పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్

పరీక్షాసమయంలో పరీక్షలకు తయారయ్యే పనిలో ప్రతి విద్యార్థి బిజిగా ఉంటారు. పరీక్షాకాలంలో గ్రూపుల వారీగా చదువుకునే వారుంటారు. ఒక్కరే ప్రశాంత వాతావరణంలో ప్రశాంతమైన సమయంలో చదువుకునేవారుంటారు. ప్రశాంత వాతావరణం అంటే ఎక్కువగా తెల్లవారుజాము, ఇంటివద్ద లేక హాస్టల్ వద్దనే…

హాస్టల్లో అయితే తోడుగా ఉండే వారుంటే, ఇంటివద్దనే ఒక్కరే లేక చుట్టుప్రక్క స్నేహితులు అయితే గ్రూపుగానే చదువుతారు. కానీ ఆసమయంలో నిద్రలేచి చదివేవారు ఒంటరిగానే చదువుకునే అవకాశం ఎక్కువ. ఆసమయంలో చదువును మనసు పట్టుకుంటుంది, అంటారు.

పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్ధులకు స్నేహితులతో పాటు తోడుగా స్మార్ట్ ఫోను కూడా ఉంటుంది. ఒకదగ్గరలేకపోయినా, దూరంగా ఉన్న స్నేహితునితో కూడా ప్రక్కనే ఉన్నట్టు వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యేకతలు స్మార్ట్ ఫోను ప్రత్యేకతగా ఉంటే, ఎడ్యుకేషనల్ మొబైల్ యాప్స్ కూడా విద్యార్ధుల చదువుకు ఉపయోగపడుతున్నాయి. అలా స్మార్ట్ ఫోను కూడా ఇప్పటి విద్యార్ధుల చదువులో భాగమవుతుంది.

తరచుగా వివిధ సబ్జెక్టులలో అనేక సమస్యలకుండే సాధారణ సందేహాలకు పరిష్కారాలను, లేకా వివిధ అంశాలలో చదివే విధానం, సమస్య పరిష్కార విధానాలు, టిప్స్ ఇలా వివిధ రకాల ఎడ్యుకేషనల్ మొబైల్ యాప్ ద్వారా చూడవచ్చు.

పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్

అయితే పరీక్షలకు సిద్దపడే విద్యార్థులకు ఆండ్రాయిడ్ ఆప్స్ ద్వారా కూడా స్టడీ టిప్స్ మరియు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టిప్స్, లాజికల్ రీజనింగ్ టెస్ట్ మొదలైన విషయాలపై టిప్స్ పొందవచ్చును.

పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్
పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్

Study Tips Android Mobile App – స్టడీ టిప్స్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్: చదువుకునే అలవాట్లను అభివృద్ది చేసుకోవడం ఎట్లా? చదువుకునే సమయాన్ని ఎంత పొదుపుగా వాడుకోవాలి? గుర్తు పెట్టుకునే విధానం? త్వరగా విషయాలను పట్టుకోవడం? తేలిక పద్దతిలో చదువుకోవడం ఎలా? ఇలాంటి వాటితో కూడిన సూచనలను తెలిపే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ గూగులో ప్లేస్టోర్లో లభిస్తుంది. ఈ మొబైల్ యాప్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.

పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్
పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్

StudyTips – Tips for studying & Exam preparation స్టడీ టిప్స్ చదువుకునే సమయంలో చేయవలసిన టిప్స్, పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ముందరి టిప్స్, మెమోరి పవర్ పెంచుకోవడంలో టిప్స్, పర్సనల్ స్టడీ ప్లాన్స్, చదువును ఒక అలవాటుగా నిర్మాణాత్మకంగా చదువును కొనసాగించడం, లక్ష్యం నిర్ధేశించుకోవడం…. ఇలా చదువుకునే విద్యార్ధులకు అవసరమయ్యే సూచనలను ఒక మొబైల్ యాప్ గా గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తుంది. ఈ మొబైల్ యాప్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులో డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.

పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్
పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్

Logical Reasoning Test: Practice Tips & Tricks లాజికల్ గా ఆలోచన చేయడం ద్వారా చదువుకునే విషయాలపై పట్టు సంపాదించవచ్చని అంటారు. ఇక మాథమటిక్స్ అయితే కేవలం లాజిక్స్ అవసరం, అలాగే ఎక్కౌంట్స్, ఇంకా సాప్ట్ వేర్ అయితే కేవలం లాజిక్ ప్రధానంగా సాగుతాయి. అలాంటి లాజికల్ థింకింగ్ మరియు లాజికల్ స్టడీని పెంచుకునే ప్రక్రియ ఉంటే, అది చాలా ఉపయోగకరం. ఇలాంటి లాజికల్ టెస్ట్స్ అందిస్తామంటూ ఆండ్రాయిడ్ మనకి గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తుంది. ఈ మొబైల్ యాప్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.

పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్
పరీక్షలకు స్టడీ టిప్స్ మొబైల్ యాప్స్

Best Study Tips Android App – బెస్ట్ స్టడీ టిప్స్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్: శక్తివంతంగా చదువుకోడం ఎలా? వేగంగా గుర్తు పెట్టుకోవడం ఎలా? పరీక్షరోజున విజయవంతం అవ్వడం ఎలా? రీడింగ్ టిప్స్, రైటింగ్ టిప్స్, స్టడీ టిప్స్, ఫోకస్ స్కిల్స్, మొదలైన టిప్స్ అందిస్తూ ఉండే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తుంది. ఈమొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.

సరైన ప్రణాళికతో సక్రమమైన పద్దతిలో నిర్ధేశిత సమయంలో క్రమం తప్పకుండా సాగే చదువులు విజయవంతం అవుతాయి అంటారు. అటువంటి విషయాలను మనకున్న టీచర్స్, స్నేహితులు, మన పెద్దలు మరియు ఇలా సాంకేతిక సదుపాయలతో తెలుసుకుని చదువును దిగ్విజయంగా పూర్తి చేయండి.

NamoBharata App Download From PlayStore

vega2020