Facebook, Messenger, Pages & Groups Android Mobile Apps

Facebook, Messenger, Pages & Groups Android Mobile Apps

Facebook messenger, pages & groups Android Mobile Apps free download, Telugu : పేస్ బుక్ ఎకౌంటు వివరాలు గోప్యతలో గప్ చిప్ గా షేర్ అవుతున్నాయి అంటున్నారు. షేరింగ్ చేయడంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఒకటి మరియు మొబైల్ ఆప్. పేస్ బుక్లో పేస్ పెడితే ఫ్రెండ్స్ మరియు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కి కూడా పరిచయం జరుగుతుంది. పరిచయం మిస్ అయినవారు కొత్తగా పరిచయాలు ఏర్పరచడంలో పేస్ బుక్ బాగా ఉపయోగపడడం వలననేమో చాలా ఎక్కువగా ఎకౌంటులు కలిగి ఉంది. పేస్ బుక్ ఏదైనా విషయాన్ని పాపులర్ చేయడంలో ప్రధమం అయితే దానిని మంచి విషయాలు షేర్ చేయడం వలన సమాజ సేవ అవుతుంది. చాల మంచి విషయాలు షేర్ చేస్తూ ఉండే వారు చాలమందే ఉంటారు, కానీ మంచి మట్టిమీద నీరులా ప్రాకితే, చెడు భూమిపై గాలిలా ప్రాకుతుంది.

పేస్ పేజి పెట్టి పాపులారిటీ పొందడం, లేకపొతే ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం వంటివి పేస్ బుక్లో చాల సులభం. పేస్ బుక్ పేజికి బ్లాగుకి లింకు పెట్టి వెబ్సైటు ట్రాఫిక్ పెంచే అవకాశాలు ఎక్కువ అని ఎస్ఇఓ నిపుణుల అభిప్రాయంగా చెబుతారు. చాలామంది టెక్నికల్ విషయాలపై అవగాహన కలిగించే విధంగా బ్లాగు పోస్టింగ్స్ చేస్తూ, వాటిని పేస్ బుక్ పేజిల ద్వారా వీక్షకులకు పరిచయం చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది అనేక తగిన శీర్షికలతో విషయాలపై అవగాహన, లేక వివరణలు బ్లాగుల ద్వారా పోస్ట్స్ లేక వీడియోలు చేసి, వాటిని పేస్ బుక్ పేజిద్వారా షేర్ చేస్తూ ఉంటారు.పేస్ బుక్ పేజిల నిర్వహణకు కూడా మొబైల్ ఆప్స్ లభిస్తాయి.

పేస్ బుక్ చాలా స్మార్ట్ ఫోన్లలో ఉండే మొబైల్ ఆప్ కనుక పేస్ బుక్ పేజిద్వారా ఏదైనా ప్రోడక్ట్ లేక సర్వీసు ప్రమోట్ చేయవచ్చు. అయితే పేస్ పేజి ఎక్కువ లైక్స్ కలిగి ఉండాలి, ఎంతమంది ఆ పేజి లైక్ చేసి ఉంటే, అంతమందికి ఏదైనా విషయంపై పోస్టు పెట్టినప్పుడు, అది వారందరికీ చేరుతుంది. ఇంకా పేస్ బుక్ గ్రూప్స్ క్రియేట్ చేసి, స్నేహితులు మరియు స్నేహితుల స్నేహితులను గ్రూప్లో జాయిన్ చేయడం ద్వారా గ్రూప్ ఎక్కువమందికి పరిచయం చేస్తూ విషయలను ప్రమోట్ చేయవచ్చు. ఎంతమంది గ్రూప్లో ఉంటే అంతమందికి ఏవిషయం పోస్ట్ చేస్తే ఆ విషయం చేరుతుంది. పేస్ బుక్ గ్రూప్ నిర్వహణ మొబైల్ ఆప్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి.

పేస్ బుక్ పేజిలు కానీ, గ్రూపులు గాని తొందరగా పలకగలిగే టైటిల్ అయ్యి, అర్ధవంతమైన పోస్టులు అప్డేట్ చేస్తూ ఉంటే, ఆదరణ బాగుంటుంది. ఇంకా పేస్ బుక్ మెసెంజర్ మీ ఎకౌంటులో స్నేహితులుగా ఉన్న వారందరితో టెక్స్ట్ చాట్ లేక వీడియో చాట్ చేయవచ్చు. పేస్ బుక్ మెసెంజర్ మొబైల్ ఆప్ మరియు పేస్ బుక్ మెయిన్ మొబైల్ ఆప్ పేస్ బుక్ కంపెనీ వారివి ఉంటే, మిగిలినవి మూడవ పార్టీ మొబైల్ ఆప్స్ ప్లే స్టోర్లో  లభిస్తాయి.

Facebook, Messenger, Pages & Groups Android Mobile Apps

Facebook

Facebook, Messenger, Pages & Groups Android Mobile Apps

Messenger

Facebook, Messenger, Pages & Groups Android Mobile Apps

Pages

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *