జిబి వరకు ఉచితంగా ఉపయోగించవచ్చు. ఇంకా స్టోరేజ్ ఎక్కువ అవసరమయితే నెలవారీ కొంత రుసుం చెల్లించి 1 టిబి ఆపైన కలిగన పధకాలలోకి అప్ గ్రేడ్ అవవలసి ఉంటుంది.

ఇలా ఆన్ లైన్లో పరిమిత ఉచిత స్టోరేజ్ అందించే ఇతర క్లౌడ్ స్టోరేజ్ మొబైల్ ఆప్స్ కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.స్మార్ట్ ఫోనుకి క్లౌడ్ స్టోరేజ్ అప్ కి ఆటో సింక్రొనైజ్ సదుపాయం ఆన్లో ఉంచితే, మీ ఫోన్లో డేటా ఎప్పటికప్పుడు ఆన్ లైన్ సర్వర్లో మీ మెయిల్ idతో రిజిస్టర్ అయిన క్లౌడ్ స్టోరేజ్ ఎకౌంటులోకి అప్ లోడ్ అవుతూ ఉంటాయి. అలాగే కాంటాక్ట్స్, కూడా మీ జిమెయిలులోకి సింక్రొనైజ్ చేస్తే, అవి గూగుల్ కాంటాక్ట్స్ గా మీ మెయిల్ ఎకౌంటులో సేవ్ అవుతాయి.

మీ ఫోను మార్చవలసిన అవసరం వచ్చినప్పుడు ఈ క్లౌడ్ స్టోరేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఫోటోలు, ఎంపిక చేసుకున్న మ్యూజిక్ ఫైల్స్, వీడియోలు మరియు కాంటాక్ట్స్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లోకి సులభంగా తిరిగి తెచ్చుకోవచ్చు. అలాగే స్మార్ట్ ఫోను మెసేజ్ మరియు కాంటాక్ట్స్ బ్యాక్ అప్ తీసుకుని, సదరు మొబైల్ ఆప్లో  మీరు రిజిస్టర్ అయిన మెయిల్ ద్వారా తిరిగి ఇతర స్మార్ట్ డివైజ్లలో ఉపయోగించవచ్చు.

స్మార్ట్ ఫోన్లో వాడుతున్న దాచిన డేటా ఫైల్స్, మొబైల్ అప్స్ వివరాలు ఇవ్వన్ని క్లౌడ్ స్టోరేజ్ మొబైల్ ఆప్స్ ద్వారా ఆన్ లైన్లో సేవ్ చేయవచ్చు. తిరిగి కావలసినప్పుడు, అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ పరికరాలలో ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి క్లౌడ్ స్టోరేజ్ సేవలు ఉచిత లేదా చెల్లింపుల పధకాలలో లభించే కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ క్రింది గమనించగలరు. అలాగే సదరు మొబైల్ ఆప్ ఉచిత లేక చెల్లింపు సేవల వివరాలు సంబందిత మొబైల్ అప్ వివరాలలో గూగుల్ ప్లే స్టోర్లో ఇవ్వబడతాయి, గమనించగలరు.

Cloud Data Storage Services Free Android Smartphone Mobile Apps Download

గూగుల్ డ్రైవ్

Cloud Data Storage Services Free Android Smartphone Mobile Apps Download

డ్రాప్ బాక్స్

Cloud Data Storage Services Free Android Smartphone Mobile Apps Download

మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్

Cloud Data Storage Services Free Android Smartphone Mobile Apps Download

అమెజాన్ డ్రైవ్

Cloud Data Storage Services Free Android Smartphone Mobile Apps Download

బాక్స్

Cloud Data Storage Services Free Android Smartphone Mobile Apps Download

మీడియా ఫైర్

Message And Contacts Online Storage Cloud Backup Android Mobile Apps

ఎస్ఎంఎస్ బ్యాక్ అప్

Message And Contacts Online Storage Cloud Backup Android Mobile Apps

ఆండ్రాయిడ్ మెసేజెస్

Message And Contacts Online Storage Cloud Backup Android Mobile Apps

SMS కాల్లాగ్ బ్యాక్ అప్

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *