EyeCare Android Mobile Apps

సర్వేంద్రియానం నయనం ప్రధానమన్నారు పెద్దలు అంటే ఇంద్రియాలన్నింటిలోను కళ్లు ప్రధానమన్నారు మన పెద్దవారు. ఎందుకంటే చూపులేకపోతే లోకంతో సంభందం సగంపైగా ఉండదు. చూపుతోనే బంధువులను గుర్తుపెట్టుకోవడం, స్నేహితులతో పరిచయం పెంచుకోవడం ఉంటే, చూపుతోనే మనసుకు ఇష్టాలు, అయిష్టాలు వస్తువులపై ఏర్పడుతూ ఉంటాయి. చూపరులను ఆకట్టుకోవడం ద్వారా సమాజంలో సగం వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అంత బలమైన చూపు మన కళ్లుతోనే సాద్యం. కంటిచూపుతో సమానమైన కెమెరా కనిపెట్టాలంటే ఎంత ఖర్చు భారిగానే ఉండవచ్చు. EyeCare Android Mobile Apps

మరి మన మనసుకు సంతోషాన్నిచ్చే కళ్లు సంరక్షణ చాలా ముఖ్యం. అయితే పూర్వం బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉండేవారికి కంటిచూపు దోషం ఏర్పడితే, ఇప్పుడు టివీల పుణ్యమో, కంప్యూటర్ల పుణ్యమో, స్మార్ట్ ఫోన్ల పుణ్యమో, ఆహార పుణ్యమో కానీ చాలమందికి కంటిచూపు దోషం వస్తుందని అంటారు. వస్తువు ఏదైనా మనసుకు సంతోషం కలిగించే విషయాలు అదేపనిగా కంటితో చూస్తూ ఉండడంతో కంటిచూపు దోషమేర్పడడానికి కారణం కాగలదు.

న్యూఇయర్ విషెస్ స్టిక్కరింగ్ మొబైల్ యాప్స్ గురించి చదవడానికి ఈ అక్షరాలను తాకండి

యూట్యూడ్ డార్కుథీమ్ సెట్టింగ్సు చదవడానికి ఈ అక్షరాలను తాకండి.

అయితే స్మార్ట్ ఫోను వినియోగం ఎక్కువమంది చేస్తూండడం వలన, మొబైల్ డేటా ధరలు సామాన్యులకు అందుబాటులో రావడం, అనేక వీడియోలను అందించే మొబైల్ యాప్స్ తోబాటు, లైవ్ వీడియోలను అందించే మొబైల్ యాప్స్ కూడా అందుబాటులో ఉండడం చేత, కంటి ఇబ్బందు ఇంతింతై అన్నరీతిలో ఉండే అవకాశాలు ఎక్కువ. ఏదైనా స్మార్ట్ ఫోనులో వీడియోలు చూడడం లేక లైవ్ కార్యక్రమాలు చూడడం పరిపాటి కావునా కంటిచూపుపై స్మార్ట్ ఫోను కాంతి ప్రభావం తగ్గించే మొబైల్ యాప్స్ ఉంటే, వాటిని వాడడం మంచిదంటారు.

స్మార్ట్ ఫోను ఉపయోగిస్తున్నప్పుడు స్మార్ట్ ఫోను స్ర్కీనుకాంతి ప్రత్యక్షంగా కంటిపై పడుతూ ఉంటుంది. వీడియోలు చూస్తున్నప్పుడు కూడా అదేపనిగా స్మార్ట్ ఫోను స్క్రీనుకాంతి కళ్లను తాకుతూ ఉంటుంది. ఇక పగలు, రాత్రిళ్లు కాంతి ప్రభావం కంటిపై ఒకేలా కాకుండా, స్మార్ట్ ఫోను వాడుతున్న పరిస్థితులలో ఉన్న కాంతిననుసరించి, కాంతిప్రభావం మారేవిధంగా కొన్ని మొబైల్ యాప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్లకు గూగులో ప్లేస్టోర్లో లభిస్తాయి. EyeCare Android Mobile Apps.

పోస్టుపాప పోస్టులను చదవడానికి ఈ అక్షరాలను తాకండి.

Click here to read postpapa posts

ఇలా కళ్ల ఇబ్బందిని తగ్గించేలా స్మార్ట్ ఫోను స్ర్కీను కాంతిని మార్పులు చేసే మొబైల్ యాప్స్ ఉచితంగా గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తే, అవి మొబైల్లో పనిచేస్తునే యాడ్స్ కూడా చూపుతూ ఉంటాయి. కొన్ని రకాల మొబైల్ యాప్స్ ఉచితంగాను మరియు పెయిడ్ వెర్షన్లలోను లభిస్తాయి. పెయిడ్ వెర్షన్లో లభించే మొబైల్ యాప్స్ యాడ్స్ లేకుండా పనిచేస్తాయి. కలర్స్ ఎడ్జస్ట్ చేస్తూ కళ్లకు ఇబ్బందిని తగ్గించే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్.

యాడ్స్ లేకుండా బ్లూలైట్ ఫిల్టర్ మొబైల్ యాప్ ఉచితంగానే గూగుల్ ప్లేస్టోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్స్ కోసం లభిస్తుంది. Bluelight Filter Mobile App డౌన్ లోడ్ చేయడానికి ఈ అక్షరాలను తాకండి.

EyeCare Android Mobile Apps
EyeCare Android Mobile Apps
EyeCare Android Mobile Apps
EyeCare Android Mobile Apps
EyeCare Android Mobile Apps
EyeCare Android Mobile Apps
EyeCare Android Mobile Apps
EyeCare Android Mobile Apps

 

 

 

ధన్యవాదాలు
vega2020