File Manager Android Smartphone Mobile Apps Download

File Manager Android Smartphone Mobile Apps Download

File manager Android smartphone mobile apps download Free from Google Play Store in Telugu: స్మార్ట్ ఫోనుతో ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటాం, అలాగే వాయిస్ రికార్డింగ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఇతర స్మార్ట్ ఫోన్లో డేటాని మన స్మార్ట్ ఫోన్లోకి షేరింగ్ పద్దతిలో మన మొబైలులో సేవ్ చేస్తాము. కొన్నిసార్లు ఆన్ లైన్లో ఉన్న డేటా మన స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. ఉదా: నచ్చిన నేచర్ ఫోటోలు, సినిమా నటీనటుల ఫోటోలు, అలాగే పాటలు, వీడియోలు నెట్ నుండి స్మార్ట్ ఫోన్లోకి డౌన్ లోడ్ చేస్తూ ఉంటాం. ఇలా స్మార్ట్ ఫోన్లోకి సేవ్ చేయబడుతున్న డేటా మొబైల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది.

సాదారణంగా స్మార్ట్ ఫోను కెమేరాతో చిత్రీకరించిన ఫోటోలు అయితే, గేలరీలో కనబడతాయి, వీడియోలు అయితే సంబందిత వీడియో ప్లేయర్ ఓపెన్ చేస్తే వీడియోలు ప్లే చేయబడతాయి. వాటిని స్మార్ట్ ఫోన్లో వీక్షించడానికి అవి ఎక్కడ స్టోర్ అయ్యి ఉన్నాయనే విషయం అనవసరమే అయితే, వాటిని ఫోన్లో మెమరీ మేనేజ్ చేయాలంటే మాత్రం, ఫైల్ మేనేజ్మెంట్ తెలియాలి. ఇలా ప్లే లేక కనిపించే ఫోటోలు ఫోన్లో ఎక్కడ స్టోరేజ్ అయ్యి ఉన్నాయి, లేక డౌన్లోడ్ చేయబడిన మ్యూజిక్ ఫైల్స్ స్టోరేజ్ వివరాలు తెలియడానికి ఉపయోగపడే మొబైల్ ఆప్ ఫైల్ మేనేజర్. ఇది చాలా స్మార్ట్ ఫోన్లలో డిఫాల్ట్ బేసిక్ మొబైల్ అప్లికేషను.

ఫోను మెమరీ ఫుల్ అయ్యింది, అవసరమైన మొబైల్ ఆప్స్ రన్నింగ్ అవ్వడానికి ఫోను మెమరీ సరిపోవడం లేదు, అప్పుడు ఫోన్ మెమరీలో సేవ్ చేయబడిన వీడియోలు లేక ఫోటోలు లేక మ్యూజిక్ ఫైల్స్ లేదా ఇతర ఫైల్స్ తొలగించాల్సిన లేక SD కార్డులోకి మార్చాల్సిన అవసరం వస్తే, ఫైల్ మేనేజర్ ఉపయోగపడుతుంది.

స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫైల్స్ ని వెతికి ఫోల్డర్ వారిగా చూపించే అప్లికేషను ఫైల్ మేనేజర్, డిఫాల్ట్ అప్లికేషను అయిన ఇంకా అనేక ఇతర ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లో సేవ్ చేయబడిన ఏదైనా ఫైల్ డిలీట్ చేయడానికి షేర్ చేయడానికి లేదా ఆన్ లైన్ క్లౌడ్ స్టోరేజ్ ఆప్స్ లో షేర్ చేయడానికి, ఇంకా ఫైల్స్ కంప్రేస్స్ చేయడానికి మొదలైన వాటిలో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకా ఆప్స్ తొలగించడం, హోం స్క్రీనుపై మొబైల్ ఆప్స్ షార్ట్ కట్స్ క్రియేట్ చేయడంలాంటి ఉపయోగాలు ఉంటాయి.

ఇవి ఉచితంగా మరియు చెల్లింపు పధకాలలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. ఉచిత సదుపాయాలు మరియు చెల్లింపు సదుపాయాల వివరాలు ఆయా మొబైల్ ఆప్ యొక్క వివరణలో ప్లే స్టోర్ ఇన్స్టాల్ వెబ్ లేక ఆప్ పేజిలో ఉంటాయి, గమనించగలరు. క్రింది కొన్ని ఫైల్ మేనేజర్ మొబైల్ ఆండ్రాయిడ్ ఆప్స్ ఇవ్వబడ్డాయి.

file manager Storage Management Android mobile app free download

ఫైల్ మేనేజర్

file manager Storage Management Android mobile app free download

ఫైల్ మేనేజర్

file manager Storage Management Android mobile app free download

ఫైల్ మేనేజర్

file manager Storage Management Android mobile app free download

ఫైల్ మేనేజర్

file manager Storage Management Android mobile app free download

ఫైల్ మేనేజర్

file manager Storage Management Android mobile app free download

ఫైల్ మేనేజర్

ధన్యవాదాలు
vega2020 – View Enlisted Gadget Apps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *